మనకి దేవుడు కి పెట్టె నైవేద్యం గురించి అందరికీ తెలుసు , కానీ నివేదన పెట్టె విధానం , పద్దతి ఒకటి శాస్త్రం లో ఉంది
గర్భగుడిలో కొలువైన దైవానికే కాదు ... ఇంట్లోని పూజా మందిరంలో నెలవైన దైవానికి కూడా నైవేద్యం పెట్టవలసిందే. చేసేది నిత్యపూజ అయినా ... విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజే అయినా నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసిందే. దైవానికి జరిపే ఉపచారాలలో నైవేద్యానికి ఎంతో విశిష్టత వుంది. దైవంపై మనకి గల భక్తిశ్రద్ధలు బయటపడేది ఈ నైవేద్యాల విషయంలోనే.
మా గురువు గారు మాకు నైవేద్యం లో ఉన్న విశేషం ను ఏ ఏ రోజుల్లో ఏ తిధి లో ఏమి నైవేద్యం పెట్టాలో మాకు ప్రతి రోజు భాగవత శ్రవణం అయ్యిన తర్వాత మాకు తెలియ చేస్తారు.
మా గురువు గారు ఇలా చెప్పడం వెనక ఒక మంత్ర శాస్త్ర రహస్యం ఉంది.. ఎంతో ప్రయోగాత్మకం గా నిరూపమైన ఈ ప్రక్రియ..
ఈ విధం గా ఎవరైనా వాళ్ళ సమస్యను బట్టి స్వామి కి నివేదన చెయ్యండి.. తప్పక నెరవేరుతుంది.. ఇది మా గురువు గారు డాక్టర్ గారు తయారు చేసిన ప్రక్రియ
దేవుడి ఆరాధనలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. అయితే వాటిలో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడం. ఇది ప్రక్రియ చాలా ముఖ్యమైన మరియు దేవుని క్రుప పూర్తిగా దక్కే మార్గం ఇది ఒక్కటే
అలాగే నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్, వస్తువు లో పెట్టకూడదు , మా శివ పరివారం ప్లాస్టిక్ వస్తువు ని నిషేదించింది
ఈ క్రింది విధం గా ఆయ తిది ప్రకారం నివేదన పెట్టాలి

నివేదన పెట్టె విధానం, ఒక్కొక్కరు ఒక్కో విధం గా వాళ్ళ ఇష్ట దైవనంను ప్రార్ధిస్తూ ఇస్తారు..
ఉదాహరణ కి మీకు ఇంట్లో ఇచ్చే నివేదన విధానం ను ఇస్తున్నాను
చంద్రమా మన’సో జాతః | చక్షోః సూర్యో’ అజాయత |
ముఖాదింద్ర’శ్చాగ్నిశ్చ’ | ప్రాణాద్వాయుర’జాయత ||
ఆర్ద్రాం యః కరి’ణీం యష్టిం పింగలామ్ ప’ద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||
ప్రసాదం పై పూవు తో నీళ్ళు చల్లి -
ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియోయోన ప్రచోదయాత్ । ।
అని చదివి నైవేద్యమును నివేదిస్తూ
సత్యంత్వర్తేన పరిషించామి
అమృతమస్తు
అని చెప్పి ఉద్ధరిణి తో నీరు దైవానికి చూపి పళ్ళెములో వేయవలెను
అమృతోపస్తరణ మసి
మనం పెట్టే నైవేద్యాన్ని చెప్పాలి. నైవేద్యములు నివేదిస్తూ
శ్రీ భవాని శంకర స్వామి నే నమః
ఓం ప్రాణాయ స్వాహా
ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా
అంటూ పూవు తో నీళ్ళు చల్లాలి
note : ఇక్కడ మా గురువు గారు మా అభిషేక సమయం లో కాశీ అన్నపూర్ణ నుంచి కామాఖ్యా , అష్ట దశ శక్తీ పీఠాలు, అన్ని దేవతా స్వరూపాలు కి పిలిచి నివేదన ఇస్తారు.. ఈసారి రికార్డింగ్ పెడతాను
శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - నైవేద్యం సమర్పయామి ॥
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి
ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్ష్యాళయామి, పాదౌ ప్రక్ష్యాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి
చివరి లో మనం ఇలా చెప్పుకోవడం ఆనవాయితీ
అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా ।
తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమా ॥
మధ్యే మంత్ర తంత్ర స్వరవర్ణ ధ్యాననియమ న్యూనాతిరిక్త లోపదోష
ప్రాయశ్చిత్తార్థం అచ్యుత అనంత గోవింద మహామంత్ర జపం కరిష్యే । ।
అచ్యుతాయ నమః ।
అనంతాయ నమః ।
గోవిందాయ నమః ।
॥ సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు ॥
ఇట్లు
శివ పరివారం
*వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు*
మన నిత్య పూజలో కానీ దేవాలయంలో కానీ, భగవంతుడికి గాని, ఫలం, పత్రం, పుష్పం తోయం లు పూజలో వాడడం మన ఆచారం.
మనకు పూజ అనగానే మనకు దేవుడికి దీపంపెట్టి ఆగరు బత్తులు వెలిగించి, పూవులు పెట్టి, ఆక, వక్క, పండు నైవేద్యంగా పెట్టి కొబ్బరి కాయ కొట్టడం ఆనవాయితీ.
ఏ ఫలం నైవేద్యంగా పెడితే ఏ ఫలితం లభిస్తుందో, మనకoదరకు తెలిసినా మరొక్క మారు తెలుకుందాం.
*1. కొబ్బరి కాయ* ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే, మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.
*2.అరటి పండు -* భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగు తుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే , మద్యలో నిలిచి పోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.
*3. నేరేడు పండు. -* శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.
*4. ద్రాక్ష పండు. -* భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.
*5. మామిడి పండు. -* మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు, ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని, దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి, అందరికి పంచి, తరువాత మీరు తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.
*6.అంజూర పండు. -* భగవంతుడికి నైవేద్యం పెట్టిన అoజూరా పండును అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.
*7.సపోట పండు. -* సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలున్ని తొలగిపోతాయి.
*8.ఆపిల్ పండు:- -* భగవంతుడికి ఆపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. *
9.కమలా పండు. -* భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.
*10.పనసపండు:- -* పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగవిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

Nicely narrated. Thank you
ReplyDelete