Friday, May 1, 2020

శంకర జయంతి శుభాకాంక్షలు

ప్రియమైన శివ పరివారం కు శంకర జయంతి శుభాకాంక్షలు

ఈ రోజు గురువు గారు శంకర జయంతి గురించి చాల క్లుప్తం గా చిన్న సమయం లో చెప్పారు.. నిజం చెప్పలాంటి గురువు గారు చెప్పినట్టు ఒక జీవిత కాలం సరిపోదు.. నిజమే శంకరులు గురించి అందరికీ తెలుసు , కానీ వాటిని ఎంతమంది ఆచరిస్తున్నారు.. ఎదో శంకర జయంతి రోజున స్వామి వారిని గుర్తు చేసుకోవడం, ఆ రోజు అభిషేకం చెయ్యడం , చేసాం అంటే చేసాం అన్నట్టు గా కాకుండా అయన వాగ్మయం ను తెలుసుకోవడం, శంకర భాష్యం ను తెలుసుకోవడం మనం ప్రయత్న పూర్వకం గా నేర్చుకోవాలి. మనకి పుస్తకాలూ కూడా తెలుగు లో ఉన్నాయి.. ఉదాహరణ కి  ఆది శంకరాచార్యులవారి రచనలన్నింటినీ తెలుగులో వ్యాఖ్యానంతో శంకర గ్రంథ రత్నావళి పేర సాధన గ్రంథ మండలి, తెనాలి వారు ప్రచురణ లో ఉన్నాయి.. (Bhashyam means commentary in Sanskrit. Adi Sankaracharya wrote commentaries for the Vedas, Brahmasutram and Bhagavad Gita. Collectively, his commentaries are called Sankara Bhashyam.)
 ఎందరో ఆచార్యులు భగవద్గీతకు వ్యాఖ్యానాలు, భాష్యాలు రచించినప్పటికీ శ్రీ శంకరాచార్యుల భాష్యం ఉత్కృష్టమైనదిగా ప్రసిద్ధి గాంచినది.

ఇక గురువు గారు చెప్పినట్టు కనీసం లో కనీసం సౌందర్య లహరి , శివానంద లహరి అయినా కొన్ని శ్లోకాలు నేర్చుకుందామ్.. గురువు గారు దగ్గరకి వెళ్ళినప్పుడు ఒక్క శ్లోకం నేర్చుకునే అది మననం చేసుకుందాం..

ఇక గురువు గారు నాకు ఇష్టం అయినా తోటకాచార్యులు గురించి చెప్పారు.. గురువు గారు ప్రతి అభిషేకం లో తోటక అష్టకం లో శ్లోకములు చెప్పి అభిషేకం మొదలు పెడతారు.. శంకరులనుద్దేశించి ఆశువుగా చెప్పిన అష్టకం మీ తోటకా అష్టకం. అందుకే చివరిలో భవ శంకర దేశిక మే శరణమ్ అని ఉంటుంది..
దేశిక అంటే "దిశ్" నుంచి వచ్చిన దిశ, సరైన దిశ, దారి చూపించే గురువు
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ .
1. గురు చరణలను హృదయం లో కలన చేయాలని (ధ్యానం లో) శిష్యుని కర్మ శరణాగతి!
2. రచయ - నా యందు అఖిల దర్శన తత్త్వాన్ని రచించవయ్యా అనే ప్రార్థన.
3. కలయ - ఈశ్వర జీవ వివేకాన్ని నాలో కలుగజేయ మనే ప్రార్థన.
4. వారయ - నాలోని మోహమనే మహాసముద్రాన్ని నివారిచమనే ప్రార్థన.
5. పరిపాలయ - దీనుడైన నన్ను పరిపాలించమనే ప్రార్థన.
6. మహామహులు జగత్తును రక్షించడానికి సంచరిస్తూ ఉంటారనీ, అటువంటి వారిలో శంకరులు సూర్యుని వంటి వారనే విషయాన్ని చక్కగా లెలియజేసారు తోటకాచార్యులు.
7. శరణన్న వారిని వాత్సల్యంలో రక్షించడం శంకరుల సహజ లక్షణం.
8.నాకేమీ తెలియదు. నా దగ్గరేమీ లేదు.

గురువు తన సహజమైన కృపతో ఉద్ధరిస్తాడనే అపూర్వమైన రహస్యాన్ని చెప్పారు ఈ శ్లోకంలో!
(నా లాంటి అప్రయోజకుడైన, దేనికీ పనికిరాని శిష్యుడిని కూడాఉద్ధరింపచేయు వారు మన గురువు గారు )
ఈ సందర్భం లో మన గురువు గారు కి నమస్సుమాంజలి , పాదాభివందమ్

ఇట్లు
శివపరివారం

No comments:

Post a Comment