Monday, April 27, 2020

అక్షయ తదియ

మనకి గురువు గారు తరచూ చెప్తూ ఉంటారు నాలుగు రాత్రులు గురించి. అవి ఏమిటంటే  కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి , దారుణ రాత్రి గురించి.. రాత్రి శబ్ద వివరణ జగన్మాత రాత్రి రూపిణి. పరమేశ్వరుడు పగలు  అని , అందులో దారుణ రాత్రి అంటే అక్షయ తదియ నాటి రాత్రి ని దారుణ రాత్రి అంటారు.. మనకి వివిధ సందర్భాలు లో గురువు గారు అక్షయ తదియ గురించి చాల విశదీకరించారు.. ఒక రకం గా చెప్పాలంటే అలంటి రోజు కోసం ఆధ్యాత్మిక వ్యక్తులు , ఉపాసకులు వేచి చూస్తారు. ఒక్క నిమిషం కూడా వృధా చెయ్యరు.. ఎదుకంటే అక్షయ తదియ నాడు మనం ఏదైతే ఉపాసన / మంత్రం లేదా పుణ్య కార్యం చేసుకుంటే అది అక్షయం అవుతుంది.. (నో లిమిట్)..అక్షయం అంటే క్షయం లేకుండా ఉండాలని అర్థం..

అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. మన అదృష్టవ శాత్తు ఇప్పుడు బంగారం షాప్స్ మూసి వేయ బడినవి ..


 అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తిథి అని అర్థం. , అక్షయ తృతీయ అనగా ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి వివరించారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే వ్రతం, జపం,హోమం, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుందని చెపుతాడు. అక్షయ తృతీయ నాడు చేసేటువంటి దానాలు మంచి ఫలితాలనిస్తాయి. దానం చేయమని పురాణాలు చెపుతుండగా బంగారం కొనడం అనేటువంటివి తప్పు అని భాగవతం తెలియచేస్తోంది.. ఎందుకంటే మనం మొన్నటి వరకు నేర్చుకున్నాము కదా బంగారం లో కలి  ప్రవేశిస్తాడు అని..

అయితే ఈ మాసం లో చేసే దానం కూడా కొన్ని చెయ్యాలి అని చెప్పింది.. ఉదక  దానం, గొడుగు, చెప్పులు , మొ..  ఎందుకంటే వైశాఖ మాసం అనగానే ఎండలు విపరీతం గా ఉంటాయి కదా.. ఇవి దానం ఇస్తే తీసుకునే వారికీ ఉపయోగం అవుతాయి..దానాలను వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. అంటే వేసవి తాపాన్ని తగ్గించే విసనకర్ర, గొడుగు, పాదరక్షలతో పాటు దశ దానాలు కూడాశక్తి కొలది చేయవచ్చు

మనకి శాస్త్రం లో మానసిక ము గా కూడా దానం ఇవ్వచ్చు.. దానికి ఖర్చు లేదుగా .. మనసుకు కుదుట పరచుకుని వాళ్ళని మన ఎదురుగ కూర్చోపెట్టుకుని వాళ్ళకి గోదానం, సువర్ణ దానం, పట్టు పీతాంబరం లు మొ. ఇచ్చినట్టు గా అనుకోవచ్చు.. నేను ఎక్కువగా మానసిక దానం ఇస్తాను.. ఉదాహరణ కి నేను మొన్న మానసికం గా అగస్య మహా ముని ని, లోపాముద్ర అమ్మవారి ని మా ఇంటికి పిలిచి వారికీ దానం ఇచ్చినట్టు గా భావించాను.. ఒకరోజు నా మా అక్కయ్య కి సువర్ణ , మరియు పట్టు వస్త్రాలు ఇచ్చినట్టు గా మానసికం గా దానం ఇచ్చాను.. .ఈ రోజు పితృ తర్పణం,దానం ఇస్తే గ్రహ దోషాలు, పూర్వ కర్మ ఫలితాల తొలగిపోతాయి అని శాస్త్ర  వచనం

ఇక మన శివ పరివారం కు చాల మంది కి చండీ పారాయణ తెలిసినదే కదా.. చండీ పారాయణ లేని వాళ్ళు రుద్ర పారాయణ , స్వామి వారికీ అభిషేకం యోగ నరసింహ మాత్రం లేదా గురువు గారు చెప్పిన మాత్రం జపించుకోవచ్చు..

శ్రీ వైద్య నాధాయ నమః శివాయ , ఎందుకంటే ఈశ్వరుడే ప్రధమ వైద్యుడు కాబట్టి.. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ను దృష్ట్యా మనం పరమేశ్వర శరణాగతి ని వేడుకోవలసినదే..


కాబట్టి ఈ అక్షయ తదియ చాల ముఖ్యమైన రోజు.. కావున మన శివ పరివారం అందరం తప్పనిసరిగా వినియోగించుకోవాలని సాధ్యమైనంత వరకు మౌనం గా ఉంది మనసులోనే మన కి ఇష్టమైన దేవతా ఆరాధన చేసుకోవాలి  అని గురువు గారు తెలియచేయడం జరిగినది..

ఇట్లు
శివ పరివారం

Saturday, April 25, 2020

వరాహ జయంతి శుభాకాంక్షలు

ప్రియమైన శివ పరివారం కు వరాహ జయంతి శుభాకాంక్షలు


శ్రీ మహావిష్ణువు ధర్మ పరిరక్షణ మరియు దుష్టశిక్షణల నిమిత్తమై యుగయుగాల్లో ఎన్నో అవతారాలు ధరించాడు. వీటిలో దశావతారాలు ప్రముఖమైనవి. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము.

శ్వేతవరాహ కల్పములో శ్రీ మహావిష్ణువు రెండు మార్లు వరాహ అవతారం ధరించాడు. మొదటిదైన స్వాయంభువ మన్వంతరములో ఒకసారి మరియు ఆరవదైన చాక్షుష మన్వంతరములో మరొకసారి ఈ అవతారమును ధరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మనము ఇదే కల్పములో ఏడవదైన వైవస్వత మన్వంతరములో నాలుగవదైన కలియుగంలో వసిస్తున్నాము.


వరాహ రూపం ధరించిన మహా విష్ణువు తన కోరల మీద భూమిని పైకి ఎత్తి, ఆ స్థితిలో భూమిని స్థిరంగా ఉంచడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరచి, వాటి తొండముల మీద భూమిని ప్రతిష్ఠించాడు. అప్పటినుంచి ఆ అష్ట దిగ్గజాలే భూమి గతి తప్పకుండా కాపాడుతున్నాయి.

స్వాయంభువ మన్వంతరములో అవతరించిన ఈ వరాహ అవతారాన్ని యజ్ఞ వరాహరూపంగా భావిస్తారు. ఈ యజ్ఞ వరాహ జయంతిని చైత్ర బహుళ త్రయోదశినాడు జరుపుకుంటారు


వరాహ రూపంలో ఉన్న విష్ణు దేవుడికి  ప్రత్యేకమైన ఆలయాలు లేవు. ఆ తరవాతి అవతారమైన నరసింహావతారంతో కలిసి సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామిగా పూజలందుకొంటున్నాడు.

వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా,
శశిని కళంకకలేవ నిమగ్నా,
కేశవ ధృతసూకరరూప జయ జగదీశ హరే||

కుంగిపోయిన భూమిని తన నాసికపై చంద్రుని నెలవంక వలె నిలిపి కాపాడిన వరాహావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము  – ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా అలాంటిదే.. కాకపోతే మనకి అర్ధం కావడానికి కొంత సమయం పడుతుంది..
సృష్టిలో ప్రతి ప్రాణికీ ఒక్కొక్క ప్రత్యేక లక్షణం, శక్తి ఉంటాయి. అందువల్ల ఆ లక్షణాలుగల జీవి కొన్ని విషయాల్లో అత్యంత బలసమన్వితమై ఉంటుంది. ఆ కారణంగానే స్థితికారకుడైన విష్ణువు దుష్టశిక్షణ చేయవలసివచ్చినప్పుడు స్వస్వరూపంతో కాకుండా ఆయా ప్రాణుల రూపాల్లోనే అవతారం దాల్చాడంటారు. వాటిలో ఒకటి వరాహావతారం.

ఇప్పుడు ఉన్న పరిస్థితి లో మనకి  శ్రీ మహావిష్ణువే ఈ జగత్తును కాపాడుతున్నాడు అనడం లో  సందేహం లేదు.  , అందుకే మన అందరినీ ఇళ్లలో లోనే  ఉండే జాగ్రత్తగా ఉండి  ఆ పరమేశ్వర ప్రార్ధన  చేసుకోమని  చక్కటి అవకాశం ఇచ్చారు..
మన కోసం మన పూజ్య గురువు గారు ఈ సందర్భం లో మనకి శ్రీమద్ భాగవతం మనకి తెలియపరుస్తున్నారు అంటే అంత ఆ పరమేశ్వర సంకల్పం.. ఒక్క మాటలో చెప్పాలంటే అంతటా "రామ కృష్ణ" గోవిందా నారాయణా ..

ఇటువంటి సమయమలో ఈ వరహ మూర్తి కధను మనం గుర్తుపెట్టుకుని మన భూమిని, సహజవనరులను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఇట్లు
శివ పరివారం

రక్షాకవచం

రక్షాకవచం - ఇలా చేసిన వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఏవిధంగా జీవిస్తే మనం అన్నివిధాలా బాగుంటామో అటువంటి జీవనవిధానం పేరే సనాతనధర్మం. ఇందులో సదాచారం చాలా ముఖ్యం అని చెప్పబడుతోంది.
బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేవడం, ప్రతివారూ ఏదో ఒక యోగాభ్యాసం చేయడం, ధ్యానం చేయడం, ముఖ్యంగా చెప్పారు.
నిత్య యోగాభ్యాసం కలిగినటువంటి వారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మందులు కూడా లేని జబ్బులు రాకుండా ఉండాలన్నా, వచ్చినవి వెంటనే తొలగిపోవాలన్నా ముఖం రోగనిరోధకశక్తి. అది పెంచగలిగిన విధానం సనాతనధర్మంలో కనబడుతోంది.
కేవలం ఉచ్ఛ్వాసనిశ్వాసలు తీసి వదలడమే యోగం కాదు.
యోగజీవనం ఒక్కటే రోగనిరోధకశక్తికి మార్గం.
సూర్యనమస్కారాలు చేయడం, ప్రాణాయామం(అనులోమ, విలోమ),
ఊరికే exercise లాగా యోగా చేయడం కాదు, యోగం యోగవిద్య కావాలంటే అది భగవదారాధనతో ముడిపడాలి. ఏరోబిక్ exerciseల లాగా యోగం చేస్తాము అంటే యోగానికి ఉన్న ప్రాణశక్తి తీసేసినట్లే.
ఆసనాలు వేయడం, ప్రాణాయామాలు రాజయోగం అయితే మంత్రయోగం మరొకటి ఉంది.
రాజయోగం, మంత్రయోగం, హఠయోగం, నాదయోగం, లయయోగం అని అయిదురకాల యోగములున్నాయి.

ఇంటివంట వంటికి మంచిది. వర్కింగ్ డేస్ లో క్యాంటీన్లో తిని, వీకెండ్ లలో హోటల్ కి వెళ్ళిపోదాం అనే పరిస్థితులలో చాలా గృహాలున్నాయి. భార్యాభర్తలు ఉభయులూ కష్టపడుతున్న కుటుంబాలలో ఇది మామూలు. కానీ ఇంటివంట వండుకోవడం – అది కూడా శుచిగా సాత్త్వికమైన ఆహారం వండుకొని భగవంతునికి నివేదించి అన్న పదార్థాన్ని ప్రసాదంగా మార్చుకొని సకాలంలో సాత్త్విక భోజనం చేయగలిగితే అది రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అనారోగ్యాలను తొలగిస్తుంది.

ధార్మికమైన ప్రవృత్తి కలిగి ఉండాలి. ఏ ఒక్కరినీ హింసించకుండా ఉండగలగడం అలవాటు చేసుకోవాలి. హింస ఎప్పుడూ ధర్మం కాదు. పదిమందినీ నశింపజేస్తాను, నా ధర్మం కాపాడుకోవడం కోసం ఇతర ధర్మాలను నాశనం చేస్తాను అని బయలుదేరినది ధర్మమే కాదు. ఇటువంటి మతాలు తీవ్రవాదాలై, ఉన్మాదాలై ప్రపంచాన్ని ప్రమాదభరితం చేస్తాయి.
సత్యం, అహింస, శుచి, అక్రమార్జన లేకుండా ఉండడం – ఇవే ప్రధానంగా ధర్మభాగాలు. సాత్త్వికమైన ప్రవృత్తి అలవరచుకోవాలి.

క్రోధము, భయము వంటి తామస ప్రవృత్తులనుంచి దూరంగా ఉండాలి. ప్రతివారికీ అనుకున్నది జరుగకపోతే కోపం వచ్చేస్తుంది. నిగ్రహం అనేది అలవాటు చేసుకోవాలి.
యోగాభ్యాసం, సరియైన భోజనం ఉంటే క్రోధం కూడా జయించవచ్చు. క్రోధాన్ని నిగ్రహించుకుంటే ఆయుష్షు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానసికమైన ఉద్రేకాలు, ఉద్వేగాలు నిగ్రహించుకోవాలి. మానవసహజంగా వస్తాయి కోపాలు. సంస్కారంతో, వివేకంతో నిగ్రహించుకోవడం అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా క్రోధాది రుగ్మతలు పోతాయి.
సత్ప్రవర్తన కలవాడు, భగవంతుని ఆశ్రయించిన వాడిని బాధించే శక్తి ఏదీ ప్రపంచంలో లేదు. ధర్మము, దైవము – ఈ రెండూ రక్షిస్తాయి. ధర్మాన్ని ఆచరించాలి, దైవాన్ని ఆశ్రయించాలి.
యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు! యుక్తస్వప్నావ బోధస్య యోగీ భవతు దుర్గః!! (భగవద్గీత – కృష్ణపరమాత్మ)

నిత్యం భోజనం చేస్తున్నప్పటికీ అనారోగ్యాలు వచ్చినప్పుడు పథ్యం పుచ్చుకుంటాం, కొన్ని విడిచిపెడతాం, ఔషధతుల్య పదార్థాలు స్వీకరిస్తాం. అదేవిధంగా వ్యక్తికీ, సమాజానికీ, ప్రకృతికీ వైపరీత్యాలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా ఉపాసన పెంచుకోవాలి. ఇంట్లో ఉన్న సమయాన్ని వ్యర్థ కాలక్షేపాలతో కాకుండా భగవన్నామస్మరణ, స్తోత్రాదులు చేసుకోవాలి.

దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతోఖిలస్య!
ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం తమీశ్వరీ దేవి చరాచరస్య!!

ఎప్పుడైనా మన కోరిక ప్రపంచానికి ఉపకరించేది కావాలి. అపకారం కలిగించేది కాకూడదు. జగత్తుకు ఉపకారమైన కోరిక కోరుకుంటే భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు.
దేవి ప్రసీద పరిపాలయ నోరిభీతేర్నిత్యం యథాసురవధాదధునైవ సద్యః!
పాపాని సర్వజగతాం ప్రశమం నయాశు ఉత్పాతపాక జనితాంశ్చ మహోపసర్గాన్!!(చండీసప్తశతి)
ఈ శ్లోకం విశేషించి జపం చేయవలసినదే. ఎందుకంటే కనబడని శత్రువులు తయారయ్యారు. అలాంటి శత్రువుల బాధ లేకుండా చెయ్యి తల్లీ అంటూ సర్వ జగత్తులో దుఃఖానికి కారణమైన ఏ పాపములున్నాయో అవి తొలగిపోవుగాక! అంటున్నారు. ఉత్పాతాలను వెంటనే తొలగించు తల్లీ! అని ప్రార్థన.

విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం విశ్వాత్మికా ధారయసీతి విశ్వమ్!
విశ్వేశవంద్యాభవతీ భవంతి విశ్వాశ్రయా యే త్వయి భక్తినమ్రాః!!

సిద్ధేశ్వరీ తంత్రంలోని దుర్గా ఆపదుద్ధారక స్తోత్రమ్

నమస్తే శరణ్యే శివే సానుకమ్పే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే ।
నమస్తే జగద్వన్ద్యపాదారవిన్దే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౧॥
నమస్తే జగచ్చిన్త్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే ।
నమస్తే నమస్తే సదానన్ద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౨॥
అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జన్తోః ।
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౩॥
అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే నలే సాగరే ప్రాంతరే రాజగేహే ।
త్వమేకా గతిర్దేవి నిస్తార నౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౪॥
అపారే మహాదుస్తరేఽత్యన్తఘోరే విపత్ సాగరే మజ్జతాం దేహభాజామ్ ।
త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౫॥
నమశ్చణ్డికే చణ్డదుర్దణ్డలీలా సముత్ఖణ్డితా ఖణ్డితా శేషశత్రోః ।
త్వమేకా గతిర్దేవి నిస్తార బీజం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౬॥
త్వమేవాఘభావాధృతా సత్యవాదీ ర్నజాతా జితా క్రోధనాత్ క్రోధనిష్ఠా!
ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౭॥
నమో దేవి దుర్గే శివే భీమనాదే సరస్వత్యరుంధత్వమోఘ స్వరూపే
విభూతిశ్శుచీ కాలరాత్రిస్సతీ త్వం నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౮॥
శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం! మునిమనుజపశూనాం దస్యుభిస్త్రాసితానామ్ ।
నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానాం! త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ॥ ౯॥

పోల్చుకోలేకుండా ఉన్న శత్రువులను ‘దస్యులు’ అంటారు.

ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారహేతుకమ్। త్రిసన్ధ్యమేకసన్ధ్యం వా పఠనాద్ధోరసఙ్కటాత్ ॥ ౧౦॥
ముచ్యతే నాత్ర సన్దేహో భువి స్వర్గే రసాతలే। సర్వం వా శ్లోకమేకం వా యః పఠేద్భక్తిమాన్ సదా ॥ ౧౧॥
స సర్వం దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్। పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే ॥ ౧౨॥
స్తవరాజమిదం దేవి సఙ్క్షేపాత్కథితం మయా ॥ ౧౩॥

శివుడు పార్వతీదేవికి చెప్పిన దివ్యమైన స్తోత్రం ఇది.

దీపావళీ, భాగ్యదివ్యావళీ,

ఆది లక్ష్మీ  కాంతులు, వెలుగుల  భ్రాంతులు, తేజము నిండగ ప్రకాశం బు గా వెలిగెన్
తార  జువ్వలు,నింగి నుంచి ఆకాశంబునకు  రివ్వున పయణించెనే
పిల్లల కేరింతలు సవ్వడి  , అన్నదమ్ముల మేనల్లుల   , సందడి తో దద్దరిల్లినట్టుగా
నవ్వులపువ్వులు, తియ్యని బువ్వలు తో  శాంతిసౌభాగ్యముల తో 
 ఆయురారోగ్యముల్ యాశదీర  దీపావళీ, భాగ్యదివ్యావళీ,
చూచెడి భాగ్యంబు శుభదివ్య తేజంబు మాకు  ప్రాప్టించెను

కార్తిక పౌర్ణమి రోజున మా శివ పరివారం

కార్తిక పౌర్ణమి రోజున మా శివ పరివారం కు చేసుకున్న మహా యాగం ... చాల బాగా జరిగింది.. ఇంకా నాకు ఆ పౌర్ణమి కళ్ళకు కట్టినట్టు గా ఎంతో ఆనందం ఇచ్చింది.. గురువు గారు చెప్పినట్టు గా ఒక కాశీ , శ్రీశైలం రెండు ఉన్న పుణ్య ప్రదేశాలు చూసినట్టు ఉంది.. నిజం చెప్పాలంటే దేవాలయాల్లో కూడా ఇలా జరపటం లేదు.. ఎదో హడావిడి చెయ్యడం తప్ప..
శివ పరివారంబు పూర్తిగ శివకేశవులను బూజించి మదిన్
గీర్తించుచు దీపములన్ వెలిగించెన్
అంబరాన వెలిగె అందాల   జాబిలి వలె
పండువెన్నెలనిట పంచుచుండె ఆనందాల హేల
సంతసించిన మా మది ఈశ్వరుడిని శరణాగతి వేడెనె
ఇంకా ఎలా ఉందొ చెప్పాలంటే.. నాకు మాటలు రావడం లేదు
నిండు చందమామ  మా ముంగిట లో మెరిసేను , పండు వెన్నెలంత మా వాకిట లో వెలుగునిచ్చేను
కలిగెడిది మా భావము , మురిసేను పలవరింత గా  పులకరించేను 
కార్తీకపున్నమి కలలను మా శివ పరివారం అందించెను
మా మదిలోన మాలిన్య  భావాలు దొలగించు భాగ్యదినము
 భక్తిచేత కొలువు తీరేను  ఆ దేవుళ్ళ పిలుపు హారతి వలన
దైవ కాంతిని మా  దరికి జేరి చూపిన  దూప దీప హారతులు
ఇక మా గురువు గారు దంపతులు అంటే మాకు పార్వతీ పరమేశ్వరులు
తల్లివి త౦డ్రియున్ గురువు దైవము మీరే మాకు  శివపరివారం అండగా
మా శివ పరివారం ను ఎచ్చోట చూచిన ఈశ్వర భజనలే
 " ఈశ్వరా ! శ౦కరా ! " యను నామములె ప్రతిధ్వని౦చు
ఎచట శివ  కార్యక్రం  జరుగు చు౦డు భవుడు వసియి౦చు " శ్రీ శైల " పర్వతమ్ము
 కైలాస పురంబున మా  శివపరివారం కు శుభాశీస్సులు ఇవ్వగన్
హరిహరులను కొలుచు  నేడు  కనులపండువిదియె కల్పమందు
నదుల లోన నేడు స్నానమ్ము చేసిన   పాపములును హరించు  పర్వదినము
ఈ కార్తీక పౌర్ణమి కి మా శివ పరివారం చేసుకున్న పూర్వ జన్మ దివ్య గ్యాన సంపత్తితోన్
మొన్న కామాక్షీ టీచర్ ఇంట్లో జరిగిన కార్తీక పౌర్ణమి ని చాలా అత్యంత అద్భుతం గా జరిగింది.. గురువు గారు చెప్పినట్టు కాశీ లోనే , శ్రీ శైలం లో చేసుకున్నాము అన్నట్టు గా ఉంది. అందులోను మా సాక్షాతూ నంది చే అవార్డు తీసుకున్న భాగీ శాస్త్రి గారు శ్యామల దండకం, మా అందరికీ అమ్మవారి సాక్షాత్కరించింది అన్నట్టు గా ఉంది..
ఇట్లు
శివ పరివారం

మతి మరుపు

ఏంటోనోయ్!  అస్తమానూ   పెన్ను ,మొబైల్  ఎక్కడ  పెట్టానో  మరచిపోతూ  ఉంటాను, ఈమధ్య మతిమరుపు బాగా ఎక్కువ అయింది " అని శ్రీలత తో చెబుతాడు ఆమె భర్త సుబ్రహ్మణ్యం.
శ్రీలత వెంటనే అఫుగుతుంది  ఎందుకు  అలా ? "
"  ఏమిటో  మీరు   ఈ  మతి   మరుపు !  అందుకే   నేను  ఎప్పుడోఖరీదైన  పెన్నులు వాడడం  మానేశాను .  చీప్  పెన్ను  మాత్రమె  వాడుతున్నాను అని సమాధానం చెప్పి,ఆ పెన్ను   మరిచిపోయి  పారేసినా  బాధ  అనిపించదులే !  అయితే  నా  మీ ఈ  మతిమరుపు  గురించే ! "
.వెంటనే శ్రీలత ఏమండీ " నేను  మీకు ఒక  మంచి సలహా   ఇవ్వనా ? "  అని గోముగా చెబుతూఉండే లోపే నేను ,   వెంటనే నా
"  మతిమరుపు  పోతుందా ?"  అని..అమాయకం గా అడుగుతాను
వెంటనే మా శ్రమతి ఎప్పటిలాగే చమత్కారంగా   చెప్పలేను !  అది నీ  మీద  ఆధారపడి  ఉంటుంది !"
ఏమిటది ?
."  నువ్వు  కొనగలిగినంత  అత్యంత  ఖరీదు  అయిన  పెన్ను  కొని  వాడుతూ  ఉండు  .  అప్పుడు  కూడా   నువ్వు మరిచిపోతావా?   , 
నీ  మరుపు  పోతుందా ?   చూద్దాము "
సరే.."  తప్పకుండా   చేస్తాను " ..ఈ సంభాషణ అంతా మా బావమరిది అయినా సోమేశం చెప్పింది
కొన్నాళ్ళు   తర్వాత   బావమరిది సోమేశం కి గురుతు కు వచ్చి  ఫోన్  చేసి మా శ్రీలత ని అడుగుతాడు , మీ అయన ఖరీదు అయినా  పెన్ను  మరిచిపోతున్నాడా  ?   అని  అడిగాడు .
." అబ్బే ! నువ్వు  చెప్పాక 22 కేరట్ల బంగారం పెన్ను   కొన్నారు 
దాని  విషయం  లో  చాలా  జాగ్రత్తగా  ఉంటున్నారు
ఈ ఆరునెలల్లో  ఒక్క  రోజు  కూడా   నేను  దానిని  ఎక్కడా  మర్చిపోలేదు అని మొన్ననే నాకు చెప్పారు మా సంభాషణ అంతటి తో ఆగలేదు అన్నయ్య , అయన నన్ను మెచ్చుకుంటూ ."  పెన్ను  మర్చిపోకపోడానికి  కారణం నువ్వు  దానికి  ఇచ్చిన  విలువ " అని వివరం గా చెప్పారు .మా సంభాషణ లో జరిగిన మాటలు ఏమిటంటే  మనం  దేనికి  విలువ  ఇస్తామో  దానిపట్ల  మనం   జాగ్రత్తగా  ఉంటాము . వస్తువుకు  విలువ  ఇస్తే  దాన్ని  కోల్పోము
అలాగే ఆరోగ్యానికి  విలువ  ఇస్తే  ఏమి  తినాలో  ,  ఏమి  తినకూదదో , ఎంత  తినాలో  ,  ఎప్పుడు  తినాలో  అన్నీ  జాగ్రత్తగా  ఉంటాము,

అలాగే ప్రభుతం వారు చెప్పిన లాక్ డౌన్ కూడా అంటే. మన మీద మన ఆరోగ్యం కోసం ప్రభుతం జాగ్రత్త తీసుకుని మనలని ఇంట్లోనే స్టే హోమ్ అండ్ సేఫ్ హోమ్ గా ఉండమని చూపిన కారణం కూడా అదే.. ఎందుకంటే బతికుంటే బలుసాకు అయినా తినచ్చు అని వెంకటి సామెత  .. మన ఆరోగ్యం మనకు ప్రాణాలకు విలువ ఇచ్చి మనలని , మన పిల్లలని జాగ్రత్త గా ఉండమని చెప్పడం కూడా ఒక కారణం కావచ్చు
ఇంతకీ ఈ కాన్సెప్ట్ లో నీతి ఏమిటంటే 
స్నేహానికి  విలువ  ఇస్తే స్నేహితుడిని గౌరవిస్తాము.
డబ్బుకు  విలువ  ఇస్తే  ఆచి  తూచి   ఖర్చు  పెడతాము
కాలానికి  విలువ  ఇస్తే  టైం  వేస్ట్  చెయ్యము,
బంధాలకు  విలువ  ఇస్తే  వాటిని  తెంచుకోము.
దేనికి  ఎంత  విలువ  ఇవ్వాలో  తెలుసుకుని   వ్యవహరించడం  మనం  తెలుసుకోవాలి అని తెలియపరిచారు

భాగవతం ప్రవచనం 24 ఏప్రిల్ 2020

DATE : 24/04/2020

మాకు ఈ లాక్ డౌన్ సమయం లో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మా గురువు గారు మా శివ పరివారం కు శ్రీమద్ భాగవతము  ప్రవచన రూపం లో చెబుతున్నారు..

ఈ రోజు భాగవతం వింటుంటే ఎందుకో నా మనసు నా మాట వినలేదు.. గురువు గారు చెప్పినట్టు ఆ పరమేశ్వరుడు దగ్గరకి వెళుతోంది..
ఈ భాగవతం మొదలు అయ్యిన దగ్గర నుంచి నేను టీవీ కానీ, న్యూస్ పేపర్ , వాట్స్ అప్ కూడా కొద్దీ సమయం లో చూడ్డానికి చూస్తున్నాను.. ఆ భాగవత పద్యాలూ ని ఒక పుస్తకం లో వ్రాసుకుంటున్నాను. ఇంట్లో ఉండే భాగవత మధురిమలు లో పద్యాలూ చదవడానికి ప్రయత్నిస్తున్నాను.. శ్రీమద్భాగవతం అద్భుత మహిమాన్వితమని.. అది సాక్షాత్ భగవత్ స్వరూపమని ప్రవచనవిరించి , సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ మన గురువు వారు  అన్నారు.. . ఇది భక్తి ధాతువు చేత జ్ఞానవైరాగ్య హేతువుగా సాగే గొప్ప యజ్ఞమన్నారు.
ఒక సందర్భం లో గురువు గారు.. ఆ మాట నా మనసుని హత్తుకుంది.  భగవంతుడు అన్నీ ఇస్తాడు గానీ.. భక్తి మాత్రం ఇవ్వడని.. అది స్వీయ సముపార్జితంగా రావాల్సిందేనని స్పష్టం చేసారు. కానీ అట్టి భక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు తిష్ట వేసుకొని ఉంటాడని గురువు గారు చెప్పడం తో నా మనసులో ఒక్కసారి ఆ శ్రీ హరి పాదాలు ని గుర్తు చేసుకొని నా శిరస్సు వంచి నమస్కరించాను
ఈ రోజు సరిగ్గా 3.30 కి గురువు గారు ఫోన్ చేసారు.. అప్పుడే నేను నిద్ర లోంచి లేచాను.. నాకు కలలో గురువు గారు శశి వాళ్ళ ఇల్లు వచ్చాయి.. నేను ఎప్పటిలాగే కొన్ని కొత్త పుస్తకాలూ కొని గురువు గారు ఇంటికి తీసుకుని వెళ్ళాను.. గోరకపూర్ వాళ్ళ భాగవతం కొని తీసుకుని వెళ్ళాను. వెంటనే శశి ఈ భాగవతం బాగుంటుంది , పారాయణ కి సింపుల్ గా అని తీసుకున్నారు.. ఈ లోపు నేను గురువు గారు తో కల లో మాట్లాడుతున్నాను. నిద్ర లేచాను. వెంటనే గురువు గారు ఫోన్.. ఏమి చేస్తున్నావు సుబ్రహ్మణ్యం అని .. భాగవతం అర్ధమవుతోందా అని ఒకటి కి రెండుసార్లు అడిగి తెలుసుకున్నారు..

 భాగవత స్వరూప స్వభావ ప్రభావాలు మూడింటినీ భాగవత మాహాత్మ్యం ద్వారా వెల్లడిస్తుందని   తెలిసింది
భాగవత శ్రవణం ద్వారా శబ్దరూపంలో భగవత్ సాక్షాత్కారం భక్తుల అనుభూతికి వస్తుందని  గురువు గారు మాటల  ద్వారా తెలిసింది  భక్తికి అత్యవసరమైన శ్రద్ధను ఈ శ్రవణం కల్పిస్తుందన్నారు. గాధల రూపంలో భక్తుల చెవుల ద్వారా ప్రవేశించే భగవానుడు వారి హృదయాల్లో స్థిరాసీనుడవుతాడని  గురువు గారు మనకి  ప్రవచనం ద్వారా తెలియాచేసారు .
మన శివ పరివారం ను  తరింపజేసే సరళ తరుణోపాయంగా , అనేక పరమ ప్రయోజనాలను కల్పించే ఒకే ఒక్క సాధనంగా భాగవత మాహాత్మ్యాన్ని , భాగవత పారాయణ, ప్రవచన, శ్రవణాదులను సశాస్త్రీయంగా
 ఇప్పుడు మనకున్న పరిస్తుతులు  లను , అనుభవాలు ను , మనకి అర్ధమైన విధం గా గురువు గారు  & టీం మనకి అర్ధమయ్యే సరళ మైన భాష లో తెలియపరుస్తున్నారు.. వాళ్ళు మనకి రెండు గంటలు చెప్పాలంటే గురువు గారు & టీం ముందు రోజు రెట్టింపు గంటలు కస్టపడి నోట్స్ తయ్యారు  చేసుకోవాలి

నా మనసులో భావాన్ని వ్రాసాను