Sunday, June 12, 2022

నేటి నుంచి బడులు 2022

 సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి 

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!


ఈ రోజు నుంచి స్కూల్స్ మొదలు అవుతున్నాయి.. 

స్కూల్స్ చేసేసి శుభ్రం మళ్లీ సరస్వతీ నమస్తుభ్యం..

ఇన్నాళ్లు ఇంట్లోనే  కూర్చుందేమో చదువులమ్మ

బడికెళ్తే సాక్షాత్కారమౌను మరోసారి గురుబ్రహ్మ..!

కరోనా తర్వాత వాన కాలపు చదువుల్లాగా సాగింది ఇన్నాళ్లు 

స్కూల్స్ మొదలు అయ్యాయి సందడి కూడా మొదలు అయ్యింది 

ఇప్పుడు మళ్లీ  అక్షరాలకు చిగుళ్ళు..

కళకళలాడేనిక చదువుల గుళ్ళు..!

అయిందేదో అయ్యింది  ,పోయిన కాలం ఎదో పోయింది

కరోనా మహమ్మారి చదువులను మింగేసింది..

ఇప్పుడిక భయానికి సెలవు.. పూర్తిగా తెరుచుకుంది  చదువులమ్మ  కొలువు..!

మన ఇళ్లల్లో మొబైల్స్ కూడా కాస్త విశ్రాంతి దొరుకుంది 


ఒకప్పుడు మాస్టారు అంటే పట్టుకుంటారు బెత్తం   

చాక్పీసు ను విసిరి కొడతారు మన మీదకి 

వేయిస్తారు మనకి గోడకుర్చీలే 

నిలబెడతారు మంచి మండుటెండలో .. 

ఇప్పుడు కనిపించని హాజరు  మన బ్రతుకులే బ్రతుకే బేజారు..! 


వేసవి సెలవులు కావవి , వానాకాలం చదువులు

అప్పుడు  లాక్ డౌన్లతో చచ్చేంత చావు..

చదువుకే చాకిరేవు... బరువైపోయిన బ్రతుకు తెరువు

ఎవరిని అడిగిన వారి గుండె చెరువు..!

ఆన్లైన్ క్లాసులు.. ఎందుకొచ్చిన తిరకాసులు..

మా జేబుల్లోచి వెళ్ళేవి కాసులు 

ఇప్పుడు ఇక అమ్మవారి దయవలన  జరగాలి 

ఇక పాఠాల వరదే.. సరస్వతీ నమస్తుభ్యం వరదే..!

ఇక పాఠాల వరదే.. సరస్వతీ నమస్తుభ్యం వరదే..!

ఇక మన రోజులు ను గురిచూసుకుందాం కాసేపు 

తప్పులు చేస్తే గుంజీలు ఇంటర్వెల్ లో  గుడుగుడు గుంచాలు..

గంట కొట్టేటప్పటికి తుర్రుమంటూ ఇంటికి

అమ్మ పెట్టే జంతికల  కోసం వంటింటికి..!

ఇప్పుడు పెద్దవాళ్ళకి కొంచం కాస్త ఊరట లేకపోతె అమ్మ మొబైల్ , నాన్న మొబైల్ కి కాస్త రెస్ట్ ఉంటుంది .. 

నాకు ఒక చిరకాల కోరిక..అది నెరవేరుతుందో లేదో తెలియడం లేదు..

ప్రభుత్వం ఇన్ని పధకాలు, బోలెడు డబ్బులు ఖర్చు పెడుతున్నాయి కదా..

విద్య విధానం పై ఎక్కువ మక్కువ చూపడేందుకు 

ప్రభుత్వ పాఠశాలా,జిల్లా పరిషత్ స్కూల్స్ ఏమైయ్యాయి..గోడలాల్లోని రావి మొక్కలు, బీటలు వదిన  గోడలు తప్ప.. ఒకప్పుడు ఎంత బాగుండేవి..మంచి మంచి టీచర్స్ , ఉన్నత పాఠశాలను అన్ని కనుమరుగవుతున్నాయి..

ఇంతమంది వాలంటీర్ ఉన్నారు , బోలెడు ఫౌండషన్స్ ఉన్నాయి..పూర్వ విద్యార్థులు లో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు..డబ్బులు ఉన్నారు ఉన్నారు కాస్త ప్రభుత్వ పాఠశాలలు దత్తత తీసుకుని బాగుచెయ్యచ్చు కదా..

ప్రభుత్వం ఎందుకు ద్రుష్టి పెట్టడం లేదో తెలియదు.. ప్రభుత్వం పెట్టుబడి విద్య సంస్థలు మీద పెడితే చాల బాగుంటుంది..అది కూడా తారతమ్యం లేకుండా అందరికీ ఒకే ల చదువు.. ఆ సూర్యుడు అందరికీ వేడి , వెలుతురూ ఒకేలా ఇస్తారు కదా అలాగా.

మంచి మంచి పండితులు , అవధానం లు చేసే వారు జిల్లా పరిషత్ స్కూల్స్ లోనే ఉంటారు..వారి మంచి మాట , వారి కేవలం చదువే కాదు సంస్కారం కూడా నేర్పుర్టారు..

నా పిచ్చి కానీ మన రోజుల్లో చదువు ఇప్పటి రోజులు తో పోలిక..ఇప్పుడు చదువు కొంటున్నాము అంటే..

ఇట్లు 

వాణి నా రాణీ 

No comments:

Post a Comment