Friday, May 29, 2020

బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం?

Date : 29/05/2020


బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం?

ఈ రోజు భాగవతం లో మాకు బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం? అనేది వివరించారు..

కాల గణనం🤘
ఇది మన కాల గణనం.
ఇంత నిశిత కాల గణన
ఇతరులకు అసాధ్యం.
నానో సేకండ్స్ ని మన
వాళ్ళు ఎంతగా గుణించారో చూడండి
Particulars
Particulars
1
100 తృటికలు 
 1వేధ
2
3 వేధలు 
1 లవము
3
3 లవములు 
1 నిమిషం
4
3 నిమిషాలు 
1 క్షణం
5
5 క్షణాలు 
1 కాష్ట
6
15 కాష్టలు 
1 లఘువు
7
15 లఘవులు 
నిశిక
8
6 నిశికలు 
1 ప్రహర
9
4 ప్రహరలు 
1 దినం
10
15 దినాలు
1 పక్షం
11
2 పక్షాలు 
1 మాసం
12
2 మాసాలు 
1 ఋతువు
13
3 ఋతువులు
1 ఆయనం
14
2 ఆయనాలు
1 సంవత్సరం
15
12 సంవత్సరాలు 
1 తప
16
100 సంవత్సరాలు 
1 శతకం
17
10 శతకాలు 
1 సహస్రకం
18
4 సహస్రకాలు 
1 యుగం
19
4 యుగాలు 
1 మన్వంతరం
20
100 మన్వంతరాలు
1 బ్రహ్మదినం
 
బ్రహ్మ కల్పం-మహాయుగమంటే ఎంతకాలం?
అనంతమైన ఈకాలమానంలో ఎన్నో
మహాయుగాలు గడిచిపోయాయి. ఎందరో
బ్రహ్మలు గతించారు. బ్రహ్మకు పద్మసంభవుడని
పేరు. బ్రహ్మకు ఇప్పటికి కాలమానంలో 50
సంవత్సరాలు గడిచి 51 సంవత్సరంలో శ్వేత
వరాహకల్పంలో ఆరు మన్వంతరాలు తర్వాత ఏడవ మన్వంతరమైన వైవస్వతంలో 27
మహాయుగాలు గతించాయి.
28వ మహాయుగంలో 4వది
అయిన కలియుగం ఇప్పుడు నడుస్తున్నది.
సహస్ర చతురుయుగ సమానమైన బ్రహ్మ దివసాన్ని 14
మన్వంతరాలుగా విభజించడం జరిగింది.
మనమిప్పుడు సప్తమ మనువు వైవస్వతుని కాలంలో ఉన్నాము. పూర్వం ఆరుగురు మనువులు, ఒక్కొక్కరు 76 1/2 చతురుయుగాల చొప్పున
459 చతురుయుగాల కాలం అంటే దాదాపు 3కోట్ల
30లక్షల 50వేల సంవత్సరాలు పాలించారు.

1
కృతయుగం-
1728000  సంవత్సరాలు
2
త్రేతాయుగం- 
1296000  సంవత్సరాలు
3
ద్వాపరయుగం- 
864000  సంవత్సరాలు
4
కలియుగం- 
432000  సంవత్సరాలు
5
ఒక మహాయుగం43,20,000 సంవత్సరాలు                  
 
43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం.
మన లెక్కల ప్రకారం
360 సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరం.
అటువంటి 12వేల దేవసంవత్సరాలు అనగా
43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం (మహాయుగం) అన్నమాట.
2వేల చతుర్యుగాలు బ్రహ్మకు ఒక అహోరాత్రం.
360 అహోరాత్రాలు ఒక సంవత్సరం క్రింద లెక్క. అనగా మనుష్యమానంలో
31,10,40,00,00,000 (311 లక్షల 4వేల కోట్లు)
సంవత్సరాలు.
ఈ చతురుయుగానికి మహాయుగమని పేరు. దీని
ప్రమాణం 43లక్షల 20వేల సంవత్సరాలు.
71 మహాయుగాలు కలిపి ఒక మన్వంతరం అవుతుంది. ఇటువంటి 14
మన్వంతరాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు, మళ్ళీ 14 మన్వంతరాలు ఒక రాత్రి. 28 మన్వంతరాల బ్రహ్మ దినాన్ని కల్పం అంటారు. 360 కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి
నూరు సంవత్సరాలు బ్రహ్మ ఆయుష కాలం.
2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక సంపూర్ణ
దివారాత్రం. 7లక్షల 20వేల మహాయుగాలు ఒక బ్రహ్మ
సంవత్సరం.
ప్రస్తుతం 28వ మహాయుగంలోని 4వ
యుగమైన కలియుగంలో ప్రధమపాదంలో
5108 సంవత్సరాలు
మన్వంతరము:-
హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము
30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును.
ఒక బ్రహ్మ దినము లో 14
మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి.
ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో
ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71
మహాయుగములుగా విభజించబడినది.

*ఎన్నెన్ని సంవత్సరాలు*
దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు
360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి).
మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల.
మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య)
సంవత్సరము. ఇట్టి
12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము).
ఇది మనకు ఒక
చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
💎• కృత యుగము =
4,800 దివ్య సంవత్సరములు =
17,28,000 మానవ సంవత్సరములు
💎• త్రేతా యుగము =
3,600 దివ్య సంవత్సరములు =
12,96,000 మానవ సంవత్సరములు
💎• ద్వాపర యుగము =
2,400 దివ్య సంవత్సరములు =
8,64,000 మానవ సంవత్సరములు
💎 కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు =
4,32,000 మానవ సంవత్సరములు
💎 మొత్తము 12,000 దివ్య సంవత్సరములు =
43,20,000 మానవ సంవత్సరములు –
💎 ఒక దివ్య
యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య
యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు.
బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.
ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము.
అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

ఇది సంగతి
ఇట్లు
శివ పరివారం 

Thursday, May 28, 2020

సప్తఋషులు

date : 28-05-2020

గురువు గారు ప్రవచనం లో ఒక ముఖ్యమైన విషయం తెలియచేసారు.. మనకి ఇప్పడు ఉన్న మన్వంతరం లో సప్త ఋషులు ని తెలియచేసారు.. ప్రతి రోజు మన పూజ సమయం లో కానీ లేదా నిద్ర లేస్తూనే వీళ్ళని ఒక్కసారి అయినా స్మరిస్తే చాలు .. 

ఆ సప్తఋషులు గురించి తెలుసుకుందాం 

ఈ రోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును.  అని గురువు గారు తెలియచేసారు ఇంకా గట్టిగా చెప్పాలంటే...అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రంపూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలికూడా.*

 *ఎక్కడ ఉంటారు?* *ఎలా ఉంటారు?* *అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు.*
*సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.*

 *ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..*

*కశ్యప అత్రి భరద్వాజ*
*విశ్వామిత్రోథ గౌతమః!*
*వశిష్టో జమదగ్నిశ్చ*
*సప్తైతే ఋషయః స్మృతాః!!*

*భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.*
*ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.*

1. *కశ్యపుడు,*
2. *అత్రి,*
3. *భరద్వాజుడు,*
4. *విశ్వామిత్రుడు,*
5. *గౌతముడు,*
6. *జమదగ్ని,*
7. *వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులే.*

*రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.*

 1. *కశ్యప మహర్షి:- సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.*

 2. *అత్రి మహర్షి:-*
*సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.*

 3. *భరద్వాజ మహర్షి:-*
*భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.*

4. *విశ్వామిత్ర మహర్షి*:-
*విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.*

5. *గౌతమ మహర్షి:-*
*తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.*

6. *వశిష్ఠ మహర్షి:-*
*ఇతని భార్య అరుంధతి.* *వసిష్ఠుడు బ్రహ్మమానస* *పుత్రుల్లో ఒకడు. వైవస్వత* *మన్వంతరాన సప్తర్షుల్లో* *ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు* *గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు,* *గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.*
*సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.*

7. *జమదగ్ని మహర్షి:-*
*జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.*


 *మీరంతా మీకు వీలున్న సాయంత్రపు వేళ "సప్తర్షి మండల దర్శనం" చేసుకుంటారు కదూ...*

 *సప్తర్షి మండల దర్శన ఫల ప్రాప్తిరస్తు* 

ఇట్లు 
శివ పరివారం

వేదాశీస్సులు

నిన్న గురువు గారు ప్రవచనం లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియపరిచారు..

మనకి వేదం ప్రామాణికం.. వేదం ఏది చెప్పిందో అదే అదే నిజం.. వేదం లో చివరి లో ఆశీస్సులు ఇస్తారు ఒకేలా ఉంటాయి..

ఆ విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను

గురువు గారు ఎప్పుడైనా ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు ఎంతో ఆర్ద్రత తో చెపుతారు , కొన్ని విషయాలు వాళ్ళ తండ్రి గారు అయినా పరమ గురువు గారిని తలుచుకుని చెప్తారు.. పరమ గురువు గారు అన్నమాటలు ఇవి
మరల బ్రాహ్మణులూ జప మల పట్టుకుంటే సమాజం రూపు రేఖలు మారిపోతాయి
బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకుని ఒక్కసారి జప మాల పట్టుకుంటే వాళ్ళ వంశం తరించిపోతుంది 

వేదాశీస్సులు
సాధారణంగా అన్ని హిందూ ప్రార్థనలు ఇలా ముగుస్తాయి
(శాంతి:, శాంతి:, శాంతి:)
సర్వేజనా సుఖినోభవంతు !
(అందరికీ సుఖసంతోషాలు కలగాలి)
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం
లోకా సమస్తా సుఖినో భవస్తు !
(లోకంలోని అందరికీ సుఖసంతోషాలు కలగాలని దీవించేందుకు గోవులు, బ్రాహ్మణులు నిత్యంశుభం కలుగాలి. )
పైన పేర్కొన్న వేద మంత్రం లేదా ఆశీస్సు, మొత్తం ప్రపంచానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దానిలో వేదాంతం యొక్క ఉద్దేశం మరియు సారాంశం ఉంటుంది. అనేక కారణాల వల్ల దాని అర్ధం యొక్క వివరాలలోకి వెళ్ళడం ముఖ్యం. ప్రపంచ సంక్షేమానికై ఈ మాటలు చాలా ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. రెండవది అపార్ధం చేసుకునే అవకాశం కూడా ఉంది కొంత.
‘్ధర్మిక లేదా దైవ సంబంధ’ కార్యకలాపాలు చేయడానికి మరియు వాటి నిర్వహణకై మార్గదర్శకత్వం చేసి పాల్గొన్న వారిని దీవించే వేదాలను అధ్యయనం చేసే బ్రాహ్మణుడు మరియు ఐశ్వర్యం ప్రసాదించే గోవు ఎల్లప్పుడూ అనందంగా ఉండాలి. అందువల్ల ప్రపంచం మొత్తం, సంతోషంగా జీవిస్తుంది. ఎవరికైనా జీవితం సఫలీకృతం కావడం కోసం ‘ఇహం మరియు పరం’ రెండూ కావాలి అని దీని అంతరార్ధం. ఐశ్వర్యవంతులు ఏది ఆశిస్తే అది పొందగలరు అని ఎవరైనా అనుకోవటం సహజం. అది ధనం మాత్రమే కాదు, ఏదైనా అవవచ్చు. కానీ అది జరుగుతున్నదంటే,దానికి కారణం ఇతరులు దృవీకరించిన ధార్మిక సూత్రాలకు బద్ధులై ఉండటంవేరే మాటల్లో:
ధర్మో రక్షతి రక్షిత:
దీని అర్ధం గుర్తించడం ముఖ్యం. ధర్మమార్గంలో నడిచే వారిని, నడవని వారిని కూడా కాపాడేది ధర్మమే
ఎప్పుడైతే ఒక గోవు గురించి పేర్కొనబడిందో అది ఒక సామాన్య, సాధారణ వ్యక్తి గురించి. వేదాలకు, గోసేవకు దూరంగా ఉండేవారు బహుశా వైదిక సత్యం మరియు సుఖం నుండి దూరమవుతున్నారు.
మంత్రాలలో చెప్పినట్లు వేదాశ్సీస్సుల సార్వజనీయతను ఏ రకంగానూ ఇతర విశ్వాసాలతో పోల్చలేనవి అంటే అతీతమైనవి.


ఇంకా  ఉంది
ఇట్లు
శివ పరివారం 

మహాప్రళయం -సృష్టి ఆవిర్భావం -ఋషులు - జీవరాసి

DATE  28/05/2020

ఈ రోజు మా భాగవత ప్రవచనం లో   మా గురువు గారు  మహాప్రళయం -సృష్టి ఆవిర్భావం -ఋషులు - జీవరాసి

నేను కొంత విషయం లు సేకరించియే ప్రయత్నం చేయగలిగాను ,

మహాప్రళయం -సృష్టి ఆవిర్భావం -ఋషులు - జీవరాసి
     

        అపారమైన జ్ఞాన విజ్ఞానములకు,  సంస్కృతి సంప్రదాయాలకు  ఆలవాలమైన దేశం మన భారత దేశం.  భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మూలాధారం ఋషులు, జీవరాశికి మూలపురుషులు ఋషులే .  మనను  నిత్యమూ నడిపిస్తూ, మనకు సంప్రదాయాన్ని ఇచ్చినవారు ఋషులు. ఈ ఋషులు భౌతికమైన ప్రపంచానికి తండ్రులు . బ్రహ్మ ముఖం నుండి వేదం పుట్టింది, కాని దానిని మనకు ప్రసాదించినది ఋషులే.  ఋషి అంటే మంత్రద్రష్ట, త్రికాలజ్ఞాని, సద్గురువు, వేదవిజ్ఞాన ప్రచారకుడు, తపశ్శాలి , మానవాళికి మార్గదర్సకుడు.

        ప్రతి మనిషికి ఎప్పుడో ఒకప్పుడు  సందేహం కలుగుతుంది - నేనెవరు, నా మూలపురుషులెవరు, వారి చరిత్ర ఎటువంటిది అని -- దీనికి ముందుగా మనం కొంత సృష్టి ఆవిర్భావం గురించి(క్లుప్తంగా ) తెలుసుకొని - ఆ తరువాత మన ఋషులు, మనగోత్రాలు, ప్రవర చెప్పుకొందాం.
 మానవులందరికీ మూలపురుషుడు మనువు.  మనువు యొక్క సంతతి కాబట్టి మనం మనుషులం.
 
  అసలు ఈ మనువు ఎవరు? సప్తఋషులు ఎవరు?  ఇది తెలుసుకొందాం.
           మహాప్రళయం తరవాత అనంత జలరాశి లో శయనించిన మహావిష్ణువు యొక్క నాభికమలం లోంచి ఉద్భవించిన బ్రహ్మకు సృష్టి భాద్యతని అప్పచెప్పాడు విష్ణుమూర్తి.  కాని ఎలాగో చెప్పలెదు. ఆ నాభికమలం చాలా దూరం వెళ్ళిపోయింది, అక్కడ బ్రహ్మ మాత్రమే ఉన్నాడు . సృష్టి ఎలా చెయ్యాలో తెలియలేదు, తెలుసుకొనేందుకు తపస్సు చేసాడు.  ఆ తపస్సు లో ఆయనకి అవగతం అయింది - ముందు నేను సృష్టికి హేతువులైన ఋషులను సృష్టించాలి. అంటే వారికీ ప్రపంచ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము రెండు ఉంటాయన్నమాట.  వాళ్ళే మానవాళికి మంచిచెడులు భోధించి చెపుతారు.

       అలా బ్రహ్మ తలలోంచి మొదట పుట్టినవాళ్ళు - సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనే నలుగురు పుట్టారు.  వీరిని బ్రహ్మ మానసపుత్రులు అంటారు. కాని వాళ్ళు సహజంగా బ్రహ్మ జ్ఞానం ఉండటం తో సృష్టి కార్యక్రమం చెయ్యలేమని తపస్సు కు వెళ్లిపొయరు.

       తరవాత బ్రహ్మవిశ్వం నందు జీవకోటిని  సృస్తించుటకై  మనువులను , శతరూప  అనే సుందరిని, ప్రజాపతులను, ఋషులను సృష్టించాడు.  ఆ తరవాత సృష్టి క్రమం ప్రారంభం అయింది. ఇది మనకి సంబంధించిన విశ్వం.  ఇటువంటివి అనేకానేక  విశ్వాలు ఉన్నాయని మన పురాణాలు చెపుతున్నాయి.

             ఇప్పుడు బ్రహ్మ యొక్క కాలం గురించి ఆయన administration గురించి తెలుసుకొందాం.

         బ్రహ్మ యొక్క ఒక రోజు " పగటి కాలాన్ని" ఒక " కల్పము " అంటారు. ఈ పగటి కాలాన్ని (14) పద్నాలుగు భాగాలుగా చేసి, ఒకొక్క భాగానికి ఒకొక్క  మనువుని సృష్టించాడు. ఒకొక్క మనువు కాలం అయిపోగానే మళ్ళా కొత్త మనువుని సృష్టిస్తూ ఉంటాడు.  మనువు, మనువుతో పాటు ప్రజాపతులు, సప్తరుషులు, రుద్రులను,. ఇంద్రుడు, దేవతలు ఇలా  entire administration అన్నమాట.

బ్రహ్మ ఒక రోజు పగటి కాలం (కల్పము )   =  1000 మహాయుగాలు (432,00,00,000 మానవ సంవత్సరాలు)                                                                   (43,20,000X 1000)   (432 కోట్లు సంవత్సరాలు)
ఒక మహాయుగం  =  . కృతయుగం + త్రేతాయుగం + ద్వాపరయుగం + కలియుగం (చాతుర్యుగాలు )
కలియుగం       =                                                                    4,32,000   సంవత్సరాలు
ద్వాపరయుగం =       (432000 X 2)=                                     8,64,000          "
త్రేతాయుగం     =       (432000X 3) =                                    12,96,000          "
కృత(సత్య)యుగం =  (432000X 4)=                                     17,28,000         "
                                                                                            43,20,000         "

               బ్రహ్మగారి పగలు కాలం అంటే 1000 మహా యుగాలు పూర్తి అయితే ఒక మహాప్రళయం వస్తుంది. (end of kalpa ). భూమి, జీవకోటి మొత్తం ప్రళయంలో అంతం అయిపోతుంది, కాని విశ్వం ఉంటుంది.  బ్రహ్మ గారి 1000 మహా యుగాల రాత్రి సమయం గడిచాక మళ్ళా సృష్టి పునరావృతం అవుతుంది.

               1000 మహా యుగాలు పగలు + 1000 మహా యుగాలు రాత్రి కలిపితే బ్రహ్మ ఒక రోజు.  దీన్ని  మహాకల్పము అంటారు. ఇలాంటి 360 రోజులైతే ఒక సంవత్సరం . బ్రహ్మ ఆయుర్దాయం 100 (దేవ) సంవత్సరాలు. (100 సంవత్సరాల బ్రహ్మ గారి ఆయుర్ధాయ కాలం, మహావిష్ణువు యొక్క పగటి కాలం).   ప్రస్తుత బ్రహ్మ గారికి (మన గెలాక్సీ) మన శాస్త్రాల ప్రకారం 50 సంవత్సరాలు ( దేవ సంవత్సరాలు)గడచిపోయాయి.

ప్రస్తుతం  బ్రహ్మగారి 51 వ సంవత్సరం లో పగటి కాలం (7) వ మనువు కంట్రోల్ లో మనం ఉన్నము.

మనువు - మన్వంతరాలు

             ఇప్పుడు ఏదైతే జరుగుతోందో ఆ కల్పానికి (day of brahma) "శ్వేతవరాహ కల్పము " అని పేరు. బ్రహ్మగారి పగటి కాలాన్ని (14) భాగాలు చేసి ఒకో భాగానికి ఒకో మనువును appoint చేసారని మనం చెప్పుకొన్నాం.

             ఈ ప్రకారం ఒక మనువు కాలం = 71 మహాయుగాలు = 308571414 (మానవ)సంవత్సరాలు  (71+కృతయుగ(approx )
ప్రస్తుతం మనం (7) వ మనువైన "వైవస్వతమనువు" కాలం లో ఉన్నాము. దీన్ని "వైవస్వతమన్వంతరం" అంటారు.


            ఈ  "వైవస్వతమన్వంతరం" లో ( 27)  ఇరవైఏడు    మహాయుగాలు గడచిపోయాయి -- ఇప్పుడు మనం (28) వ మహాయుగంలోనాలుగవదైన  కలియుగంలో ఉన్నాము. (ఈ మహాయుగం లో మొదటి మూడు యుగాలు గడచిపోయాయి). కలియుగంలో ఇప్పటికి 5115 సంవత్సరాలు (out of 4,32,000 years)  గడచిపోయాయి (B.C +A.C).

పూజ చేసుకొనే టప్పుడు  సంకల్పం లో  చెప్పుకొంటాము(మనం ఎక్కడ ఉన్నాం ఏ కాలంలో ఉన్నాం )  --  శ్వేతవరాహకల్పే,  వైవస్వతమన్వంతరే,  కలియుగే,  ప్రధమపాదే, జంబూద్వీపే, భరతఖండే... 


        ఈ  (14) మనువులు, వారి పేర్లు, వారి కాలంలో ఋషులు , ఇంద్రుడు, వగైరా ఈ క్రింద పట్టికలో చూడండి
(ఇంకో సంగతి ఏమిటంటే ఈ దిక్పాలకుల పేర్లు, ఉపదేవతల పేర్లు ఒకో మనువు టైం లో కొన్ని మార్పులతో ఉన్నాయి)



మన్వంతర (No.)
మన్వంత మను పేరు
అవతార్ పేరు (అసలు పేరు )
భార్య, పిల్లలు
సప్త ఋషులు
ఇంద్రుడు


1


స్వయంభువమను


యజ్ఞ
భార్య-శతరూప
కూతుర్లు-అకుటి,దేవహుతి
మనవలు-యజ్ఞ,కపిల
మరీచిఅత్రిఅంగిరసపులహక్రతు,  పులస్త్య. వశిస్థ  
యజ్ఞ  (మనువు మనవడు)

2

స్వారోచిషమను

 విభు
కొడుకులు - ద్యుమాట్సుషేనరోసిష్మట్  
ఉర్జస్తంభప్రాణదత్తోలి,  రిషభనిస్చరఅర్వరివత్

రొచన

3

ఉత్తమమను

సత్యసేన      
కొడుకులు-పవన,    శ్రింజయయజ్ఞహొత్ర    
కాకుండిహి, కురుండి, దలయ, శంఖప్రవహితమితసమ్మిత   (వశిష్టుని కొడుకులు) 

సత్యజిత్     

4

తామసమను(ఉత్తమమను తమ్ముడు)  

హరి   
10 మందికొడుకులు    
జ్యోతిర్ధామప్రీతుకావ్య, చైత్ర అగ్నివానకపివర 

 త్రిశిఖ  


5


రైవతమను  (తామసమను కవల సోదరుడు)  


వైకుంఠ      


అర్జునబాలివింధ్య    
హిరణ్న్యరోమవేదశ్రిఊర్ద్ధబాహువేదబాహు,సుధామన్పర్జన్య,    మహాముని 


భుట్టరాయ  


6


చాక్షుషమను


అజిత    
చాలామంది కొడుకులుపురు,పురుస,...  
సుమెధస్విరజాస్హవిష్మట్,  ఉత్తమమధు,అభినమన్,సహిశ్న్ను 


మంత్రద్రుమ 


7


వైవస్వతమను   (ప్రస్తుత మనువు)


  వామన        
10 మంది కొడుకులు - ఇక్ష్వాకు,నభగ,ద్రష్ట,సర్యాతినరిస్యంత,నభగ,దిష్ట,తరుస,   ప్రసాదర,వాసుమాన్ 
కశ్యపఅత్రివశిష్టవిశ్వామిత్రగౌతమజమదగ్నిభరద్వాజ


పురందర


8


సావర్ణిమను  


సార్వభౌమ  
చాలామంది కొడుకులు - మొదట నిర్మోక ...    
దిప్తిమత్గాలవపరశురామకృప,  ద్రౌనివ్యాసరిష్యశ్రింగ 


బాలి 


9



దక్ష సావర్ణిమను



రిషభ    

చాలామంది కొడుకులు  -    మొదట భూతకేతు  

సవనద్యుతిమత్భవ్యవాసుమేధాతిథిజ్యోతిష్మాన్సత్య



అద్భుత 


10


బ్రహ్మసావర్ణిమను


విష్వక్సేన


భూరిసేన (etc )      
హవిష్మాన్సుక్రితిసత్య,అపమ్ముర్తి నభగఅప్రతిమౌజస్సత్యకేత్  


శంభు     


11


ధర్మసావర్ణిమను


ధర్మసేతు
10మంది కొడుకులు    సత్యధర్మ  ...  
నిస్చరఅగ్నితేజాస్వపుష్మన్విష్ణుఆరుణిహవిష్మాన్అనఘ 


వైధ్రిత 


12


రుద్రసావర్ణిమను 


సుధామ
 

దేవవన్ ....   
తపస్విసుతపస్తపోమూర్తితపోద్యుతితపోరతితపోద్రితి,తపోధన్


రితధామ


13


దేవసావర్ణిమను


యోగేశ్వర 


చిత్రసేన...  
నిర్మోహ,తత్వదర్సిన్నిష్ప్రకంపనిరుత్సుక ధ్రితిమత్అవ్యయ ,సుతపస్    


దివస్పతి


14


ఇంద్రసావర్ణిమను


బ్రిహద్భాను 


ఉరుగంభీర        
అగ్నిబహుసూచిశుక్రమగధయుక్త,   గ్రిద్రఅజిత     


శుచి



             ఇవి  (14) మనువుల వివరాలు.  బ్రహ్మగారి యొక్క ఒకరోజు పగటి కాలానికి పరిపాలనా వ్యవస్థ.  ఈ  కాలం లో మనం (7) వ మనువైన    "వైవస్వతమనువు" కాలం లో ఉన్నాము. ఈ "వైవస్వతమనువు" గారు సృష్టి కార్యక్రమం చేపట్టి 27 మహాయుగాలు అయిపొయింది (27X 43,20,000). ఇప్పుడు  మనం 28 వ మహాయుగంలో నాలుగవదైన కలియుగం లో ఉన్నము. కలియుగం ప్రవేసించి 5115 సంవత్సరాలు అయింది( ఇంకా 4,32,000-5115=4,26,885 ఉంది ).  మనువుల వివరాలు (9) వ మనువు దగ్గరనుంచి కొన్నికొన్ని పురాణాల్లో కొంతకొంత తేడాలు తో ఉన్నాయి.  ముఖ్య ప్రమాణం భాగవతం, విష్ణుపురాణం.

          ఇంక ఇతిహాసాలు, పురాణాల ప్రమాణాల విషయానికి వస్తే మనకి ఈ 28 వ యుగం లో కృతయుగం దగ్గరనించి విషయసేకరణ, అవగాహన ఉంది.

           సంక్షిప్తంగా  ఈ  కల్పం యొక్క కాలపరిమితులు ఇవి.

              మనువు మారినప్పుడల్లా అంటే మన్వంతరం లో (71 మహాయుగాల అనంతరం) ప్రళయం వస్తుందా అంటే వస్తుంది అనే చాల పురాణాలు చెపుతున్నాయి, కాని అది కల్పాంతం అంటే బ్రహ్మగారి పగలు ముగిసి రాత్రి మొదలు అయ్యేటప్పుడు వచ్చేప్రళయం లా మొత్తం solar system అంతా లయం కాదు అంటున్నాయి.

              మన పురాణాల్లో   మూడురకాలైన ప్రళయాలు చెప్పబడ్డాయి.

1. ప్రాక్రితిక్ ప్రళయ -మహాప్రళయం   -- 311040000000000(311trillion 40billion ) అంటే బ్రహ్మగారి 100 దేవసంవత్సరాల ఆయుర్దాయం తరవాత. (బ్రహ్మగారి ఒక పగలు  కాలం =4320,000000X 2 X 100) మొత్తం విశ్వం, పంచభూతాలు అంతా వినాశనం అవుతుంది. అంటే విష్ణువు యొక్క పగలు సమాప్తం అవుతుంది అన్నమాట. ఆ తరవాత అంతే కాలం రాత్రి విశ్రమించిన మహా విష్ణువు,  సృష్టి  పునః ప్రారంభం మొదలు పెడతారు with new  brahma. 

2. నైమిత్తిక ప్రళయం - కల్పాంతం - అంటే బ్రహ్మ గారి ఒక పగలుకాలం - 4320,000000 (432 కోట్ల సంవత్సరాలు) అప్పుడొచ్చే ప్రళయం లో అన్ని జీవరాసులు నశించిపోతాయి, భూమి కుంగి పోతుంది, కాని విశ్వం ఉంటుంది - ఆయన రాత్రి నిద్రకి వెళ్ళేటప్పుడు జీవకోటినంతా నాశనం చేసి మళ్ళా ఉదయం సృష్టి మొదలు పెడతారు

 3. మన్వంతర ప్రళయ : ఒక మనువు కాలం అంటే 71 మహాయుగాలు (30.7 కోట్లు సంవ ) అప్పుడుకూడా ప్రళయం వస్తుంది, కానీ కల్పాంతం అంత  పెద్దది కాదు, కాని ఇక్కడ కూడా జీవకోటి చాలా నశించిపోతుంది. భూమి కూడా కుంగుతుంది.

ఇవి  కాక  ఒక మహాయుగం అంటే (4) చాతుర్యుగాలు పూర్తి అయినప్పుడు ఒక ప్రళయం, జీవకోటికి అపార నష్టం కలుగుతుంది.   .ఇది కాక  ఇంకా సౌర కుటుంబం లో వచ్చే ప్రళయాలు  చాలా చెప్పారు మన పురాణాల్లో.

అన్ని పురాణాలలోను మహాప్రళయం ఒక భయంకరమైన వర్షం తో (deluge ) మొదలవుతుందని సమస్త ప్రాణికోటి నీటిలో పరిసమాప్తి అవుతుందని,భగవంతుడు ఒక మనిషిని సాక్షీభూతంగా భవిష్యత్తు మానవాళి కోసమ్ ఎన్నుకొంటాడని అతడే మనువు (వైవస్వతమను ) అని చెపుతున్నయి.  బైబిల్లో కూడా ప్రళయం ఇంచుమించు ఇదే విధంగా వర్ణించారు - బైబిల్ ప్రకారం ఆ మానవుడు  నోహ్ (NOAH).    BIG BANG THEORY  ప్రకారం ప్రళయం తరువాత విశ్వం లో జరిగే మార్పులు కూడా కొచెం ఇంచుమించులో ఇంతే. ( the Big Bang model suggests that at some moment all matter in the universe was contained in a single point.  which is considered the beginning of the universe)


బ్రహ్మ వైవర్త పురాణం లో శ్రీకృష్ణుడు, గంగాదేవి తో చెపుతాడు మొదటి 5000 సంవత్సరాలలో నువ్వు మానవజాతి పాపాలను ప్రక్షాళన చెయ్యి అని.
కాలేః పంచసహస్రని వర్షాని తిష్థా భూతలే ! పాపాని  పాపినో యాని తుభ్యం దశ్యంతి స్నానతః !

మొత్తం మీద సారాంశం ఏమిటంటే ఈ విశ్వం సృస్టించబడుతూ, లయం చెయ్యబడుతూ, మళ్ళా సృజించ బడుతూ ఈ కాలచక్రాన్ని ఆ పరబ్రహ్మ (brahman ) అంటే అనంత శక్తిస్వరూపం దీన్ని ఇలా నడిపిస్తోంది.  దీనికి ఆది లేదు అంతం లేదు, చావు, పుట్టుకల మద్యలో కాలచక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది .

ఇప్పుడు మన subject కి వద్దాం. ఎప్పటివో ఈ విషయాలన్నీ మానవులకి ఎలా తెలిసాయి . జ్ఞాన, అజ్ఞానాల మధ్యలో మనుషులు ఎలా కొట్టుమిట్టాడుతున్నారు.  వీళ్ళకి మార్గదర్శకులు ఎవరు?

పూర్వకల్పం లో బ్రహ్మ మొదట సృష్టించిన అతడి మానసపుత్రులు సనకసనందనాదులు వాళ్ళు బ్రహ్మ జ్ఞానం తో సృష్టి కార్యం లో పాలుపంచుకొలెదు. తరవాత బ్రహ్మ ప్రజపతులను, దేవతలను, ఋషులను సృష్టించాడు. వాళ్ళే ఈ  సృష్టిలో జ్ఞానులై పుట్టటం, సంతతిని వృది చెయ్యటం జరిగింది.  బ్రహ్మ ఉద్దేశ్యం ఏమిటంటే - మనుషులు పెళ్ళిచేసుకోవాలి పిల్లల్ని కనాలి సంతానం వృది చెయ్యాలి భూమి కళకళ లాడాలి - ఇలా ఉండాలంటే వారికీ అవిద్య,(పరమాత్మ గురించి) అజ్ఞానం, దేహత్మభావన, దేహాభిమానం - ఇట్లాంటి లక్షణాలుంటే తప్ప మనుషులు వృది పొందరు. అందరూ శుద్ధజ్ఞానం లో ఉంటె సృష్టి జరగదు .  కాబట్టి మనుషులలో అవిద్య, అజ్ఞానం ప్రవేశపెట్టారు .

          ఈ సృష్టి రహస్యం, జీవకోటి లక్షణాలు అంతా సంపూర్ణంగా తెలిసినవారు, జగత్తు యొక్క భూత, భవిష్యత్, వర్తమానాలు తెలిసినవారు, జీవులకు ఏది క్షేమకరమో అది తెలిసినవారు మహర్షులు.  ఆద్యంతమూ సృష్టి రహస్యం తెలిసి , వాళ్ళ కర్తవ్యం నిర్వహిస్తూ మనకి కర్తవ్య భోధ చేస్తూ, పుట్టబోయేవారి యోగక్షేమాలు కూడా ఆలోచించే వారు మహర్షులు . అనేకమంది మహర్షులు ఆర్య సంస్కృతిని రక్షించి జీవకోటిని ఉద్దారించారు,  వేదములు, దర్శనములు, స్మృతులు మొదలైన వాజ్మయ ప్రపంచాన్ని ఈ ప్రపంచానికి అందించారు.

ప్రస్తుతం ఇంతవరకు తెలుసుకుందాం.. మిగతా వివరాలు ఇంకో పోస్ట్ లో తెలియచేస్తాను

ఇట్లు

శివ పరివారం