Saturday, May 9, 2020

బ్రహ్మి ముహూర్తం - కల

19/02/2020
నాకు ఈ రోజు తెల్లవారుఝామున ఒక కల వచ్చింది.. అది కల అందము అంటే కల కానిది. అది కూడా బ్రహ్మి ముహూర్తం లో వచ్చింది..
నిజం గా లైవ్ గా జరిగినట్టు ఉంది.. ఎక్కడ మర్చిపోతానో ఆ మధుర సన్నివేశం అని వెంటనే వ్రాసుకుంటున్నాను..
ఈ విషయం ఎవరి కి ఎలా చెప్పాలో తెలియడం లేదు అందుకే నా బ్లాగ్ లో వ్రాసుకుంటున్నాను.
నాకు వచ్చిన కల లో మా నా స్నేహితుడు  , వాళ్ళ నాన్నగారు (నుదుటన విభూది ధారణ తో) మరియు నేను కార్ లో వెనక సీట్ లో ఉన్నాము.. అది కూడా నీలం కలర్ సెలిరియో కార్.. అన్ని చాల క్లియర్ గా విసిబిలిటీ గా ఉంది. ఆలా ట్రావెల్ చేస్తున్నాము.. నా చేతిలో నా దేవతార్చన , పంచాయతనం ఉంది.. సాధారణం గా అది బయటకి తీసుకుని రాను. ఎందుకో నా సంపుటం లో పెట్టుకుని తెచ్చాను..
మేము కార్ ఆగి ఒక దేవాలయం లోకి వెళ్ళాము.. అది చాలా పెద్ద పాట శివాలయం.. ఎలా ఉంది అంటే మినిమం 1000 ఇయర్స్ క్రితం కట్టిన గుడి.. ఒక రకం గా చెప్పాలంటే దక్షారామం  దేవాలయం లా పెద్దగా ఉంది.. ఆ బండలు కూడా చాల నున్నగా అచ్చమ్ మన తిరుమల లో ఉన్న బండలు లా ఉన్నాయి.. నేను ఒక గట్టు దగ్గర కూర్చున్నాను.. మా సర్ వాళ్ళ నాన్నగారు లోపాలకి దర్శనానికి వెళ్లారు.. వాళ్ళ నాన్నగారు అయితే చాల క్లియర్ గా చాలా పరమేశ్వరుడు ని చూద్దాం లో తరిస్తున్నే ఉన్నారు.. మొహానికి విభూది ధారణ తో..
నేను ఒక మెట్టు మీద కూర్చున్నాను.. ఒక పౌరోహితుడు  వచ్చి నా చేత నా శివ దేవత విగ్రహాలు పంచాయతనం కు అభిషేకం చేసుకోండి.. అని ప్రదేశం చూపించి వెళ్లారు..
నేను యధావిధి గా నా స్వామి వారికీ అభిషేకం మరియు నీరాజనం ఇస్తున్నాను. పక్కనే మారేడు చెట్టు నుంచి రెండు బిల్వ దళాలు తీసుకుని మా స్వామి వారికీ వేసుకున్న్నాను.. ఈ లోగ ఆటను హారతి కర్పూరం తెచ్చారు , నీరాజనం ఇచ్చి నా పంచాయతనం ను నా సంపుటం లో జాగ్రత్తగా పెట్టుకున్నాను..
తర్వాత ఎదురుగా స్వామి వారి దగ్గరకి వెళ్దాం అని బయల్దేరాను , లోపల ఈశ్వర లింగం లోపల విద్యుత్ కంటి లేదు.. ఒక్క దీపం , ఆ దీపం కాంతి ఆ శివ లింగం మీద పడుతూ ఉంది.. స్వామి వారికీ విభూది తో అభిషేకం, హారతి, వెంటనే జలాభిషేకం. ఆ దీపం కాంతి శివ లింగం పై పడుతూ స్వామి వారు మెరిసిపోతున్నాడు.. వెంటనే ఎవరో తెచ్చిన దండను స్వామి కి అలంకరిస్తున్నారు.. హారతి ఇస్తున్నారు.. నేను వెంటనే అఘోరేభ్యోఽథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః । సర్వతః శర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః అని హారతి ఇస్తూ ఉండగా చెప్పను.
ఆ తర్వాత అదే లైన్ లో నుంచి వస్తుండగా పక్కనే అమ్మవారి విగ్రహం ఉంది.. అమ్మవారు సాధారణం గా ఉన్నారా ..
సౌందర్య లహరి లో శంకరులు అమ్మవారి ని ఎలా వివరణ చేస్తారో ఆలా ఉన్నారు.. అమ్మ వారిని ని చూడగా నే సౌందర్య లహరి లో ఒక్క రెండు పద్యాలూ నాకు ఇష్టమైనవి చాపుకుని అమ్మవారిని చూస్తూ వచ్చాను.. అమ్మవారి కి గులాబీ దండాలు వేశారు.. ఎర్రటి పట్టు చీరతో.. ఇంకా నా హృదయం లో అమ్మవారి స్వరూపం అలాగే ఉంది..
నీరసం గా ఉంది ఆ ప్రసాదం లైన్ లో ఉండాలా అని అక్కడ కూర్చుంటే ఒక పూజారి దద్దోజనం ప్రసాదం ఇచ్చారు.. నల్లటి పోపు వేసిన మిరపకాయ.. ఆ ప్రసాదం తిని పక్కన ఉన్న హ్యాండ్వాష్ లో చేతిని క్లీన్ చేసుకుని కూర్చున్నాను..
చరణ్ సర్ వాళ్ళ నాన్నగారు తో కలిసి బయట కి వచ్చేసాము ఇంతకీ ఏది ఏమి దేవాలయం అని చుస్తే పేరు కనబడ లేదు.. కానీ అక్కడ బోర్డు మీద ఏలూరు అని మాత్రం స్పష్టం గా క్లియర్ గా కనబడింది.
ఈలోగా 5:15 అయ్యింది మా శ్రీమతి నన్ను నిద్ర లేపడం .. నేను యధావిధిగా నా ఆ నిద్ర లోంచి వచ్చేసాను..
ఇదండీ సంగతి...
ఇట్లు
రాణీ శర్మ


No comments:

Post a Comment