ఏకాదశుల పేర్లు - వాటి ఫలాలు
Thursday, November 3, 2022
ఏకాదశుల పేర్లు - వాటి ఫలాలు
Sunday, October 30, 2022
నేడు అంతర్జాతీయ పొదుపు దినోత్సవం
నేడు అంతర్జాతీయ పొదుపు దినోత్సవం
దీన్ని 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ సేవింగ్స్'గా ప్రపంచ దేశాలు గుర్తించాయి. పొదుపు అవసరాన్ని చాటి చెప్పేందుకు, సేవింగ్స్‌ను ప్రోత్సహించడానికి ఈ రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సాధారణ వాడుకలో పొదుపు అంటే తమ ఆదాయంలో డబ్బును ఖర్చు పెట్టకుండా అట్టేపెట్టుకోవడం.
ఆర్ధిక శాస్త్రం పరిభాషలో ఆదాయంలో వినియోగం చేయగా మిగిలిందే పొదుపు. మరింత విస్తృతమైన అర్ధంలో "పొదుపు" అంటే ఖర్చును తగ్గించుకోవడం.
భవిష్యత్తు అవసరాలు, వ్యయాల కోసం పక్కన పెట్టే మొత్తమే పొదుపు. ఇది సాధారణంగా అత్యవసరాలు, ఆపదల కాలంలో చేతికందుతుంది. మరో మాటలో చెప్పాలంటే అవసరమైనప్పుడు అతిత్వరగా చేతికందే మొత్తాలే పొదుపు. డిపాజిట్లు, నగదు, నగదు సమానమైన సాధనాలు ఈ కోవలోకి వస్తాయి.
మదుపు
వివిధ ఆర్థిక సాధనాలు, అసెట్లలో దీర్ఘకాలంలో సంపదను సృష్టించడానికి చేసేదే మదుపు. ఇవి సంపదను సృష్టించడంతోపాటు ఆదాయాలను కూడా ఇస్తాయి. ఈ కోవలోకి షేర్లు, రియల్ ఎస్టేట్, బంగారం, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు, ఇతర సాధనాలు వస్తాయి. వీటిలో రిస్క్ ఎక్కువ. అలాగే రాబడీ అధికమే. స్వల్ప, మధ్య, దీర్ఘకాలాలకు అనుగుణంగా మదుపు చేయవచ్చు.
నేటి పొదుపు.. రేపటి మదుపు..
ఆ తరంలో..ఈ తరంలో..
నీకైనా..నాకైనా..ఎవరికైనా
ఇదే ఓ వేదమంత్రం. మనకి బ్రతికే సూత్రం..!
పొదుపంటే సొమ్ము మాత్రమే కాదు..
వనరులు.. మొక్కలు అడవులు మొ.
నేటి మొక్క.. మరునాటికి చెట్టు..
మరో నాటికి మహావృక్షం!
మనకి పెద్దలు తరచు చెబుతూ ఉంటారు
మన చిన్నతనం లో లక్ష్మీ నివాసం సినిమాలో ఒక పాట ఉండేది అది ఇప్పటికీ నాకు గుర్తు
ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం
కొండలైన కరగిపోవు కూర్చుని తింటే..
కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే.. అంటాడు ఆరుద్ర.
ఈ మాటలు బాగుంటాయి వింటే..
ఆచరణే కష్టం..
కానీ క్రమశిక్షణ గా కలిగి మెలిగితే నే జీవనం .
ఆపై నీ ఇష్టం!
ఆకలి కడుపు, ఖాళీ జేబు, విరిగిన మనసు నేర్పినన్ని పాఠాలు ఎవరూ నేర్పలేరు' అంటారు. ఆకలి కడుపు జీవితంలో ఆహారం విలువను తెలియజేస్తే... ఖాళీ జేబు చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో పొదుపు చేయలేకపోయామే అన్న వేదనను మిగుల్చుతుంది. 'బూంద్ బూంద్ బనేగా సముందర్, పైసా పైసా జమాతో రుపయా హోయేగా' అనేది హిందీలో ఒక సామెత. ఒక్కొక్క బిందువు కలిస్తేనే మహాసముద్రం... పైసా పైసా కలిస్తేనే రూపాయి అవుతుందని దాని అర్థం. జీవితమనే బండిని సాఫీగా నడిపేందుకు అవసరమైన ఇంధనమే 'ధనం'. ఆదాయానికి మించి ఖర్చు చేయకుండా, రేపటి ఆనందమయ జీవితం కోసం...భవిష్యత్తు అవసరాల కోసం పక్కన పెట్టే చిన్నచిన్న మొత్తాలే పొదుపు. ఇవన్నీ జీవితంలో పొదుపు ఎంత ముఖ్యమో...తెలియజెప్పే సూత్రాలు. రూపాయి అంటుందిట- 'నన్ను వంద వరకూ పెంచు' తర్వాత నిన్ను నేను పెంచుతా' అని. అదే రూపాయిని చిల్లరగా మార్చితే చెల్లాచెదురవుతాయి. అదే చిల్లరను ఒక దగ్గర జమ చేస్తూపోతే ధన సమూహంగా మారుతుంది. అందుకే పొదుపు...భవిష్యత్తు నిర్మాణానికి తొలిమెట్టు.
'చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి/ బంధువవుతానని అంది మనీ మనీ/ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు/ ఐనా అన్ని అంది మనీ మనీ/ పచ్చనోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుందని/ అంది మనీ మనీ' .
'పొదుపు తెలిసిన గృహిణి కాపురం పచ్చని సంసారమే' అంటారు పెద్దలు. ఇంటి అవసరాల కోసం వచ్చే ఆదాయాన్ని బట్టి బడ్జెట్ తయారుచేసుకోవాలి. పొదుపు కోసం కొంత మిగుల్చుకోవాలి. ఈ అలవాటు ప్రారంభంలో కొంత కష్టమనిపించినా...తినగ తినగ వేము తీయనుండు అన్నట్టుగా తర్వాత్తర్వాత సులభమవుతుంది. 'ఇదమే వహి పాండిత్యం, ఇదమే వహి శూరత, ఇదమే వహి వైదగ్థ్యం, అదాదల్ప తరోవ్యయః’ అన్నారు మన పెద్దలు. . ఆదాయం కన్నా చాలా తక్కువ ఖర్చుపెట్టడమే..కానీ అది ఈ రోజుల్లో అయ్యే పని కాదని అందరికీ తెలుసు .
కుటుంబాలకే కాదు...ఇది పాలకులు, ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది. ప్రజల సొమ్మును, ప్రకతి వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతూ...లక్షల కోట్ల అప్పులతో ప్రభుత్వాలను నడుపుతున్నారు. సంస్కరణల పేరుతో ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తూ...కార్పొరేట్లకు మాత్రం కోట్లాది రూపాయల రాయితీలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో...అరకొర ఆదాయాలతో బతకడానికే ఆపసోపాలు పడుతుంటే...పొదుపు ఎలా చేయాలి? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. నయా ఉదారవాద ఆర్థిక విధానాల పుణ్యమాని... ప్రపంచంలో వినిమయదారీ సంస్కతి విపరీతంగా పెరిగింది. చేతిలో పైసా లేకపోయినా, మధ్యతరగతి జీవితాలను ఆశల పల్లకిలో విహరింపజేస్తూ...క్రెడిట్ కార్డులు, ఇఎంఐ ల రూపంలో వున్నదంతా ఊడ్చేస్తున్నారు. పొదుపు అలవాటుని ప్రజల్లో అవగాహనా పెంచాలి.
కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే
మనం చేస్తే పొదుపు అది ఇంటికి మేలు..
కాని..అదుపు లేని.. పొదుపు ఎరుగని సర్కార్ల దుబారా..
ఈ పంపిణీల హంగామా.. అప్పుల పాలు..అదెంత భారం ఈ దుబారా..
అందుకోడానికి ఎందుకంత గాభరా..?
ఈ స్కీములు.. పెద్ద స్కాములు..
సంక్షేమం కాదది..సంక్షామం!
అన్నట్టు..అతి పొదుపు.. అదీ మరీ ముప్పే..
నువ్వు తినడం మాని.. తగిన బట్ట కట్టక..
జీవితాన్ని అనుభవించక.. బ్రతికే బ్రతుకు ఎడారి..
అప్పుడు నీ పేరు పిసినారి..! అవసరాన్ని
మించిన పొదుపు.. దెబ్బతినే గరిమనాభి...
నీ మరోపేరు లోభి..! ఇతరుల పొట్ట కొట్టి..
నీ పొట్ట కట్టి కూడబెడితే ఆస్తి..
సమాజానికి నీ వల్ల ప్రయోజనం నాస్తి..
చెప్పేయి ఆ పద్ధతికి స్వస్తి..
సంపాదించు..ఆస్వాదించు..ఆస్తి పెంచు..
అవసరానికి మించి ఉంటే కాస్త పంచు..!
చివరిగా పొదుపు ప్రాముఖ్యతను ప్రభత్వం అందరిలోనూ అవగాహనా పెంచాలి .
మారుతున్న పరిస్థితులు, విజృంభిస్తోన్న మహమ్మారి నేపథ్యంలో ఈ రోజు వెనుక ఉన్న ఆలోచన, ఉద్దేశాలను ప్రజలు గుర్తించాలి. ఆర్థిక వనరులు (ఫైనాన్షియల్ రిసోర్సెస్) ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంచాలి . దీన్ని దృష్టిలో పెట్టుకొని డబ్బు ఆదా చేయడంతో పాటు పొదుపుపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు పొదుపు విలువ చాటి చెప్పాలి. డబ్బు ఆదా చేయడం ప్రాముఖ్యత గురించి పాఠశాలల్లో ప్రచారం చేయాలి. చిన్న వయస్సులోనే పిల్లలకు డబ్బు దాచడం గురించి నేర్పితే, ఆ అలవాటు పెద్దయ్యాక వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని మా అభిప్రాయం అనవసరమైన ఖర్చును తగ్గించుకొని, రేపటికోసం కొంత దాచాలన్నది పెద్దలు చెప్పే ఆర్థిక సూత్రం. ఈ సూత్రంపైనే కుటుంబ భవిష్యత్తయినా, దేశ భవిష్యత్తయినా ఆధారపడి వుంటుంది.
Friday, October 28, 2022
MOBILE మొ - బైల్
మొబైలాయనమహా..
సమయం వృధాయై నమః
పనులు పెండింగేయి నమః
సవ్య సాచి వాయ నమః
ఒకప్పుడు అనగా మన తరం లోనే ఏ ఫోను లేనప్పుడు
ఎంత హాయి.. ఈ మొబైలొచ్చాక సొమ్ములు సమయం రెండు పోయిపోయి..!
ఒకనాడు బేసిక్ అంటూ పలకరించింది. మొబైల్
ఫోన్చే చేసేమా..ఎత్తేమా.. గ్రీనా..రెడ్డా..
అందులో ఎసెమ్మెస్.. షార్ట్ మెసేజ్ సర్వీస్..
దాంట్లో ఓ మెమరీ కార్డు.. అందులోనే పాటల రికార్డు..
అక్కడితో సరి.. ఓ చిన్న రీఛార్జి తప్పని సరి!
ఇక మనం అంతటి ఆగలేదు కదా
పోను..పోను ఈ ఫోనులో బుల్లి కెమెరా...
ఏదో మెగా పిక్సల్.. అదో లెవెలు..
సరిగ్గా కనబడని వీడియో.. వెనక్కి తిప్పి
తీసుకుంటేనే సెల్ఫీ... అప్పటికదే గొప్ప..
ఆ బుల్లి ఫోనే ఒప్పులకుప్ప..! వయ్యారి భామ
ఒకనాడు ఇంటిల్లిపాదికీ ఒకటే ఫోను..
అదే ఉమ్మడికుటుంబం.. సంబరాల కదంబం..!
మొదట్లో ఫోనొత్తినా... ఎత్తినా చార్జి..
ఊరు మారితే రోమింగు.. అప్పుడు మరీ భారంగా ఇన్కమింగు..
ఇది పెద్దోడి వ్యవహారమేరా అని నిట్టూర్పు..
మనకి మనమే ఓదార్పు..!
ఫోన్ ఎత్తాల వద్దా.. పోనిలే ఎక్కడ ఉన్నామో తెలుస్తుందిలే ...
సరే..రాను రాను వినియోగదారుల వినియోగం..
చేతిలో ఫోనుంటే అదో రాజయోగం..
పది పెట్టి కార్డు కొని గీకితే ఏడున్నర. ఛార్జి
ఇన్కమింగు లైఫ్ టైము.. డబ్బులైపోతే మళ్లీ గీకుడు..!
ఈలోగా సుడిగాలి లా వచ్చింది లిమిటెడ్ వాలిడిటీ చార్జింగు
జేబుకు చిరుగు.. సొమ్ములైపోయాక
ఔట్ గోయింగుకి లేకపోయినా రామీ.. ఇన్కమింగు హామీ..!
ఇక్కడి వరకు అంతా ఒక యుగం మొదలైంది ఆండ్రాయిడ్ యుగం..
స్మార్ట్ ఫోను జగం.. వచ్చింది వాట్సాప్ యోగం
మొహం తెలియనోన్ని దగ్గర చేసే ఫేస్బుక్కు..
మూగనోము వదిలిస్తూ ఇన్ స్టాగ్రాము..
వీటన్నిటికీ స్వెట్టర్లా ట్విట్టర్..ఫోనులోనే సినిమాలు..
టివి చానళ్లు..గూగులు..వంటిపై లేకుండా
నూలు పోగులు.. వీటన్నిటికీ నెట్టు.. అదే నీ పని పట్టు..
అదిగో..అక్కడితో నీ పని మాడిపోయిన పెసరట్టు..
ఆ మత్తు నుంచి మనం బయటపడితే
మొబైల్ ఫోను మీదొట్టు..! ఇదో గమ్మత్తు
ఇప్పుడు కార్డు గీకుడు.. బుల్లి రీచార్జీలు గోవిందా..
బాదుడే బాదుడు.. అది కూడా 28 రోజులే .
ముప్పై రోజులైతే ఏడాదికి పన్నెండే..
అదే ఇరవై ఎనిమిదైతే సాల్ కి తేరా..
తెలివంటే అదేరా..! కార్పొరేట్ల గిమ్మిక్కు..
సర్కారు లాజిక్కు.. ఇక నీకెవరు దిక్కు!
మొత్తంగా లైఫ్ టైమనిఆఫర్స్ బోణీ..బాణీ..
హోల్ మొత్తం అంబానీ..
ట్రాయ్ నిన్ను చేసింది టాయ్
నిన్ను ఫోనుకి బానిసను చేసి
అయ్యో అనుకునేలోగానే జియో మింగేసింది..
ఎయిర్ టెల్ మోగించింది డేంజర్ బెల్..
ఒక ఐడియా నీ జీవితాన్నే మార్చేసింది..
ఇప్పుడు ఇంటి బడ్జెట్లో సింహభాగం
మొబైల్ రాగం.. రీఛార్జి రోగం..!
అన్నం లేకపోయినా పర్లేదు
ఫోను రీఛార్జి మస్టు.. అదే చీజ్ బడీ మస్తు మస్తు!!
ఫోను మనలని ముంచేసే వ్యసనమే..
అది లేకపోతే బతుకు శీర్షాసనమే..
మనిషికో మొబైల్. అవకాశం ఉంటే మరొకటి .
త్రీజి..ఫోర్ జీ..ఫైవ్ జీ.. వల్లే మన గురూజీ లు
ఇలా ఎక్కడికి పోతున్నావు సర్ జీ...!
కరోనా కష్టకాలం లో మనకి దొరికింది ఒక ఆయుధం అదే మొబైల్ ఆయుధం..
సవ్యసాచి కూడా అవాక్కయ్యే లా ఉపయోగించాము
ఇప్పుడు పిల్లల చేతిలో ఫోన్
ఆ అమ్మా.. వస్తున్నా..ఆ నాన్న ...
ఉఆ..ఇవే సమాధానాలు
తల్లి తండ్రులు ఎక్కడ చూస్తారో అని మొబైల్లాక్.
ఆకలేస్తే ఫోన్, ఆకలిని చంపేసేది ఫోన్.
ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా ఫోన్ ఇచ్చి అన్నం పెట్టేస్తున్నారు.
నిజం గా ఆరు బయట చందమామ చూడడం లేదు. నెట్టింట్లో నెట్ లో చూపిస్తున్నారు.
Sunday, October 23, 2022
ధన్వంతరి
ధన్వంతరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది.
మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చు.
శ్రీ ధన్వంతరి స్తోత్రం..
శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం చారుదోర్భిశ్చతుర్భిః ౹
సూక్ష్మస్వచ్ఛాతిహృద్యాంశుక పరివిలసన్మౌళిమంభోజనేత్రమ్ ౹
కాలాంభోదోజ్జ్వలాంగం కటితటవిలసచ్చారుపీతాంబరాఢ్యమ్ ౹
వందే ధన్వంతరిం తం నిఖిలగదవనప్రౌఢదావాగ్నిలీలమ్ ౹౹
ఒక శంఖం, ఒక చక్రం లేదా శక్తి (చక్ర) పళ్లెంలో ఒక జలగ మరియు అమృతాన్ని (ఖగోళ అమృతం) ఒక కుండ: హిమ్, తన నాలుగు చేతులు పట్టుకుని ఎవరు ధన్వంతరి, నమస్కారాలు. దీని గుండె కాంతి చాలా సూక్ష్మ స్పష్టమైన, సున్నితమైన మరియు ఆనందము మెరుపు ప్రకాశిస్తాడు. ఈ కాంతి కూడా అతని తల మరియు తామర కళ్ళు చుట్టూ మెరిసిపోయాడు. ఎవరు తన మేరే నాటకం ద్వారా ఒక శక్తివంతమైన దావాగ్ని వంటి అన్ని వ్యాధులు నాశనం చేస్తాడు.
ఇప్పటిదా..అప్పటిదా.. అని కాకుండా
నీ కోసం నా కోసం ముందే ఆలోచించి
యుగాలకు మునుపే ఉద్భవించిన ధన్వంతరి.. మహా మంత్రం
అలా దశావతారాలకు మునుపే తొలి అవతారమెత్తిన శ్రీ హరి!
ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ సూత్రానికి జీవం పోస్తూ
సృష్టిలో ఆది వైద్యుడిగా రూపు దాల్చిన ధన్వంతరి..
అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ రోగాలకు వైరి...!
శ్రీ హరి రక్ష మనకి
వైద్యో నారాయణో హరి.. ధన్వంతరి పేరు చెబితేనే
వ్యాధులు హరీ.. అలా వరమిచ్చెను మురారి..
సర్వరోగాలను హరియించే భాస్కరుని శిష్యుడై..
బ్రహ్మాదులే ధన్వంతరి అని నామకరణం చేయగా
ఇలను చేరిన మొదటి వైద్యుడు.. శస్త్రచికిత్సలకూ ఆద్యుడు!
మన మనసుకు..శరీరానికి బాధ కలిగించే శల్యాలను..
వికృతులు..అఘాతాలను నివారించే శక్తిసంపన్నుడు
ఈ ధన్వంతరుడు..! ఇది వ్యుత్పత్తి..లోకోక్తి..
అనేక సందేహాలకు నివృత్తి..!!
క్షీరసాగర మథనం జరుగుతున్న శుభవేళ..
కామధేనువు..ఉచ్చశ్రైవం. ఐరావతం..పారిజాతం..
ఇన్ని అద్భుతాలు.. అనంతరం ముకుందప్రియ..
మహాద్భుత ఉద్భవం తదుపరి.. అసురులు అక్షింతలు చేసుకుని వీక్షిస్తుండగా..
అసలే మూతపడని రెప్పలను మరింతగా తెరచి చూస్తుండగా..
పీనాయుత బాహుదండ యుగళుడై..
కంబుకంటుడై.. పద్మారుణ లోచనుడై..
విశాల వక్షస్థలుడై.. సుస్నిగ్ధ కేశజాలంతో..
నీలగాత్ర తేజుడై.. పీతాంబరం..మణికుండల
సమాభాసితుడై.. అమృతకలశంతో అరుదెంచినాడు ధన్వంతరి..
లోకకళ్యాణం కోరి..!
ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది.[1]
భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.
కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") - ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.
విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం.
ఇంతే కాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు.
పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉంది.
భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడు అతడే "ధన్వంతరి" గా ఉద్భవించాడు
ధన్వంతరి మంత్రం
ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే
అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ
త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్ర్తే శ్రీ మహా విష్ణు స్వరూప శ్రీ ధన్వంత్రి స్వరూప
శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా
గాయత్రీ :
ఓం తత్ పురుషాయ విద్మహే అమృత కలశ హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్!
ఓం ఆదివైధ్యాయ విద్మహే ఆరోగ్య అనుగ్రహాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్!
క్షీర సాగరమును చేరి సురాసురు
,,,,లమృతమ్ము నొందగ యత్నమూని
మంథర శైలమున్ మంచి కవ్వము చేసి
....వాసుకిన్ ద్రాడుగ బట్టుకొనుచు
ద్రిప్పుచు నుండగా దీక్షతో నా గిరి
....క్రుంగుచుండుట జూచి కూర్మమగుచు
వీపుపై మోసెను విష్ణువా యద్రిని
....సాధన మారీతి జరుగు చుండ
నహిపతికి బాధ హెచ్చయి హాలహలము
గ్రక్కె గ్రక్కున నతి భయంకరముగ నది
సకల ప్రాణాంతకంబయి జగములెల్ల
వ్యాప్తి చెందుచు నుండగా భయమునొంది
దేవతలు రాక్షసులు నంత దేవదేవు
డైన శంకరు బ్రార్థింప నా కృపాబ్ధి
యభయమిడి స్వాగతించి యా హాలహలము
నంతయును దన కంఠంబునందు నిలిపె
ఆ మహా గరళమ్ము నంతయు మ్రింగెనా
....కడుపులో నున్న లోకమ్ము లెల్ల
నాశనమగునంచు నీశుడా తరుణాన
....నుమియుచో వెలుపల నుండునట్టి
భువనమ్ము లెల్లను పూర్తిగా నాశిల్లు
....ననుచు దలంచి నిల్పెను స్థిరముగ
తన కంఠమందు తద్దయు హాలహలమునే
....యెంత బాధయును భరించుచుండి
యటుల ముల్లోకములకు మహావిపత్తు
తొలగజేసి భద్రమ్ములు కలుగజేసె
నాదిదేవుడు నతుల దయామయుండు
శంకరుండు సదా లోకశంకరుండు
జయ మహాదేవ! శంకరా! జయము జయము
జయ జగత్త్రయ రక్షకా! జయము జయము
జయ మనుచు దేవ దానవ చయములెల్ల
సంస్తుతు లొనర్చి రావేళ సన్నయమున
మరల క్షీరాంబుధి మథనమ్ము సాగించు
....చుండగా నద్దాని నుండి వేగ
వెల్వడె సురభియు, విధుడు,నైరావత
....మును కల్పభూజమ్ము, పుష్కరాక్షి
యగు మహాలక్ష్మియు, నశ్వరాజంబగు
....నుచ్చైశ్రవమ్మును నొప్పు మీర
అమృత కలశమ్ముతో నంత ధన్వంతరి
....ప్రత్యక్షమయ్యె నా పర్వమందు
హరి జగన్మోహినీ రూప మపుడు దాల్చి
యమృతకలశమ్ము చేబూని యసురతతుల
నకట మోహింపజేయుచు, నమర బృంద
ములకు నమృతమ్ము బంచె నద్భుతము గాగ
హరి లీలలు హరు లీలలు
కరము శుభంకరములగు జగమ్ములకెల్లన్
హరిహరుల నాత్మ దలచుచు
పరమాదరమలర గూర్తు వందన శతముల్
Friday, October 14, 2022
మానవ సంబంధాలు. Human Relations
మనిషి ఎల్లప్పుడూ ఒంటరిగా కాకుండా ఒక సొంత కుటుంబాన్ని ఏర్పరచుకొని జీవనం సాగిస్తాడు. తన కుటుంబంతో జీవనం సాగించడానికి ఒక ఇంటిని కట్టి దానినే దేవాలయంగా భావిస్తారు.
" ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం మా ఇల్లే బృందావనం "
అంటూ ప్రతీ వారి లాగానే మనం కూడా మా ఇల్లు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటాం.
కానీ నేడు అది పెరిగిన కొద్దీ మన బృందావనం బీటలు వాలి చివరికి మమకారం తగ్గి అహంకారంతో రగిలి అతలాకుతలం అయ్యింది.
ఆలోచిస్తే ఒకే ఇంట్లో పెరిగినవాళ్ళం, ఒకే బడిలో చదివినవాళ్ళం, ఒకే ఊళ్ళో తిరిగినవాళ్ళం .... కానీ మా వయస్సు పెరుగుతున్న కొద్దీ పెద్దల ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి.
దీనికి కారణం మారుతున్న కాలంతో పాటు, రోజురోజుకి మనిషిలో పెరుగుతున్న స్వార్ధం ఎందుకంటే మన చిన్నతనంలో
"కలసి ఉంటే కలదు సుఖం" అని చెప్పేవారు,
కానీ నేడు " కలసి కలహించుకోవడం కన్నా
విడిపోయి సంతోషంగా
ఉండటం మేలు".
అంటున్నారు.
ఇది భౌతిక , కుటుంబ ఎడబాటైనట్లైతే అంత ఇబ్బందేమీలేదు. కాని
చిన్నతనంలో ఉన్న కుటుంబాలని నేటి కుటుంబాలతో పోల్చి చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.
"వెన్నలాంటి రాత్రులలో చందమామ మిస్ అవ్వలేదు కానీ చందమామ కధలు చెప్పేవారు మిస్ అయ్యారు.
ఎండా కాలంలో వేసవి సెలవులు మిస్ అవ్వలేదు కానీ ఆ వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాదినీ ఒక దగ్గర చేర్చే పెద్ద దిక్కు మిస్ అయ్యింది.
ప్రతి సంవత్సరం వచ్ఛే పండగలు మిస్ అవ్వలేదు కానీ ఏ పండగ నాడు
ఏ తీపి వంటకం వండాలో చెప్పే మనిషి మాత్రం మిస్ అయ్యారు".
దీనికి కారణం నేటి తరానికి కధలు చెప్పడానికి ట్యాబ్లు, యూ ట్యూబ్ ఉన్నాయి. అదే వేసవి సెలవులు వస్తే సమ్మర్ కోర్సులు, క్రాష్ కోర్సులు ఉన్నాయి. అలాగే పండగలు వస్తే తినడానికి రెస్టారెంట్స్, తిరగడానికి షాపింగ్ మాల్స్ ఉన్నాయి.
అందుకే నేటి తరానికి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు అవసరం లేదు. అందుకే మన భారత దేశంలో కూడా ఉమ్మడి కుటుంబాలు శాతం తగ్గుముఖంగ ఉండగా చిన్న కుటుంబాలు శాతం పెరుగుతూ ఉంది.
నేటి తరానికి ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళని ఒక క్రాష్ కోర్సులో జాయిన్ చేస్తారు, ఇలా చివరికి వ్యక్తిత్వ వికాసం కూడా కోర్సుల్లో జాయిన్ అయి నేర్చుకుందుకు ప్రయత్నిస్తారు..
వాళ్ళు వృత్తిలో రాణించడానికి పాఠాలు చెప్పగలరేమో గాని జీవితానికి కావాల్సిన నైతిక విలువలు, సాంప్రదాయాలు, ప్రేమాభిమానాలు మాత్రం నేర్పించలేరని తెలియడం లేదు.
ఒక అర్ధ శాస్త్రవేత్త చెప్పిన
మాటను గుర్తుచేస్తాను
" All human relations are commercial relations"
అంటే
" మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార బంధాలే".
ఏమో కొన్ని సార్లు ఈ మాట నిజమనిపిస్తుంది. నేటి సమాజంలో మనిషి బంధాలను ప్రేమతో కాక డబ్బుతో ముడి వేస్తున్నారు. ఎక్కడ ఇచ్చిపుచ్కునే ధోరణి ఉందో ఆ బంధాలు దృఢంగా ఉంటాయి.
ప్రేమ, అభిమానాలు వ్యక్త పరచడానికి ఇచ్చిపుచ్కోవడమనేది ఒక పద్ధతి అంతే కానీ పుచ్కునే ధోరణితో బంధాలు ఏర్పడితే అవి ఎక్కువ కాలం నిలబడవు.
ప్రేమకు ప్రాధాన్యత ఉన్నచోట డబ్బు ఉంటుంది కానీ డబ్బుకి ప్రాధాన్యత ఉన్నచోట మాత్రం ప్రేమ నిలబడదు.
కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం
" ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం కానీ మన కోసం కన్నీళ్లు కార్చే మనిషిని మాత్రం కొనలేం "
ఈ మాటలు నిజం .
నేను చెప్పడం కాదు
యాపిల్ కంపినీ సృష్టి కర్త,
తన ఆఖరి రోజులలో డైరీలో రాసుకున్న మాటలివి.
"Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS".
అందుకే మన జీవితంలో
ఉన్న ప్రతీ బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే "
When you say sorry to someone, It means that you are not wrong and other one is right. But it means that you have given importance to relationship more than 'EGO'
Let's have a smooth relationships
Wednesday, September 7, 2022
పోతన కలంలో...వామనావతారం
Sunday, June 12, 2022
నేటి నుంచి బడులు 2022
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!
ఈ రోజు నుంచి స్కూల్స్ మొదలు అవుతున్నాయి..
స్కూల్స్ చేసేసి శుభ్రం మళ్లీ సరస్వతీ నమస్తుభ్యం..
ఇన్నాళ్లు ఇంట్లోనే కూర్చుందేమో చదువులమ్మ
బడికెళ్తే సాక్షాత్కారమౌను మరోసారి గురుబ్రహ్మ..!
కరోనా తర్వాత వాన కాలపు చదువుల్లాగా సాగింది ఇన్నాళ్లు
స్కూల్స్ మొదలు అయ్యాయి సందడి కూడా మొదలు అయ్యింది
ఇప్పుడు మళ్లీ అక్షరాలకు చిగుళ్ళు..
కళకళలాడేనిక చదువుల గుళ్ళు..!
అయిందేదో అయ్యింది ,పోయిన కాలం ఎదో పోయింది
కరోనా మహమ్మారి చదువులను మింగేసింది..
ఇప్పుడిక భయానికి సెలవు.. పూర్తిగా తెరుచుకుంది చదువులమ్మ కొలువు..!
మన ఇళ్లల్లో మొబైల్స్ కూడా కాస్త విశ్రాంతి దొరుకుంది
ఒకప్పుడు మాస్టారు అంటే పట్టుకుంటారు బెత్తం
చాక్పీసు ను విసిరి కొడతారు మన మీదకి
వేయిస్తారు మనకి గోడకుర్చీలే
నిలబెడతారు మంచి మండుటెండలో ..
ఇప్పుడు కనిపించని హాజరు మన బ్రతుకులే బ్రతుకే బేజారు..!
వేసవి సెలవులు కావవి , వానాకాలం చదువులు
అప్పుడు లాక్ డౌన్లతో చచ్చేంత చావు..
చదువుకే చాకిరేవు... బరువైపోయిన బ్రతుకు తెరువు
ఎవరిని అడిగిన వారి గుండె చెరువు..!
ఆన్లైన్ క్లాసులు.. ఎందుకొచ్చిన తిరకాసులు..
మా జేబుల్లోచి వెళ్ళేవి కాసులు
ఇప్పుడు ఇక అమ్మవారి దయవలన జరగాలి
ఇక పాఠాల వరదే.. సరస్వతీ నమస్తుభ్యం వరదే..!
ఇక పాఠాల వరదే.. సరస్వతీ నమస్తుభ్యం వరదే..!
ఇక మన రోజులు ను గురిచూసుకుందాం కాసేపు
తప్పులు చేస్తే గుంజీలు ఇంటర్వెల్ లో గుడుగుడు గుంచాలు..
గంట కొట్టేటప్పటికి తుర్రుమంటూ ఇంటికి
అమ్మ పెట్టే జంతికల కోసం వంటింటికి..!
ఇప్పుడు పెద్దవాళ్ళకి కొంచం కాస్త ఊరట లేకపోతె అమ్మ మొబైల్ , నాన్న మొబైల్ కి కాస్త రెస్ట్ ఉంటుంది ..
నాకు ఒక చిరకాల కోరిక..అది నెరవేరుతుందో లేదో తెలియడం లేదు..
ప్రభుత్వం ఇన్ని పధకాలు, బోలెడు డబ్బులు ఖర్చు పెడుతున్నాయి కదా..
విద్య విధానం పై ఎక్కువ మక్కువ చూపడేందుకు
ప్రభుత్వ పాఠశాలా,జిల్లా పరిషత్ స్కూల్స్ ఏమైయ్యాయి..గోడలాల్లోని రావి మొక్కలు, బీటలు వదిన గోడలు తప్ప.. ఒకప్పుడు ఎంత బాగుండేవి..మంచి మంచి టీచర్స్ , ఉన్నత పాఠశాలను అన్ని కనుమరుగవుతున్నాయి..
ఇంతమంది వాలంటీర్ ఉన్నారు , బోలెడు ఫౌండషన్స్ ఉన్నాయి..పూర్వ విద్యార్థులు లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు..డబ్బులు ఉన్నారు ఉన్నారు కాస్త ప్రభుత్వ పాఠశాలలు దత్తత తీసుకుని బాగుచెయ్యచ్చు కదా..
ప్రభుత్వం ఎందుకు ద్రుష్టి పెట్టడం లేదో తెలియదు.. ప్రభుత్వం పెట్టుబడి విద్య సంస్థలు మీద పెడితే చాల బాగుంటుంది..అది కూడా తారతమ్యం లేకుండా అందరికీ ఒకే ల చదువు.. ఆ సూర్యుడు అందరికీ వేడి , వెలుతురూ ఒకేలా ఇస్తారు కదా అలాగా.
మంచి మంచి పండితులు , అవధానం లు చేసే వారు జిల్లా పరిషత్ స్కూల్స్ లోనే ఉంటారు..వారి మంచి మాట , వారి కేవలం చదువే కాదు సంస్కారం కూడా నేర్పుర్టారు..
నా పిచ్చి కానీ మన రోజుల్లో చదువు ఇప్పటి రోజులు తో పోలిక..ఇప్పుడు చదువు కొంటున్నాము అంటే..
ఇట్లు
వాణి నా రాణీ
Saturday, February 26, 2022
వివాహ వేడుక
వివాహ వేడుక సంప్రదాయం ఒక తంతు ఇవన్నీ ఒకప్పుడు ఒక సంప్రదాయం గా నిర్వహించారు . అప్పట్లో ఇలాంటి హడావిడి లేదు.. వేద మంత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.వేద ఆశీర్వచనం, కవిత్వం మొ ఉండేవి..ఇప్పుడు అంతటా వీడియో పెళ్లిళ్లు, ఫోటో గ్రాఫేర్స్ హడావిడి..
కొంత కలం క్రితం చెప్పేవాళ్ళు ఉన్న వినే వారు లేరు , ఇప్పుడు వినే వాళ్ళు ఉన్న చెప్పే పెద్ద తరం వాళ్ళు లేరు..
దానికి తోడు కోవిద్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఎవరికీ ఏమి అంటుకు పోతుందని మరి దూరం గా ఉంటున్నారు..
పెళ్ళికి సంభందించి చాల పుస్తకాలూ , చాల వేద మంత్రాలూ తో కూడిన పుస్తకాలూ ఉన్నాయి..
అందులో కొన్ని సంగ్రహించి తర్వాత తరానికి ఉపయోగపడడం కోసం ఒక ఆర్టికల్ వ్రాయాలని సంకల్పం..
అసలు వివాహం గురించి నాలుగు మాటలు తెలుసుకుందాం
"వివాహం"
ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం.
"పెళ్ళి చూపుల" సాంప్రదాయం
పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. "పెళ్ళి చూపుల" సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన వారు బంధు-మిత్ర-సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు. వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవుతారు. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకుంటారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు కట్న కానుకలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.
నిశ్చితార్థం
వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం). తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు "నిశ్చయ తాంబూలం". వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఇప్పుడు "ఎంగేజ్ మెంట్" అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు.
సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు-చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి-పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.
ఆడ పెళ్లివారిచ్చేవి- మగ పెళ్లివారిచ్చేవి
సాధారణంగా ఆడ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధు-పర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం-బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్-షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా-సత్యనారాయణ వ్రతమప్పుడు వధూ-వరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు-అత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె (సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులు-ఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల శనగ-సున్నిపిండి, కిలోంబావు పసుపు-అందులో సగం కుంకుమ, చీరె-ధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు) ముఖ్యమైనవి.
సాధారణంగా మగ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు-ఇతర చీరెలు, నగలు-ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే కట్నం, వధువు తల్లి కడుపు చీరె-తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.
ముహూర్త నిశ్చయం
వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. "పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. చ తప్పకుండా అమలు చేయాలంటే "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారం-పద్ధతి".
పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంటే పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు.. .. ఎన్నో కొంటారు.
నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు"గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళి వారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ "శుభ లేఖలు" పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోప-తాపాలు కూడా వస్తాయి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ-ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే.
"స్నాతకం"
పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని "సత్యాన్న..." అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది.
"సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు" అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, "వరుడికి శుభం కలుగుగాక" అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తాడు పురోహితుడిక్కడ.
స్నాతకానికి "సమా వర్తనం" అన్న పేరు కూడా వుంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమా వర్తనం అంటారు. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కాశీ ప్రయాణం - బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి "అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి" అని చెప్పి బొట్టు పెట్టి,బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు.
కాశీ యాత్ర
కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధు-మిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు. ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (బావ మరిది-మేన మామ-తాత గారు లాంటి వారు) "బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వారి "అమ్మాయి" నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి, కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు-మిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరుతారు. బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడం – నిందించడం - దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.
పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం
పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూ-వరుల ఇళ్లలో, ఉదయం తెల-తెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లి-తండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. స్నాతకం చేసుకున్న నాడే, లాంఛనంగా అక్కడ కన్యా దాత ఇంట్లో, వధువుని "పెళ్ళికూతురు" చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ముందు-వెనుకల కూడా జరగొచ్చు. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" లో చేస్తారు.
స్నాతకం చేసుకున్న రోజునే మగ పెళ్లివారు ఆడ పెళ్ళివారి వూరికి తరలి పోతారు. ఒక్కోసారి అక్కడకు పోయి స్నాతకం చేసుకుంటారు.
విడిది మర్యాదలు
మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్లి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం సరదాగా-సందడిగా జరుపుకునే మరో వేడుక. విడిదిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి (సబ్బులు, పేస్టులు, బకెట్లు, తుండు గుడ్డలు, వేడి నీళ్లు లాంటివి) ముందు (హాలులో) భాగంలో పెద్ద తివాచీ లాంటిది పరిచి ఎదురు చూస్తుంటారు ఆడ పెళ్ళి వారు. మేళ-తాళాలతో ఆహ్వానించి కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. పెళ్ళికొడుకు ఆ పనిని బావమరిదితో చేయిస్తారు. ఈ కాళ్లు కడగడమనేది రెండు-మూడు పర్యాయాలు జరిపే వ్యవహారం. ఆ తర్వాత అందరికీ కాఫీ-పలహారాలిచ్చి మర్యాదలు చేసి, స్నానాలు ముగించుకొని సిద్ధంగా వుంటే, భోజనాలకు తీసుకెళ్తామంటారు. లేదా అక్కడే ఏర్పాటు చేస్తారు.
వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరవలేని సంఘటన. కొందరు కల్యాణ మండపాలను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెటూర్లలో కొబ్బరి ఆకుల పందిరి వేయడం వలన మండపం ఆవశ్యకత తగ్గింది. పట్టణాలలో టిప్ టాప్ పందిరి మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.
గౌరీ పూజ-వర పూజ- మధు పర్కం
ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి,సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు.
వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా, ఆడ పెళ్ళి వారు-వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వాని్స్తారు. వరపూజలోనే ఇరువైపువారు, ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది.
మగ పెళ్లివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం-సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్ల” మని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు.
మధుపర్కం:
మధువు అంటే తేనె. కుమార్తెకు భర్తగా వరుడి ఎంపిక తరువాత అతను వధువు తల్లి-తండ్రికి సంప్రదాయాన్ననుసరించి పుత్ర సమానుడౌతాడు. వివాహానంతరం "మధుపర్కం" అంటే తీయటి పానీయం అని అర్ధం. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. వరుడు ఆ పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత వరుడు నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు.
గోత్రం-ప్రవర
గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "గోత్రం" అంటే వంశం, "ప్రవర" అంటే ఆ వంశం మూల పురుషుల సమాచారం. మీ అమ్మాయిని, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-…. …. …. త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, ….. …. శర్మణో నప్త్రే, …. … శర్మణ పౌత్రాయ, … …. శర్మణ పుత్రాయ, .. … శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న …… గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించేవాడూ, … మునిమనుమడూ, …. మనుమడూ, …. పుత్రుడూ అయిన … అనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇలా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్‌లో అనవచ్చు.
కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, ఆ సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు.
గంపలో వధువు-కాళ్లు కడగడం
గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు.
కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. కన్యాదాతేమో వయసులో పెద్ద-వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ వుందంటే దానికి సాంప్రదాయ బద్ధమైన అర్థం వుండి తీరాలి. కన్యా దాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్పుతాడు. "నా లోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా వుండుగాక" అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యా దాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన "అర్ఘ్యాన్ని" (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, " ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని-పాడి పంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని చేసి, రక్షించండి" అని చెప్పిస్తారు. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు.
వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, ఆ విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించుతారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.
మహా సంకల్పం
మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భరత వర్షం-భరత ఖండం, దానిలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యా దాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్థం గడవగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పాలలోని శ్వేత వరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో-శాలివాహన శకంలో-ఇరవై ఎనిమిదవ మహా యుగంలో-కలియుగంలో-ఫలానా సంవత్సరంలో-ఫలానా మాసంలో-ఫలానా తిది రోజున, ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషితైన ఈ కన్యను దానం చేస్తున్నాను అని కన్యా దాత చెప్పే సంకల్పం ఇది. ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని,స్తోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక- ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలని కన్యా దాత సంకల్పం చేస్తాడు.
కన్యాదానం
ఇక ఆ తర్వాత, "కన్యా దానం" తంతు, అంటే, ముహూర్తం సమయం దగ్గరపడుతున్నదని అర్థం. "కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !! అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పాలి కన్యా దాత: " సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మామ గారు (కన్యా దాత) (వరుడి) చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యా దాత వరుడితో. దీనికి సమాధానంగా, "నాతి చ రామి" అని వరుడితో చెప్పించాలి. సుముహూర్తం వచ్చేస్తున్నదనె దీనర్థం.
"జీల కర్ర- బెల్లం"
వధూ-వరులను కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తి అయిన పిదప, అమ్మాయి-అబ్బాయిల జాతకాల ననుసరించి జ్యోతిష్యంలో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచుకుంటారు. సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లుతారు దంపతులు మీద.
జీల కర్ర-బెల్లం ముద్దను వధూవరులు పెట్టుతున్న సమయంలో, పురోహితుడు చదివిన మంత్రానికి, "వరుణుడు, బృహస్పతి, మీకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చెదరు గాక ! అగ్ని దేవతలు మిమ్ములను దీవించెదరు గాక ! పంచభూతాలు స్థిరంగా వుండు గాక ! ఈ సుముహూర్తం మీకు శుభ ముహూర్తం అగుగాక !" అని అర్థం వస్తుంది. జీల కర్ర-బెల్లం మిశ్రమంలో పరస్పరాకర్షణ వుంటుందని మన పెద్దలు చెప్పడమే కాకుండా, శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. ఇక వధూవరులమైన మేమిద్దరం, ఆ తర్వాత, సకల దేవతలకు నమస్కరించి, "నూతన దంపతులమైన మా ఇరువురి ప్రేమానుబంధం చాలా గొప్పది. మా బంధాన్ని పితృదేవతలు కూడా ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతోనే మేం భార్యా-భర్తలం అయ్యాం. ఈ శుభ సమయంలో బంధువులైన మీరందరూ ఆనందంగా వుండండి. వధువు బంధువులు కొద్దిగా మానసిక ఆందోళనకు గురికావడం సహజమే" అని మంత్రాల ద్వారా పురోహితుడు అనిపిస్తాడు. ఇక ఇక్కడినుంచి మాంగల్య ధారణ తంతు మొదలవుతుంది.
మాంగల్య ధారణ-తలంబ్రాలు
వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం.
సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు. "శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది.
పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం.
మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు.
కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.
స్థాళీపాకం-సప్తపది-నాగవల్లి-సదశ్యం
తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా హోమం దగ్గర అన్నం వండించే పని, ఆ తర్వాత సప్తపది వుంటుంది.
వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు, ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం వధువు తన అంగీకారాన్ని తెలియ పరుస్తుంది. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి. సప్తపది పూర్తైన తర్వాతనే, వధువు గోత్రం-ప్రవర-ఇంటి పేరు, వరుడి గోత్రం-ప్రవర-ఇంటి పేరు గా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ-హిందూ సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పదనాన్ని విశదపరిచే మంత్రాన్ని చదువుతారు. అందులో, "ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ, ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక" అన్న అర్థం స్ఫురిస్తుంది.
వధువును అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరం నకుగానీ, ఏడు మంత్రాలతో, ఏడు అడుగులు నడిపించుతున్న వరుడితో జపం-హోమం చేయించుతారు. ఇక్కడే చెప్పిన మరో మంత్రంద్వారా వధూవరులిద్దరు, ఇకనుంచి స్నేహితులం అన్న అర్థం కూడా వుంటుంది. "మన ఇద్దరం స్నేహితులం. నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయులకు మైత్రి కలిగింది. నీ చేతిని నేనెప్పుడూ విడవను-నన్ను నీవు కూడా విడవవద్దు. మంచి మనస్సుతో అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం. పరస్పరం చర్చించుకొని కుటుంబ పనులను నెరవేరుద్దాం. అనుకూల దంపతులమై సంసార యాత్ర కొనసాగించుదాం. నువ్వు భూమివి-నేను ఆకాశాన్ని. నువ్వు వాక్కువు-నేను మనస్సును. నేను చేసే ధర్మ కార్యాలకు నీ సహకారం కావాలి. యోగ్యమైన సంతానాన్ని-సంపదను మనం ఇద్దరం కలిసి అనుభవించుదాం" అని దానర్థం. " రాత్రి గాని, పగలు గాని, ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో నువ్వుండాలి నీకు ఎటువంటి ఇబ్బందీ కలగరాదు. సుమంగళివై-సత్ సంతానంతో గృహలక్ష్మివై, అభివృద్ధి చెందాలి" అని రక రకాలుగా అనునయించే మాటలివి.
సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం. సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు, వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం వుంటుంది. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు. ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమితృల కోలాహలం మధ్య "భుజం బంతి భోజనాల" హడావిడి వుంటుంది. వధూవరులిద్దరిని పక్క-పక్కన కూచోబెట్టి, వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి, వరుసకు బావా-మరదళ్లలాంటి వారి వేళా-కోళాల మధ్య భోజన చేయడం ఆరంభించుతారు అందరూ. మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో వుంచడం, పక్క వారందరూ తినమని బలవంతం చేయడం అక్కడ జరిగే వేడుక.
ఉంగరాలు తీయడమనే "ప్రధానాంగుళీయకం" వేడుకలో మూత కురుచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోసి, దానిలో మెట్టెలు, ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నించే తంతుంటుంది. వుంగరం దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమితృల కోలాహలం చోటుచేసుకుంటుంది. ఆ కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది.
అప్పగింతలు-గృహ ప్రవేశం
కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో, వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ ఆ టైంలోపల జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు. కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు.
భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ: "అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా, అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు. బహుశా అప్పగింతల ద్వారా, పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం చేయడం కొరకు, ఈ వేడుకను జరిపిస్తుండవచ్చు.
అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో ఊయలలాగా చేసి, అందులో ఈ చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి ఆ బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాప-బాబును జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లనిపించిన తర్వాత, ఆడబిడ్డకు ఆ పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు.
ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది.
హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.