ప్రియమైన శివ పరివారం కు వరాహ జయంతి శుభాకాంక్షలు
శ్రీ మహావిష్ణువు ధర్మ పరిరక్షణ మరియు దుష్టశిక్షణల నిమిత్తమై యుగయుగాల్లో ఎన్నో అవతారాలు ధరించాడు. వీటిలో దశావతారాలు ప్రముఖమైనవి. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము.
శ్వేతవరాహ కల్పములో శ్రీ మహావిష్ణువు రెండు మార్లు వరాహ అవతారం ధరించాడు. మొదటిదైన స్వాయంభువ మన్వంతరములో ఒకసారి మరియు ఆరవదైన చాక్షుష మన్వంతరములో మరొకసారి ఈ అవతారమును ధరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మనము ఇదే కల్పములో ఏడవదైన వైవస్వత మన్వంతరములో నాలుగవదైన కలియుగంలో వసిస్తున్నాము.
వరాహ రూపం ధరించిన మహా విష్ణువు తన కోరల మీద భూమిని పైకి ఎత్తి, ఆ స్థితిలో భూమిని స్థిరంగా ఉంచడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరచి, వాటి తొండముల మీద భూమిని ప్రతిష్ఠించాడు. అప్పటినుంచి ఆ అష్ట దిగ్గజాలే భూమి గతి తప్పకుండా కాపాడుతున్నాయి.
స్వాయంభువ మన్వంతరములో అవతరించిన ఈ వరాహ అవతారాన్ని యజ్ఞ వరాహరూపంగా భావిస్తారు. ఈ యజ్ఞ వరాహ జయంతిని చైత్ర బహుళ త్రయోదశినాడు జరుపుకుంటారు
వరాహ రూపంలో ఉన్న విష్ణు దేవుడికి ప్రత్యేకమైన ఆలయాలు లేవు. ఆ తరవాతి అవతారమైన నరసింహావతారంతో కలిసి సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామిగా పూజలందుకొంటున్నాడు.
వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా,
శశిని కళంకకలేవ నిమగ్నా,
కేశవ ధృతసూకరరూప జయ జగదీశ హరే||
కుంగిపోయిన భూమిని తన నాసికపై చంద్రుని నెలవంక వలె నిలిపి కాపాడిన వరాహావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము – ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా అలాంటిదే.. కాకపోతే మనకి అర్ధం కావడానికి కొంత సమయం పడుతుంది..
సృష్టిలో ప్రతి ప్రాణికీ ఒక్కొక్క ప్రత్యేక లక్షణం, శక్తి ఉంటాయి. అందువల్ల ఆ లక్షణాలుగల జీవి కొన్ని విషయాల్లో అత్యంత బలసమన్వితమై ఉంటుంది. ఆ కారణంగానే స్థితికారకుడైన విష్ణువు దుష్టశిక్షణ చేయవలసివచ్చినప్పుడు స్వస్వరూపంతో కాకుండా ఆయా ప్రాణుల రూపాల్లోనే అవతారం దాల్చాడంటారు. వాటిలో ఒకటి వరాహావతారం.
ఇప్పుడు ఉన్న పరిస్థితి లో మనకి శ్రీ మహావిష్ణువే ఈ జగత్తును కాపాడుతున్నాడు అనడం లో సందేహం లేదు. , అందుకే మన అందరినీ ఇళ్లలో లోనే ఉండే జాగ్రత్తగా ఉండి ఆ పరమేశ్వర ప్రార్ధన చేసుకోమని చక్కటి అవకాశం ఇచ్చారు..
మన కోసం మన పూజ్య గురువు గారు ఈ సందర్భం లో మనకి శ్రీమద్ భాగవతం మనకి తెలియపరుస్తున్నారు అంటే అంత ఆ పరమేశ్వర సంకల్పం.. ఒక్క మాటలో చెప్పాలంటే అంతటా "రామ కృష్ణ" గోవిందా నారాయణా ..
ఇటువంటి సమయమలో ఈ వరహ మూర్తి కధను మనం గుర్తుపెట్టుకుని మన భూమిని, సహజవనరులను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇట్లు
శివ పరివారం

No comments:
Post a Comment