ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ
మనకి నిత్యం జరిగే భాగవతం లో మనకి తెలియని ఎన్నో విశేషాలు మన పూజ్య గురువు గారు ద్వారా తెలుసుకుంటున్నాము . ఇలాంటి మంచి విషయాలు మన పూజ్య గురువు గారు తెలియచేసినందు వారికీ పాదాభివందనం
అష్టసిద్ధులు అనగా ఎనిమిది రకాల సిధ్దులు. భారతీయ తత్వ శాస్త్రంలో "సిద్ధి" అన్నమాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం.
మనకి సిద్దించే శక్తులు లో ఒకటి శ్రీమద్ భాగవతం ఒకటి .
(అ.) విధము (ఆ.) విధము
1. మహాపద్మము,
2. పద్మము
3. శంఖము
4. మకరము
5. కచ్ఛపము
6. ముకుందము
7. కుందము
8. నీలము
9. ఖర్వము
1. కాళము
2. మహాకాళము
3. పాండుకము
4. మాణవకము
5. నైసర్పము
6. సర్వరత్నము
7. శంఖము
8. పద్మము
9. పింగళము.
నవ-నిధులు : ఇవి కుబేరుని నవనిధులు
మనకి మణిద్వీప వర్ణనలో అమ్మవారి దగ్గర ఒక శ్లోకం లో చెప్పుకుంటాము అవి అష్టసిద్ధులు నవ
నవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టి కర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
అలాగే అమ్మవారి ఖడ్గమాలా లో కూడా ఒక వర్ణన చేస్తారు
అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః
మార్కండేయ పురాణములో అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశీత్వం అని సిద్ధులు అష్టవిధములుగా పేర్కొనబడినవి. బ్రహ్మ వైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మ ఖండమునందు సిద్ధులు గురించి మరింత వివరం తెలుపబడినది .
చివరిగా హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు, వినాయకుడు లకు అష్టసిద్ధులుండేవి. వీరిరువురికీ అష్టసిద్ధుల మీద పూర్తి సాధికారత ఉందనీ, వీరిన పూజించిన భక్తులకు ఆయా సిద్ధులను అతి సులభంగా అనుగ్రహించగలరనీ ఓ నమ్మకం. అందుకనే హనుమంతుని ‘అష్టసిద్ధి నవవిధికే దాతా’ అంటాడు తులసీదాసు తన హనుమాన్ చాలీసాలో. ఇక వినాయకుని భార్య సిద్ధి అన్నది కేవలం ఒక పేరు మాత్రమే కాదు. ఆమె అష్టసిద్ధులకు ప్రతిరూపం
ఇట్లు
శివ పరివారం
No comments:
Post a Comment