Saturday, June 27, 2020

సామెతల్లో ఆయుర్వేదం!

సామెతల్లో ఆయుర్వేదం!
.
"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" ..అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !
.
పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు !
.
త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !
.
"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు,కనీసం కందిపుల్ల" ...ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట
.
 వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు ..
.
అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని ...సామెత ఏమంటే  ...."కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "
.
పుండుమీదకు ఉమ్మెత్త ,నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా ..."పుండుమీదకు నూనెలేదంటే  గారెలొండే పెండ్లామా అన్నట్లు"..."ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...
.
వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది ...సామెత ...ఇలా ..."ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "
.
కరక్కాయ పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి ...శ్వాస,కాస,ఉదర,క్రిమి,గుల్మ,హృద్రోగం ,గ్రహణి,కామిల,పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది..అందుకే ..."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి "..అని సామెత 
.
ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది ..సామెత ఇదుగో ..."పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "...."ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి "
.
అలానే ...శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ..."కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...
.
 ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి ! 
.
పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ? 
.
సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ?
.
అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది! 
జాతి జీవనాడి నశిస్తుంది!
ఈ ఆటా పాటలో నున్న ఆరోగ్య రహస్యం మీకు తెలుసా???
కాళ్ళ గజ్జీ కంకోలమ్మా!
వేగు చుక్క వెలగా మొగ్గ
మొగ్గా కాదు మోదుగ ఆకు
ఆకూ కాదు నిమ్మలవారి
వారీ కాదు వావింటాకు
ఆకు కాదు గుమ్మడి పండి
కాళ్ళు తీసి కడగాపెట్టు

 ఈ పాట ...
ఆట మనందరం ఆడినవారమే! పాడినవారమే! 

అయితే ఈ పాటలో ఏముందని ఏప్పుడు మనం ఆలోచించివుండం...ఆలోచిస్తే..ఇందులో దాగున్న అద్బుత వైద్య విజ్ఞానం  మనకు అవగాహనవుతుంది!

కాళ్ళకు గజ్జివస్తే..కంకోళం(గంగారపాకు) అనే ఆకును నూరిరాయాలి!!దానికి తగ్గకపోతే...తెల్లవారుజామున..లేత వెలగ కాయి గుజ్జురాయాలి!! దానికి తగ్గకపోతే మోదుగఆకు నూరిరాయాలి!!...తగ్గడం ప్రారంబించాక.. నిమ్మరసం ను పలచగాచేసి గజ్జి సోకిన కాలిని కడగాలి!! అప్పటికి గజ్జి మాడకపోతే వావింటాకు నూరిరాయాలి!! అంతేకాకుండా గుమ్మడిపండుగుజ్జుకూడా గజ్జికూడా మందుగా పనిచేస్తుంది...ఇలా మన పూర్వీకులు అద్భుతమైన వైద్య విజ్ఞాన రహస్యాలను పాటలరూపంలోను...సామెతల రూపంలోను భద్రపరిచారు  అలాభధ్రపరిచిన విజ్ఞానాన్ని వినోదంలాకాకుండా అంతర్ధుృష్టితో పరిశీలిస్తే.. విజ్ఞానంఅవగాహనకోస్తుంది

Thursday, June 25, 2020

ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రులు

ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రి

*ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.* అమ్మవారి వైభవం గురించి కొంత.......

మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి...అందుకే ఆవిడను దండనాథ అన్నారు...

లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీ దేవి.లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు.ఆమెకు ప్రత్యేక రథం ఉంది,దానిపేరు కిరి చక్రం.ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభిని దేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ, మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు.

కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||

భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||

భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |
మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |

అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ, అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు. విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి.హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు,శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి,వాడిని సంహరించి,భూదేవిని రక్షిస్తాడు.స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె #వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది.అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ.అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.

అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది...ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం...ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే,ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది.నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు.నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది.ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.

పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి...శ్రీ విద్యా గద్యంలో "అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే" అని లలితను కీర్తిస్తారు...దేవీ కవచంలో "ఆయూ రక్షతు వారాహి" అన్నట్టు...ఈ తల్లి ప్రాణ సంరక్షిణి....ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం

ప్రకృతి పరంగా చూసినట్లైతే...ఈ సమయంలో వర్షం కురుస్తుంది...రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు...దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది…


వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు.కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి.వెంటనే అనుగ్రహిస్తుంది,కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది, అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం, క్రోధం,లోభం,మోహం,మదం, మాత్సర్యం,అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు,అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.
1. ఓం శ్రీం హ్రీం క్లీం వరాహై మమ వాక్మే ప్రవేశయా వాకు పాలితాయ ||
మమ మాతా వరాహి మమ దారిద్ర్యం నాశాయ నాశాయ హుం భట ||

2. ఓం శత్రు శంకరి సంకటహరణీ మమ మాత్రే హ్రీం దుం వం సర్వారిష్టం నివారాయ నివారాయ హుం భట్ ||

3. ఓం క్లీం వారాహి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షాయా వర్షాయా స్వాహా ||

4. ఓం శ్రీం పంచమి సర్వసిద్ధి మాతా మమ గృహామి ధనం ధన్యాం సమృద్ధిం దేహి దేహి నమః ||

5. ఓం హ్రీం భయానకరీ అతి భయంకరి ఆశ్చర్యా భయంకరీ సర్వ జన భయంకరీ ||
సర్వ భూత ప్రేత పిశాచ భయంకరీ సర్వ భయం నివారాయ శాంతిర్ పావతు మే సదా ||
సర్వ భూత ప్రేత పిశాచ భయంకరీ సర్వ భయం నివారాయ శాంతిర్ పాదుమే సదా ||

అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి...బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి...ముఖ్య ప్రాణ రక్షిణి...హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు…




ఇట్లు
శివ పరివారం
(మిగిలిన సమాచారాన్ని పూర్తి చేసి మరల షేర్ చేస్తాను)

Tuesday, June 23, 2020

శ్రీ మహావిష్ణుని 21 అవతారములు

శ్రీ మహావిష్ణుని 21 అవతారములు

మనలను ఎవరైనా శ్రీ మహావిష్ణుని అవతారములు ఎన్ని అని అడిగితే నామం ఠక్కున 10 అని చెప్తాము కదా! కానీ హైందవ ధర్మం ప్రకారం భగవానుడు ప్రతి చరాచర సృష్టిలో నిండి ఉన్నాడు. కానీ ఆ విష్ణు భగవానుని లీలలు చెప్ప బడిన శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీమహావిష్ణువు ఇప్పటివరకు 21 ముఖ్యమయిన అవతారములు ధరించి భూమిమీదకు వచ్చారు. మరి అవి ఏమిటో ఇప్పుడు చూద్దామా!


  1.  సనత్కుమారుడు 
  2. వరాహ 
  3. నారదుడు 
  4. నర నారాయణులు (ఇద్దరు)
  5. కపిల మహర్షి 
  6. దత్తాత్రేయుడు 
  7. యజ్ఞుడు 
  8. ఋషభ దేవుడు 
  9. పృధు మహారాజు 
  10. మత్స్యం 
  11. ధన్వOతరి 
  12. కూర్మం 
  13. మోహిని 
  14. నృసింహ 
  15. వామన 
  16. పరశురామ 
  17. వ్యాస మహర్షి 
  18. శ్రీరామ 
  19. శ్రీ కృష్ణ 
  20. బుద్ధ (manam ippudu cheppukuntunna buddudu kadu)
  21. కల్కి 

వీరి గురించి వివరంగా తరువాతి టపా లలో తెలుసు కుందాం!

స్వయంభు మనువు కర్దమ ప్రజాపతి - దేవహుతి

ప్రియమైన భాగవత శివ పరివారం కు శుభాకాంక్షలు

గురువు  గారు రోజు చెబుతున్న భాగవతం లో అన్ని పేర్లు ఎలా గుర్తు పెట్టుకుంటున్నారు ? , గురువు గారు భాగవతం చెప్పిన తర్వాత ఒక్కసారి ఆ పేర్లు తలచుకుందాం అని ప్రయత్న పూర్వకం గా చాల రోజులు నుంచి ప్రయతిస్తున్నాను

స్వయంభు మనువు

స్వయంభు మనువు, మనకు ఉన్న పదునాలుగు మంది మనువులు  అందరిలో మొదటివాడు. అతని పేరు మీదుగానే మనకు మానవులు (ఆంగ్లంలో Man కూడా ఇక్కడి నుండే వచ్చింది) అని పేరు వచ్చింది.

బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలు పెట్టినప్పుడు అతనికి సృష్టి చాలా నిదానంగా జరుగుతుంది అని అనిపించసాగింది. అందుకని బ్రహ్మదేవుడు కుమారులను సృష్టి కార్యక్రమములను కొనసాగిన్చావలసినదిగా కోరాడు. కానీ వారు నిరాకరించారు. ఆ పరిస్థితులలో బ్రహ్మదేవుడు ఒక యోచన చేసారు. మొదటిసారి స్త్రీ పురుషులను సృష్టిస్తే, మిగిలిన సృష్టి కార్యం తనంత తానుగా జరుగుతుంది అని భావించారు. తన ఆలోచనను అమలులో ఉంచుతూ బ్రహ్మదేవుడు తన శరీరాన్ని రెండుగా విభజించారు. ఒక బాగం స్వయంభుమనువు, మరొక భాగం శతరూప అనే ఒక స్త్రీ.



అప్పుడు బ్రహ్మదేవుడు వారిని సృష్టి కార్యం చేయమని చెప్పారు. అప్పుడు స్వయంభు మనువు తాము నివసించుటకు భూమి లేదు అని బ్రహ్మదేవునకు గుర్తుచేశారు. అప్పుడు పరిసరములను గమనించిన బ్రహ్మదేవుడు భూమి మరలా గర్భొదక జలములలో మునిగి ఉండుట చూసాడు. ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణువు వరాహవాతారం ధరించి భూమిని ఉద్దరించారు.

శతరూప, స్వయంభు మనువులకు

పుత్రికలు                         పుత్రులు    
ఆకూతి                              ఉత్తానపాదుడు
దేవహూతి                          ప్రియవ్రతుడు
ప్రసూతి



బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యమును మొదలుపెట్టి, మొట్ట మొదట నలుగురు పుత్రులను సృష్టించాడు.

సనకుడు                   సననందనుడు        సనత్కుమారుడు       సనత్ సుజాతుడు 



వారిని సృష్టి కార్యం సహాయం చేయమని చెప్పగా, వారు ఆ కార్యం చేయుటకు తమ అనంగీకారం తెలుపగా, బ్రహ్మదేవునికి కోపం వచ్చినది. కానీ తనకు గల శక్తితో ఆ కోపమును నియంత్రించుకొనెను. కానీ ఆ కోపం బ్రహ్మదేవుని నొసటి భాగం నుండి ఒక పుత్రుని రూపంలో బయటకు వచ్చాడు. క్రోధం కారణం గా జన్మించుట చేత, అతను నల్లగా ఉన్నాడు. పుట్టీ పుట్టగానే, ఏడ్చుట మొదలు పెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని తండ్రి అయిన బ్రహ్మదేవుడు అడుగగా, తన పేరు ఏంటి? తను ఎక్కడ ఉండాలి? అని అడిగాడు. పుట్టుకతోనే ఏడ్చాడు కనుక అతనికి రుద్రుడు అని పేరు పెట్టారు. నలుపు ఎరుపు కలిగిన రూపం కలిగి ఉన్నాడు కనుక నీలలోహితుడు అని అన్నారు.

1. మన్యువు - ధీర - చంద్రుడు 
2. మనువు - వృత్తి - సూర్యుడు 
3. మహాకాలుడు - అశన - అగ్ని 
4. మహశ్చివుడు - ఉమ - వాయువు 
5. ఋతధ్వజుడు - నియతి - జలము 
6. ఉరురేతుడు - సర్పి - ఆకాశము 
7. భవుడు - ఇల - భూమి 
8. కాలుడు - అంబిక - ప్రాణములు 
9. వామదేవుడు - ఇరావతి - తపస్సు 
10. ధృతవ్రతుడు - సుధ - హృదయం 
11. నీలలోహితుడు - దీక్ష - ఇంద్రియములు 

తనకి పేర్లు, భార్యలు, నివాస స్థానములు నిర్ణయించిన మీదట, సృష్టి కార్యం చేయమని చెప్పగా, నీలలోహితుడు అలాగే చేసాడు. కానీ అతని వలన కలిగిన సంతానం తమోగుణం కలిగిన వారు అయినారు కనుక ఈ సృష్టికి విపత్తు ఏర్పడినది. అప్పుడు మరలా బ్ర్హమదేవుడు వారిని తపస్సు చేయమని అడిగారు. వారు అలాగే అని తపస్సు చేసారు.

నవబ్రహ్మలు

నీలలోహిత రుద్రుని తరువాత బ్రహ్మ సృష్టి క్రమంలో 10 మంది పుత్రులను తన శరీరం నుండి సృష్టించాడు. వారు

1. బ్రొటన వేలి నుండి దక్షుడు 
2. ఊరువులు (తొడలు) నుండి నారదుడు 
3. నాభి నుండి పులహుడు 
4. చెవుల నుండి పులస్త్యుడు  
5. చర్మం నుండి భృగువు 
6. చేతి నుండి క్రతువు 
7. ముక్కు నుండి అంగిరసుడు 
8. ప్ర్రాణం నుండి వసిష్ఠుడు 
9. మనస్సు నుండి మరీచి 
10. కన్నుల నుండి అత్రి 


ఈ పది మందిలో నారదుడు నిత్య బ్రహ్మచారి అగుట వలన తన సృష్టి కార్యంలో ప్రత్యక్షంగా తోడ్పడక పోయినందువలన, అతనిని తప్పించి మిగిలిన 9 మందిని నవబ్రహ్మలు అని అంటారు. వీరు 9 మంది దేవహుతి, కర్ధముల 9 మంది పుత్రికలను  వివాహం చేసుకుని బ్రహ్మదేవుని సృష్టి కార్యంలో సహాయం చేసారు.

కర్దమ ప్రజాపతి - దేవహుతి

కర్దమ ప్రజాపతి కృతయుగంలో జన్మించారు. ఒకనాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ మహర్షిని తన సృష్టి కార్యంలో సహాయం చేయవలసినది అని అడిగారు. అప్పుడు కర్దమ ఋషి సరస్వతి నదీతీరంలో తపస్సు మొదలు పెట్టారు. అలా 10000 సంవత్సరముల పాటు తపస్సు చేసిన తరువాత ఒకరోజు శ్రీమహావిష్ణువు అతనికి దర్శనం  ఇచ్చారు. ఆ ఆనందంలో కర్దమ ఋషి  అనేక విధములుగా విష్ణుని పూజించి, కీర్తించి, అప్పుడు బ్రహ్మ తనముందు ఉంచిన భాద్యతను నిర్వర్తించుటకు ఒక అనుకూలవతి అయిన కన్య ఎక్కడ ఉంటుందో చెప్పవలసినది అని కోరారు.

అతని సేవలకు , తపస్సుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ  కన్య స్వాయంభువ మనువు కు జన్మించిన దేవహుతి అని చెప్పి, మరునాటి సమయంలో వారే స్వయంగా కర్ధముని వద్దకు వచ్చి కన్యాదానం చేస్తారు అని చెప్పారు.

మరునాటి సమయంలో స్వాయంభువ మనువు తన భార్య, పుత్రికలతో కలసి కొంతసైన్యం తోడు రాగా కర్ధముని ఆశ్రమమునకు వచ్చారు. తన ఆశ్రమమునకు వచ్చిన అతిధులకు కర్దముడు అతిధి మర్యాదలు చేసి, వారి రాజ్యంగురించిన కుశల ప్రశ్నలు అడిగినమీదట స్వాయంభువ మనువు తను వచ్చిన కార్యం చెప్పారు. గుణ,శీల,జ్ఞాన వంతురాలయిన తన కుమార్తె దేవహుతికోరకు తను వరునికోసం వెతుకుతున్నందున, ఆమె ఒకసారి నారదముని వలన కర్ధముని గురించి విని ఉండుట చేత ఆమె కర్ధముని మనస్సునందే వరించిన కారణంగా, ఆమెను కర్ధమునికి ఇచ్చి వివాహం చేయాలి అనే సంకల్పంతో తన కుమార్తెను కూడా వెంటబెట్టుకుని వచ్చారు అని.

ఆ మాటలు విన్న కర్దముడు అత్యంత లావణ్య రాశి అయిన దేవహుతిని వివాహం చేసుకొనుటకు తనకు సమ్మతమే కానీ ఒక షరతు ఉన్నది అని చెప్పాడు.
ఆమెకు ఎప్పటివరకు సంతానం కలుగకుండా ఉంటుందో అప్పటివరకు మాత్రమే ఆటను గృహస్థుగా ఉంటానని, పుత్రుడు కలిగిన మీదట అతను వానప్రస్థమునకు వెళ్ళేందుకు అంగీకరిస్తే వివాహం చేసుకుంటాను అని.

స్వయంభువమనువు తన భార్య శతరూప వలన తన కుమార్తె దేవహుతి అభిప్రాయం తెలుసుకుని, సంతోషించి, వారికి శాస్త్రబద్దంగా వివాహం చేసారు.

అప్పటి నుండి  పరమశాంతంగా, వినమ్రతతో భక్తితో దేవహుతి భర్త సేవచేస్తూ ఉంది.  కొంతకాలము తరువాత చిక్కిపోయిన దేవహుతిని చూసి, ఆమె చేసిన ఈ తపస్సు ఆమె తనఃమనస్సులను పరిశుద్ధం చేసుకొన్నది. కనుక ఆమెకు సకల సౌక్యములను అనుభావింప చేయవలసిన సమయం ఆసన్నమైనది అని భావించి, అతని అద్వితీయమైన తపఃశక్తి వల్ల అనేక అనన్య సామాన్యమైన సౌక్యములతో కూడిన ఒక విమానమును సృష్టించి, ఆమెతో సంతోషంగా కాలం గడుపసాగాడు. కొంతకాలమునకు దేవహుతికి 9 మంది పుత్రికలు కలిగారు.
మరికొంతకాలం తరువాత కర్దముడు వానప్రస్తామునకు వెళ్ళబోతున్నాడు అని తెలుసుకుని, దేవహుతి అతని పాదములకు నమస్కరించి తమకు ఇంకా పుత్రుడు కలుగలేదు కనుక అతనిని అప్పుడే వెళ్ళుటకు ఆమె అభ్యంతరం తెలిపినది.

ఆ మాటలు విన్న కర్దముడు శ్రీ మహావిష్ణువును మనస్సు నందు తలచుకుని చిన్న చిరునవ్వు మొహంపై తొణికిసలాడగ, ఆమెను అనునయిస్తూ, ఆమె ఇప్పుడు గర్భవతి అని, ఆ భగవంతుడే స్వయంగా తమ పుత్రునిగా జన్మించబోతున్నారని, అతని దయవలననే దేవహుతికి సంఖ్యాయోగం వినగలుగుతుంది, ఆమె తరించ గలదు అని చెప్పి,  కర్దముడు వానప్రస్థమునకు వెళ్లి పోయారు.

కొంతకాలమునకు దేవహుతి కపిలునికి జన్మను ఇచ్చినది.

వారికి గల 9 మంది పుత్రికలను 9 మంది బ్రహ్మలకు ఇచ్చి వివాహం చేశారు. కుమార్తెలు, అల్లుడుల పేర్లు

  1. కళ - మరీచి  
  2. అనసూయ - అత్రి 
  3. ఊర్జ - వసిష్టుడు 
  4. శ్రద్ధ  - అంగిరసుడు 
  5. హవిర్భవు - పులస్త్యుడు 
  6. గతి - పులహుడు 
  7. క్రియ - క్రతువు 
  8. ఖ్యాతి - భృగువు 
  9. చిత్తి  - అదర్వుడు 


సశేషం
ఇట్లు
శివ పరివారం 

Saturday, June 20, 2020

ధర్మం, సనాతన ధర్మం

Date : 21/06/2020

ప్రియమైన శివ పరివారం కు శుభాకాంక్షలు

మనకి భాగవతం మొదలు పెట్టిన దగ్గర నుంచి గురువు గారు మనకి ధర్మం, సనాతన ధర్మం గురించి చెబుతూ వచ్చారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో ఒక్క మాటలో చెప్పగలిగే నిర్వచనం కాదు. సనాతన అంటే ఎప్పుడూ వుండేది అని అర్థం, ఇంచుమించు శాశ్వతానికి పర్యాయపదం.

ధర్మం అంటే సత్యాన్ని కాపాడుకుంటూ వుండే ఒక జీవనశైలి (ఇంచు మించు నాగరికత అని అనవచ్చు). మరి సత్యం అంటే ఏమిటి అని అడుగుతారేమో…

నారదుడు ఇంద్రుడి చెరనుండి ప్రహ్లాదుడి తల్లిని (ప్రహ్లాదుడు గర్భంలో వున్నప్పుడు) విడిపించి తనకు సత్యం అంటే ఏమిటో ఇలా చెప్తాడు.

సత్యస్య వచనం శ్రేయః సత్యాదపి హితం వదేత్
యావత్భూతానాం హితం ఏతత్ సత్యం మతం మమ.

నిజం మాట్లాడటం మంచిది, నిజం కన్నా హితం మాట్లడటం అలవాటు చేసుకోవాలి. యావత్ భూతానాం అంటే సకల చరాచర జగత్తుకు హితం చేసేది సత్యం అని తెలియచేసారు

 నారదుడి ఆలోచన ప్రకారం రాక్షస రాజు భార్యని బిడ్డను కాపాడటం హితం (యావత్ భూతానాం ) కాబట్టి దాన్ని కాపాడటం ధర్మం.

ధర్మం అనే పదానికి పర్యాయ పదాలు లేవు. అసలు ధర్మం అనే పదం వేరే ఏ దేశ భాషలలోను లేదు. వారికి అర్థం అయినంత వరకు మతమూ ధర్మమూ ఒక్కటే, మన దురదృష్ట వశాత్తూ భావదాస్యంలో వున్న మనం మన గొప్పతనాన్ని మరిచి అనేక నిర్వచనాలు చెప్పి
 తెలియని అయోమయ స్థితికి దిగజారిపోయాం. పాస్చాత్య నిర్వచనం ప్రకారం మతం అంటే ఒక గ్రంధం ఒక దేవుడు ఓకే ప్రవక్త ఉండాలి, మరి హైందవం ఆకోవలోకి రాదు కానీ దాన్ని బలవంతంగా హిందూ ధర్మాన్ని హిందూ మతం అని వ్యవహరించటం మొదలు పెట్టాం.


కానీ సనాతన ధర్మం మాత్రం ఎన్ని దండయాత్రలు చవిచూసినా చెక్కు చెదరలేదు అందుకే సనాతనం.

సనాతన ధర్మం గురించి ఇంకొక్క మాట గర్వంగా చెప్పుకోగలిగినది ఏమిటి అంటే

భగవత్గీత లో కృష్ణుడు జాతస్య హి మరణం ధృవం అంటే పుట్టిన వాడు మరణిస్తాడు, మరణించిన వాడు వేరే రూపంలో మళ్ళీ పుడతాడు అని చెబుతాడు. మరి ఆలోచనల ద్వారా వచ్చిన మతాలకి పుట్టుక వుంది కాబట్టి వాటికి ఒక జీవన కాలం ఉంటుంది అది చరిత్ర ద్వారా మనకు తెలుసు కూడా, సనాతన ధర్మం పుట్టుక లేనిది అంటే దానికి జీవన కాల పరిమాణం కూడా ఉండదు అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది.


అదీ మాకు  తెలిసేలాగా  మాకు గురువు గారు ఒకసారి భాగవత ప్రవచనం లో సనాతన ధర్మం గురించి చెప్పారు.. అది నాకు వ్రాసుకోవడానికి ఇంత సమయం పట్టింది. .

ఇట్లు
శివ పరివారం 

guru pournami kosam

గురు పౌర్ణమి కోసం
సనాతన ధర్మానికి ఆధారాలుగా వేద పురాణేతిహాసాలను ప్రస్తావించుకున్నాం. వాటి స్వరూప స్వభావాలను వివరించుకున్నాం. ఆ సద్గ్రంథాల ఆధారంగాను, సత్పురుషుల వ్యవహార ధోరణితోను మన ఆచార సంపద సమృద్ధి చెందింది.
అయితే వాటితో పాటు మన సంస్కృతి అభ్యుదయానికీ, పరిపుష్టికీ దోహదపడింది – స్తోత్రవాజ్ఞ్మయం.
మన స్తోత్ర సాహిత్యం అపారం. దీనిశక్తి ఈదేశ సంగీత నృత్యాది కళలపై కూడా ప్రగాఢంగా ప్రసరించింది. భగవంతుని తత్త్వ, మహిమ, లీలా, గుణ వైభవాలను కీర్తించడమే స్తుతి. యజ్ఞములయందు వైదిక మంత్రాలతో సాగిన దేవతా స్తుతి, పురాణాలలో శ్లోకాలతో నిబద్దం చేశారు వ్యాస మహర్షి.
భగవానుని పలు రూపాలలో ఉపాసించే భక్తులు, తమ అనుభూతికీ, ఆత్మ నివేదనకీ అక్షరాకారాలుగా అపార స్తోత్ర వాజ్ఞ్మయాన్ని సంతరించారు.
ఆధ్యాత్మిక దృక్పథంతోనే గాక, కళా దృష్టితో దర్శించినా ఒక పరిపూర్ణ కవితా ప్రక్రియగా స్తోత్ర సాహితి వర్ధిల్లింది. వేద పురాణ మార్గాలను అనుసరిస్తూ కాళిదాసాది మహాకవులు అద్భుత ఛందో విన్యాసాలతో భావ చిత్రాలతో, శబ్దార్థాలంకారాలతో మహోన్నత స్థాయిలో స్తోత్ర సాహితిని అందించారు. అంతేకాక తత్త్వచింతన, జీవుని వేదన, లీలలు, మహిమలు…మొదలైనవెన్నో ఆ సాహిత్యంలో ప్రవహించాయి. అనేక స్తోత్రాలు పఠన పారాయణాల వల్ల మంచి ప్రభావాన్ని చూపించడాన్ని అనుభవించిన కొందరు ఆ స్తోత్రాలను పవిత్ర గ్రంథాలుగా గుర్తించి ఆరాధింపజేశారు. సహస్ర నామ స్తోత్రాల వంటి అంశాలతో పాటు వివిధ స్తుతులు, భారత భాగవతాలలో లభిస్తున్నాయి. పురాణ వాజ్ఞ్మయంలో సరే సరి.
ఇక ఆదిశంకర భగవత్పాదుల వారు శక్తితో స్తోత్ర సాహిత్యం ఒక ఉజ్జ్వల స్థాయిని అందుకుంది. వారి కనకధారా స్తోత్రం, సౌందర్య లహరి, శివానందలహరి, మహా కావ్యాలుగా ఆదరింపబడుతున్నాయి. సామాన్యులు సైతం పారాయణ చేసుకుంటున్నారు.
శివ తాండవ స్తుతి, మహిషాసుర మర్దినీ స్తోత్రం, వంటివి సంగీతాత్మకమైన చక్కని లయతో సర్వ ప్రజానీకానికి మంచి రసానుభూతినిస్తున్నాయి. అష్టకాలుగా, దండకాలుగా విస్తరిల్లిన స్తుతి సాహిత్యం, సంస్కృతంలోనే ఒక మహా సముద్రమంత గోచరిస్తుంది. శ్యామలా దండకం వంటివి నేటికీ నిత్య పారాయణాలయ్యాయి. పుష్పదంతుని మహిమ్నా స్తుతి ప్రసిద్దిగా దేశంలో వ్యాపించింది.
లీలా శుకుని శ్రీ కృష్ణ కర్ణామృతం, అప్పయ్య దీక్షితుల శివకర్ణామృతం, శంకర కృతంగా ప్రసిద్ధి చెందిన శ్రీరామ కర్ణామృతం, సాహిత్య లోకంలో అమృత కళాశాలు. కొన్ని స్తోత్ర కావ్యాలు వివిధ క్షేత్రాలతో ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకు గురువాయూర్ నారాయణుని స్తోత్రించిన శ్రీమన్నారాయణీయం, నారాయణ భట్టాద్రి తపోబలంతో సమకూర్చారు. భాగవతానికి మరో రూపమైన ఈ కృతి కేరళ, తమిళనాడు, ఆంధ్ర దేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది. ఛందస్సు లో, భావుకతలో, అలంకారిక సంపదలో సర్వ సులక్షణ గ్రంథమిది. పారాయణ వల్ల పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే గ్రంథంగా ప్రతిష్ఠ పొందింది.
మయూర కవి రచించిన సూర్య శతకం, దాని అనుకరిస్తూ శ్రీ కూర నారాయణ కవి రచించిన సుదర్శన శతకం వంటివి చదువుతుంటేనే తన్మయం కలిగిస్తాయి. భారతీయ సంస్కృతికి ప్రాణం వంటి సంస్కృత భాష సామాన్యులలో కొంతైనా బ్రతికున్నది అంటే ఈ స్తోత్ర సాహిత్య ప్రభావాన్ని అంగీకరించవలసిందే. జయదేవుని గీతాగోవిందం ఒక రసస్తుతి.
భారతీయ దేశ భాషలన్నింటిలోనూ స్తోత్ర సాహితి ఉజ్జ్వల స్థానాన్ని పొందింది. మహారాష్ట్రలో తుకారాం, జ్ఞానేశ్వర్, వంటి వారి రచనలు, తమిళంలో ఆళ్వారుల, నాయనార్ల, వైష్ణవ, శైవ సాహిత్యాలు, కన్నడలో బసవేశ్వరుని వచనాలు, దాస సాహిత్యం….కొద్ది ఉదాహరణలు మాత్రమే.
మన తెలుగులో దాశరధీ శతకం, నరసింహ శతకం, శ్రీకృష్ణ శతకం, వంటివి దైవభక్తితో పాటు ధర్మనిరతిని, నైతికతనీ, కూడా ప్రబోధించాయి. ఆంజనేయ దండకం వంటివి అతి సామాన్యుని సైతం ఆదుకుంటున్నాయి. పోతనగారి భాగవత కావ్యం, ఎన్నో అద్భుత స్తుతి పద్యాలను ఆంధ్ర ప్రదేశంలో శాశ్వత ప్రతిష్ఠ చేసింది. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరశతకం గంభీర రచనగా శైవ సాహిత్యంలో మణిదీపమైంది.
ఈ స్తోత్ర సాహితి సంగీత ప్రపంచంలో కూడా పదిలమైంది. భగవత్ సంకీర్తన లేని సంగీతాన్ని భారతీయ హృదయం ఆమోదించలేదేమో! మొత్తం ఏ ప్రాంతంలోనైనా, ఏ భాషలోనైనా దేవత స్తుతియే సంకీర్తింప బడి సంగీతం పరిపుష్టమైంది. మీరా, సూరదాస్, వంటి ఔత్తరాహికులతో పాటు అన్నమయ్య, రామదాసు, క్షేత్రయ్య, త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామా శాస్త్రి, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి, తరిగొండ వెంకమాంబ, వంటి వాగ్గేయకారులు ఎందరో సంకీర్తన రూప స్తోత్ర సాహితిని సృజించారు.

ఇవి మన తరగని కళా సంపదలు, ధార్మిక వారసత్వాలు, ముక్తి సోపానాలు. భారతీయుల భక్తి భావన గుండెలలో పదిల పరచుకొని, కాపాడుకుంటోంది. తద్వారా మన భక్తి మార్గాన్ని, ధార్మిక కళా సంపదను నిరంతరాయంగా నిలుపుకోగలుగుతున్నాం.
గ్రంథమభ్యస్య మేధావీ జ్ఞాన విజ్ఞాన తత్పరః
పలాలమివ ధాన్యార్థీ త్యజేద్ గ్రంథమశేషతః

After studying the scriptures, an intelligent person intent on gaining knowledge and liberation should discard the scriptures altogether, like one who desires grain discards the husk.

ఎలా అయితే ధాన్యం పండించిన తరువాత రైతు ధాన్యపు పొట్టుని వదిలివేసి ధాన్యపు గింజలను మాత్రమే గ్రహిస్తాడో అలాగే గ్రంథాభ్యసనం అయిన తరువాత మేధావి అయినవాడు
జ్ఞానము విజ్ఞానము సముపార్జనా తత్పరుడు అయినవాడు గ్రంథ సారాన్ని గ్రహించి గ్రంథాన్ని వదిలివేస్తాడు.
భాగవతము భక్తి రసశృంగార రసభరిత కావ్యము. భాగవత కథామృతము జన్మరాహిత్య మార్గమునకు సోపానము. భాగవతము మోక్షపదము ప్రసాదించెడి కల్పతరువు. పారమార్ధిక చింతనకు పట్టుకొమ్మ సంసారాబుధి దాటించగల నావ. అరిషడ్వర్గములను, ఈషణత్రయములను మనస్సుకు ఆధీనముగావించి నిరంతరము వారి నామ సంకీర్తనగావించుటకు దోహదికారి. కావున పరమోతృష్టమైన మానవజన్మనెత్తిన మనము భాగవతమందలి, భక్తిరస ప్రపూరిత ఉపాఖ్యానములను అవగాహన చేసుకొని భక్తితత్పరతో ధర్మపధమున జీవయాత్ర సాగించవలెనను పరమసత్యమును భాగవతమునకు బోధించుచున్నది.
భాగవతములోని ఏ కథను చదివినా ఏ పురాణ పురుషుని జీవితాన్ని పరిశీలించినా పరమసత్యం, పరమాత్మను తత్వాన్ని ఎరుకపడుతుంది. ప్రహ్లాదుడు తన తల్లి కడుపులోనుండే నారదుని ఉపదేశాన్ని అందుకున్నాడు. పుట్టిననాటినుంచి విష్ణుస్మరణ చేసేవాడు. తనతండ్రిలో ఉన్న అజ్ఞానాన్ని రూపు మాపదల్చాడు. వెంటనే పెదవులు విడవడకముందే హరి అనిసంబోధించడం చేసేవాడు. ఇక మాటలొచ్చి నడక వచ్చిన తరువాత అహర్నిశమూ హరినామాన్ని వీడలేదు.
తానే కాదు తన తోడి వారిచేత కూడా హరి భజన చేయంచేవాడు. చేసేవాడు, చేయంచేవాడు కూడా హరి ఒక్కడేనని ఈ జన్మను వృథాపరుచుకోకుండా ఉండాలంటే సార్థక్యం పొందాలంటే కేవలం హరినామోచ్చారణమే మార్గమని బోధించేవాడు. హరి అసురులకు శత్రువు అని తండ్రి గురువుల చేత చెప్పించాడు. పెద్దల చేత చెప్పించాడు. అసురీగుణాలు ప్రతివారిలోను ఉంటాయ. కాని వాటిని పెరగనివ్వకుండా పెద్దవి కాకుండా మొదట్లోనే తుంచివేస్తే దైవీగుణాలు బయటపడ్తాయ. ఆ దైవగుణాలే ప్రదర్శితవౌతుంటే కొన్నాళ్లకు ఈ జన్మ నుంచి విడవడి పరమాత్మ సాయుజ్యాన్ని పొందుతామని ప్రహ్లాదుడు చేసి చూపించాడు. తండ్రికి మల్లె తాను అసురుడైనా దైవీగుణాలతో విరాజిల్లే మహాత్ముడిగా పెరిగాడు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంతో ఎదుర్కొన్నాడు.
చివరకు తనతండ్రికి పరమపదసోపానాన్ని నిర్మించి వైకుంఠ వాసుని పాదపద్మాల దగ్గర చోటు చూపించాడు. తాను చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. అటువంటి ఎందరో మహానుభావుల చరిత్రను భాగవతం చెబుతుంది. అందుకే పండితులకే కాక పామరులకు సైతం భాగవతం అంటే ప్రాణం. నిర్థనులకు ధనం వంటిది భాగవతం. అవిద్యానాశకారి. విజ్ఞాన దాయని.
నేడు కలియుగంలో అరాచకత్వం పెచ్చుపెరిగింది. విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడుతున్నారు. ఆధ్యాత్మికతకు దూరంగా అవుతు న్నారు. ఒకవేళ భగవంతుని పూజ చేసినా అది కేవలం నామ మాత్రంగానో, లేక ఆడంబరాలకు విలువనిచ్చేవారే ఎక్కువగా కన బడుతున్నారు. ఆధ్యాత్మిక పథంలో నడవడానికి పూజ ఒక మెట్టు. దాన్ని కూడా స్వార్థంతో అనవసర ఆడంబరాలకుపోయ అసలైన అర్థాన్ని తెలుసుకోకుండానే ఉతృష్టమైన సంపదను పొందకుండా తాత్కాలిక సంపదతో సంతృప్తిపొందుతున్నారు.
నేటి వాతావరణంలో వావివరుసలు కూడా తెలియని దీన స్థితుల్లో రాక్షస ప్రవర్తనలతో మానవీయ విలువల్ని మంటకలుపుతున్నారు. వినాశకాలే విపరీతబుద్ధి అన్నట్టు ఎంతమంది మంచిని ప్రబోధించినా విన్నంతసేపు వూకొట్టి తరువాత మళ్లీ పాతపాటను అందుకుంటు న్నారు. మానవ సంబంధాల్ని తెంచుకుంటూ మానవ మృగాలుగా మారుతున్నారు. ఏ రుణానుబంధం లేకుండా ఎవరూ ఎవరి దగ్గరకూ రారు. అందుకే కర్మఫలాన్ని అర్థం చేసుకొంటూ లభించిన మానవజన్మను సార్థకం చేసుకోవాలి మానవత్వం, జాలి, దయ, క్షమాగుణం, దానగుణాల్ని అలవరచుకోవాలి. నిజమైన మానవత్వం వెంట దైవత్వం ఉంటుంది.దీన్ని తెలుసుకొనేందుకు భాగవత పారాయణమొక్కటే తరుణోపాయం. భాగవత పఠనం వల్ల ‘మానవసేవే మాధవసేవ’ అన్న దానిలో పరమార్థ అర్థమవుతుంది. మానవీయ విలువలు పెరుగుతాయ. భాగవతాన్ని చదివి అవగాహన చేసుకొన్నవారికి అటు పరలోక సంపదతో పాటుగా ఈలోకంలో కష్టాలు లేని సుఖమయ జీవనం అందుతుంది.
- ఎస్. నాగలక్ష్మి

శ్రీమదప్పయ్యదీక్షితేంద్ర విరచిత శ్రీమదాదిత్య స్తోత్ర రత్నం లు


మన పూజ్య గురువు గారు భాగవతం అనంతరం మనకి ఋషి ప్రోక్తం  అయిన శ్రీమదప్పయ్యదీక్షితేంద్ర విరచిత శ్రీమదాదిత్య స్తోత్ర రత్నం లు మనకి చెబుతున్నారు..

ఆ రత్నాలు ఇవే

ఆదిత్య స్తోత్ర రత్నమ్- అప్పయ్య దీక్షితుల వారిది
(ఋషి ప్రోక్తం-గురువు గారు మనకి చెప్పినది )

విస్తారాయామమానం దశభిరుపగతో యోజనానాం సహస్రై
శ్చక్రే పంచార నాభి త్రితయవతి లసన్నేమిషట్కే నివిష్టః
సప్తచ్ఛన్దస్తురంగాహిత వహనధురో హాయనాంశత్రివర్గ
వ్యక్త్యాక్లప్తాభిలాంగః స్ఫురతు మమ పురః స్యన్దనశ్చణ్డభానోః   ।1।

ఇది రధ మహిమ వర్ణన శ్లోకం

ఆదిత్యైరప్సరోభిర్మునిభిరహివరైర్గ్రామణీ యాతుధానైః
గన్ధర్వైర్వాలఖిల్యైః   పరివృతదశమాంశస్య కృత్స్నం రథస్య
మధ్యంవ్యాప్యాధితిష్ఠన్ మణిరివ నభసో మణ్డలశ్చణ్డరశ్మేః
బ్రహ్మజ్యోతిర్వివర్తః శ్రుతినికరఘనీభావ రూపః సమిన్ధే      ।2।

ఇది మండల మహిమ నిరూపణ శ్లోకం

నిర్గచ్ఛన్తో2ర్కబిమ్బాన్నిఖిలజనిభృతామ్ హార్దనాడీ ప్రవిష్టాః
నాడ్యామ్ వస్వాది బృన్దారక గణమధునస్తస్య నానాదిగుత్థాః
వర్షన్తస్తోయముష్టం తుహినమపి జలాన్యాపిబన్తః సమన్తాత్
పిత్రాదీనాం స్వధౌషధ్యమృతరసకృతో భాన్తి కాన్తిప్రరోహాః   ।3।

ఇది కిరణ సహస్ర మహిమ నిరూపణ శ్లోకం

శ్రేష్ఠాస్తేషాం సహస్రే త్రిదివవసుధయోః పంచ దిగ్వ్యాప్తిభాజాం
శుభ్రాంశుం తారకౌఘం శశితనయ ముఖాన్ పఞ్చ చోద్భాసయన్తః
ఆరోగో భ్రాజముఖ్యాస్త్రిభువనదహనే సప్త సూర్యా భవన్తః
సర్వాన్ వ్యాధీన్ సుషుమ్నాప్రభృతయ ఇహ మే సూర్యపాదాః క్షిపన్తు ।4।

ఇది సప్త రశ్మి మహిమ నిరూపణ శ్లోకం

ఆదిత్యానాశ్రితాః షణ్ణవతి గుణ సహస్రాన్వితా రశ్మయో2న్యే
మాసే మాసే విభక్తాస్త్రిభువన భువనం పావయన్తః స్ఫురన్తి
యేషాం భువ్యప్రచారే జగదవనకృతాం సప్తరశ్మ్యుత్థితానాం
సంసర్పే ఛాధిమాసే వ్రతయజనముఖాః సత్క్రియాః న క్రియన్తే ।5।

ఇది ద్వాదశాదిత్యాశ్రిత రశ్మిస్తవ సంపన్న శ్లోకం

ఆదిత్యం మణ్డలాన్తః స్ఫురదరుణవపుస్తేజసా వ్యాప్త విశ్వం
ప్రాతర్మధ్యాహ్నసాయం సమయ విభజనాదృగ్యజుః సామసేవ్యం
ప్రాప్యం చ ప్రాపకం చ ప్రథితమతిపథిజ్ఞానినాముత్తరస్మిన్
సాక్షాద్బ్రహ్మేత్యుపాస్యం సకల భయహరాభ్యుద్గమం సంశ్రయామి ।6।

ఇది వేద సేవ్యత్వ నిరూపణ శ్లోకం

యచ్ఛక్త్యా2ధిష్ఠితానాం తపన హిమజలోత్సర్జనాదిర్జగత్యా
మాదిత్యానామశేషః ప్రభవతి నియతః స్వస్వమాసాధికారః
యత్ప్రాధాన్యం వ్యనక్తి స్వయమపి భగవాన్ ద్వాదశస్తేషు భూత్వా
తం త్రైలోక్యస్య మూలం ప్రనమత పరమం దైవతం సప్త సప్తిమ్  ।7।
ఇది ఆదిత్యుడు సేవించ దగిన వాడని నిరూపణ శ్లోకం

స్వఃస్త్రీగన్ధర్వ యక్షా మునివరభుజగా యాతుధానాశ్చ నిత్యం
నృత్తైర్గీతైరభీశుగ్రహనుతివహనైరగ్రతః సేవయా చ
యస్య ప్రీతిం వితన్వన్త్యమితపరికరా ద్వాదశ ద్వాదశైతే
హృద్యాభిర్వాలఖిల్యాః సరణి భణితిభిస్తం భజే లోకబన్ధుమ్  । 8।

ఇది ఆదిత్యుడు అప్సరో గణాదులకు ఆరాధ్యుడని వర్ణించు శ్లోకం

బ్రహ్మాణ్డే యస్య జన్మోదితముషసి పరబ్రహ్మముఖ్యాత్మజస్య
ధ్యేయం రూపం శిరోదోశ్చరణపదజుషా వ్యాహృతీనాం త్రయేణ
తత్సత్యం బ్రహ్మ పశ్యామ్యహరహమభిధం నిత్యమాదిత్య రూపం
భూతానాం భూనభస్స్వః ప్రభృతిషు వసతాం ప్రాణసూక్ష్మాంశ మేకమ్ ।9।

ఇది ఆదిత్యుడు ధ్యేయుడని ప్రతిపాదించు  శ్లోకం

ఆదిత్యే లోకచక్షుష్యవహితమనసాం యోగినాం దృశ్యమన్తః
స్వచ్ఛస్వర్ణాభ మూర్తిం విదలిత నలినోదారదృశ్యాక్షి యుగ్మమ్
ఋక్సామోద్గానగేష్ణం నిరతిశయలసల్లోక కామేశ భావం
సర్వావద్యోదితత్వాదుదితసముదితం బ్రహ్మ శమ్భుమ్ ప్రపద్యే ।10।

ఇది ఆదిత్యాన్తర్యామి మహిమ  వర్ణించు శ్లోకం

ఓమిత్యుద్గీథభక్తేరవయవపదవీం ప్రాప్తవత్యక్షరే2స్మిన్
యస్యోపాస్తిః సమస్తం దురితమపనయత్యర్కబింబే స్థితస్య
యత్పూజైకప్రధానన్యఘమఖిలమపి ఘ్నన్తి కృచ్ఛ్రవ్రతాని
ధ్యాతః సర్వోపతాపాన్ హరతు పరశివః సో2యమాద్యో భిషఙ్సః ।11।

ఇది ఆదిత్యోపాసన మహిమ  వర్ణించు శ్లోకం

అదిత్యే మణ్డలార్చిః పురుషవిభిదయాద్యన్తమధ్యాగమాత్మ
న్యాగోపాలాఙ్గనాభ్యో నయనపథజుషా జ్యోతిషా  దీప్యమానం
గాయత్రీమన్త్ర సేవ్యం నిఖిలజనధియాం ప్రేరకం విశ్వరూపం
నీలగ్రీవం త్రిణేత్రం శివమనిశముమావల్లభం సంశ్రయామి ।12।

ఇది శివుడు గాయత్ర్యుపాస్యుడని ప్రతిపాదించిన శ్లోకం

అభ్రాకల్పః శతాఙ్గః స్థిర ఫణితిమయం మణ్డలమ్ రశ్మిభేదాః
సాహస్రాస్తేషు సప్త శ్రుతిభిరహితాః కించిదూనాశ్చ లక్షాః
ఏకైకేషాం చతస్రస్తదను దినమణేరాదిదేవస్య తిస్రః
క్లప్తాః తత్తత్ప్రభావ ప్రకటనమహితాః స్రగ్ధరా ద్వాదశైతాః  ।13।

ఇది శ్లోక విభాగ ప్రదర్శన చేయు శ్లోకం.  తరువాతది ఫల శ్రుతి శ్లోకం

దుఃస్వప్నం దుర్నిమిత్తం దురితమఖిలమప్యామయానప్యసాధ్యాన్
దోషాన్ దుఃస్థానసంస్థ గ్రహగణజనితాన్ దుష్ట భూతాన్ గ్రహాదీన్
నిర్ధూనోతి, స్థిరాం చ శ్రియమిహ లభతే, ముక్తిమభ్యేతి చాన్తే
సంకీర్త్య స్తోత్ర రత్నం సకృదపి మనుజః ప్రత్యహం పత్యురహ్నాం ।14।

ఇతి శ్రీమదప్పయ్యదీక్షితేంద్ర విరచిత శ్రీమదాదిత్య స్తోత్ర రత్నం సంపూర్ణం

Tuesday, June 16, 2020

స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని

స్వర్ణ సిద్ధ యోగి వాసిష్ఠ గణపతి ముని

     ఆయన చదవని శాస్త్రం లేదు ,రాయని కావ్యం లేదు ,దర్శించని క్షేత్రం లేదు ,తపస్సు చేయని ప్రదేశం లేదు ,చూపని మహిమలు లేవు,,ప్రసన్నం చేసుకొని దేవత లేదు  అన్నిటికి మించి అస్ప్రుస్యతనుయేవగించుకొన్న సదాచార సంపన్నుడు ,భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమం లో ముందు నిలిచినకర్మిష్టి ,భగవాన్ రమణ మహర్షి చేతనే ‘’నాయనా ‘’అని పించుకొన్న అద్భుత మూర్తి .సాక్షాత్తు గణపతి అవతారమే  శ్రీ వాసిష్ఠ గణ పతి ముని .వారి జీవితం అంతా పరోప కారమే .కారణ జన్ములాయన .ఆ పేరు స్మరిస్తే చాలు సర్వ పాప హారం .
                                   

జననం –విద్యా భ్యాసం –వివాహం

    అసలు పేరు అయ్యల సోమయాజుల సూర్య గణపతి శాస్త్రి .తండ్రి నరసింహ శాస్త్రి-గణపతి ఉపాసకుడు .తల్లి నరసమ్మ సూర్య ఉపాసకురాలు .వీరి సంతానమే గణపతి శాస్త్రి .శ్రీ కాకుళం జిల్లా బొబ్బిలి  దగ్గర ‘’కలువ రాయి ‘’గ్రామం లో 17-11-1878 న జన్మించారు .ఆరామద్రావిడ కుటుంబం .తండ్రికి గణపతి తన దగ్గరకు వస్తున్నట్లు కని పించింది .తల్లికి సూర్యుని శక్తి అయిన అగ్ని పూర్ణ స్వర్ణ కలశం కల లో కన్పించింది ..బిడ్డ జన్మించినప్పుడు అతన్ని ఒక దివ్య తేజస్సు ఆవరించి ఉన్నట్లు చూసింది .పదేళ్ళకే తల్లిని పోగొట్టు కొన్నదురదృష్ట వంతుడు గణ పతి .ఈయన దైవాంశ సంభూతుడు అని భావిస్తున్నారు తల్లీ ,తండ్రీ .కాని మన వాడికి ఆరేళ్ళ దాకా మాటలే రాలేదు ..తండ్రి కాల్చిన లోహపు ముల్లును కొడుకు నాడిలో గుచ్చాడు .వెంటనే జలపాతం లాగా మాటలు జారి వచ్చాయి .
                 పిన తండ్రి  ప్రకాశ  శాస్త్రి దగ్గర కావ్యాలు చదివటమే కాక పంచాంగ గణనం లోను దిట్ట అని పించుకొన్నాడు .పన్నెండవ ఏట విశాలక్షమ్మ తో వివాహం జరిగింది .కాళిదాసు గారి మేఘ దూతం లాగా ‘’భ్రున్గా దూతం ‘’అనే రెండు సర్గల కావ్యం రాశాడు ..పద్దెనిమిదేళ్ళు వచ్చే సరికి వ్యాకరణ ,అలంకార ,సాహత్యా లనుకరతలా మలకం చేసుకొన్నాడు .పురాణ ,ఇతి హాసాల లోతులు తరచాడు .పదమూడవ ఏటి నుండి తండ్రి వద్దే మేధా దక్షిణా మూర్తి ,నారాయనాక్షరి ,సౌరాస్త్రాక్షరి ,చండి నవాక్షరి ,మాతంగి ,బాల ,వారాహి ,భువనేశ్వరి ,మహాగణపతి ,పంచ దశి ,షోడశి అనే పన్నెండు మహా మంత్రాలను సాధన చేసి వశం చేసుకొన్నాడు .తపస్సు చేసుకోవాలనే కోరిక బల మైంది .ఆరు నెలలు ఇంటి దగ్గర ,ఆరు నెలలు తపస్సు చేసుకోవటానికి భార్య అనుమతి పొందాడు .ఇద్దరు పిల్లలు కన్న తర్వాతతనకు కూడా తపస్సు చేసుకొనే అవకాశం ఇమ్మని భార్య కోరితే సరే నన్నాడు .వెంటనే భార్యకు మహాగణపతి మంత్రం ,శ్రీ దీక్ష ఇచ్చాడు .
                                       

  దేశ సంచారం –శాస్త్ర చర్చలు –తపస్సు

              1896లో అంటే పదహారేల్లప్పుడు కౌశికీ నదీ తీరాన పేరమ్మ అగ్రహారం లో రెండు నెలలు తీవ్ర తపస్సు చేశాడు ..కాశీ కి బయల్దేరి నంది గ్రామం లో ధర్మ శాలాధి కారిచే సన్మానం పొంది ఇంటికి వచ్చాడు .కలువ రాయి లో ధ్యానం లో ఉండగా భద్రకుడు అనే అనే ఆయన  కన్పించిగణపతి  గణకుడు అని జ్ఞాపకం చేశాడు .తండ్రి అనుమతి తో ప్రయాగ వెళ్లి హంస తీర్ధం లో కొంత కాలం తపస్సు చేసి ,కాశీ చేరి తండ్రి మేన మామ భవాని   శంకరం ఇంట్లో ఉండి దర్భాంగా సంస్థానం లో ఉండే ‘’శివ కుమార పండితుడి ‘’ని తన కవిత్వం తో మెప్పించాడు .నవద్వీపం లో జరిగే విద్వత్ పరీక్ష కు హాజరవమని పరిచయ పత్రం పొందాడు .ఒక రోజు ఆయనకు అయ్యల సోమయాజుల సూర్య నారాయణ యోగి కని పించి భద్రకుడు మొదలైన తాము పదహారు మంది లోక కళ్యాణం కోసం జన్మించామని తాను’’ సుకేతుడని’’ ,అతను గణపతి అని ,యే పని చేయాలో’’ స్తూల శిరస్సు’’ అనే వాడు తెలుపుతా డని చెప్పాడు .నాసిక్ లో తపస్సు  చేయాలని స్వప్నం లో తెలియ జేయ బడటం తో అక్కడికి చేరి  నీలామ్బికా ఆలయం లో తపస్సు చేశాడు .అక్కడే మొదటి అష్టావదానమూ చేశాడు .అక్కడ తనను అవమానించిన పూజారిని శపించి ,పాప పరిహారం కోసం ‘’నవ చూతి ‘’లో 72 రోజులు ఘోర తపస్సు చేశాడు .అప్పుడే’’ తెల్లని దిగంబరుడు’’ కల్లో కనిపించి ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు ..ఒరిస్సా చేరి భువనేశ్వర్ లోతోమ్మిది రోజులు తపస్సు చేశాడు . భువనేశ్వరి దేవి సాక్షాత్కారించి బంగారు గిన్నె లోని తేనె ను అతనితో తాగించింది ..దానితో కవితా మాధుర్యం పెరిగింది .బుద్ధి సూక్ష్మత రెట్టింపైంది .ఇంటికి వస్తే భార్య కొడుకుని కన్నది .మహాదేవుడనే పేరు పెట్టాడు .కేశ న కుర్రు లో తర్క వేదాంత ,వ్యాకరణ మహా భాష్యాలను ,నీతి శాస్త్రాన్ని ఆపోసన పట్టాడు .1900  లో మదసా సంస్థానం లో రాజ గురువును ఓడించి ,అష్టావధానం చేసి ,రాజకుమారుడికి శివ పంచాక్షరి ఉపదేశించి రాజు ప్రోత్సాహం టో నవద్వీపం చేరాడు .అక్కడ ‘’సితి కంథ    వాచస్పతి ఆదరం పొందాడు .పరీక్షాధికారి అయిన ‘’అంబికా దత్తుఆయన అంబికకు దత్తుడు అయితే తాను సాక్షాత్తు అంబిక కు ఔరస పుత్రుడిని గణపతిని  అనే  ‘’శ్లోకం తో మెప్పించి ,ఆయన మెప్పు పొంది పరీక్ష లో పాల్గొన్నాడు .నవద్వీప పండితులను మెప్పించటం మహా కష్టం .కాని మన గణపతి అక్కడి పండిత పరిషత్తు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి ,తన పాండిత్యం ,కవిత్వాలతో అందర్ని మెప్పించి ‘’కావ్య కంథ గణపతి  ‘’బిరుదును 20-6-1900 న పొందాడు .అప్పటి నుంచి ఆపేరు తో నే సార్ధక నామదేయుడైనాడు .
                    వైద్యనాద్ వెళ్లి తపస్సు చేసి సురేష మిత్రుని వద్ద ‘’తారా’’మంత్రోపదేశం పొందాడు .గణపతి గారి వల్లే ఉత్తరాదికే పరిమిత మైన ఈ మంత్రం దక్షిణాదికి చేరింది .పదవ రోజు రాత్రి శివుడు కలలో కన్పించి నిర్విషయ ధ్యాన రూపం అయిన ‘’స్మృతి మార్గం ;;చూపించి ,విభూతి చల్లి అదృశ్యమైనాడు .గద్వాల్ చేరి మహారాజుకు ఆప్తుడై ,కాన్పూర్ వెళ్లి మూడు నెలలు తపస్సు చేసి ,మళ్ళీ ఇంటికి వెళ్లి తండ్రికి నేత్ర చికిత్స చేయించాడు .1902 లో భార్య తో  సహా మంద సా వెళ్లి రాజు గారి ఆతిధ్యం పొంది ,భార్యను పుట్టింటికి పంపి ,తమ్ముడు శివ రామ శాస్త్రి తో  కలిసి భువనేశ్వర్ లో మళ్ళీ తపస్సు  చేసి కలకత్తా చేరాడు .అక్కడినుంచి దక్షిణ దేశం చేరి క్షీరవతీ ,వేగావతీ నాడు మద్య శివ పంచాక్షరి జపించి ,,అరుణాచలం  చేరి తన తపో సాధనకు అదే సరైన ప్రదేశం గా భావించి అక్కడే ఉందామని నిర్ణ ఇంచుకొన్నాడు .
          కానీ అన్నదమ్ములిద్దరికి పిడికెడు అన్నం పెట్టె వారే కరువైనారు .గణతి కి ఆ క్షేత్ర దేవత పై కోపం వచ్చింది .ఆకలి దహిస్తోంది .వెంటనే ఒక బ్రాహ్మణుడు వచ్చి తన భార్య వ్రతం చేసి పారణ ను బ్రాహ్మణులకు ఇవ్వాలని అనుకుంటున్నది భోజ నానికి రమ్మని చెప్పి తీసుకొని వెళ్లాడు .అక్కడ ఆమె మృష్టాన్న భోజనం పెట్టింది .సంతృప్తిగా తిన్నారు ..ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకొన్నారు .తెల్ల వారి లేచి చూస్తె అక్కడ ఇల్లే లేదు .అరుణా చలేశ్వరుడే తమల్ని పిలుచుకొని వెళ్ళాడని అమ్మ వారు’’ ఆపీత కుచామ్బే’’ తమకు భోజనం పెట్టిందని గ్రహించాడు .కాని నోట్లో తాంబూలం అట్లాగే ఉండటం ఆశ్చర్యం వేసింది .అది కల కాదు నిజం అని తెలుసు కొన్నాడు .అప్పటికి గణపతి అయిదు కోట్ల శివ పంచాక్షరి ని జపించి నందుకు అమ్మవారే స్వయం గా కన్పించి ఆతిధ్యం ఇచ్చిందని అర్ధ మయింది .ఇక మానవ మాత్రులేవారిని దేహీ అని అర్ధించ రాదనీ నిశ్చయించు కొన్నాడు .రోజు అరుణాచల నందీశ్వరుని  ముందు నిలిచి శ్లోకాలను అరుణా చలేశ్వరునికి విని పిస్తూ ‘’హరస్తుతి ‘’కావ్యం రచించాడు .చివరి రోజు న అరుణాచల యోగులు శేషాద్రి స్వామి ,బ్రాహ్మణ స్వామి (రమణ మహర్షి )ఆ కావ్యం విని ఆనదించారు .అక్కడి విద్యాలయం లో ఈయనకు సంస్కృత అధ్యాపక పదవి లభించింది .పది రోజుల్లో తమిళం నేర్చి ,ఆ భాష లో బోధించటం ప్రారంభించి మెప్పు పొందాడు .1903 లో రమణ మహర్షిని దర్శించాడు .ఆయనేదుర్గా మందిర యోగి చెప్పిన ‘’స్థూల శిరస్సు ‘’అని గుర్తించి నమస్కరించాడు .అప్పుడు రమణుల వయస్సు ఇరవై రెండు .గణపతి వయస్సు ఇరవై అయిదు .అలా చారిత్రాత్మకం గా కలిసిన వారిద్దరూ జీవికా జీవులు గా ఉండి పోయారు .
ఇంతటి మహానుభావులు వంశస్తులు మా శివ పరివారం లో ఉండడం కూడా మా శివ పరివారం చేసుకునే అదృష్టం.గురువు గారు తరచు ప్రవచనం లో గణపతి మహా ముని మహానుభావులుని గుర్తు చేస్తూనే ఉంటారు..
ఇట్లు
శివ పరివారం

Monday, June 15, 2020

04. యజ్ఞ వరాహ మూర్తి



04. యజ్ఞ వరాహ మూర్తి



 వారిలో ఒకడయిన హిరణ్యాక్షుడు  పశ్చిమ సముద్రము అడుగున ఉన్న వరుణుడిని యుద్ధమునకు రమ్మనమని పిలుస్తున్నాడు. ఆ సమయమునకే యజ్ఞవరాహమూర్తి జన్మించాడు. వరుణుడు– ‘సముద్ర జలముల మీదకు ఒక కొత్త భూతం వచ్చింది. నీవు దానితో యుద్ధం చెయ్యి’ అన్నాడు. అప్పటికి యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణముగా యజ్ఞవరాహ మూర్తిని ఎక్కడయినా ఏదయినా ఫోటో చూసినప్పుడు ఒక పంది స్వరూపమును వేసి దాని మూపు మీద రెండుకోరల మధ్య భూమిని ఎత్తుతున్నట్లుగా వేస్తారు. పరమాత్మ అలా ఉండడు. యజ్ఞవరాహ మూర్తి వర్ణన విన్నా, ఆవిర్భావమును గూర్చి విన్నా, చదివినా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాపము దగ్ధమయిపోయి కృష్ణభక్తి కలుగుతుంది. అటువంటి స్వరూపముతో ఆయన దర్శనం ఇచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఆ హుంకారం? అనుకుని స్వామి వంక చూశారు. ఆయన గుర్ గుర్ అని శబ్దం చేస్తున్నాడు. వ్యాసులవారు అలాగే వర్ణించారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగు తీసి  అడుగు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం.  ఆయననను స్తోత్రం చేయాలి. ఋషులందరూ నిలబడి ఋగ్వేదములోంచి, యజుర్వేదము లోంచి, సామవేదంలోంచి సూక్తములను వల్లిస్తూ యజ్ఞవరాహమునకు నమస్కారం చేస్తున్నారు.

 యజ్ఞవరాహం సముద్రములోకి ప్రవేశించి తన నాసికతో, మూపుతో సముద్ర అడుగు భాగమును కెలకడము ప్రారంభించింది. ముఖం అంతా నీటితో నిండిపోతోంది. యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను. ఒక్కసారి తన ముఖమును పైకెత్తి కనురెప్పలను ఒకసారి చిట్లించి మెడను అటూ ఇటూ విసురుతోంది.

  విసిరినప్పుడు  జూలులోంచి నీళ్ళు లేచి పడుతున్నాయి. మహర్షులు, చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్ళి ఆయననుండి పడిన నీటికోసమని దానిక్రింద తలపెట్టారు. ఈ కంటితో చూడరాని పరమాత్మ ఇవ్వాళ యజ్ఞవరాహముగా వచ్చి నీటితో తడుస్తున్నారు. ఆయన వెతికి భూమిని పట్టుకుని దానిని మూపు మీదకు ఎత్తుకుని రెండు దంష్ట్రల మధ్య ఇరికించి, పైకి ఎత్తి చూపించారు. అలా చూపించేసరికి దానిని చూసి ఋషులందరూ స్తోత్రం చేశారు.

జయవిజయులకు సనకసనందనాదుల శాపము

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ 

మనకి లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటినుంచి ఈ రోజు వరకు మనకి శ్రీమద్ భాగవతం , విష్ణు కధలు మొ.. మనకి గురువు గారు ఆన్లైన్ లో చెప్పడం అందరికీ తెలిసిన సంగతే.. ఎక్కడ ఉన్న 7. 20 నిముషాలు కు ఇంటికి వచ్చి ఆన్లైన్ లో గురువు గారు కి శ్రీ కృష్ణ శరణం మమ అని గురువు గారు మొదలు పెడతారు.. ఇక అమృత ధార , గంగా  ప్రవాహం లా వెళుతూ ఉంటుంది..

తింటే గారెలే తినాలి ! వింటే భారతం వినాలి ! ఉంటే వనంలో ఉండాలి ! అంటే అమృతం చిందాలి! కొంటే ఐఫోన్  యే కొనాలి!
కంటే అసలు సిసలు ఆడపిల్లనే కనాలి!!!  అనే నానుడి.. అలాగే వింటే మా పూజ్య గురువు గారు ప్రవచనం వినాలి.. 

పిల్లలకి పెద్దలకి అందరికీ అర్ధమయ్యే సరళ మైన భావం తో భాష తో మాకు తెలియచేస్తారు.. 

మా శివ పరివారంచేసుకునే అదృష్టం 



ఇక శ్రీ మద్  భాగవతం లో ప్రస్తావించుకుందాం.. మొన్నటివరకు గురువు గారు జయవిజయులకు సనకసనందనాదుల శాపము. గురించి చెప్పారు. ఎదుకంటే భాగవతం ఒక్కసారి చదివినప్పుడు విన్నప్పుడు బాగుంటుంది.. ఇంకో సారి మననం చేసుకుందుకు ఇలా వ్రాసుకుంటున్నాము 

శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులని ఇద్దరు పార్షదులు ఉన్నారు. వైకుంఠములో వారిద్దరూ ద్వారం దగ్గర నిలబడతారు. వైకుంఠమునకు ఏడు ద్వారములు ఉంటాయి. ఏడవద్వారం దాటి లోపలి వెళితే స్వామి దర్శనము  అవుతుంది. జయవిజయులు ఏడవద్వారమునకు అటూ ఇటూ నిలబడి ఉన్నారు.  సనకసనందనాదులు స్వామి దర్శనార్ధమై అక్కడికి వచ్చారు. వాళ్ళు మహా జ్ఞానులు. నిరంతరము  భగవంతుని పాదములయందు భక్తితో ఉండే స్వరూపము  ఉన్నవారు. వారు ఏడవద్వారం దగ్గరకు వెళ్ళి నిలబడ్డారు. జయవిజయులు వారిని ‘లోపలికి వెళ్ళడానికి వీలు లేదు’ అని అడ్డుపెట్టారు.

 సనకసనందనాదులు ‘ఇది వైకుంఠము. ఇక్కడ మాత్సర్యము ఉండదు. ఇక్కడ ఎవరికీ కూడా ఒకరి మీద ఒకరికి మత్సరము ఉండదు. లోపలికి వెళ్ళి ఈశ్వరుని దర్శించుకునేందుకు అభ్యంతరము ఎందుకు? మమ్మల్ని ఎందుకు ఆపినట్లు? లోపల ఉన్న స్వామి భక్త పరాధీనుడు. భక్తులయిన వారు వస్తే చాలు ఆయనే ఆర్తితో ఎదురువచ్చే స్వభావము ఉన్నవాడు.  ఆయన  లోపల ఉంటే వెళ్ళడానికి మేము వస్తే మా హృదయములో ఆయనను దర్శనము చేయాలన్న కాంక్ష తప్ప వేరొకటి లేకుండా ఉంటే మధ్యలో అడ్డుపెట్టడము మీకు మించిన స్వాతంత్ర్యము.  ఏది ఎక్కడ ఉండకూడదో దానిని మీరు చూడడము  మొదలు పెట్టారు.  అది ఎక్కడ పుష్కలముగా దొరుకుతుందో ఆ భూలోకమునకు పొండి’ అన్నారు. అనేటప్పటికి జయవిజయులిద్దరూ సనకసనందనాదుల కాళ్ళ మీద పడి పెద్ద ఏడుపు మొదలు పెట్టారు.

 శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చాడు. ఆయన శరీరము మీద నల్లని పుట్టుమచ్చ ఒకటి ఉంటుంది. ఆ పుట్టుమచ్చను శ్రీవత్సము అని పిలుస్తారు. ఆ పుట్టుమచ్చను చూసి, ఆయన స్వరూపమును చూసి సనక సనందనాదులు పొంగిపోయారు. ‘మా అదృష్టం పండి ఇంతకాలం తర్వాత నీ స్వరూపమును దర్శనం చేయగలిగాము. మా భాగ్యం పండింది’ అని ఆయన పాదముల మీద పడి నమస్కారం చేసి ‘పుష్పములోకి మకరందము కోసము గండుతుమ్మెద ఎలా చేరుతుందో నిరంతరము నీ పాదములయందు అటువంటి భక్తి మాకు ప్రసాదించవలసింది’ అని ప్రార్థించారు.

 శ్రీమన్నారాయణుడు – ‘మీ స్తోత్రమునకు నేను చాలా సంతోషించాను. ఇక్కడ ఏదో చిన్న అల్లరి జరిగినట్లు నాకు అనిపించింది. ఏమయింది?’ అని అడిగితే  – ‘స్వామీ మేము తప్పే చేశామో! ఒప్పే చేశామో! మాకు తెలియదు. కానీ మేము లోపలకి వస్తున్నప్పుడు ఏడవద్వారం దగ్గర ఈ పార్షదులు మమ్ములను అడ్డుపెట్టారు. మత్సరములు ఉండడానికి అవకాశం లేని వైకుంఠమునందు నీ దర్శనమునకు మమ్మల్ని పంపలేదు, వారు మాయందు విముఖులయి ఉన్న వారిని భూలోకమునందు జన్మించమని శపించాము.  నీవు ఎలా చెపితే అలా ప్రవర్తిస్తాము. ఒకవేళ మావలన అపరాధము అంటే మన్నించవలసినది’  అన్నారు.

 శ్రీహరి – ‘నా పాదములు మీవంటి బ్రహ్మజ్ఞానులు నమ్మి అర్చించిన పాదములు.  ఇంతమంది చేత ఆరాధింపబడుతున్నాయి. మీవంటి వారిచేత పూజించబడి మిమ్మల్ని రక్షించుటకు పూనికతో తిరిగి మీకు దర్శనం ఇస్తాను. నిత్యాపాయినియై నిరంతరము లక్ష్మి నావెంట వస్తోంది. నేను భక్త పరాధీనుడను. భక్తులయిన వారు పిలిస్తే పరుగెత్తుకు వెళ్ళడం నా ధర్మం. ఒకవేళ అలా పరుగెత్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించడములో అడ్డువస్తే నా చేతిని నేను నరికేస్తాను’ అని ఎంతో పెద్దమాట అన్నాడు ! ఆ చేయి లోకములనన్నిటిని రక్షించే చేయి.  మీరు నిరంతరము  నన్ను తప్ప వేరొకరిని కొలవని వారు, ఎప్పుడూ నా పాదముల యందు మనస్సు పెట్టుకున్నవారు, చతుర్ముఖ బ్రహ్మ అంతటివారు సంసారమునందు ప్రవర్తించి సృష్టి చేయమంటే చేయకుండా కేవలము నా పాదపంజరము నందు భక్తితో నిలబడిన మిమ్ములను జ్జయ విజయులు అడ్డుపెట్టి మహాపచారం చేశారు. వీళ్ళు చేసిన అపచారం వలన నా కీర్తి నశిస్తుంది.’ ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమయిన విషయమును ప్రతిపాదన చేశారు.

‘నేను ఎందుకు మీరు ఇచ్చిన శాపమును అంగీకరిస్తున్నానో తెలుసా! వీరికి యుక్తాయుక్త విచక్షణ లేదు. వీళ్ళకి ఈ అధికారం నేను ఇచ్చాను. ఏడవ ప్రాకార ద్వారము వద్ద ఉండి వచ్చిన వాళ్ళని లోపలి పంపించండని చెప్పాను. లోపలికి ఎవరు వెళ్ళాలి, ఎవరిని తొందరగా ప్రవేశపెట్టాలని అంతరము తెలుసుకొని ముందు వాళ్ళకి నమస్కారం చేసి, లోపలి ప్రవేశ పెట్టగలిగిన సంస్కారం ఉన్నవాడు అక్కడ ఉండాలి. వీళ్ళు అలా ఉండలేదు. పరమ భాగవతులయిన వారికి కలిగిన మనఃక్లేశము పట్టి కుడిపేస్తుంది. మీలాంటి వారిని కాపాడడానికి నేను లోపల ఉన్నాను. మీరు నావద్దకు రాకుండా వీళ్ళు అడ్డుపడ్డారు. తన శరీరమునందు పుట్టిన కుష్ఠు తనని పాడు చేసినట్లు నేను వీళ్ళకి పదవి ఇస్తే ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఈ జయవిజయులు నాకే తప్పు పేరు తీసుకుని  వస్తున్నారు. మీవంటి వారికే వైకుంఠమునందు ప్రవేశము నిరాకరింపబడితే భక్త కోటి నన్ను ఎలా విశ్వసిస్తుంది? లోకము పాడయిపోతుంది. నేను భక్త పరాధీనుడను. నాకు దుష్ట పేరు తెచ్చారు. వాళ్ళను మీరు శపించడం కాదు నేను చెపుతున్నాను.’

వీళ్ళు ఉత్తర క్షణం భూలోకమునకు వెళ్ళి రాక్షసయోనియందు జన్మించి ఉగ్రమయిన రాక్షసులై అపారమయిన లోభత్వమును పొందుతారు’ అన్నాడు.

 జయవిజయులిద్దరు శ్రీమన్నారాయణుడి పాదముల మీద పడి ‘స్వామీ! లోపల ఉన్నవాడి హృదయమును అర్థం చేసుకోవడములో పొరపాటు జరిగింది. మమ్ములను క్షమించు. మళ్ళీ మాకు ఎప్పుడు వైకుంఠమునకు ఆగమనం’ అని అడిగారు.  స్వామి ‘మీరు మూడుజన్మలు  గొప్ప రాక్షసులు అవుతారు.  మిమ్మల్ని  దునుమాడవలసిన అవసరం కూడా నాదే.  నేనే మీ కోసం అవతారం స్వీకరించి వచ్చి మిమ్మల్ని నిర్మూలించి తెచ్చి నా వాళ్ళుగా చేసుకుంటాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అందులో కూడా స్వామి వారి రక్షణ కనబడుతోంది..

మిగతాది తరువాతి పోస్ట్ లో వస్తుంది..  యజ్ఞ వరాహ మూర్తి ఆవిర్భావం..

ఇట్లు
శివ పరివారం 

వందే మాతరం

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

మనకి రోజు జరిగే భాగవతం ప్రవచము తో పాటు మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న పిట్టా కధలు, స్వాతంత్ర  సమార యోధులు గురించి, పృద్వీ రాజ్ చౌవాన్ , వన్డే మాతరం కధ , జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఇలా ఎన్నెన్నో విషయాలు మనకి తెలియా చేస్తున్నారు
అవి '*వందేమాతరం*'ఉద్యమం జరుగుతున్న రోజులు. ఎవరైనా 'వందేమాతరం' అని అంటే జైల్లో వేసేవారు. ఒక వూర్లో ఒక అతను వుండే వాడు.అతనికేమో బజార్లో నిలబడి గట్టిగా  " వందే మాతరం " అని అరవాలని  ఉందట . ఆలా అంటే జైల్లో వేస్తారని భయపడే వాడు.
జైలు కి వెళ్లకుండా వన్డే మాతరం అని ఎలా అరవాలి అని యోచన చేసే వాడు. .
ఒకసారి  బజారులో వెళుతుందుండగా అయన ముందు ఒకావిడ బుట్టలో మామిడి పండ్లు పెట్టుకుని అమ్ముతూ ఉందట
ఆయనకి ఒక ఉపాయము తట్టింది  అంటే వందే మాతరం అని అరిచాడు . పోలీసులు పట్టుకున్నారు అతను భయపడకుండా నేను ఆ మామిడి పళ్ళ అమ్మాయిని *వంద ఏమాత్రం* ? అని అడుగుతున్నాను . అంటే వంద మామిడి పందులు ఎంతకు ఇస్తావని . తప్పేముంది ? అని దబాయింది తప్పించు కుని తన దేశ  భక్తిని చాటించుకున్నాడు..

మా చిన్నప్పుడు మా నాన్నగారు / తాతగారు మామిడి పండ్లు  బేరమాడినపుడు పరక , రెండు పరకలు , వందలు లెక్కలో కొనే వారు.. ఉమ్మడి కుటుంబం కాబట్టి..

ఇట్లు
శివ పరివారం

Saturday, June 13, 2020

దశరథ ప్రోక్త శని స్తోత్రం.


DATE : 13/06/2020

ప్రియమైన భాగవత శివ పరివారం కు శుభాకాంక్షలు


ఈ రోజు భాగవతం లో గురువు గారు దశరథ మహా రాజు గారు కధ చెప్పారు.. ఇది వరకు కూడా మాకు తైలాభిషేకం లో తెలియచేసారు..

పూర్వం రఘువంశ చక్రవర్తియైన దశరథుడు జ్యోతిషులు, పండితుల వలన భూమండలానికి 12 సంవత్సరాల క్షామము ఏరపడబోతున్నదని తెలుసుకొన్నాడు. దానికి కారణం కృత్తికా నక్షత్రము చివరనున్న శనిగ్రహము రోహిణీ నక్షత్రమును ఛేదించుకొని పోవడమేనని జ్యోతిషులు చెప్పారు. శనిగ్రహం ఇలా ఛేదించడాన్ని శాకట భేదమంటారు. ఈ విషయాలను తెలిసికొన్న దశరథుడు తన హితైషులైన మంత్రి పురోహితులతో విచారించాడు.

మనకి మన కుటుంబానికి పూర్వం పురోహితులు ఉండేవారు.. పురోహితులు అంటే పురమునకు హితము కోరుకునే వాడు . పురోహితుడు అనగా ముందుగా హితము పలికెడి వాడు అని అర్థం. ... ఇప్పుడు పౌరోహిత్యము చేయువానిని పురోహితుడు అంటారు.
పురోహితము
పు ,అనగా పురజనులందరికి
రో ,అనగా రోజురోజుకి
హి ,అనగా హితముచెప్పుచు
త ,అనగా తరింపజేసి
ము ,అనగా ముదముగూర్చునది  అని కూడా చెప్పవచ్చు


వశిష్టుల వారి సలహా తీసుకొన్నాడు. ఈ ప్రపంచానికి క్షామం రాకుండా చేసి క్షేమం కలిగించాలనే ఆలోచనచేశాడు. తాను స్వయంగా ధనుర్బాణాలు ధరించి నక్షత్ర మండలానికి రధారూఢుడై బయలుదేరాడు. లక్ష యోజనముల దూరమున నున్న రోహిణీ మండలము యొక్క ముందు భాగం చేరాడు. రధారూఢుడై ధనుర్బాణాలు ధరించి నక్షత్ర మండలమున దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న దశరథ చక్రవర్తిని చూచి శని ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇలా పలుకరించాడు.

‘‘ఓ దశరథ మహారాజా! నీ అనన్య సామాన్యమైన పరాక్రమునకు మెచ్చాను. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, కినె్నర కింపురుషులు నన్ను తలుచుకొని భయపడగా నీవు మాత్రం ఎంతో ధైర్యంతో నన్ను ఎదుర్కొనుటకు వచ్చావు. భూమండల క్షేమంకోరే నీ మంచితనాన్ని నేను ఇష్టపడ్డాను. ఏదైనా వరము కోరుకొమ్ము’’ అని అన్నాడు.

అంతట దశరథుడు ‘‘ఓ శనిదేవా! నీవు సూర్య చంద్రాదులున్నంతవరకు రోహిణీ నక్షత్రాన్ని ఛేదించుకొని పయనించకూడదు ఇదే నాకు కావలసిన వరం’ అని అనగా శని ‘‘తథాస్తు’’ అని అన్నాడు. అంతేకాక మరేదైనా వరాన్ని కోరుకోమని కూడా సంతోషంగా చెప్పాడు. అప్పుడు ‘‘దేశములో ఎన్నడూ కూడా 12 సంవత్సరాల క్షామం రాకూడదు- ఇలాంటి క్షామం వలన జనులు తీవ్రకష్టనష్టములకు లోను అవుతారు.కనుక ఎన్నడూ కూడా ఇలాంటి క్షామం రాకుండా వరం ప్రసాదించవలసిందని కోరుకున్నాడు. ఆకోరికకు శని సంతసించి ‘‘ఓ రాజా! నీవు కోరినట్లే ఎన్నడూ కూడా దేశంలో 12 సంవత్సరాల క్షామం ఏర్పడకుండుగాక’’ అని పలికిన శనిదేవుని గాంచి దశరథుడు ధనుర్బాణములు ప్రక్కన పెట్టి చేతులు జోడించి భక్తితో స్తుతించాడు.

అయిననూ ఎవరైతే నీచే పఠింపబడిన నా స్తోత్రమును భక్తితో పఠిస్తారో వారిని నేను పీడించను. అంతేకాక ఎవరైతే శనివారం రోజున నన్ను శమీ పత్రములతో పూజించి నువ్వులు, మినపప్పు పదార్ధం తో నైవేద్యముగా పెట్టి యధాశక్తి గా కొలిచి  ఈ స్తోత్రమును పఠిస్తారో వారికి శని దోషం తక్షణమే తొలగిపోవును’’ అని వరాన్ని ఇచ్చాడు. అంత దశరథుడుఎంతో సంతోషించి తిరిగి తన రాజ్యమునకు తిరిగి వచ్చాడు. ఈ విధంగా పరమేశ్వరుడు మానవులకు శనిగ్రహ పీడా పరిహార మార్గాన్ని నారదుని ద్వారా లోకమునకు తెలియపరిచారు.

మన శివ పరివారం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రం.....ను మనకి మన పూజ్య గురువు గారు ఒక తైలాభిషేకమ లో నేర్పిచారు


నమః కృష్ణాయ నీలయ| శిఖి ఖండ నిభాయచ|
నమో నిల మథూకాయ| నిలోత్పల నిభాయచ|
నమో నిర్మాంస దేహాయ| దీర్ఘ శృతి జటాయచ|
నమో విశాల నేత్రాయ| శుష్కోదర భయానక|
నమః పౌరుష గాత్రాయ| స్థూల రోమాయతే నమః|
నమో నిత్య క్షుధార్తాయ| నిత్య త్రుప్తాయతే నమః|
నమో దీర్ఘాయ శుష్కాయ| కాలదంష్ట్ర నమోస్తుతే|
నమస్తే ఘోర రూపాయ| దుర్నిరీక్ష్యాయతే నమః|
నమస్తే సర్వ భక్షాయ| వలీముఖ నమోస్తుతే|
సూర్యపుత్ర నమస్తేస్తు| భాస్కరో భయ దాయినే|
అధో దృష్టే నమస్తేస్తు| సంవర్థక నమోస్తుతే|
నమో మందగాతే తుభ్యం| నిష్ప్రభాయ నమోనమః|
తపసా జ్ఞాన దేహాయ| నిత్యయోగ రతాయచ|
జ్ఞాన చక్షుర్నమస్తేస్తూ | కశ్యపాత్మజ సూనవే|
తుష్టో దదాసి రాజ్యం తం| క్రకుద్దో హరసి తత్ క్షణాత్|
దేవాసుర మనుష్యాశ్చ| సిద్ధ విధ్యాధారో రగాః|


ఇట్లు
శివ పరివారం 

Wednesday, June 10, 2020

ధూమావతి

ప్రియమైన శివ పరివారం కు జేష్ట మాస శుభాకాంక్షలు

మనం ఈ నెల 13 వ తారీఖున సరూర్ నగర్ చండీ అమ్మవారి దేవాలయం లో ధూమావతి హోమం చేయుటకు ఆ పరమేశ్వర సంకల్పం.

మనం చేసే చండీ హోమం పేరు ధూమావతి.. మీకు వివరాలు తెలియ చేసే ప్రయత్నం చేస్తాను..

మన శివ పరివారం లో అందరికీ దశమహావిద్యలు  తెలిసినదే

మరొకసారి తెలుసుకుందాం  దశ మహావిద్యలంటే ఏవి?

1. కాళీ
2. తార
3. త్రిపుర సుందరి
4. ధూమావతి
5. భువనేశ్వరి
6. భైరవి
7. ఛిన్నమస్త
8. మాతంగి
9. బగళాముఖి
10. కమలాత్మిక

అనేక దశాబ్దాల పాటు వీటి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలని, అర్ధాలని, అంతరార్ధాలని తెలుగు వారికి అందించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావుల సమక్షంలో దశ మహా విద్యల సాధన చేసి అందులో ఉన్న శక్తి కేవలం గ్రంధాలుగా కాక నిజంగా చూపించిన వారు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. వారు వ్రాసిన ఉమా సహస్రాన్ని అమ్మ వారికి అంకితం చేసినప్పుడు అన్నారుట, " అమ్మా ! ఈ రచన నీకు నచ్చినట్లయితే నాకు తెలియజెయ్యి. ఏ భాగం నీకు నచ్చక పోతే ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను " అని. అలా ఆయన ఆ మహా గ్రంధాన్ని చదవడం మొదలు పెట్టే సరికి, ఆ అమ్మ వారు కరుణాసముద్రయై ప్రతి పద్యానికో మెరుపు ఆకాశంలో చూపించిదిట. అంతటి దివ్య శక్తిని దర్శనీయంగా చూడడానికి ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశ మహావిద్యలు దేన్ని సూచిస్తాయి అని సందేహం వస్తుంది. వీటి చిత్రాలు, విగ్రహాలు కూడా అన్నీ సౌమ్యం గా ఉండవు. ఉదాహరణకి కాళీ విగ్రహం ఎప్పుడూ ముండ మాలతో, ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది. మరి ఈ కాళికే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెర్రి వాడైన కాళి దాసుకి కవిత్వాన్నిచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది. అమ్మ ఒక సారి కోపంగా ఉంటుంది. ఒక సారి సంతోషంగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తే ఒకటి పీకుతుంది కూడా. అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెరిగిన వారెవ్వరు? ప్రేమ అనేది ఒక అపురూపమైన తత్వం. తిట్టుకున్న, కొట్టుకున్నా ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి.

ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.

కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి కాలం మనకి అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే అనంత బయొలాజికల్ క్లాక్ లో నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గం చూపగలడు. అంతరాళం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిని శక్తి. ఇది అర్ధం కావాలంటే శ్రీ కృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగల మనో తరంగ విశ్వసృష్టి స్పందన. దీన్ని తారా దేవి తెలియజేయ గలదు. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపంలో ఆద్యా శక్తులుగా ఉపాసించడమే దశ మహా విద్యల స్వరూపం. అందుకే వీటిలో ఒక మౌలిక భావ సముదాయం ఉపాసనగా ఉంటుంది. సాధరణంగా వీటిని ఉపాసించే వారు వీటి విసృత పరిధిని జ్ఞాపకంలో పెట్టుకుని ఉంటారు.

*ఇటువంటి హోమం ను స్వయం గా ఆ దేవదేవుడు , మహాదేవుడు, పార్వతీ పరమేశ్వరులు లోక కల్యాణార్థం ను దృష్టిలో ఉంచుకొని, మన పూజ్య గురువు లు చే నిర్వహిచాలని సంకల్పం చేయబడినది*..

దశ మహావిద్యలకు జ్యోతిష శాస్త్ర సారుప్యత దృష్ట్యా ధూమవతి కేతుగ్రహాదిష్టాన దేవత. ఈమె చూడటానికి వికారంగా, చేతిలో చాటతో, పొగసూరిన బట్టలతో, మెల్లకళ్ళతో, గుర్రంలేని బండిపై కూర్చుని ఉంటుంది.ధూమవతి సిద్ధిని ప్రసాదించే తల్లి.
యత్ర అగ్నిః తత్ర ధూమః– అవిద్య నుండి విద్యను, విద్యాతత్త్వాన్ని అనుభూతి చేయగలది ధూమావతి. మానవుని నిద్రా, నిద్రారాహిత్యాలు ధూమవతి యొక్కవైభవము

ధూమావతి అంటే ఉపాసనా పరంగా మహామౌనమని కూడా అర్థం. ఉపనిత్తులలో పేర్కొన్న భూమావిద్య. ఇది పూర్ణవిద్య మరియు అపూర్ణవిద్య కూడా – విద్యాఽవిద్యా స్వరూపిణి

లౌకికంగా ఆలోచిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముందు జ్యేష్టాదేవి కృపతో అలక్ష్మిని తొలగించికోవాలి, జ్యేష్టాదేవి దయ ఉంటేనే లక్ష్మీదేవి ప్రాసాదించే సంపద మనకు దక్కుతుంది. ధూమావతి మంత్రాలలో జ్యేష్టాదేవి మంత్రంకూడా వుంది. లోకంలో సంపద ఉంచాలన్నా తీసేయాలన్నా ఈమే కారణం.


దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతీ దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

                         ||శ్లోకం||

అత్యుచ్చా మలినాంబరాఖిలజనోద్వేగావహా దుర్మనా
రూక్షాక్షి త్రితయా విశాలదశనా సూర్యోదరీ చంచలా|
ప్రస్వేదామ్బుచితా క్షుధాకులతను: కృష్ణా తిరూక్ష ప్రభా
ధ్యేయా ముక్త కచా సదాప్రియకలిర్ధూమావతీ మంత్రిణా|

దుఃఖదాయకమైన పరివర్తనాన్ని ధూమవతిగా చెప్పారు. జ్యేష్ట శుక్ల అష్టమి రోజున ఈమె జయంతి జరుపుతారు. ధూమవతి రాత్రిని దారుణ రాత్రిగాను, అక్కడ శివుడిని కాలభైరవునిగానూ వర్ణిస్తారు. స్థిత ప్రజ్ఞతకు ధూమవతి ప్రతీక. ఈమెది కాకి వాహనం. వాసనాగ్రస్త మనసుకు ప్రతీక. అంతరం లేని మనసుకు, అసంతృప్తికి ప్రతీక. ఆమెకు ఉన్న ధూమశరీరం, తమో మయమైన బుద్ధికి అవివేకానికి చిహ్నం. జీవునికి (సాధకునికి) జన్మలో లభించిన దీనావస్థలన్నీ అంటే బుభుక్షా, పిపాస, కలహా, దారిద్య్రాది వ్యసనాలే ధూమవతి కార్యకలాపాలు.

వేదవిద్యలో లభించే క్రదువు అనే మాటకు అసురత్వ భూమికలైన వృక్షస్తేన, అహి, వృతభృతులను ఇది ఉత్పత్తి చేస్తుంది. తంత్ర గ్రంధాలలో ధూమవతి ఉగ్రతారగా వర్ణితమైనది. ఆమె ధూమ్రత్వమే ఆమెకు ఆ పేరు తెచ్చిపెట్టి సార్థకం చేసింది.

దేవి ప్రసన్నంగా ఉన్నప్పుడు ఏ విధంగా రోగాలను నయం చేస్తుందో కుపితగా మారితే సమస్త సుఖాలను, కామమును హరించి వేస్తుంది. దేవి శరణుపొందిన మానవులకు విపత్తులు ఉండవు. సంపద ప్రాప్తిస్తుంది. ఇతరులకు సహాయపడే శక్తి లభిస్తుంది.

ఋగ్వేద సూక్తంలో దేవి “సుతారా” అని వ్యవహరితమైంది. అంటే సుఖ పూర్వ యోగ్యదాయిని అని అర్థం. తారా తారిణి అనే పేర్లతో వర్ణించారు.

ఋణాన్ని దూరం చేసేది అంటే ఆ భావాన్ని, సంకటాన్ని దూరం చేసే ధనంగాను, సుఖాన్నిచ్చే తల్లిగాను అవతరించింది. కనుక ఈమెకు “భూతి” అనే పేరు కూడా ఉంది.

భగవద్గీతలో “ధూమే న వ్రియతేవహ్నిః” అని ఉంది. అంటే జ్ఞానం, అజ్ఞానం అనే ధూమం చేత ఆవరింపబడి ఉంటుంది అనీ, జ్యోతి స్వరూపిణి అయిన దేవి దానిని విచ్ఛిన్నం చేసి మోక్షాన్ని ఇస్తుందని అర్థం.  ధూమవతి వికృతి శక్తిగా చెప్పబడింది. ముసలమ్మ దేవత చావుపుట్టుకల గూర్చిన పాఠాలను ధూమవతి బాగా చెబుతుంది. ఆమె తన దివ్య స్వప్నాలకు స్వస్తిపలికి వ్యక్తంగాని యువస్వప్నాలలోని నిజాలను ముసుగు తీసి ప్రదర్శిస్తుంది. ధూమం అంటే పొగ. పొగతో నిండేది ప్రకాశం కాదు. ఆమె స్వభావం అంతర్థానం. తెలివిని అంతర్థానం చేసి దాని (లోతున) చాటున ఉన్న నిజాన్ని లాగి చూపిస్తుంది. ప్రళయ కాలంలో యోగనిద్ర యుక్త పురుషులలో నిత్యానంద నిద్ర ధూమవతీ లక్షణం. సంసారంలో చిక్కుకుని ఉన్నవాళ్ళను నిద్ర, మూర్ఛ, మరపులాంటి ఏ అజ్ఞానం కప్పి ఉండటం వల్ల సంసారులు ఆత్మను వెతుక్కోలేక పోతున్నారో అది కూడా ధూమవతియే.!!

ఇటువంటి హోమం ను స్వయం గా ఆ దేవదేవుడు , మహాదేవుడు, పార్వతీ పరమేశ్వరులు లోక కల్యాణార్థం ను దృష్టిలో ఉంచుకొని, మన పూజ్య గురువు లు చే నిర్వహిచాలని సంకల్పం చేయబడినది..


సశేషం
మరికొన్ని వివరాలు తో మీకు మరింత సమాచారం ను అందిస్తాము..

ఇట్లు
శివ పరివారం

Friday, June 5, 2020

నైవేద్యం

మనకి దేవుడు కి పెట్టె నైవేద్యం గురించి అందరికీ తెలుసు , కానీ నివేదన పెట్టె విధానం , పద్దతి ఒకటి శాస్త్రం లో ఉంది

గర్భగుడిలో కొలువైన దైవానికే కాదు ... ఇంట్లోని పూజా మందిరంలో నెలవైన దైవానికి కూడా నైవేద్యం పెట్టవలసిందే. చేసేది నిత్యపూజ అయినా ... విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజే అయినా నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసిందే. దైవానికి జరిపే ఉపచారాలలో నైవేద్యానికి ఎంతో విశిష్టత వుంది. దైవంపై మనకి గల భక్తిశ్రద్ధలు బయటపడేది ఈ నైవేద్యాల విషయంలోనే.

మా గురువు గారు మాకు నైవేద్యం లో ఉన్న విశేషం ను ఏ ఏ రోజుల్లో ఏ తిధి లో ఏమి నైవేద్యం పెట్టాలో మాకు ప్రతి రోజు భాగవత శ్రవణం అయ్యిన తర్వాత మాకు తెలియ చేస్తారు.
మా గురువు గారు ఇలా చెప్పడం వెనక ఒక మంత్ర శాస్త్ర రహస్యం ఉంది.. ఎంతో ప్రయోగాత్మకం గా నిరూపమైన ఈ ప్రక్రియ..
ఈ విధం గా ఎవరైనా వాళ్ళ సమస్యను బట్టి స్వామి కి నివేదన చెయ్యండి.. తప్పక నెరవేరుతుంది.. ఇది మా గురువు గారు డాక్టర్ గారు తయారు చేసిన ప్రక్రియ

దేవుడి ఆరాధనలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. అయితే వాటిలో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడం. ఇది ప్రక్రియ చాలా ముఖ్యమైన మరియు దేవుని క్రుప పూర్తిగా దక్కే మార్గం ఇది ఒక్కటే

అలాగే నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్, వస్తువు లో పెట్టకూడదు , మా శివ పరివారం ప్లాస్టిక్ వస్తువు ని నిషేదించింది

ఈ క్రింది విధం గా ఆయ తిది ప్రకారం నివేదన పెట్టాలి




నివేదన పెట్టె విధానం, ఒక్కొక్కరు ఒక్కో విధం గా వాళ్ళ ఇష్ట దైవనంను ప్రార్ధిస్తూ ఇస్తారు.. 
ఉదాహరణ కి మీకు ఇంట్లో ఇచ్చే నివేదన విధానం ను ఇస్తున్నాను 

చంద్రమా మన’సో జాతః | చక్షోః సూర్యో’ అజాయత |
ముఖాదింద్ర’శ్చాగ్నిశ్చ’ | ప్రాణాద్వాయుర’జాయత ||

ఆర్ద్రాం యః కరి’ణీం యష్టిం పింగలామ్ ప’ద్మమాలినీమ్ |
చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||


ప్రసాదం పై పూవు తో నీళ్ళు చల్లి - 
ఓం భూర్భువస్సువః ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి 
ధియోయోన ప్రచోదయాత్ । ।  
అని చదివి నైవేద్యమును నివేదిస్తూ 


సత్యంత్వర్తేన పరిషించామి 
అమృతమస్తు 
అని చెప్పి ఉద్ధరిణి తో నీరు దైవానికి చూపి పళ్ళెములో వేయవలెను 


అమృతోపస్తరణ మసి 
 మనం పెట్టే నైవేద్యాన్ని చెప్పాలి. నైవేద్యములు నివేదిస్తూ 
శ్రీ భవాని శంకర స్వామి నే నమః 
ఓం ప్రాణాయ స్వాహా 
ఓం అపానాయ స్వాహా 
ఓం వ్యానాయ స్వాహా 
ఓం ఉదానాయ స్వాహా 
ఓం సమానాయ స్వాహా 
అంటూ పూవు తో నీళ్ళు చల్లాలి 

note : ఇక్కడ మా గురువు గారు మా అభిషేక సమయం లో కాశీ అన్నపూర్ణ నుంచి కామాఖ్యా , అష్ట దశ శక్తీ పీఠాలు, అన్ని దేవతా స్వరూపాలు కి పిలిచి నివేదన ఇస్తారు.. ఈసారి రికార్డింగ్ పెడతాను 

శ్రీ ఉమా మహేశ్వర స్వామినే నమః - నైవేద్యం సమర్పయామి ॥
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి 
ఉత్తరాపోశనం సమర్పయామి, హస్తౌ ప్రక్ష్యాళయామి, పాదౌ ప్రక్ష్యాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి 

చివరి లో మనం ఇలా చెప్పుకోవడం ఆనవాయితీ 

అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా । 
తాని సర్వాణి మే దేవ క్షమస్వ పురుషోత్తమా ॥

మధ్యే మంత్ర తంత్ర స్వరవర్ణ ధ్యాననియమ న్యూనాతిరిక్త లోపదోష 
ప్రాయశ్చిత్తార్థం అచ్యుత అనంత గోవింద మహామంత్ర జపం కరిష్యే । । 

అచ్యుతాయ నమః  । 
అనంతాయ నమః  । 
గోవిందాయ నమః । 

॥  సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు ॥ 


ఇట్లు 
శివ పరివారం 
*వివిద ఫలాల నైవేద్యం - ఫలితాలు*


     మన నిత్య పూజలో కానీ దేవాలయంలో కానీ, భగవంతుడికి గాని, ఫలం, పత్రం, పుష్పం తోయం లు పూజలో వాడడం మన ఆచారం. 

           మనకు పూజ అనగానే మనకు దేవుడికి దీపంపెట్టి ఆగరు బత్తులు వెలిగించి, పూవులు పెట్టి, ఆక, వక్క, పండు నైవేద్యంగా పెట్టి కొబ్బరి కాయ కొట్టడం ఆనవాయితీ.

      ఏ ఫలం నైవేద్యంగా పెడితే ఏ ఫలితం లభిస్తుందో, మనకoదరకు తెలిసినా మరొక్క మారు తెలుకుందాం. 

 *1. కొబ్బరి కాయ* ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే,  మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి. 
*2.అరటి పండు -* భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగు తుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే , మద్యలో నిలిచి పోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. 
 *3. నేరేడు పండు. -* శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.
 *4. ద్రాక్ష పండు. -* భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది. 
 *5. మామిడి పండు. -* మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు, ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది.  నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని, దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి,  అందరికి పంచి, తరువాత మీరు తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు. 
 *6.అంజూర పండు. -* భగవంతుడికి నైవేద్యం పెట్టిన అoజూరా పండును అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు. 
 *7.సపోట పండు. -* సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలున్ని తొలగిపోతాయి. 
 *8.ఆపిల్ పండు:- -* భగవంతుడికి ఆపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. *
9.కమలా పండు. -* భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి. 
 *10.పనసపండు:- -* పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగవిముక్తి కలిగి సుఖంగా ఉంటారు. 
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️