Friday, May 1, 2020

శ్రీమద్భాగవతం మహా యజ్ఞం.

ప్రియమైన   భాగవత బందువులకు  శుభాకాంక్షలు

ఈ రోజు ప్రవచనం లో గురువు గారు మనకి ఒకటి తెలియచేసారు.. యజ్ఞం గురించి..  నిజమే గురువు గారు చేసేది  శ్రీమద్భాగవతం మహా యజ్ఞం..

కేవలం శ్లోకాలు చదవడమే కాదు వాటి భావాన్ని మనకి  అర్ధమయ్యే విధం గా తెలియచేస్తున్నారు ,  మనకి తెలియని విశేషాలు ఎన్నో తెలియచేస్తున్నారు.  యధాతధం గా  శాస్త్రం లో ఎలా ఉందొ ఆలా చెప్తున్నారు , మన భావి తరాల కోసం గ్రంధస్థం చెయ్యవలసిన శ్లోకాలు మనకి తెలియచేస్తున్నారు . నిజం గా  ఇది ఒక మహా యజ్ఞం అని చెప్పచ్చు,  ఎంతో  సాధన ఉంటే తప్ప ఈ మహా యజ్ఞం ఇలా సాధ్యం కాదు , కనుక నిస్సందేహం గా తెలుగు భాగవతం అనగా అంధ్ర మహా భాగవతం పరమేశ్వర వర ప్రసాదమే. అందుకే ఆ భాగవత ప్రసాదం ఇంట్లో వున్నా,పఠించినా, విన్నంత మాత్రమున  అనంత పుణ్య ఫలమును ఇచ్చునని గురువు గారు తెలియచేసారు

గురువు గారు చెప్పినట్టు , భగవత్గీత లోను శ్రీమద్  భాగవతం లోను ఇంచుమించు పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం ఒక్కటే

బ్రహ్మార్పణం బ్రహ్మా హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా

సంపూర్ణ భగవత్ ధ్యాస లోనే ఉన్న వారికి, హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము వంటివి బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదాన్నీ కూడా ఆవిధంగా భగవంతునిగా చూసే వారు భగవంతుడిని సునాయాసంగా పొందుతారు.

ఇటువంటి యజ్ఞం లో మనలని కూడా భాగస్వాములు గా చేసిన మన పూజ్య గురువు గారు కి పాదాభివందనం

ఇట్లు
శివ పరివారం

No comments:

Post a Comment