ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ
నిన్న రోజు గురువు గారు చెప్పిన భాగవతం లో నాకు నచ్చినది రాధా కృష్ణులు గురించి.. మా ఇంటి ఇలవేల్పు మరియు మా తండ్రి గారు ఇష్టదైవం ఆ రాధా కృష్ణులు .. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు కి ఏదైనా తినే పదార్ధం కానీ ఏదైనా వస్తువు ఇస్తే వెంటనే "కృష్ణార్పణం "
అనుకుంటారు.. ఇప్పటికీ మా నాన్నగారు కూడా అదే అలవాటు. మా ఇంట ప్రతి సం. ఉగాది అయినా తర్వాత రాధా కృష్ణులు కళ్యాణం చేసే వారు . మా బాబయ్య రాధా కవచం, రాధా కృష్ణుల మకుటం మొ.. పరాయణా చేసేవారు.. మా నాన్నగారు కి కూడా మంచి సద్గురు గారు ఉండే వారు.(మన పరమ గురువు గారు వాలే ఉండే వారు) . అయన వ్రాసిన పద్యాలు , కీర్తనలు ఇప్పటికీ మా ఇంట్లో మేము , మా అన్నదమ్మలు చెప్పుకుంటాము..
నిన్నను గురువు గారు మంత్రం గురించి చెప్పారు కదా నాకు ఒక శ్లోకం గురుతుకు వచ్చింది , అది మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను.
శ్రీ రాధా హృదయేశ్వరం సురనుతం తత్వాబ్ధి చంద్రోదయం
శ్రీ కృష్ణం "శశి"కోటి తేజవదనం శృంగార రత్నాకరం
లోకేశం త్రిజగద్గురుం త్రిభువనే సంపూజితాఘ్రిధ్వయం
శ్రీ శంఖాభ్యం గదాసుదర్శన ధరం కృష్ణం భజే శ్యామలం.
ఇలా మా చిన్న తనం లో మా తండ్రి గారు మాకు కృష్ణుడు పద్యాలూ నేర్పిచారు.. ఇవి ఎక్కడ ప్రచురితం కాని పద్యాలు
అలాగే మనకి తరచూ గురువు గారు మంత్రం గురించి , ఆ మంత్ర విశేషణం గురించి ప్రాముఖ్యత ని చాల సార్లు చెబుతారు గురువు గారు మనకి ఒక మంత్రం ఇచ్చారు అంటే అది మన మరణానంతరం అది జపించుకోవాలి.. మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇతి మంత్ర: అని అంటారు. అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం. ఈ మంత్రం విశిష్టత గురించి కూడా ఒక మంచి శ్లోకం నేర్పారు మా తండ్రి గారు .
జయతు జయతు మంత్రం శాశ్వతానంద మంత్రం
మునిజన హితమంత్రం మోక్ష సంప్రాప్తి మంత్రం
భవ భయ హర మంత్రం భక్త సామ్రాజ్య మంత్రం
ప్రవిమల రస మంత్రం రాధికా కృష్ణ మంత్రం.
గురువు గారు చెప్పే ఈ భాగవతము నిజం గా అత్యంత అత్బుతం , నిన్న గురువు గారు ఒక శ్లోకం చెప్పారు నాకు బాగా నచ్చింది
కధా భాగవతస్యాపి నిత్యం భవితియత్ గృహే
తత్ గృహం తీర్థ రూపంహి వసతాం పాప నాశనమ్
భాగవత కథ ప్రతి నిత్యము జరుగుతున్న గృహము పుణ్య తీర్థముగా మారుతుంది అని అర్ధము . ఆ గృహములో ఉన్న వారికి సకల పాపములు నశించును . పుణ్యతీర్థం అంటే పవిత్రములైన గంగా, యమునా, సరస్వతీ, కావేరీ, తుంగభద్రా, సింధూ, గోదావరీ మొదలగు నదుల ప్రాంతం. భాగవతంలో 5వేల నదుల పేర్లు ఆ నదుల కథలు, పుట్టుకలు ఆ నదీ తీరంలో వేంచేసి ఉన్న ఆ భగవానుని అవతారములు, కథలు ఉంటాయి. అలాంటి భగవంతుని ఆ నదులును సేవించిన భక్తుల కథలను తమ పాపములను నశింప చేసుకున్న మహానుభావుల కథలూ ఇవన్నీ కూడా భాగవతంలో ఉంటాయి. ఆ కథలు వినేవారు ఆ నదులు, క్షేత్రముల వింటారు పలుకుతారు. స్నానం చేసి పాపములు పోగొట్టుకున్న భక్తుల కథలు వింటారు. ఇన్ని పలకబడుచున్న, వినబడుచున్న ఆ ఇల్లు పుణ్యతీర్థమే కదా. అందుకే భాగవత కధ , శ్రవణం జరుగుతున్న ఇల్లు మహా పుణ్యతీర్థం. …అందుకే మన పూజ్య గురువు గారు ఈ భాగవతం ను మన అందరికీ అందిస్తున్నారు.
ఇట్లు
శివ పరివారం

No comments:
Post a Comment