అహో! భాగ్యవతీ నారీ
సందర్భం :
ఒకానొక గురువుగారు ఉండే వారు. మంచి విద్వాంసుడు. ఎంతోమంది ఆయన దగ్గర శిష్యరికం చేసి విద్యనభ్యసించే వారు. చాలా ఏళ్ళు అయిన తర్వాత, ఒక సందర్భంలో పొరుగూరికెక్కడికో పని మీద వెళ్ళ వలసి వచ్చింది ఆయనకి. అనుకోకుండా తన దగ్గర విద్యనభ్యసించిన శిష్యుడొకడు తారసిల్లాడు. ఆ శిష్యుడు విద్యాదానం చేసిన గురువు గారిని చూసి చాలా ఆనందంతో, అతి కృతజ్ఞతా భావంతో తన ఇంటికి భోజనానికి రావలసినదిగా అభ్యర్థించాడు. ఆతని అభ్యర్థన మేరకు శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళారు గురువు గారు. శిష్యుని భార్య పరమ గయ్యాళి. భర్తని ఏమాత్రం లక్ష్యపెట్టేది కాదు. ఇంటికి వచ్చిన అతిథులని కూడా ఆమె ఏమాత్రం లక్ష్యపెట్టేది కాదు. రాక రాక గురువు గారు ఇంటికి భోజనానికి వచ్చారు, ఆయనకి ఏమాత్రమూ అమర్యాద జరుగకుండా ఉండుటకై, శిష్యుడు భార్యని బ్రతిమలాడాడు. ఇదే అదనుగా నన్ను ఏ మాత్రం అమర్యాద చేసినా ఊరుకునేది లేదని ఆమె మాత్రం తెగేసి చెప్పింది. ఆమె ఆ రోజు సవ్యంగా అతిథిమర్యాదలన్నిటినీ నిర్వర్తించేట్టుగ ఒప్పందం చేసుకుని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు ఆ శిష్య పరమాణువు.
గురువుగారి భోజనాదికం పూర్తి అయ్యింది. అతిథి మర్యాదలన్నీ సవ్యంగా సక్రమంగా నిర్వర్తించింది ఆ భార్యా మణి. శిష్యుని ఆనందానికి అవదులు లేవు. గురువుగారు, భోజనం పూర్తి అయ్యాక చేయి కడుక్కునేందుకై పెరటిలోకి వెళ్ళారు. భోజన సమయంలో ఏమిలోపం జరిగినదో ఏమో, పరిస్థితి అవగాహన అయ్యేలోపునే, గురువుగారు చేయికడుక్కోవడానికి అలాగ పెరటిలోకి వెళ్ళడం తరువాయి, ఆగ్రహంతో అ భార్యామణి అక్కడే ఉన్న భాండపాత్రనొక దానిని తీసుకుని, భర్త నెత్తిమీద ఒక మొత్తు మొత్తింది. ఆ దెబ్బకి, కుండ కాస్తా ముక్క చెక్కలయ్యింది. ఆ దెబ్బ నుండి తేరుకునే లొపునే ఆ భార్యామణి, కొత్త భాండపాత్రకొనుటకై భర్తని డబ్బులడిగింది. ఎంతైనా ధర్మ పత్నికదా! మరల వంటవండుటకై పాత్ర కావలెను కదా!!
ఈ దృశ్యమంతా పెరటిలో చేయి కడుక్కుంటూ ఉన్న గురువుగారి దృష్టిలో పడింది. వెంటనే తను ఎంత అదృష్టవంతుడో ఆ గురువుగారికి అర్థమై, తన భార్యమీద గౌరవం అపారంగా పెరిగిపోయింది. గురువుగారు ఏమన్నారో ఆతని మాటల్లోనే ఆలకించండి.
శ్లోకం :
అనేక శత భాండాని భిన్నాని మమ మస్తకే
అహో! భాగ్యవతీ నారీ! భాండమూల్యం న యాచతే
భావం :
"నా నెత్తి మీద కూడా నా భార్యచే ఎన్నో వందల కుండలు ఎన్నోసార్లు పగిలాయి. ఎంత ఉత్తమురాలు నా భార్య! ఏ విధంగా తను ఏర్పాటుచేసుకుంటున్నదో ఏమో గానీ, మళ్ళీ కుండను కొనడానికి నన్ను డబ్బులు ఎప్పుడూ అడగనేలేదు కదా"!
అని భార్యను కృతజ్ఞతా భావంతో జ్ఞప్తికి తెచ్చుకున్నాడా గురువు గారు.
ఈ సంఘటనతో శిష్యుడు ఖిన్నుడయ్యాడు, ముఖం పాలిపోయింది.
పై శ్లోకానికి నా తెనుగుసేత
మట్టి కుండలెన్నియొ నాదు మస్తకమున
మాడు పగులగనన్నియు ముక్కలయ్యె
నాదు భాగ్యమేమని చెప్ప, నారి నన్ను
మూల్యమెపుడడుగదు గదా మరల కొనగ !
ఇటువంటి వాటిని ముక్తకాలు అంటారు. They are like jokes and cartoons. They are self explanatory. Do not need any information before and after. నిజానికి They are independent by themselves.

కుండలు అయితే పర్లేదు -- మనింట్లో స్టీలు గిన్నెలాయే -- బొప్పి మనకే , నొప్పి మనకే :)
ReplyDelete