Sunday, May 24, 2020

భాగవతం అనే పండు లో అంతా మధుర రసమే

భాగవతం అనే పండు లో అంతా మధుర రసమే
అందులో దశమ స్కంధం ఇంకా మధురం నాకు ఇష్టమైన పండు
పైన చెప్పిన 9 స్కంధాలు ఎవరిని ఆశ్రయం చేసుకున్నాయో అది  దశమస్కంధం
అందులో మొదటి ఐదు అధ్యాయాలు పంచప్రాణాలులా
రాసపంచాధ్యాయి లా ఉంటాయి
రసం అంటే పరమాత్మ అంటాయి 
ముగ్ధ మనోహరమైన వేణుగానం ...మనసా మన్తా శ్రీ కృష్ణమయం
 కృష్ణుడినే నింపుకున్న
గోపికలు వాలే మన శివ పరివారం కూడా తమను తామే మరిచిపోయి అరణ్యంలో
వెడుతున్నారు వాళ్ళకి వెలుగు చూపుతున్నాయి
భాగవతంలో భీష్ముడు అంటారు
కుండలంబుల కాంతి గగనభాగంబెల్లగప్పికొనగ అని
జీవాత్మ పరమాత్మ తో కలవడానికి పడే 
తపన ...ఎంత చెప్పుకుంటే ముచ్చట తీరుతుందని తీరదు...
ఎవరి చెయ్యి పట్టుకుంటే ఇంక ఎవరిని పట్టుకోవలసిన
అవసరం ఉండదో ఆయన మన చెయ్యి పట్టుకున్న యోగులు సిద్ధులు మహా పురుషులే మనకు వ్యాస పీఠం వేసుకుని మన శివ పరివారం కోసం శ్రీమద్భాగవతము ను ప్రతి రోజు మన కోసం తెలియ చేస్తున్న పూజ్య గురువు గారుకి పాదాభివందనం..
నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఆ శ్రీకృష్ణుడే మనకి గురువు గారు ద్వారా తెలియ చేస్తున్నారా అనిపిస్తుంది.

No comments:

Post a Comment