ప్రియమైన భగవత్ బంధువులు కి శ్రీకృష్ణ శరణం మమ
కృష్ణుడు అంటే కాల స్వరూపుడు.కోట్లకొలది విష్ణు నామాలు పలికితే ఎంత పుణ్యమో కృష్ణ అని ఒకసారి పలికితే అంత పుణ్యం.
*మంత్రశాస్త్ర నామాల్లో ముఖ్యమైనది శ్రీకృష్ణశరణం మమ* నారాయణుని ఆశ్రయించిన వారిని,దేవతల్ని ఆసురులు ఏమి చెయ్యలేకపోయారు ఎలాగో ఈ కృష్ణపరమాత్మ పై ఎవరు ప్రీతి పొందుతారో వారిని ఎవరూ బాధించలేరు.
శ్రీమత్ భాగవత పురాణం స్వయానా మహా మంత్రరాజం. గాయత్రిని అధికరించిన మహా మంత్రం. ఇహ పరాలు రెంటికి అనుసంధానించే కల్పవృక్షం. దీనిలోని ప్రతి ఘట్టం, శీర్షిక, పద్యం ప్రభావవంతమైన మంత్రాలే.
అద్భుత ఫలాలను, ఇహపర శుభాలను అందించేది భాగవత పురాణం. మహామంత్ర రాజం.
ప్రతి ఘట్టం, ప్రతి పద్యం మహా ఫలప్రదాయి అయిన మహా మంత్రపూరితమే,
వీటిలో ఏర్చి కూర్చిన కొన్ని మంత్రాలూ ఏర్పరిచారు
ఉదాహరణ కు మీకోసం కొన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను
శ్రీమద్ భాగవతము ఒక కల్ప వృక్షంలా, అమృతంలా, గాయత్రీ మంత్రంలా ఇహ పర సర్వ శ్రేయస్సులు అందిస్తుంది.
అందులోనే అజామిళోపాఖ్యానం ను ఏకాగ్రచిత్తంతో పారాయణ చేసినవారికి మోక్షం బహు సుగమమం అవుతుంది.
అదే కూర్మావతార కథ చదవడం లో కష్టాల కడలిలో మునిగిపోయే వారిని కూడా పైకెత్తి విజయాలను అందించే అమృత ప్రాయం. విశేషమైన సుఖసంతోషాలను కలుగజేస్తుంది
ఇక ధ్రువ చరిత్ర వింటే చాలు క్లేశ నాశనం, మంచి భక్తి, శీలం, తేజస్సు, మానసిక శక్తి, తత్వజ్ఞానం దొరుకుతాయి, వినిపించేవానికి దైవానుగ్రహం లభిస్తుంది.
మాస్టర్ ప్రహ్లాద చరిత్ర ఒక దివ్యమంగళ విగ్రహం కలవాడై నిత్య భయరహిత లోకాన్ని పొందుతాడు.
మనకి తరచూ గురువు గారు నారాయణ కవచం ను చదువు తారు పూజ అనంతరం ఎందుకంటే తిరుగులేని శత్రు నాశని, శత్రు భయ నివారిణి, సిద్ధ విజయ కారిణి అని తెలియచేసారు
ఇక పయోభక్షణవ్రతం అనేది అద్భుతమైన సంతానం అనుగ్రహించే తిరుగులేని వ్రతం.
మత్యావతారం కథ @ మోక్షాన్నిసుగమం చేస్తుంది; కోరికలు సత్యంగా నెరవేరతాయి.
రుక్మిణీ కల్యాణం చేయడం వలన వివాహాది శుభకార్యాలు ఆలస్యం కాకుండా శీఘ్రమే జరిగేలా చూస్తుంది. కల్యాణ ప్రదాయిని. వామనావతారం వలన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది; ఇంద్రభోగాలు ఇచ్చి, గొప్ప భాగ్యవంతుని చేస్తుంది; దివ్యసుఖాలను సమకూరుస్తుంది.విదుర-మైత్రేయ సంవాదం విస్తృతమైన కీర్తులను సమకూరుస్తుంది.
ఇలా శ్రీమద్ భగవతమ్ లో బోలెడు విష్ణు కధలు, వ్రతాలూ, శ్రీకృష్ణకథారసం మొ.. అన్ని మనకి ఉంటాయి అని ఇప్పుడే గురువు గారు చెప్పారు
ఇట్లు
శివ పరివారం
No comments:
Post a Comment