Saturday, April 25, 2020

రక్షాకవచం

రక్షాకవచం - ఇలా చేసిన వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఏవిధంగా జీవిస్తే మనం అన్నివిధాలా బాగుంటామో అటువంటి జీవనవిధానం పేరే సనాతనధర్మం. ఇందులో సదాచారం చాలా ముఖ్యం అని చెప్పబడుతోంది.
బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేవడం, ప్రతివారూ ఏదో ఒక యోగాభ్యాసం చేయడం, ధ్యానం చేయడం, ముఖ్యంగా చెప్పారు.
నిత్య యోగాభ్యాసం కలిగినటువంటి వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మందులు కూడా లేని జబ్బులు రాకుండా ఉండాలన్నా, వచ్చినవి వెంటనే తొలగిపోవాలన్నా ముఖం రోగనిరోధకశక్తి. అది పెంచగలిగిన విధానం సనాతనధర్మంలో కనబడుతోంది.
కేవలం ఉచ్ఛ్వాసనిశ్వాసలు తీసి వదలడమే యోగం కాదు.
యోగజీవనం ఒక్కటే రోగనిరోధకశక్తికి మార్గం.
సూర్యనమస్కారాలు చేయడం, ప్రాణాయామం(అనులోమ, విలోమ),
ఊరికే exercise లాగా యోగా చేయడం కాదు, యోగం యోగవిద్య కావాలంటే అది భగవదారాధనతో ముడిపడాలి. ఏరోబిక్ exerciseల లాగా యోగం చేస్తాము అంటే యోగానికి ఉన్న ప్రాణశక్తి తీసేసినట్లే.
ఆసనాలు వేయడం, ప్రాణాయామాలు రాజయోగం అయితే మంత్రయోగం మరొకటి ఉంది.
రాజయోగం, మంత్రయోగం, హఠయోగం, నాదయోగం, లయయోగం అని అయిదురకాల యోగములున్నాయి.

ఇంటివంట వంటికి మంచిది. వర్కింగ్ డేస్ లో క్యాంటీన్లో తిని, వీకెండ్ లలో హోటల్ కి వెళ్ళిపోదాం అనే పరిస్థితులలో చాలా గృహాలున్నాయి. భార్యాభర్తలు ఉభయులూ కష్టపడుతున్న కుటుంబాలలో ఇది మామూలు. కానీ ఇంటివంట వండుకోవడం – అది కూడా శుచిగా సాత్త్వికమైన ఆహారం వండుకొని భగవంతునికి నివేదించి అన్న పదార్థాన్ని ప్రసాదంగా మార్చుకొని సకాలంలో సాత్త్విక భోజనం చేయగలిగితే అది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అనారోగ్యాలను తొలగిస్తుంది.

ధార్మికమైన ప్రవృత్తి కలిగి ఉండాలి. ఏ ఒక్కరినీ హింసించకుండా ఉండగలగడం అలవాటు చేసుకోవాలి. హింస ఎప్పుడూ ధర్మం కాదు. పదిమందినీ నశింపజేస్తాను, నా ధర్మం కాపాడుకోవడం కోసం ఇతర ధర్మాలను నాశనం చేస్తాను అని బయలుదేరినది ధర్మమే కాదు. ఇటువంటి మతాలు తీవ్రవాదాలై, ఉన్మాదాలై ప్రపంచాన్ని ప్రమాదభరితం చేస్తాయి.
సత్యం, అహింస, శుచి, అక్రమార్జన లేకుండా ఉండడం – ఇవే ప్రధానంగా ధర్మభాగాలు. సాత్త్వికమైన ప్రవృత్తి అలవరచుకోవాలి.

క్రోధము, భయము వంటి తామస ప్రవృత్తులనుంచి దూరంగా ఉండాలి. ప్రతివారికీ అనుకున్నది జరుగకపోతే కోపం వచ్చేస్తుంది. నిగ్రహం అనేది అలవాటు చేసుకోవాలి.
యోగాభ్యాసం, సరియైన భోజనం ఉంటే క్రోధం కూడా జయించవచ్చు. క్రోధాన్ని నిగ్రహించుకుంటే ఆయుష్షు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానసికమైన ఉద్రేకాలు, ఉద్వేగాలు నిగ్రహించుకోవాలి. మానవసహజంగా వస్తాయి కోపాలు. సంస్కారంతో, వివేకంతో నిగ్రహించుకోవడం అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా క్రోధాది రుగ్మతలు పోతాయి.
సత్ప్రవర్తన కలవాడు, భగవంతుని ఆశ్రయించిన వాడిని బాధించే శక్తి ఏదీ ప్రపంచంలో లేదు. ధర్మము, దైవము – ఈ రెండూ రక్షిస్తాయి. ధర్మాన్ని ఆచరించాలి, దైవాన్ని ఆశ్రయించాలి.
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు! యుక్తస్వప్నావ బోధస్య యోగీ భవతు దుర్గః!! (భగవద్గీత – కృష్ణపరమాత్మ)

నిత్యం భోజనం చేస్తున్నప్పటికీ అనారోగ్యాలు వచ్చినప్పుడు పథ్యం పుచ్చుకుంటాం, కొన్ని విడిచిపెడతాం, ఔషధతుల్య పదార్థాలు స్వీకరిస్తాం. అదేవిధంగా వ్యక్తికీ, సమాజానికీ, ప్రకృతికీ వైపరీత్యాలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా ఉపాసన పెంచుకోవాలి. ఇంట్లో ఉన్న సమయాన్ని వ్యర్థ కాలక్షేపాలతో కాకుండా భగవన్నామస్మరణ, స్తోత్రాదులు చేసుకోవాలి.

దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతోఖిలస్య!
ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం తమీశ్వరీ దేవి చరాచరస్య!!

ఎప్పుడైనా మన కోరిక ప్రపంచానికి ఉపకరించేది కావాలి. అపకారం కలిగించేది కాకూడదు. జగత్తుకు ఉపకారమైన కోరిక కోరుకుంటే భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు.
దేవి ప్రసీద పరిపాలయ నోరిభీతేర్నిత్యం యథాసురవధాదధునైవ సద్యః!
పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు ఉత్పాతపాక జనితాంశ్చ మహోపసర్గాన్!!(చండీసప్తశతి)
ఈ శ్లోకం విశేషించి జపం చేయవలసినదే. ఎందుకంటే కనబడని శత్రువులు తయారయ్యారు. అలాంటి శత్రువుల బాధ లేకుండా చెయ్యి తల్లీ అంటూ సర్వ జగత్తులో దుఃఖానికి కారణమైన ఏ పాపములున్నాయో అవి తొలగిపోవుగాక! అంటున్నారు. ఉత్పాతాలను వెంటనే తొలగించు తల్లీ! అని ప్రార్థన.

విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం విశ్వాత్మికా ధారయసీతి విశ్వమ్!
విశ్వేశవంద్యాభవతీ భవంతి విశ్వాశ్రయా యే త్వయి భక్తినమ్రాః!!

సిద్ధేశ్వరీ తంత్రంలోని దుర్గా ఆపదుద్ధారక స్తోత్రమ్

నమస్తే శరణ్యే శివే సానుకమ్పే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే ।
నమస్తే జగద్వన్ద్యపాదారవిన్దే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౧॥
నమస్తే జగచ్చిన్త్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే ।
నమస్తే నమస్తే సదానన్ద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౨॥
అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జన్తోః ।
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౩॥
అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే నలే సాగరే ప్రాంతరే రాజగేహే ।
త్వమేకా గతిర్దేవి నిస్తార నౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౪॥
అపారే మహాదుస్తరేఽత్యన్తఘోరే విపత్ సాగరే మజ్జతాం దేహభాజామ్ ।
త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౫॥
నమశ్చణ్డికే చణ్డదుర్దణ్డలీలా సముత్ఖణ్డితా ఖణ్డితా శేషశత్రోః ।
త్వమేకా గతిర్దేవి నిస్తార బీజం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౬॥
త్వమేవాఘభావాధృతా సత్యవాదీ ర్నజాతా జితా క్రోధనాత్ క్రోధనిష్ఠా!
ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౭॥
నమో దేవి దుర్గే శివే భీమనాదే సరస్వత్యరుంధత్వమోఘ స్వరూపే
విభూతిశ్శుచీ కాలరాత్రిస్సతీ త్వం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౮॥
శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం! మునిమనుజపశూనాం దస్యుభిస్త్రాసితానామ్ ।
నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానాం! త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ॥ ౯॥

పోల్చుకోలేకుండా ఉన్న శత్రువులను ‘దస్యులు’ అంటారు.

ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారహేతుకమ్। త్రిసన్ధ్యమేకసన్ధ్యం వా పఠనాద్ధోరసఙ్కటాత్ ॥ ౧౦॥
ముచ్యతే నాత్ర సన్దేహో భువి స్వర్గే రసాతలే। సర్వం వా శ్లోకమేకం వా యః పఠేద్భక్తిమాన్ సదా ॥ ౧౧॥
స సర్వం దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్। పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే ॥ ౧౨॥
స్తవరాజమిదం దేవి సఙ్క్షేపాత్కథితం మయా ॥ ౧౩॥

శివుడు పార్వతీదేవికి చెప్పిన దివ్యమైన స్తోత్రం ఇది.

No comments:

Post a Comment