Monday, April 27, 2020

అక్షయ తదియ

మనకి గురువు గారు తరచూ చెప్తూ ఉంటారు నాలుగు రాత్రులు గురించి. అవి ఏమిటంటే  కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి , దారుణ రాత్రి గురించి.. రాత్రి శబ్ద వివరణ జగన్మాత రాత్రి రూపిణి. పరమేశ్వరుడు పగలు  అని , అందులో దారుణ రాత్రి అంటే అక్షయ తదియ నాటి రాత్రి ని దారుణ రాత్రి అంటారు.. మనకి వివిధ సందర్భాలు లో గురువు గారు అక్షయ తదియ గురించి చాల విశదీకరించారు.. ఒక రకం గా చెప్పాలంటే అలంటి రోజు కోసం ఆధ్యాత్మిక వ్యక్తులు , ఉపాసకులు వేచి చూస్తారు. ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యరు.. ఎదుకంటే అక్షయ తదియ నాడు మనం ఏదైతే ఉపాసన / మంత్రం లేదా పుణ్య కార్యం చేసుకుంటే అది అక్షయం అవుతుంది.. (నో లిమిట్)..అక్షయం అంటే క్షయం లేకుండా ఉండాలని అర్థం..

అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. మన అదృష్టవ శాత్తు ఇప్పుడు బంగారం షాప్స్ మూసి వేయ బడినవి ..


 అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తిథి అని అర్థం. , అక్షయ తృతీయ అనగా ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి వివరించారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే వ్రతం, జపం,హోమం, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుందని చెపుతాడు. అక్షయ తృతీయ నాడు చేసేటువంటి దానాలు మంచి ఫలితాలనిస్తాయి. దానం చేయమని పురాణాలు చెపుతుండగా బంగారం కొనడం అనేటువంటివి తప్పు అని భాగవతం తెలియచేస్తోంది.. ఎందుకంటే మనం మొన్నటి వరకు నేర్చుకున్నాము కదా బంగారం లో కలి  ప్రవేశిస్తాడు అని..

అయితే ఈ మాసం లో చేసే దానం కూడా కొన్ని చెయ్యాలి అని చెప్పింది.. ఉదక  దానం, గొడుగు, చెప్పులు , మొ..  ఎందుకంటే వైశాఖ మాసం అనగానే ఎండలు విపరీతం గా ఉంటాయి కదా.. ఇవి దానం ఇస్తే తీసుకునే వారికీ ఉపయోగం అవుతాయి..దానాలను వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. అంటే వేసవి తాపాన్ని తగ్గించే విసనకర్ర, గొడుగు, పాదరక్షలతో పాటు దశ దానాలు కూడాశక్తి కొలది చేయవచ్చు

మనకి శాస్త్రం లో మానసిక ము గా కూడా దానం ఇవ్వచ్చు.. దానికి ఖర్చు లేదుగా .. మనసుకు కుదుట పరచుకుని వాళ్ళని మన ఎదురుగ కూర్చోపెట్టుకుని వాళ్ళకి గోదానం, సువర్ణ దానం, పట్టు పీతాంబరం లు మొ. ఇచ్చినట్టు గా అనుకోవచ్చు.. నేను ఎక్కువగా మానసిక దానం ఇస్తాను.. ఉదాహరణ కి నేను మొన్న మానసికం గా అగస్య మహా ముని ని, లోపాముద్ర అమ్మవారి ని మా ఇంటికి పిలిచి వారికీ దానం ఇచ్చినట్టు గా భావించాను.. ఒకరోజు నా మా అక్కయ్య కి సువర్ణ , మరియు పట్టు వస్త్రాలు ఇచ్చినట్టు గా మానసికం గా దానం ఇచ్చాను.. .ఈ రోజు పితృ తర్పణం,దానం ఇస్తే గ్రహ దోషాలు, పూర్వ కర్మ ఫలితాల తొలగిపోతాయి అని శాస్త్ర  వచనం

ఇక మన శివ పరివారం కు చాల మంది కి చండీ పారాయణ తెలిసినదే కదా.. చండీ పారాయణ లేని వాళ్ళు రుద్ర పారాయణ , స్వామి వారికీ అభిషేకం యోగ నరసింహ మాత్రం లేదా గురువు గారు చెప్పిన మాత్రం జపించుకోవచ్చు..

శ్రీ వైద్య నాధాయ నమః శివాయ , ఎందుకంటే ఈశ్వరుడే ప్రధమ వైద్యుడు కాబట్టి.. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ను దృష్ట్యా మనం పరమేశ్వర శరణాగతి ని వేడుకోవలసినదే..


కాబట్టి ఈ అక్షయ తదియ చాల ముఖ్యమైన రోజు.. కావున మన శివ పరివారం అందరం తప్పనిసరిగా వినియోగించుకోవాలని సాధ్యమైనంత వరకు మౌనం గా ఉంది మనసులోనే మన కి ఇష్టమైన దేవతా ఆరాధన చేసుకోవాలి  అని గురువు గారు తెలియచేయడం జరిగినది..

ఇట్లు
శివ పరివారం

No comments:

Post a Comment