Wednesday, May 27, 2020

సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం ఒక మంత్రమే



సౌందర్యలహరిలోని ప్రతి శ్లోకం ఒక మంత్రమే

ఈ జగత్తు సృష్టిస్థితి లయ కారణాలకు మూలమైన ఒక మహాశక్తి శ్రీ లలితా పరమేశ్వరి అనేది దేవతలు సహితం విశ్వసిస్తారు. ఆ శక్తిని అనేక నామాలతో, అనేక రూపాలతో ఆరాధిస్తారు. శ్రీ శంకరాచార్యులవారు జగన్మాతను స్తుతిస్తూ అనేక స్తోత్రాలు చెప్పారు. అందులో సౌందర్యలహరి చాలా ముఖ్యమైనది.

యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా౹
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః౹౹

సర్వభూతములలో ఏ శక్తి వ్యాపించి ఉందో ఆ శక్తికి నమస్కారము. మన భారతీయ సంస్కృతిలో మంత్రములకు చాలా ప్రాముఖ్యము ఉంది. ఏకాక్షరీ రూపమై బహు దేవతాత్మకమైన 'ఓం'కార బీజాక్షరం మొదలు ఎన్నో మంత్రాలు మనకి మంత్రద్రష్టలైన మహర్షులు ప్రసాదించారు. నారాయణ మంత్రం పంచాక్షరీ మంత్రం, గాయత్రి మంత్రము ఇంకా మనకున్న దేవతలందరికీ మహర్షులు వారి దివ్యజ్ఞాన శక్తితో మంత్రాలను సృజించి మానవులకందించి తరించారు.

జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులవారు అద్వైత సిద్ధాంత యోగముతో శివకేశవ శాక్తేయ, గాణపత్య మతాలను సమన్వయ పరచి అన్నీ దేవీ దేవతల స్తోత్రాలు గానం చేశారు. వారి అపూర్వ సృష్టిలోనిది 'సౌందర్య లహరి' అర్థం కాని వారికి కూడా ఆ శ్లోకాలు చదువుతూంటే సౌందర్యాధిదేవత ఆ జగన్మాత సాక్షాత్కరించిన ఆనందలహరిలో లీనమయిపోతున్న అనుభూతి కలుగుతుంది.

శ్రీ శంకరులు 'సౌందర్యలహరి'లో ప్రతి శ్లోకంలోనూ ఒక మంత్రము, ఒక యంత్రం, ఆ యంత్ర పూజా విధాన భాగమైన తంత్రమును పొందుపరచారు. అయితే తాంత్రికారాధన అందరి కోసమూకాదు అనేది గ్రహించాలి.

భక్తి శ్రద్ధలు కలవారు, గురుముఖతః ఈ విధివిధానాలు తెలుసుకున్నవారు మాత్రమే దీనిని అనుష్టించాలి. మన భారతీయ సంస్కృత సాహిత్యంలో ఎటువంటి శక్తి సంపన్నమైన మంత్రశక్తి ఉన్నదో ప్రజలకు తెలియజేయడానికి ఈ శ్లోకాలు ప్రతీకలు.

అర్థవత్ వీర్యవత్తరం భవతి" అను వాక్యాన్ని అనుసరించి అర్థవంతముగా , ఆర్తిగా, ఉచ్చారణ దోషములు లేకుండా, ఒక్కసారి చేసినా జగన్మాత సంతోషపడుతుంది.

పారాయణ ప్రతి విషయమును శ్రీమాతృ చరణారావిందములకు సమర్పించుట మన కర్తవ్యము.

పారాయణ చేసిన ప్రతిశ్లోకాన్ని , నిరంతరం మననముద్వారా, సమర్పణద్వారానే, శ్రీమాతృ అనుగ్రహానికి పాత్రులుకాగలరు.

కనుక "భవానీ భవనాగమ్యా" అనే లలితా సహస్రనామాన్ని మనస్సునందుంచుకొని, భావన, మననము ద్వారా శ్రీమాతృచరణార్చనను నిర్వహించవలెను.

"సౌందర్యలహరి"లోని ప్రతి అక్షరము శ్రీమాత అక్షర ఆకారములోని భాగమే.

. ఎంత ఆర్తితో చేసాము అన్నది ముఖ్యం. లెక్క కాదు.  ఇదే మా గురువు గారు మాకు తెలియ చేసినది


ఇట్లు 
శివపరివారం 

చెట్లను సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు

Date : 27/05/2020

ఈ రోజు భాగవత ప్రవనచం లో మన పూజ్య గురువు గారు చెట్లను సేవంచడం గలన కలిగే ప్రయోజనాలు తెలియచేసారు
మనకి శ్రీమద్ భాగవతం లో నదులు, వనములు,  చెట్లు, మొ. అన్ని విషయాలు తెలియచేసారు..
అసలు భాగవతం ను చాల విశదీకరించి  తెలుసుకుంటే తెలియని విషయం ఉండదు . ప్రతి విషయం మనకి శ్రీమద్ భాగవతం లో ఉంటుంది..

 చెట్లను సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు

మన చుట్టూ ఉంటూ వాటి ఉనికి తో మనకి అన్నివిధాల మేలు చేస్తున్న వృక్షాలు చాలానే ఉన్నాయి. పరిసరాల శుద్ది కోసం, వాతావరణ నైర్మల్యం కోసం, ప్రాణ వాయు సంచారం వల్ల అనేక జీవ కోటి బ్రతకడం కోసం వృక్షాలు చెట్ల యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఫల పుష్పాలతో కూడిన చెట్లతో, కంటికి ఇంపుగా ఆహ్లాదం గా వనాలు ఉన్న చోట దేవతలుఉంటారు, ఇటువంటి ప్రదేశాలు వారికి ప్రీతికరమై కొలువుతీరుతారు. దైవ సంబంధితమైన వృక్షాలను కాపాడుతూ, వాటి ని పూజించడం ద్వారా ఎంతో మేలు జరగడమే కాకుండా, గ్రహాల వలన కలిగే దోషాలు కూడా నివారింపబడతాయి.
ఇప్పుడు చెట్లు ఎవరు నాటుతున్నారు , అపార్ట్మెంట్ వాసులు కదా.. కనీసం దగ్గరలో ఉన్న పార్క్ కి కూడా వెళ్లరు
గురువు గారు చాల సార్లు చెప్తూ ఉంటారు.  కొత్తగా పెళ్లి అయినా వాళ్ళని వేదం వచ్చిన పండితుడు ఎలా దీవిస్తాడు.. నీకు 7 కొడుకులు తో  జీవించు అని .. అది ఒక మహా మంత్రం అనుకోండి ..

అగ్ని హోత్రం నిర్వహించడం కంటే, పుత్రుడిని కనడం కంటే, బాటలో నీడనిచ్చు మహా వృక్షాలను నాటడం పుణ్యకరమని భావిష్యపురాణం ద్వారా తెలుస్తుంది. చెట్లు ఇహలోకం లో పరలోకం లో సుఖానిచ్చే సత్పుత్రుల తో సమానమని, దేవ, నాగ, గంధర్వ, కిన్నెర, రాక్షసులకు నిలయమై రాబోవు పితృదేవతలను తృప్తి  పరుస్తాయని భాగవతం చెప్పబడింది.

చెట్లకు బాధను కలిగిస్తే, అంటే నరకడం, కొట్టడం చేస్తే మహాపాపమని, ముఖ్యం గా మర్రి, రావి, చందనం చెట్లను నరికితే బ్రహ్మహత్య తో సమానమని, మూలాన్ని నరికివేస్తే వంశక్షయమని, చెట్లను కొట్టినవాడు రాబోవు జన్మలో మూగవాడుగా, అనేక శారీరిక, మానసిక రోగగ్రస్తుడిగా పుడతాడని భవిష్యపురాణం ద్వారా తెలుస్తుంది. వృక్షాలను తడపడం, రోగాలు లేకుండా కాపాడడం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విష్ణుధర్మోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది.

నదీ తీరాల్లో వృక్షాలను నాటడం ద్వారా పితృదేవతలకు తృప్తి కలుగుతుందని పద్మపురాణ వచనం. ప్రతి పర్వం లో వాటి ఆకులు పడితే అవి పిత్రుదేవతలకు పిండాలని సృష్టి ఖండం ద్వారా తెలుస్తుంది.

మార్గాల గుండా, దేవాలయాల్లో ను చెట్లను నాటడం వలన కీర్తి లభిస్తుందని చెప్పబడింది.

మఱ్ఱిచెట్టు శివరూపతత్వం అని స్కాందపురాణం ద్వారా తెలుస్తుంది. అందుకే దక్షణా మూర్తి స్వరూపం గా స్వామి వారు మర్రి చెట్టు నీడలో తపస్సు చేసుకుంటారు.

తులసి మొక్క సర్వపాపహరమనీ దీనితో సాటి వచ్చునది ఏది లేకపోవడం వలన దీని పేరు సార్ధకమని, పాపాలకు అగ్నిశిఖ వంటిదని ముక్తిని ప్రసాదిన్చేదని, శ్రీ మహావిష్ణువు భక్తీ నోసంగునదని దేవి భాగవతం లో తులసి యొక్క పవిత్రతను చెప్పబడింది. తులసి మొక్కకి ఎన్నో ఆరోగ్య గుణాలు, దైవిక గుణాలు ఉన్నాయి. ఇంట్లో ఉత్తరం వైపు తులసి చెట్లని ఉంచడం వలన వాస్తురీత్యా ఎంతో ఉపకరిస్తుందని చెప్పవచ్చు.

బిల్వ వృక్షం గురించి ఋగ్వేద, యజుర్వేదాలలో ప్రస్తావన చేయబడింది. శివునికి ఎంతో ప్రీతికరమైన వృక్షం. ఈ చెట్టు కి 365 రోజులు పండ్లు ఉంటాయి. ఈ పండ్లని లక్ష్మి ఫలమని లేక శ్రీ ఫలమని అంటారు.సాక్షాత్తూ లక్ష్మి దేవి కుడి చేతినుంచి జారీ పడిన ఫలం ఈ మారేడు ఫలం.. అందుకే శ్రీ సూక్తం లో కూడా ఈ విషయం చెప్తారు

రావి చెట్టు ప్రకృతి లోని పావన వృక్షాలలో ఒకటైనది. పురాణాలలో రావి చెట్టు యొక్క విశిష్టత గురించి అనేక విధములుగా ప్రస్తావించ బడింది. రావి చెట్టుని విష్ణు స్వరూపం గా పూజిస్తారు. అనేక సందర్భాలలో రావి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది. రావి వృక్షాన్ని అశ్వథ వృక్షమని కూడా అంటారు. రావి చెట్టు మొదట్లో విష్ణువు, బోదేలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వ దేవా సాహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. ఇది మూర్తి దాల్చిన విష్ణు స్వరూపం. మహాత్ములు దీనిని పుణ్య మూలమని సేవిస్తారు. దీనిని ఆశ్రయించడం వలన అభీష్ట సిద్ది కలగడమే గాక, పాప నాశనం కలుగుతుంది.

వాతావరణ కాలుష్యం, రోగకారక కీటకాలను నాశనం చేసే వృక్షం కనుక దీనిని దేవతా వృక్షం గా భావిస్తారు. ధార్మిక విశ్వాసం  గల హిందువులు దీనిని దేవాలయ పరిసరాల్లో నాటుతారు. ఈ వృక్షానికి హాని చేయడం బ్రహ్మ హత్య తో సమానం అని భావిస్తారు. వైజ్ఞానిక పరం గా రావిచెట్టు నిరంతర ప్రాణ వాయువుని వెలువరించే ఏకైక అధ్బుత వృక్షం. దీని సమీపం లో ఉండటం వల్ల ప్రాణ శక్తి వృద్ది చెందుతుంది.

అరటి చెట్టు ని విష్ణు మూర్తి కి ప్రతీకగా చెప్పబడింది. గురు గ్రహ ప్రీతి కొరకు గురువారం రోజున అరటి చెట్టుని పూజిస్తారు. కుజ దోషం ఉన్నవారు ఈ చెట్టు ని పూజించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎన్నో ఉత్తమ కార్యాలకు వీటి ఆకులను పలు సందర్బాలలో వాడుతారు.

మామిడి చెట్టు ని యజ్ఞ యాగాదులలో లోను, ప్రతి శుభకార్యాలలోను వీటిని వాడుతారు. దృష్టి దోషాలు తగలకుండా ఉండడానికి ఈ ఆకులు ఎంతో ఉపకరిస్తాయి. ఇంటి ద్వారానికి వీటి ఆకులని కట్టడం ద్వారా ఇంట్లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. మామిడి చెట్టు ఇంట్లో ఉంటే జ్ఞానం, ప్రశాంతత , మరియు అదృష్టం వృద్ది చెందుతాయని చెప్పబడింది.

వేప చెట్టు లక్ష్మీ స్వరూపం గా చెప్తారు. ఈ చెట్టు ని సాక్షాత్తు అమ్మవారి రూపం గా పూజించి ఆరాదిస్తారు. అధ్బుతమైన ఔషదగుణాలు కలిగిన ఈ వృక్షాన్ని చాలా  ఇళ్ళలో చూడవచ్చు. చర్మ, ఉదర, చిగుళ్ళు వంటి ఎన్నో సమస్యలకు ఉపకరిస్తుంది. ఈ వృక్షం ఇంట్లో ఉండడం ఆరోగ్యం తో పాటు సకల శుభాలు కలుగుతాయి.

అత్తి  చెట్టు ని సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుని ప్రతీకగా చెప్పబడింది. వీటి పండ్లని చాలా  ఔషదాలలో వాడుతారు. ఈ చెట్టు ని పూజించడం వలన కుజ గ్రహం వలన కలిగే సమస్యలు తగ్గుతాయి. గ్రహాల పీడలనుండి ఉపసమనం లభిస్తుంది. ఆర్ధిక సమస్యలు ఉన్న వారు ఈ చెట్టు కింద కూర్చొని ధ్యానించి పూజించడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. అవివాహితులు ఈ చెట్టు ని పూజించడం ద్వారా శీఘ్ర వివాహానికి కి కూడా అవకాశం కలదు.

ఉసిరిగ చెట్టు లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని పూజించటం వలన గ్రహ బాధలు బూత ప్రేతాది బాధలు తొలగుతాయి. శరదృతువు లో ఉసిరి చెట్టుని పూజించి ప్రదక్షిణాలు చేయడం వల్ల  శరీర రుగ్మతలు సమసిపోతాయి. బుద్ది కుశలత వృద్ధి చెందుతుంది. ఉసిరిక చూర్ణం, రసం శరీరానికి లేపనం వేసి స్నానం చేయడం వల్ల శరీర సౌందర్యం కాపాడబడుతుంది. చర్మం కోమలంగా మారుతుంది చలి నుండి రక్షణ కలుగుతుంది. ఈ చెట్టు ని పూజించి దాని కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు ఆ చెట్టు గాలిని పీల్చడం వల్ల పైత్యప్రకోపం శమించి అనేక ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి.

అశోక చెట్టుని నాటడం, పూజించడం వలన సోక నాశనమని తెలుస్తుంది. పురాణాల ఆధారం గా యక్షులు ఈ చెట్టు పైన నివాసం ఉంటారని తెలుస్తుంది. అందువలన ఈ చెట్టు కింద ఏ దైవకార్యం చేసినా వెంటనే మంచి ఫలితాలు కలుగుతాయి. స్త్రీ గర్భ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. కొన్ని రకాల మందుల తయారీ లో  అశోక చెట్టు ఆకులను వినియోగిస్తారు. ఆర్ధిక సమస్యలు, ఆలస్య వివాహ సమస్యలు , కుజ దోషం ఉన్నవారు ఈ చెట్టు ని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి దైవ కార్యాలైనా ఈ చెట్టు కింద చేయడం వలన ఉత్తమ ఫలితాలనిస్తుంది.

ఇలా మనకి ప్రక్రుతి గురించి కూడా శాస్త్రం తెలియపరుస్తోంది..

రుద్రాధ్యాయం లో కూడా ఈ ప్రకృతి గురించి ఉంటుంది నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో.. అని

ఈ రోజు భాగవతం లో గురువు గారు ఈ విషయం ను తెలియచేసారు

ఇట్లు
శివ పరివారం 

Sunday, May 24, 2020

భాగవతం అనే పండు లో అంతా మధుర రసమే

భాగవతం అనే పండు లో అంతా మధుర రసమే
అందులో దశమ స్కంధం ఇంకా మధురం నాకు ఇష్టమైన పండు
పైన చెప్పిన 9 స్కంధాలు ఎవరిని ఆశ్రయం చేసుకున్నాయో అది  దశమస్కంధం
అందులో మొదటి ఐదు అధ్యాయాలు పంచప్రాణాలులా
రాసపంచాధ్యాయి లా ఉంటాయి
రసం అంటే పరమాత్మ అంటాయి 
ముగ్ధ మనోహరమైన వేణుగానం ...మనసా మన్తా శ్రీ కృష్ణమయం
 కృష్ణుడినే నింపుకున్న
గోపికలు వాలే మన శివ పరివారం కూడా తమను తామే మరిచిపోయి అరణ్యంలో
వెడుతున్నారు వాళ్ళకి వెలుగు చూపుతున్నాయి
భాగవతంలో భీష్ముడు అంటారు
కుండలంబుల కాంతి గగనభాగంబెల్లగప్పికొనగ అని
జీవాత్మ పరమాత్మ తో కలవడానికి పడే 
తపన ...ఎంత చెప్పుకుంటే ముచ్చట తీరుతుందని తీరదు...
ఎవరి చెయ్యి పట్టుకుంటే ఇంక ఎవరిని పట్టుకోవలసిన
అవసరం ఉండదో ఆయన మన చెయ్యి పట్టుకున్న యోగులు సిద్ధులు మహా పురుషులే మనకు వ్యాస పీఠం వేసుకుని మన శివ పరివారం కోసం శ్రీమద్భాగవతము ను ప్రతి రోజు మన కోసం తెలియ చేస్తున్న పూజ్య గురువు గారుకి పాదాభివందనం..
నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఆ శ్రీకృష్ణుడే మనకి గురువు గారు ద్వారా తెలియ చేస్తున్నారా అనిపిస్తుంది.

Wednesday, May 20, 2020

.కృష్ణుడు!" అంటేనే శిఖిపింఛమౌళి,

శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః
శ్రీకృష్ణ శరణం మమ

కృష్ణుడు అంటే కాల స్వరూపుడు.కోట్లకొలది విష్ణు నామాలు పలికితే ఎంత పుణ్యమో కృష్ణ అని ఒకసారి పలికితే అంత పుణ్యం.
మంత్రశాస్త్ర నామాల్లో ముఖ్యమైనది శ్రీకృష్ణశరణం మమ నారాయణుని ఆశ్రయించిన వారిని,దేవతల్ని ఆసురులు ఏమి చెయ్యలేకపోయారు ఎలాగో ఈ కృష్ణపరమాత్మ పై ఎవరు ప్రీతి పొందుతారో వారిని ఎవరూ బాధించలేరు.
శ్రీమత్ భాగవత పురాణం స్వయానా మహా మంత్రరాజం. గాయత్రిని అధికరించిన మహా మంత్రం. ఇహ పరాలు రెంటికి అనుసంధానించే కల్పవృక్షం. దీనిలోని ప్రతి ఘట్టం, శీర్షిక, పద్యం ప్రభావవంతమైన మంత్రాలే.
అద్భుత ఫలాలను, ఇహపర శుభాలను అందించేది భాగవత పురాణం. మహామంత్ర రాజం.
ప్రతి ఘట్టం, ప్రతి పద్యం మహా ఫలప్రదాయి అయిన మహా మంత్రపూరితమే,
వీటిలో ఏర్చి కూర్చిన కొన్ని మంత్రాలూ ఏర్పరిచారు
ఉదాహరణ కు మీకోసం కొన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను
శ్రీమద్ భాగవతము ఒక కల్ప వృక్షంలా, అమృతంలా, గాయత్రీ మంత్రంలా ఇహ పర సర్వ శ్రేయస్సులు అందిస్తుంది.
అందులోనే అజామిళోపాఖ్యానం ను ఏకాగ్రచిత్తంతో పారాయణ చేసినవారికి మోక్షం బహు సుగమమం అవుతుంది.
అదే కూర్మావతార కథ చదవడం లో కష్టాల కడలిలో మునిగిపోయే వారిని కూడా పైకెత్తి విజయాలను అందించే అమృత ప్రాయం. విశేషమైన సుఖసంతోషాలను కలుగజేస్తుంది
ఇక ధ్రువ చరిత్ర వింటే చాలు క్లేశ నాశనం, మంచి భక్తి, శీలం, తేజస్సు, మానసిక శక్తి, తత్వజ్ఞానం దొరుకుతాయి, వినిపించేవానికి దైవానుగ్రహం లభిస్తుంది.
మాస్టర్ ప్రహ్లాద చరిత్ర ఒక దివ్యమంగళ విగ్రహం కలవాడై నిత్య భయరహిత లోకాన్ని పొందుతాడు.
మనకి తరచూ గురువు గారు నారాయణ కవచం ను చదువు తారు పూజ అనంతరం ఎందుకంటే తిరుగులేని శత్రు నాశని, శత్రు భయ నివారిణి, సిద్ధ విజయ కారిణి అని తెలియచేసారు
ఇక పయోభక్షణవ్రతం అనేది అద్భుతమైన సంతానం అనుగ్రహించే తిరుగులేని వ్రతం.
మత్యావతారం కథ @ మోక్షాన్నిసుగమం చేస్తుంది; కోరికలు సత్యంగా నెరవేరతాయి.
రుక్మిణీ కల్యాణం చేయడం వలన వివాహాది శుభకార్యాలు ఆలస్యం కాకుండా శీఘ్రమే జరిగేలా చూస్తుంది. కల్యాణ ప్రదాయిని. వామనావతారం వలన అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది; ఇంద్రభోగాలు ఇచ్చి, గొప్ప భాగ్యవంతుని చేస్తుంది; దివ్యసుఖాలను సమకూరుస్తుంది.విదుర-మైత్రేయ సంవాదం విస్తృతమైన కీర్తులను సమకూరుస్తుంది.

ఇలా శ్రీమద్ భగవతమ్ లో బోలెడు విష్ణు కధలు, వ్రతాలూ, శ్రీకృష్ణకథారసం మొ.. అన్ని మనకి ఉంటాయి అని గురువు గారు చెప్పారు

ఆ స్వామి చరణ కమలాలను వర్ణించగలమా .. ...
!"..కృష్ణుడు!" అంటేనే శిఖిపింఛమౌళి,! కస్తూరీ తిలకం, !కంఠంలో ప్రకాశించే కౌస్తుభమణి,! మెడలో వైజయంతి మాల,!చెవులకు మణి కర్ణికా కుండాలాలు!,తళుక్కుమని మెరిసే నాసికాగ్ర నవ మౌక్తికం,! పద్మదళాలను తలపించే ,కారుణ్యాన్ని కురిపించే విశాల నేత్రాలు,!పసిడికాంతులను విరజిమ్మే నునుపైన కపొలాలు,!శంఖం లాంటి సన్నని మెడ,, !భుజాలనుండి వ్రేలాడే నవరత్న మణి గణ భూషిత వజ్ర వైడూర్య మరకత ఇంద్రనీల మణుల స్వర్ణభూషణాల ఆభరణాలతో శోభిల్లే "నీలమేఘ శ్యాముని, సచ్చిదానంద ఘన శ్యామసుందరరూప లావణ్య వైభవాన్ని ఎవరికయినా కూడా "వర్ణింప తరమా..? "నారింజరంగు జరీవస్త్రంతో ,ధగధగా మెరిసే బంగారు వడ్డాణంతో ,పట్టు పీతాంబరదారియై, చేతులకు ముంజేతి స్వర్ణ, కంకణాలతో, అరవిందాలను మరపించే కృష్ణయ్య చరణ కమలాల సొగసును ,ద్విగుణీకృతం చేస్తున్న ముత్యాలు రత్నాలు పొదిగిన స్వర్ణమంజీరాలు....! అరుణారుణ కాంతులను ,కోటిసూర్యసమ ప్రభలను వేదజల్లుతూ భక్తుల ఆర్తిని తీర్చే ,ఒకచేత అభయ హస్తము, మరోచేతిలో విశ్వంలోని సకల భువన బ్రహ్మాన్దాలను,ప్రకృతికాంతను , తన అద్భుతమైన దివ్య సుస్వర నాదంతో సమ్మోహనపరచే వేణువు ను ధరించిన... "జగన్మోహనాకారం "తో శ్రీకృష్ణుని దివ్యదర్శన సౌలభ్య మహా భాగ్య సౌభాగ్యం సామాన్యులకు అంత సులభంగా లభిస్తుందా ?
కమనీయము ,కడు రమణీయము ,నయన మనోహరము అయిన ఆ జగన్మోహనాకారుని సుందర రూపాన్ని దర్శిస్తే ,స్మరిస్తే ,పూజిస్తే భావిస్తే చాలు , మనసు ఉప్పొంగి ,తనువు పులకించి , హృదయం ద్రవించి ,స్రవించే ఆ ఆనందము ఎలా చెప్పగలము . అది అనుభవిస్తేనే తెలుస్తుంది
మన శివ పరివారం అదృష్టం , మనకి ఆ పరమేశ్వర స్వరూపం అయినా పూజ్య గురువు గారు ఆ వ్యాస పీఠం మీద కూర్చుని మన అందరికీ శ్రీకృష్ణ దర్సనం ను మానసికం గా ఎలా చెయ్యాలో చూపించారు . ధన్యోసి ..
ఇట్లు
శివ పరివారం

Monday, May 18, 2020

భాగవతం లో పవిత్ర నదులు

భాగవతం లో  పవిత్ర నదులు

చంద్రవశా తామ్రపర్ణీ అవటోదా కృతమాలా వైహాయసీ కావేరీ వేణీ పయస్వినీ శర్కరావర్తా తుంగభద్రా కృష్ణా వేణ్యా భీమరథీ గోదావరీ నిర్వింధ్యా పయోష్ణీ తాపీ రేవా సురసా నర్మదా చర్మణ్వాతీ సింధురంధః శోణశ్చ నదౌ మహానదీ వేదస్మృతిరృషికుల్యా త్రిసామా కౌశికీ మందాకినీ యమునా సరస్వతీ దృషద్వతీ గోమతీ సరయూరోధస్వతీ సప్తవతీ సుషోమా శతద్రూశ్చంద్రభాగా మరుద్వృధా వితస్తా అసిక్నీ విశ్వేతి మహానద్యః.

Tuesday, May 12, 2020

కేయూరాణి న భూషయన్తి


*నరసింహ సుభాషితం - కేయూరాణి న భూషయన్తి*

*శ్లోకం:*

*केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला*  
*न स्रानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः* I
*वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते*
*क्षीयन्तेखिल भूषणानि सततं वाग्भूषणं भूषणम्* II

भर्तृहरि नीतिशतकम्  ।

*శ్లోకం:*

*కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా*
*న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః* ।
*వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే*
*క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్* ॥

భర్తృహరి నీతిశతకం

పై శ్లోకములోని నాలుగవ పాదానికి పాఠాంతరం:

*క్షీయన్తే ఖలు భూషణాని, సతతం, వాగ్భూషణం భూషణం*

*పద విభాగం:*
 
కేయూరాణి, న భూషయన్తి, పురుషం, హారాః, న, చన్ద్రోజ్జ్వలాః, న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలఙ్కృతాః, మూర్ధజాః, వాణీ, ఏకా, సమలఙ్కరోతి, పురుషం, యా సంస్కృతా, ధార్యతే,
క్షీయన్తే, అఖిల భూషణాని, సతతం, వాగ్భూషణం, భూషణమ్.

*ప్రతిపదార్థం:*
 
కేయూరాణి = భుజ కీర్తులు లేదా దండ కడియాలు, న భూషయన్తి = అలంకరింపవు, పురుషం = పురుషుని, హారాః = ముత్యాల హారములు, న = న భూషయంతి = అలంకరింప బడవు, చన్ద్రోజ్జ్వలాః = చంద్రును వలె ప్రకాశించునటువంటి, న స్నానం = పన్నీటి జలకాలు అలంకరింపవు, న విలేపనం = పచ్చ కర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, మంచి గంధము మొదలగు సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన మైపూత అలంకరింపవు, న కుసుమం = పూవులు ధరించుట అలంకరింపదు, నాలఙ్కృతాః = అలంకరణలని ఈయజాలదు, మూర్ధజాః = వివిధ రకాల కేశాలంకరణలు,  

వాణీ = ఏ వాక్కు, (సా = ఆ వాణి) ఏకా = ఒక్కటియే, సమలఙ్కరోతి = సరిగా అలంకరించునది, పురుషం = పురుషుని, యా సంస్కృతా = వ్యాకరణాది శాస్త్రములచే సంస్కరింప బడినటువంటి, ధార్యతే = ధరింపబడుచున్నదో, క్షీయన్తే = కాలక్రమేణా నశించును,  అఖిల భూషణాని = మిగిలిన అఖిలములైన భూషణాలు, సతతం = ఎల్లప్పుడూ, వాగ్భూషణం = వాక్కు అనే ఆభరణము, భూషణమ్ = నిజమైన ఆభరణము. ఖలు = కదా!

*Meaning:*

The armlets on the upper arms are not the ones that adorn a man. Nor the necklaces and moon white colored pearls adorn a man. The luxurious baths, the expensive fragrantly body lotions, the garlands with beautiful flowers and the fashionable hair styles are not the ones that really adorn a man.  The pleasant, crisp and grammatically error free language of speech, the “Vaakku” that comes only with a good educational background is only the real jewelry that adorns a man.  
All other conventional jewelry gets spent out, whereas the good speech is only the real jewelry.      

*తాత్పర్యం:*

వాక్కు అనగా విద్య. ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యాన్ని, దాని విలువని ప్రస్ఫుటముగా తెలియజెప్పే భర్తృహరి నీతిశతకములోని చక్కటి సుభాషితము.  

భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు.  
చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశిచునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాలా కేశాలంకరణలూ పురుషునికి నిజమైన అలంకరణలు కా జాలవు.

వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన  అలంకారప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము.

భర్తృహరి యొక్క సుభాషితములలోని  నీతి శతకములో *వాక్కు* యొక్క ప్రాసస్థ్యాన్ని తెలియపరచే   తలమానికమైనట్టి ఈ సుభాషితమునకు, ఏనుగు లక్ష్మణ కవి యొక్క అంతటి దీటైన తెలుగు సేత ఈ క్రింది పద్యము.

ఉ.
*భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్*,
*భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్ *
*భూషలుగావు, పూరుషుని భూషితుజేయు పవిత్ర వాణి, వా*
*గ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశియించునన్నియున్* 

All India Radio ఆకాశ వాణి సంస్క్రుత భాషాధ్యయన కార్యక్రమములో గత 40 సంవత్సరాలకి పైగా ఆ కార్యక్రమము ఈ శ్లోకముతోనే ఆరంభమగుట ఈ శ్లోకము యొక్క విశిష్టతని తెలియ జేస్తోంది.  ఇది చాలామందికి సుపరిచితమైన సుభాషితము.  పురుషునకు విద్యయే ఆభరణము కాని వేరు కాదు అని సుస్పష్ఠము.

Monday, May 11, 2020

గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొన్నది ఎవ్వరు .?

ప్రశ్న..... గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొన్నది ఎవ్వరు .?
జవాబు.....న్యూటన్...(నిజంగా ఇది నిజమేనా)

గురుత్వాకర్షణ సిద్ధాంతం తెలుసుకోవడంలో భారతదేశంలో ఏమైనా అధరాలు ఉన్నాయా .? ఐతే ఇది చదవండి మీ అనుమానం తొలగిపోతుంది.

గురుత్వాకర్షణ సిద్ధాంతం ( Law of Gravitation) కనుగొన్నది న్యుటనా!? ఇది పూర్తిగా అసత్యం ఎందుకంటే ప్రాచీన భారతీయ గ్రంధాల నిండా గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి ప్రస్తావించబడి వుంది. 

1) “సూర్య సిద్దాంత” మనే ప్రాచీన గ్రంధంలో ఇలా చెప్పబడింది. “ధారణాత్మక శక్తి కారణంగా భూమి ఆకాశంలో పడిపోకుండా నిలబడుతున్నది 
(సూ.సి. 12 అ – 32 శ్లోII)
శ్లో II మధ్యే సమన్తదన్నస్య భూగోళో వ్యోమ్ని తిష్టతిI
_బీభ్రాణః పరమాం శక్తిం బ్రాహ్మణో ధారణాత్మికామ్II

2) వరాహమిహురుడు (క్రీ.శ. 505) తన “పంచ సిద్ధాంతి” అనే గ్రంధంలో గురుత్వాకర్షణ శక్తి గురించి – “భుతలంలోని ఏ భాగంలో అయిన .. అన్ని జ్వాలలు పైకేగుస్తాయి.. పైకి వేసిన వస్తువు కింద పడుతుంది. ఈ అనుభవం అందరికి తెలిసినదే. సమానమైనదే” అని అంటాడు. (పం.సి. 13 అ – శ్లోII) 
శ్లోII గగనము పైతి శిభిశిఖ క్షిప్తమపి క్షితముపితి గురు కించిత్I
_యధ్వదిహ మానవానాం అసురానం తద్వాదేవాజ్ఘః II

3) “లీలావతి” అనే గ్రంధంలో “భువనకోశం” అనే సర్గలో భాస్కరాచార్యుడు (క్రీ.శ. 1114) తన పుత్రిక లీలావతికి “భూమి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది. ఖగోళంలో గ్రహాల పరస్పర ఆకర్షణ శక్తి వల్లా అవి అక్కడ తమకు తామే ఆధారభూతమై నిలిచి ఉన్నాయని” చక్కగా వివరించారు
.
4) “సిద్దాంత శిరోమణి” (భాస్కరాచారుడు) అనే గ్రంధంలో “భువనకోశం” అనే అధ్యాయంలో 6వ శ్లోకంలో గురుత్వాకర్షణ శక్తి గురించి చాలా చక్కగా వివరించారు. 
శ్లోII ఆకృష్టిశక్తిశ్చ మహితయా యత్ స్వస్థం/గురు స్వాభిముఖం స్వశక్త్యా 
_ఆకృష్యతే తత్పతతీవభాతి/సమే సమన్తాత్ క్వ పతత్వియం ఖేII 
భూమి ఆకాశంలో ఉన్న వస్తువులను సహజంగా, స్వశక్తితో .. తన వైపునకు ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ వలన అన్ని వస్తువులు భూమిమీద పడతాయి. ఆకాశంలోని వివిధ గ్రహాల మధ్య సమాన ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు అవి ఎక్కడ పడతాయి.

5) బ్రహ్మగుప్తుడు (క్రీ.శ. 591) రచించిన “బ్రహ్మాస్పుఠ సిద్ధాంతం” లో “వస్తువులు భూమి వైపు ఆకర్షింప బడతాయి. నీటికి ఎలా సహజ ప్రవాహశక్తి ఉన్నదో, అలా భూమికి సహజమైన ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పారు.

6) జగద్గురువు అదిశంకరుల వారు వారి “ప్రశ్నోపనిషత్” భాష్యంలో “అపాన” శక్తి గురించి రాస్తూ .. “ఒక వస్తువును పైకి ఎగురవేస్తే దానిని ఎట్లు భూమి ఆకర్షిస్తుందో ... అటులనే పైకి లాగబడే “ప్రాణ” శక్తిని “అపాన” శక్తి కిందకు కిందకు లాగుతుంది. 
(3-8 శ్లోII) అని చెప్పారు. 
శ్లోII తధా పృధివ్యామభిమానినీ యా దేవతా ప్రసిద్ధా సైషా 
_పురుషస్య అపానవృత్తిమవష్టభ్యాకృష్య వశీకృత్యాధ ఏవ
అపకర్షేణ హి శరీరం గురుత్వాత్ పతేత్ సావకాశే వోద్గాచ్చేత్II” 

ఆ తరవాతి భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల గ్రంధాలలో కూడా “గురుత్వాకర్షణ” సిద్ధాంతం వివరింపబడి ఉంది. న్యూటను కంటే ఎన్నో వేల, వందల సంవత్సరాల పూర్వమే “గురుత్వాకర్షణ” గురించి భారతీయ విజ్ఞానం ఘోషించింది.

ఇంతటి విశిష్టమైన భారతీయ గొప్పతనాన్ని “జన విజ్ఞాన” సంఘం అంటూ చైనా శక్తులు భారతీయ విద్య విధానం ఒక బూటకం అంటూ నిందలు వేస్తున్న తీరు చూస్తుంటే “సొంత తల్లి ప్రేమని హరికల క్రింద పెట్టి సవతి తల్లి దొంగ ప్రేమను ప్రపంచానికి చెప్తునట్లు ఉంది” ఏది ఏమైనా గురుత్వాకర్షణ శక్తి కోసం కొన్నిటినే ఇక్కడ చెప్పా గలిగాము . వాస్తవానికి “వేదాల"లో చాల చోట్ల గురుత్వాకర్షణ శక్తి కోసం వివరించి చెప్పడం జరిగింది. ఇది భారతీయులు సాధించిన విజయం.. 

మన పూర్వ గ్రంధాలను దోచుకువెళ్ళి ఆ గ్రంధాలపై విశ్లేషణ జరిపి విదేశాలలో చాల మంది మేమే గురుత్వాకర్షణ శక్తి కోసం వెతికి కనిపెట్టి వివరించాము అని చెప్పుకోవడం హాస్యాస్పదం .. 

భారతదేశంలో పుట్టినందుకు గర్వించు భారతీయునిగా జీవిస్తునందుకు ఆనందపడండి .
భారతీయులు చేసిన ఘనతను చెప్పుకోవడానికి ఇంకెంత కాలం దూరంగా ఉంటాము .? ఈసారి ఎవ్వరైనా గురుత్వాకర్షణ శక్తి కోసం అడిగితే గర్వగా చెప్పండి

 "“సూర్య సిద్దాంత” “పంచ సిద్ధాంతి” “లీలావతి” “సిద్దాంత శిరోమణి” “బ్రహ్మాస్పుఠ సిద్ధాంతం” “ప్రశ్నోపనిషత్” మా పూర్వికులు ఆ గురుత్వాకర్షణ శక్తి కోసం సరైన విశ్లేషhణ ఇచ్చారు .. 

అంతకు మించిన సమాచారం ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు నేటికి ఇవ్వలేక పోయారు అని ...


https://www.manchester.ac.uk/discover/news/indians-predated-newton-discovery-by-250-years/
మాంచెస్టర్ యునివర్సిటీ (ఇంగ్లాండ్ లో ఉంది) వాళ్లే చెప్పారు.. న్యుటన్ చెప్పిన సూత్రాలు భారతదేశం నుంచి దొంగలించినవి అని....