Saturday, May 9, 2020

నారద మహర్షి జయంతి

ప్రియమైన భగవత్ భక్తులు కి శ్రీ కృష్ణ శరణం మమ

ఈ రోజు నారద మహర్షి జయంతి ,పురాణాల ప్రకారం రుషులను నాలుగు రకాలుగా విభజించారు. వారు దేవర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు, రాజర్షులు. ఉత్తమ శ్రేణికి చెందిన రుషులను బ్రహ్మర్షులు అంటారు. సామాన్య రుషి స్థాయిని దాటిని గొప్పవారి మహర్షి, రాజుగా ఉంటూనే రుషిత్వం పొందినవాడు రాజర్షి. దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు. వీరిలో నారదుడు, పర్వతముని గొప్పవారు.ఈ మధ్యనే మనకి భాగవతం లో మన గురువు గారు  నారదుడు యొక్క వృత్తాంతం ను తెలియచేసారు ..మనకి నారద పురాణం కూడా ఒకటి ఉంది  .  నారద ప్రవేశం అందులో కొన్ని పద్యాలు మనకి గురువు గారు విడిగా చెప్పారు.. ఆ పద్యంలో ఇప్పటి ప్రస్తుత పరిస్థితి ని కూడా విశదీకరించారు చాలా మంది నారదుడు అంటే ఎదో మధ్యలో వస్తాడు, ఫిట్టింగ్ మాస్టర్ అని సినిమా ప్రభావాలు ద్వారా మనకి చూపించారు ,  ..ఆయన గొప్ప విష్ణు భక్తుడు.బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ, నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది..మనకి ఏదైనా పనిలో ఆటంకం వస్తే disturbance వచ్చినప్పుడు నారదుడుని తలుచుకుంటే ఆ పని విజయవంతం గా సాఫీ  గా అవుతుంది.ఎందుకంటే నారదుడు రిపోర్టింగ్ to నారాయణుడు కి కదా...

మొన్న గురువు గారు చెప్పిన విశేషాలు ను బట్టి ఇంచుమించు పురాణాలలో నారదుని పాత్ర కనుపిస్తుంది. అందులో ముఖ్యమైనవి -

భాగవతం, ప్రధమ స్కంధంలో నారదుడు వేద వ్యాసునికి భాగవతం రచింపమని బోధిస్తాడు.
ఈ సందర్భంలోనే నారదుడు తన పూర్వ గాథను వ్యాసునకు వివరిస్తాడు.
రామాయణం, బాలకాండలో నారదుడు వాల్మీకికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం వ్రాయమనీ, అది ఆచంద్రార్కం నిలిచి ఉంటుందనీ తెలియాచేస్తారు . అలా చెప్పిన భాగమే సంక్షిప్త రామాయణంగా చెప్పబడుతుంది.
మహాభారతం సభా పర్వంలో నారదుడు కూడా తన పాత్ర పోషిస్తారు

నారదుని పూర్వ జన్మ వృత్తాంతం ను మహాభాగవతం మొదటి స్కంధంలో  వచ్చినప్పుడు గురువు గారు మనకి చాల వివరం గా వివరించారు..  నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది.ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు అని మొన్న భాగవతం లో గురువు గారు తెలియాచేసారు.

గురువు గారు చెప్పిన తర్వాత తెలిసింది మనకి ఈ భాగవతం మొదటి స్కంధం లో ఇంత  విలువైన సమాచారం ఉందని.. చాలామంది ప్రవచన కారులు మొదటి , రెండు మూడు ఎక్కువగా  చెప్పరు .. గజేంద్ర మోక్షం, నారసింహ , ప్రహ్లాద, దక్షయాగం, మొ.. అందరికీ తెలిసినవి చెప్తారు.. కానీ మన పూజ్య గురువు గారు ప్రతి శ్లోకం, వచనం దానిలో ఉండే వివరణ మనకి అర్ధమయ్యే బాషా లో వివరం గా తెలియచేస్తున్నారు.. నిజం గా ఇది మనం తెలుసుకోగలుగు తున్నాము అనగా శ్రీ కృష్ణ శరణం మమ.. ఈశ్వర సంకల్పం.. ఉంటేనే వినగలుగుతాము
గురువు గారు కి భాగవతము లో ఉన్న మన శివ పరివారం అందరి తరపున పాదాభివందనములు

ఇట్లు
శివ పరివారం

భూలోక భవసాగర దర్శనార్ధం విష్ణు మూర్తుల వారు, నారదుణ్ణి వరాహంగా భూలోకానికి పంపించారు. నారద మహర్షి 60 మంది పిల్లల్ని కన్నారు. వాళ్ళే మన 60 సంవత్సరాలట. అంటే మనకు 12 నెలలు ఉన్నట్టుగా 60 సంవత్సరాలున్నాయి. మనమే సంవత్సరంలో పుట్టామో సరిగ్గా మన షష్టి పూర్తికి మళ్ళీ అదే సంవత్సరం వస్తుందన్నమాట!
నారద సంతానం పేర్లు :
 ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, అంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాధి, విక్రమ, వ్రుష, చిత్రభాను, సుభాను, తారణ, పార్తివ, వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, విక్రుతి, ఖర, నందన, విజయ, జయ, మన్మధ, దుర్ముఖ, హేమళంబ, విళంబ, వికారి, శార్వరి, ప్లవ, శుభక్రుత్, శోభక్రుత్, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధిక్రుత్, పరీధావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్త, సిద్ధార్ధ, రౌద్ర, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్ష, క్రోధన, క్షయ

No comments:

Post a Comment