Monday, September 13, 2021

భాద్రపదమాసం శుద్ధ అష్టమి రాధాష్టమి

ప్రియమైన రాణీ బ్రదర్స్ కి రాధా అష్టమి శుభాకాంక్షలు 

రాధా రాసేశ్వరీ రాసవాసినీ రసికేశ్వరీ

కృష్ణ ప్రాణాధికా కృష్ణప్రియా కృష్ణస్వరూపిణీ

కృష్ణ వామాంగ సంభూతా పరమానంద రూపిణీ

కృష్ణా బృందావనీ బృందా బృందావనవినోదినే చంద్రావళీ చంద్రకాంత 

శరచ్చంద్రనిభాననా నామాన్యేతాని సారాణి తేషామభ్యంతరాణి చ ॥ 

భాద్రపదమాసం శుద్ధ అష్టమి ఈ దినమే రాధాష్టమి అని అంటారు.
భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి ‘రాధాష్టమి’ అని పేరు. ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.
శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలను సంద్భంగా రాధకృష్ణుల  స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తితో గీతాలు ఆలపింస్తారు.
 రాధారానిని కీర్తిస్తూ వైష్ణవ ఆచార్యులు స్వరపరిచిన అద్భుత పాటలు ఆలపిస్తారు. అమ్మవారికి విశేష హారతి తర్వాత పవళింపు సేవ నిర్వహింస్తారు.
రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం.తనను తాను ప్రేమించుకుందుకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.
మాధవుడు సౌందర్యసారసర్వస్వం. కోటి మన్మధ లావణ్య కోమలాంగుడు. త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు. సకల సద్గుణ భూషితుడు. నిర్మల హృదయుడు. నిర్గుణుడు. అది బృందావనం. కృష్ణాష్టమి పర్వదినం. ఈ ప్రత్యేక సందర్భానికై జాజుల దారాలతో నేయించి, వెనె్నలతో అద్దకాలు వేయించి, పాల నురగతో సరిగంచులు దిద్దించిన కొత్త చీర ధరించి,విశేషమైన అలంకారాలతో, చందనం పూసిన కుందనపు బొమ్మలా వినూత్న శోభను విరజిమ్ముతున్నది రాధ. ఆమె ఎదురుగా కృష్ణుడు, సహజాలంకార సుందరుడు, రాగరంజితుడు, అనురాగ బంధితుడు రాధ సన్నిధిలో ఏకాంతంలో తన్మయుడై ఉన్నాడు.
రాధాయ నమః అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని,అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.
రాధాకృష్ణులు- ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది.అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.
గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు.
 శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.
శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.
రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం'గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం.

వృషభానుడు,కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు.  శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి'గా వ్యవహరిస్తారు.

యశోదా ప్రియసుతుడు, ఉదయచంద్ర వదనుడు, సౌమ్య, సౌజన్యగుణధాముడు శ్రీకృష్ణుడు. అద్వితీయ సౌందర్యరాశి, అనుపమాన ప్రేమవారాశి రాధాదేవి. అనిర్వచనీయం, వర్ణనాతీతం, అలౌకికం, జగదేక ప్రేమకావ్యం ‘రాధామాధవం’.

మనకి బాబయ్య రోజు కి ఒక నామం ని మన కోసం తెలియచేస్తున్నారు. మన కృష్ణ బాబయ్య రాధా సహస్ర నామం ను కూడా పుస్తక రూపం లో ప్రచురించారు 

ఇట్లు 
రాణీ బ్రదర్స్ 

Saturday, July 17, 2021

బమ్మెర పోతన!

 బమ్మెర పోతన!

బమ్మెర పోతన సహజ పాండిత్యుడు, సద్గుణ సంపన్నుడు, వినయ విద్యా వివేక వినిర్మల త్రివేణీ సంగమ స్నాతుడు, శ్రీ రామ పాద సేవార్చనా దురంధరుడు ఐన బమ్మెర పోతన మహానుభావుడు సంస్కృతం లోని భాగవతమును తెలుగులోకి అనువదించినవాడు మాత్రమే కాదు..శ్రీ కృష్ణ లీలామృత భాగవతంను సంస్కృతం తరవాత దేశ భాషలలోనికి అనువదించడం ఈయనతోనే ప్రారంభం ఐంది. సంస్కృత భాగవతం తొలిగా తెలుగులోకి అనువదింప బడిన తర్వాతనే ఇతరదేశ భాషలలోకి అనువదించడం మహానుభావులు ఎందరో మొదలు బెట్టారు.

భక్తి వేదాంత తత్త్వంలో ప్రసిద్ధుడు అగ్రగణ్యుడు అని భావింప బడేకృష్ణ చైతన్యులు వంగ దేశంలో క్రీ.శ.1485 నుండి 1533 వరకూ జీవించినవాడు.ఆసేతు హిమాచలం పర్యటించిన కృష్ణ చైతన్యుడు పోతన వారి భాగవతంచేత ముగ్దుడైనాడు. చైతన్యుడు తెలుగు దేశానికి వచ్చినట్లుగా గుర్తుగా మంగళగిరి లో ఆయన పాదుకలు చెక్కబడి వున్నాయి. ఆతర్వాతి వాడైన మరొక మహానుభావుడు వల్లభాచార్యుల వారు తెలుగు బ్రాహ్మణుడు, ప్రత్యక్షంగా పోతన భాగవతం చేత ప్రభావితుడుఐన వాడు. చత్ర పతి శివాజీ మహారాజు గురువు, శ్రీ రామ, ఆంజనేయ సాక్షాత్కారం పొందినమహా ఉపాసకుడు, సమర్ధ రామదాసు మహారాష్ట్ర నుండి ప్రత్యేకంగా వచ్చి మరీ పోతనఆంధ్ర మహాభాగవతాన్ని విన్నాడు, పులకించి పోయాడు, ఈ విషయాలను ఆయనతన 'దాస బోధ' అనే గ్రంధం లో పేర్కొన్నాడు.

కౌండిన్య గోత్రము, అపస్తంభ సూత్రము నకు చెందిన వాడనని, కేసన, లక్కమాంబల పుత్రుడనని, తిప్పన తమ్ముడనని పోతన గారు తన ఆంధ్ర మహా భాగవత అవతారికలో చెప్పుకున్నారు.పురాణం హయగ్రీవ శాస్త్రి గారు, వావిలికొలను సుబ్బా రావు గారు, కందుకూరి వీరేశ లింగం పంతులు గారు ప్రభ్రుతులు పోతన రాయల సీమ లోని వొంటి మిట్ట వాడని భావించినా తర్వాత తమ అభిప్రాయములను మార్చుకున్నారు. ఆ తర్వాత మరికొందరు చారిత్రక పరిశోధకులు, సాహిత్యపరిశోధకులు, ప్రసిద్ధులు ఐన కొమర్రాజు లక్ష్మణ రావు గారు, శేషాద్రి రమణ కవులు, అనుముల సుబ్రమణ్య శాస్త్రి గారు, నిడదవోలు వేంకట రావు ప్రభ్రుతులు సాహిత్య, చారిత్రక, శాసనముల ఆధారములతో గుముదూరు శాసనంలో పేర్కొన బడిన వరంగల్ సమీపంలోని బమ్మెర గ్రామమే పోతన గారి జన్మ స్థలం అని నిర్ధారించి ఈ చర్చకు ఆంధ్ర దేశంలోని పండితులందరూ ముగింపు పలికారు. అంతే కాదు పోతన గారి ఆంధ్ర మహాభాగవతం లోని మిగిలిన భాగాలను పూరించిన వెలిగందల నారయ, ఏర్చూరి సింగన, గంగనలు కూడా వరంగల్ చుట్టు ప్రక్కలి ప్రాంతములకు చెందిన వారే అని నిరూపించారు. పోతనకు ప్రౌఢ సరస్వతి అని బిరుదు పొందిన కుమారుడు, అతని కుమారులైన కేసన, మల్లన సోదరులు (వీరు దాక్షాయణీ పరిణయం అనే గ్రంధ రచన చేశారు). బమ్మెర వారి యింటి ఆడ పడుచును పెండ్లి చేసుకున్న అజ్జరపు పేరయ లింగ కవి(ఇతను ఒడ నంబి విలాసం అనే వైష్ణవ భక్త శిఖామణిగురించిన గొప్ప గ్రంధం వ్రాశాడు)..ఇలా పోతన అనంతరం కూడా ఆ భక్తి, పాండిత్య విశేషాలు ఆయన వంశీకులకు సంప్రాప్తించాయి..వీరందరూ కూడా వరంగల్ ప్రాంతం వారే కావడం గమనార్హం.

పోతన కాలం గురించి రక రకాల పరిశోధనలు, వ్యాసాలూ వెలువరించిన ఈ వ్యాసంలో పైన పేర్కొనబడిన వారు అందరూ పోతన పదిహేనవ శతాబ్దమునకు చెందిన వాడని అంగీకరించారు. ఈ చిన్ని వ్యాసంలో పోతన ఆంధ్ర మహాభాగవత విమర్శ సాధ్యం కాదు గనుక క్లుప్తంగా చెప్పడం కోసం ఒక ఆధ్యాత్మిక, వేదాంత గ్రంధాన్ని సర్వ జనరంజకంగా, అద్భుతమైన పద గుంభనతో, లలితమైన పద విన్యాసంతో, భక్తి, పాండిత్యం, చమత్కృతి, భావుకత్వం నిండిన సంగీత మాధుర్యం పండిన కవన శైలితో తీర్చి దిద్దిన మహానుభావుడు పోతన.

తెలుగు పద్యానికి అత్యున్నత ఉదాహరణపోతన కవిత్వం. సంస్కృతంలో ఆది శంకరుడు తెలుగులో బమ్మెర పోతనలకు మాత్రమే సాధ్యమైన శైలి ఇది. మహానుభావులైన నన్నయ, తిక్కన, ఎర్రనలు, శ్రీనాధ మహాకవి, పెద్దన, రాయలు,భట్టు మూర్తి, తెనాలి రామ కృష్ణుడు, పింగళి సూరన, చేమకూర వేంకటకవి.. ఎందరున్నారు..ఎంతని పొగడ గలము..

ఆంధ్ర సాహిత్య సరస్వతీ పద నూపుర ధ్వనులెంత మధురిమలు? ఐనా..వచన రచనకు పోతనకు మించిన వారు ఎవరూ లేరు..నైమిశారణ్య వర్ణనం, నృసింహ ఆవిర్భావ ఘట్టం, వైకుంఠ వర్ణనం, రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో రుక్మిణి వర్ణనం, ద్వారకా పురి వర్ణనం, ఇలా ఆంధ్ర మహా భాగవతం మొత్తం అద్భుతమైన వచన రచనా విలాసంతో నిండి వున్నది.ఇక పద్య రచనా విధానం పొగడడానికి ఉద్గ్రంథా లౌతాయి. పద్యాలతో వర్ణ చిత్రాలు, భావ చిత్రాలు, చలన చిత్రాలు,నిశ్చలన చిత్రాలు, కుడ్య చిత్రాలు, మణిమయ సువర్ణ సౌధాలు..నిర్మించిన వాడు పోతన! భీష్మ ఘట్టం మొత్తం అద్భుతమైన వర్ణ చిత్రం. దశమ స్కంధం సాంతం నిరుపమానమైన భావ చిత్రం. వామన ఘట్టం లో ఎదుగుతున్న వామనుడిని 'ట్రెంచ్' షాట్లో చూపించాడు. గజేంద్ర మోక్షణం లో వైకుంఠ పురిని జూమ్ లెన్స్ లో చూపించాడు !

అద్భుతమైన కుడ్య చిత్రాలుగా, నిశ్చలన చిత్రాలుగా తమ ప్రణయ, దాస్య భక్తిలో నిశ్చేష్టులైన రుక్మిణి, ప్రహ్లాదుడు, నారదుడు, కుంతీ, కుచేలుడు,ఉద్ధవుడు, అర్జునుడు, గోపికలు..వీరందరి నవరస భావ ప్రకటనలతో కూడిన వర్ణ చిత్రాలుగా ఆయా ఘట్టాలను ఆవిష్కరించాడు! తెలుగు కవులలో భక్తికి గానీ,పాండిత్యానికి గానీ, వేదాంతానికి గానీ, నిజాయితీ తో కూడిన అత్మాభిమానానికి గానీ, వినయంలో గానీ,విచక్షణ లో గానీ, మృదువైన, మెత్తనైన, సంగీతమయమైన. ఆర్ద్రమైన, ఆనందాంబుధిలో ముంచెత్తే అమర భాగీరధీ ప్రవాహ సమాన పవిత్రతలో గానీ.. పోతన ను మించిన వారు లేరు, రారు

దశమ స్కంధము - ఉత్తర భాగం

 ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

గత 16 నెలలు నుంచి మనకి గంగా ప్రవాహం లా జరిగియే శ్రీ మద ఆంధ్ర మహా భాగవతం ఘట్టం ఈ రోజు అష్టమి తిధి కి దశమ స్కంధం లో ఉన్న ఉత్తర భాగం పరిపూర్ణమైనది..ఎందుకో తెలియదు ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి . అప్పుడే భాగవతం అయిపోతోందా అని..

ఆ శ్రీకృష్ణ పరమాత్మా దయవలన ఇప్పటి వరకు ఎన్ని ఆటకంకాలు వచ్చినా , మన పూజ్య గురువు గారు భాగవతం ను లోక కళ్యణమ్ కోసం , కరోనా నివారణార్ధం సంకల్పించి , చివరిలో మృత సంజీవిని మహా మంత్రం  తో పూర్తి చేసుకుంటున్నాము..

ఎన్ని  జన్మల పుణ్య ఫలం , మన శివ పరివారం కు భాగవత శ్రవణం. 

గురువు గారు కి స్పందన ఎలా తెలియచేయాలో తెలియయడం లేదు.., ఈ రోజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి 

సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే

తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్

సమస్త పురాణాలను సంస్కృతంలో మూలరచన గావించిన వారు, వేదాలను విభాగించిన వారు వ్యాస భగవానులు. అన్నిటిలోకి ఉత్తమమైన శ్రీమద్భాగవతంలో భగవంతుని గురించి భాగవతుల గురించి చెప్పబడింది. అందుకే సద్యోముక్తి సాధనమిది.

భాగవతంలో పారమార్థానికి ప్రాధాన్యం. అందుకే పోతనామాత్యులవారు గ్రంధారంభం లోనే తెలియాచేసారు 

సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి. అదే విధం గా మా పూజ్య గురువు గారు మా అందరికీ తెలియాచేసారు 

ఈ రోజుతో మనకి దశమ స్కంధం లో ఉత్తరభాగం పూర్తి అయినది..

ఒక్కసారి మనకి దశమ స్కంధం లో ఉత్తర భాగం లో ఏమిటన్నాయో తెలుసుకుందామము 

ఇది పరమేశ్వరుని దయ వలన కలిగిన కవితావైభవం కలవాడు, కేసన మంత్రి పుత్రుడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన శ్రీ మహాభాగవతం అనే మహాపురాణంలో ప్రద్యుమ్నుని జన్మము; శంబరాసురుని వృత్తాంతము; సత్రాజిత్తునకు సూర్యుడు శమంతకమణిని ఇచ్చుట; ఆ కారణముచేత ప్రసేనుడిని సింహము చంపుట; దానిని జాంబవంతుడు చంపి మణిని తీసుకెళ్ళుట; గోవిందుండు ప్రసేనుని చంపి శమంతకమణిని తీసుకుపోయాడు అని సత్రాజిత్తు శ్రీకృష్ణుడి మీద నింద వేయుట; శ్రీకృష్ణుడు అందుకోసం జాంబవంతుడిని ఎదిరించి రత్నముతో పాటుగా జాంబవతిని తీసుకువచ్చి వివాహము చేసికొనుట సత్రాజిత్తునకు మణిని ఇచ్చుట; సత్యభామా పరిణయము; పాండవులు లక్క ఇంటిలో కాలిపోయారు అని విని కృష్ణుడు బలభద్ర సహితుడు అయి హస్తినాపురమునకు వెళ్ళుట; అక్రూర కృతవర్మల అంగీకారముతో శతధన్వుడు సత్రాజిత్తుని చంపి శమంతకమణిని తీసుకుపోవుట; ఆ విషయమై సత్యభామ హస్తినాపురమునకు వెళ్ళి కృష్ణునికి చెప్పగా అతను వెనుకకు వచ్చి శతధన్వుని చంపుట బలరాముడు మిథిలానగరమునకు వెళ్ళుట; అక్కడ; దుర్యోధనుడు బలరాముని వద్ద గదావిద్య నేర్చుకొనుట; కృష్ణుడు సత్రాజిత్తునకు అపరకర్మలు చేయుట; శమంతకమణిని దాచిన అక్రూరుడు భయముతో ద్వారక విడిచి పోవుట; అతను లేకపోవుటచేత అనావృష్టి కలుగగా శ్రీకృష్ణుడు అక్రూరుని మరల రప్పించుట; దామోదరుడు ఇంద్రప్రస్థ పురమునకు వెళ్ళుట; అక్కడ అర్జునుని; సమేతుడు అయి వేటకి అడవికి వెళ్ళి కాళిందిని తీసుకు వచ్చుట; ఖాండవ దహనము చేయుట; అగ్నిదేవుడు అర్జునునికి అక్షయ తూణీరములు, గాండీవము, కవచము, రథము, గుఱ్ఱములు ఇచ్చుట; మయుడు ధర్మరాజునకు సభ నిర్మించి ఇచ్చుట; నగధరుండు తన పట్టణమునకు వెనుతిరిగి వచ్చి కాళిందిని; వివాహమాడుట; మిత్రవింద, నాగ్నజితి, భద్ర, మద్ర రాజకన్యలను వరుసగా పెండ్లాడుట; నరకాసురునితో యుద్ధము అతని గృహములో ఉన్న రాజ కన్యలను పదహారువేల మందిని (16,000) తీసుకు వచ్చుట; స్వర్గ గమనము; అదితికి చెవికుండలములను ఇచ్చుట; పారిజాతాపహరణము; పదహారువేల మంది (16,000) రాజకన్యలను పరిణయ మాడుట; రుక్మిణీదేవి విప్రలంబము; రుక్మిణీదేవి స్తోత్రము; కృష్ణకుమార ఉత్పత్తి; వారి గురువుల లెక్క; ప్రద్యుమ్నుని వివాహము; అనిరుద్దుని జన్మము; అతని వివాహం కోసము కుండిననగరమునకు వెళ్ళుట; రుక్మి బలభద్రుల జూదము, రుక్మి వధ; ఉషాకన్య కలలో అనిరుద్ధుని చూసి మోహించుట; చిత్రరేఖ సకల దేశాల రాజులను చిత్రపటముపై లిఖించి చూపించి అనిరుద్ధుని తీసుకువచ్చుట; బాణాసురయుద్ధము; నృగోపాఖ్యానము; బలభద్రుని ఘోషయాత్ర; యమునను చీల్చుట; శ్రీకృష్ణుడు పౌండ్రకవాసుదేవుడు, కాశీరాజులను చంపుట; కాశీరాజు కొడుకు సుదక్షిణుడు అభిచారహోమం చేసి కృత్యను కృష్ణునిమీదకి పంపగా సుదర్శనచక్రము కృత్యను, సుదక్షిణుడు సహితంగా కాశీపురమును కాల్చివేయుట బలరాముడు; రైవతనగరములో ద్వివిదుని వధించుట; సాంబుడు దుర్యోధనుని కూతురు లక్షణను ఎత్తుకురాగా కౌరవులు అతనిని తీసుకువెళ్ళి చెఱబెట్టుట; ఆ విషయము నారదుని వలన విని బలరాముడు హస్తినాపురమునకు వెళ్ళుట; కౌరవులు ఆడిన అవమానపు మాటలకు కోపగించి హస్తినాపురమును గంగానదిలో పడవేయ బోవుట; కౌరవులు భయముతో అంగనాయుక్తముగా సాంబుడుని ఇచ్చుట; బలరాముడు ద్వారకకు వచ్చుట; నారదుడు, కృష్ణుడు పదహారువేల (16,000) కన్యకలను ఒకే ముహుర్తంలోనే అందఱికి అన్ని రూపులుతో పెండ్లి ఆడెను అని విని ఆ విధానము తెలిసికొన కోరి వచ్చుట; ఆ మహాత్మ్యమును చూసి మరలిపోవుట; జరాసంధుడి చేత చెరపట్టబడిన రాజులు కృష్ణుని వద్దకు దూతను పంపించుట; నారదుని ఆగమనము; పాండవుల ప్రశంస; ఉద్ధవుడు చేయవలసినపని తెలియజెప్పుట; ఇంద్రప్రస్థకు వెళ్ళుట; ధర్మరాజు రాజసూయ యాగము ప్రారంభము; దిగ్విజయము; జరాసంధ వధ; రాజులను చెరనుండి విడిపించుట; రాజసూయ యాగము నెఱవేర్చుట; శిశుపాలవధ; అవభృథము, రాజసూయ యాగముల వైభవము చూసి సహించలేని దుర్యోధనుడు మయసభలో కట్టుకొన్న బట్టలు తడిసిపోవునట్లు తూలుట; తన్నిమిత్తమైన పరాభవమును పొంది రారాజు వెళ్ళిపోవుట; కృష్ణుడు ధర్మరాజుచేత వేడుకొనబడి నిలిపి కొన్ని నెలలు ఖాండవప్రస్థము నందు ఉండుట; సాళ్వుడు తపస్సు చేసి హరుని మెప్పించి సౌభకము అను విమానము పొంది ద్వారకానగరమును నిరోధించుట; యాదవ సాళ్వ యుద్ధము; కృష్ణుడు వెనుదిరిగి వచ్చి సాల్వుని చంపుట; దంతవక్త్రవధ; విదూరథుని మరణము; కృష్ణుడు యాదవ సైన్యములతో మరలి ద్వారకకు వెళ్ళుట; కౌరవ పాండవుల యుద్ధము జరుగును అని బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళుట; అక్కడ జాహ్నవీనది మున్నగు నదులందు స్నానముచేసి, నైమిశారణ్యమునకు వెళ్ళుట; అక్కడి ఋషులుచే పూజింపబడి దగ్గరలో ఉన్నత ఆసనముపై కూర్చుండి ఉన్న సూతుడు తనను చూసి లేవకపోవుటకు అలిగి బలరాముడు దర్భమొనతో అతనిని వధించుట; బ్రహ్మహత్యా దోషము కలిగినది అని మునులు చెప్పగా సూతుని; పునరుజ్జీవుని చేయుట; బలరాముడు ఇల్వలుని కొడుకు పల్వలుని చంపుట; వారి అనుమతిపొంది బలరాముడు ఆ సమీప తీర్థము లందు స్నానము చేసి గంగాసాగర సంగమమునకు వెళ్ళుట; మహేంద్ర పర్వతము చేరుట; పరశురామ దర్శనము; సప్తగోదావరిలో స్నానము చేయుట; ఇంకను ఉన్నట్టి తీర్థములందు స్నానము చేసి, శ్రీశైలము, వేంకటా చలములు దర్శించుట; వృషభాద్రి హరిక్షేత్రము సేతుబంధము రామేశ్వరములను దర్శించి తామ్రపర్ణి యందు జలకాలు ఆడుట; గోదానములు చేసి; మలయగిరిలో అగస్త్యుని దర్శించుట; కన్యాకుమాని కొలచుట; అక్కడ బ్రాహ్మణుల వలన పాండవ కౌరవుల యుద్ధమునందు సకల రాజులు చనిపోయిరి అని, భీమ సుయోధనులు గదాయుద్ధమునకు సిద్ధపడ్డారు అని విని వారిని వారించుటకై బలరాముడు అక్కడకు వెళ్ళుట; అక్కడ వారిచేత పూజింపబడి వారిని వారింపలేక వెనుదిరిగి ద్వారకకు వెళ్ళుట; మరల నైమిశారణ్యానికి పోయి అక్కడ యాగము చేసి రేవతీదేవి తాను అవభృతస్నానములు చేసి ద్వారకు వచ్చుట; కుచేలోపాఖ్యానము; సూర్యగ్రహణము నందు కృష్ణుడు బలరాముడు పురరక్షణకు కొడుకులను నిలిపి పదహారువేల స్త్రీలతోకూడి అక్రూర వసుదేవ ఉగ్రసేనాది యాదవశూరులు కూడ రాగా శమంతపంచకం వెళ్ళి స్నానములు చేసి వసియించి ఉండుట; పాండవ కౌరవాది సకల రాజులు ఆ తీర్థమునకు వచ్చుట; కుంతీదేవి దుఃఖము; నందయశోదా సహితులు ఐన గోపగోపికా జనాలు వచ్చుట; కుశలప్రశ్నలు ముచ్చట్లు; మద్రరాకుమారి లక్షణ ద్రౌపదీదేవిల ముచ్చట్లు; పిమ్మట, సకల రాజులు శమంతపంచకమున స్నానములు చేసి బలరామ కృష్ణాది యాదవ శూరుల అనుమతులు తీసుకొని తమ రాజ్యముకు పోవుట; కృష్ణుని దర్శించుటకు మునీంద్రులు వచ్చుట; వారి అనుమతితో వసుదేవుడు యాగము చేయుట; నంద యశోదాది గోపికలను తమ పురమునకు పంపించి ఉగ్రసేనాది యాదవ వీరులు తాను కృష్ణుడు ద్వారకకు చేరుట; ఇంతకు మునుపు కంసునిచేత చనిపోయి బలి పట్టణమునందు ఉన్న దేవకీదేవి పుత్రులను రామకృష్ణులు యోగమాయా బలంతో తీసుకు వచ్చి ఆమెకు ఇచ్చుట; అర్జునుడు సుభద్రను పెండ్లాడుట; కృష్ణుడు మిథిలకు వెళ్ళుట; శ్రుతదేవ జనకుల చరిత్రలు; బ్రాహ్మణ ప్రశంస; శ్రుతిగీతలు; కృష్ణుడు మఱలి తన నగరమునకు వచ్చుట; హరి హర బ్రహ్మదేవుల తారతమ్య వృత్తాంతము; కుశస్థలి విప్రుని చరిత్ర, అతని కొడుకులు చనిపోగా కృష్ణార్జునులు వారిని తీసుకు వచ్చి విప్రునకు ఇచ్చుట; కృష్ణుడు అర్జునునికి వీడ్కోలుచెప్పి ద్వారకకు వెళ్ళుట; అక్కడ మాధవుడు ఎల్ల భార్యలచేత పరివృతుడు అయి విహరించుట; యాదవ వృష్ణి భోజ అంధక వంశముల చరిత్రలు అనే కథలున్న దశమ స్కంధము లోని ఉత్తర భాగము.

*ఓం నమో భగవతే వాసుదేవాయ!!*

ఓం! ఓం! ఓం! 

ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!

సర్వే జనా స్సుఖినో భవతు!!


ఇట్లు 

శివపరివారం 

Saturday, July 10, 2021

గురువు గారు - శివ పరివారం

ఈ నెల 24 వ తారీఖున గురు పౌర్ణమి అయ్యింది.. ఆ తర్వాత రోజున ఆదివారం నాడు మా పూజ్య గురువు గారు అయినా శ్రీ రాళ్లబండి రామ కృష్ణ శర్మ గారు కి మేము చిరు సత్కారం చేసుకోవాలని పరమేశ్వర సంకల్పం 

ముందుగా మా గురువు గారు గురించి ఓ నాలుగు మాటలు , మా గురువు గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు (ప్రైవేట్ పాఠశాలా లో ) గా పనిచేసారు .  కొన్ని కారణాలు వలన ఉపాధ్యా య వృత్తి కి స్వస్తి చెప్పి , తానూ నమ్ముకున్న ఆధ్యాత్మిక మార్గం లో మా గురువు గారు నిత్యా కర్మానుష్ఠానం చేసుకుంటూ  ఆధ్యాత్మికం గా మా శిష్యులు అందరికీ దగ్గరయ్యారు.. మా అందరికీ ఆధ్యాత్మిక గ్యాన బోధ , సమయాచారం సదాచారం అన్ని వివరిస్తూ , మాకు తెలియని ఎన్నో విశేషాలు మాకు తెలియపరిచారు..

మా గురువు గారు పుట్టిన ప్రదేశం గుడివాడ , కృష్ణ జిల్లా , తల్లి తండ్రులు సుబ్రహ్మణ్య దీక్షితులు , అన్నపూర్ణమ్మగారు 4 వ సంతానం 

మా గురువు గారు ఆంధ్ర యూనివర్సిటీ లో MA ఎకనామిక్స్ మరియు MA ఇంగ్లీష్ కూడా చేసారు.. మా గురువు గారు అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడగలుగుతారు , పని చేసిన స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం , తండ్రి గారు ద్వారా సంస్కృతం మరియు భారతము  భాగవతం విశేషాలు కూడా చిన్నతనం నుంచి నేర్చుకున్నారు.ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు 

మేము మా గురువు గారు తో పెట్టుకున్న సత్సంఘం పేరు శివ పరివారం 

మేము ఏ కార్యక్రం చేసిన సర్వం శ్రీ శివ పరివారం అని  చేస్తాము.. 

మా శివ పరివారం విశేషం ఏమిటంటే ప్రతి నెల మొదటి ఆదివారం నాడు తప్పనిసరిగా స్వామి వారికీ పాశుపత రుద్రాభిషేకం , లేదా ఆ రోజు విశిస్థను బట్టి అన్నాభిషేకం , పుష్పాభిషేకం ,లేక పంచ అమృతం తో స్వామి వారికీ పాశుపతం చేసుకుంటాము 

ఇలా 2005 నుంచి ఇప్పటివరకు ఎక్కడ బ్రేక్ లేకుండా చేసాము అది కూడా ఎవరు  పిలిస్తే వాళ్ళ ఇంటికి. వెళ్లి ఆ మహాదేవుడికి అభిషేకం చేసి వస్తాము . మాకు కావలసింది భక్తి శ్రద్ద..ఏనాడూ మేము ఎవరి దగ్గర దక్షణా ఆశించలేదు..తిరిగి మేమె దేవాలయం లో అభిషేకం చేసి దేవాలయ పునరుద్దరణకు కొంత ఇచ్చేవాళ్ళం. దక్షినాపేక్ష లేకుండా ఉండడమే ఆ గురువు యోక్క్క విశిష్టత..

శాస్త్రం లో ఒక మాట ఉంది , ఏ ఇంట్లో అయితే ధూప దీప నైవేద్యాలు తో ఇల్లు ఉంటుందో., ఏ ఇంట్లో అయితే శివ అభిషేకం లేదా ఈశ్వరాభిషేకం జరుగుతుందో ఆ ఇల్లు ని గృహముగా పరిగణిస్తారు అని మా గురువు గారు మాకు తరచూ చెబుతూ ఉంటారు..

అసలు ఆధ్యాత్మిక గురువు కి నిర్వచనం ను ఒక్క మాటలో చెప్పాలంటే  మా పూజ్య గురువు గారు ..వారి సతీమణి గారు . వారి ఇల్లు నిత్యం గంగ ప్రవాహం లా ఉంటుంది..

మా అందరి ద్రుష్టి లో అది వారి గృహం కాదు . మా అందరికీ అమ్మవారు ఉండే దేవాలయం. 

నిత్యం చండీ పారాయణ, అభిషేకాలు , వ్రతాలూ, సుందరకాండ పారాయణాలు , మా శిష్య బృందం లో ఎవరు ఏమి శుభకార్యం చెయ్యాలన్న గురువు గారు ఇంటికి వచేస్తాము ఆ స్వామి వారికీ అభిషేకం గురువు గారు దగ్గర చేసుకుంటాము..

ప్రతి పౌర్ణమికి , మరియు మాస శివరాత్రి మా గురువు గారు ఇల్లు దేవాలయ మంటపం లా ఉంటుంది.. అది చాల విశిష్టమైనది గా ఆ రోజుని చేసుకుంటాము..

అలాగే శని త్రయోదశి రోజున స్వామి వారికీ తైలాభిషేకం చేసుకుంటాము..

మనకి ఏది కావాలన్నా ఒకటే మార్గం ఆ స్వామి వారికీ అభిషేకం చేసుకోవడం.. అంటే..

ఈశ్వరుడికి తెలియనిది ఏముంటుంది..అంటారు గురువు గారు ..

 ఆలా స్వామి వారికీ  అభిషేకం మరోపక్క చండీ పారాయణాలు జరుగుతూ ఉంటాయి.. 

మా గురువు గారు చండీ ఉపాసకులు , దశ మహావిద్యలు ఉపాసన మంత్రం తో చేసుకుతూ ఉంటారు....

ఇప్పటికే అమ్మవారి దశ మహా విద్యలు లో 6 వరకు హోమాలు చేసారు 

అలాగే అమ్మవారి శతచండీ మహా యాగం కూడా చేసారు  ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు తో నిర్వహించారు.. శతచండీ యాగం అత్యంత అత్బుటం గా జరిగింది అనడానికి నిదర్శనం మా అందరికీ హోమగుండం లోంచి అమ్మవారు కనబడినది.

అలాగే గురువు తో తీర్ధయాత్ర అంటారు..మేము మా గురువు గారు తో కాశీ మరియు నైమిశారణ్యం ను చూడగలిగాము.. అక్కడ  విశిష్టత ను మాకు తెలియచేసారు.. అలాగే పుణ్యకేత్రాలు ,ఉజ్జయిని మొ.. ప్రదేశాలు కూడా చూసాము

కాశీ లో దేవి నవరాత్రులు , చివరిగా చండీ హోమం చేసుకున్నాము . సాక్షాతూ ఆ కాశీ విశ్వేశ్వరుడే మాకు ఆ హోమం చేయించారా అన్నట్టు గా జరిగింది.. ఎందుకంటే దసరా రోజున , కాశీ మహా పట్టణం లో బాషా కానీ ప్రదేశం లో మేము చండి హోమం ఎలా నిర్వహించాలి అని ఆలోచించుకున్నాము.. మేము పరివారం తో మొదటి సారి, అమ్మవారు ని ప్రార్ధిచగా కాశీ దేవాలయ పండితుడు ఒకరు పంపారు అని అయన పేరు శ్యామ్ గారు ఒక్క నలుగురు వేదం పండితులు తో వచ్చి వారే స్వయం గా చేసారు.. మేము దక్షిణ ఇస్తుంటే , కాశీ వచ్చి మీరు నాకు దక్షిణ ఇస్తారా అని ఒక చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు..ఇప్పటికీ ఆ సన్నివేశం మా అందరి కళ్ళల్లోనూ మెదులుతోంది..

ఇలాగే నైమిశారణ్యం లో కూడా అంటే  మా టీచర్ గారు ఇక నడవలేను అని కూర్చుంటే , హనుమంతుడి ఒక బ్రాహ్మణుడు వేషం లో వచ్చి మా టీచర్ గరుని మాటల్లో పెట్టాలి నైమిశారణ్యము మొత్తం నడిపించి చూపించారు..అంతా ఈశ్వరుడు మాకు ఇచ్చిన గురువు గారు ఆశీస్సులు 

మా గురువు గారు పూర్ణ దీక్షపరులు , శిష్యులకి కూడా కొంత మందికి పూర్ణ దీక్షత్వం ఇచ్చారు..

ఒక గురువు వారి శిష్యులు కి పూర్ణ దీక్షత్వం ను ఎలా ఇవ్వాలో , శాస్త్రం లో ఎలా ఇస్తారో అలాగే ఇచ్చారు.. ఒక గురువు శిష్యుడికి  అడిగిన వెంటనే ఎప్పుడు మాత్రం లాంటివి ఇవ్వరు. ఆ గురువు శిష్యుడిని గమనిస్తూ , అతనికి మంత్రం మీద ఉన్న ఆసక్తిని గురు శుశ్రూషని బట్టి గురువు ఆ శిష్యుడికి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో అప్పుడే మంత్రం లాంటిది ఇస్తారు..ఒక గురువు శిష్యుడికి మంత్రం ఇచ్చారు అంటే గురువు తన ఊపిరిని కొంత ఇస్తున్నట్లు గా మా గురువు గారు భావిస్తారు..

అలాగే మా గురువు గారు శిష్యులు లో ఎవరికీ కష్టం వచ్చినా తనకి వచ్చినట్టే బాధపడతారు. వారికోసం అమ్మవారు ని ప్రాధేయపడతారు 

అలాగే మాస శివరాత్రి , మహా శివరాత్రి ని అత్యంత వైభవం గా జరుపుకుంటాం మా శివ పరివారం.

మా శివ పరివారం కు మహా శివ రాత్రి వచ్చిందంటే చాలు అది ఒక పెద్ద పండగా చేసుకుంటము..ఏకాదశ రుద్రం , అఖండ రుద్రాభిషేకం , ఏకవారం, ఆలా అన్ని రకాలు గా జరుగుతాయి.. కావలసిన పదార్ధములు పరివారం లో సభ్యులు ముందుగా నిర్ణయిచుకుని ఏర్పుటు చేస్తారు. అలాగే ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కూడా అంటే ప్రదోష వేళా సమయం కు కచ్చితం గా ఆ స్వామి వారికీ అభిషేకం చెయ్యాలి అని సంకల్పం..

శాస్త్రం లో మనకి నవరాత్రలు నాలుగు వస్తాయి ,నవరాత్రులూ అనగానే మనకి ముందుగా ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు తలంపుకు వస్తాయి!

అలాగే చైత్ర మాసం లో వచ్చే వసంత నవరాత్రులు కూడ మనకి పరిచయమే!

ఈ రెండూ కాక మరో రెండు నవరాత్రులు వున్నాయి.వాటి గురించి చిన్న వివరణ.

1 చైత్రమాసమున వసంత నవరాత్రములు

2 ఆషాఢమున వారాహీ నవరాత్రులు

3 ఆశ్వీజమున శరన్నవరాత్రులు దుర్గాదేవి

4.మాఘమాసమున శ్యామలదేవి నవరాత్రులు.

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు.ఆషాఢ శధ్ధ పాడ్యమి నుండీ వారాహీ నవరాత్రలు ప్రారంభం! అవి గుప్తం గా చేసుకుంటారు 

ఆశ్వీజమున జరిగే  శరన్నవరాత్రులు మా గురువు గారు ఇంట్లో  అంగ రంగ వైభవం గా జరుగుతాయి..నిత్యం అమ్మవారి అలంకరణ, పూజ, పరివారం లో సభ్యులు, పగలు ఉపవాసం ,రాత్రి భోజనాలు , సాయంత్రం అమ్మవారి కుంకుమ పూజ, సువాసిని పూజ,

ఒక్కసారి గా చుస్తే శృంగేరి లో అమ్మవారి దేవి నవరాత్రులు ఎలా నిర్వహిస్తారో అలాగే మా గురువు గారు ఇంట్లో జరుగుతాయి..శ్రీ చక్రార్చన , నవవార్చన మొ అన్ని సాంప్రదాయ పద్దతిగా , శాస్త్రీయం గా సనాతనంగా కనబడతాయి..కంకణ ధార చేసుకున్నవారు గురువు గారు ఇంట్లోనే ఉంటారు..

సాధారణం గా మా గురువు గారు దేవి నవరాత్రులు ని వారి స్వగృహం లోనే నిర్వహిస్తారు.. ఒక్కసారి మాత్రం కాశీ లోను , ఇంకోసారి సరూర్ నగర్ లో ఉన్న ఈశ్వరాలయం లో నిర్వహిచారు.. నిత్యం రుద్ర హోమం, ఆఖరి రోజున చండీ హోమం తప్పనిసరిగా చేస్తారు.. ఈ మధ్య జరిగిన దసరా నవరాత్రులు లో ఈశ్వరుడు కి రోజుకో ఒక పాశుపతం చేసుకున్నాము . 

ఒక్క మాటలో చెప్పాలంటే శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము బోధించబడినది. అర్జునుడు దీని ద్వారా శతృంజయమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు. 

రుద్రము నందలి 169 మంత్రములతో మనకు కావలసిన మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యాన్ని, ఆయుర్వృద్ధిని ఇచ్చే అమృత పాశుపతమును చేస్తున్నప్పుడు ముందుగా పాశుపత మంత్రమును చెప్పాలి. 

ఇలా 169 రుద్ర మంత్రములను సంపుటీకరిస్తే అది ఒక పాశుపతం అవుతుంది. ఇది గురుముఖతః నేర్చుకొని, ఉన్నవాళ్లు మాత్రమే  చేస్తేనే మంచి ఫలితములను ఇస్తుంది.

మా గురువు గారు అబ్బాయి శ్రీ శశికాంత శర్మ కూడా వేదం చదువుకుని మా గురువు గారు చేసే కార్యక్రం లో సహకరిస్తారు.. 

మహా పాశుపతము ,త్రిశూల పాశుపతము ,ఆఘోర పాశుపతము , నవగ్రహ పాశుపతము 

కౌబేర పాశుపతము ,మన్యు పాశుపతము, కన్యా పాశుపతము , బుణ విమోచన పాశుపతము ,సంతాన పాశుపతము , ఇంద్రాక్షీ పాశుపతము  చేసుకున్నాము 

చివరిగా మా శివ పరివారం ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసే సమయం కార్తీకం .. కార్తీక మాసం అంటే మా శివ పరివారం కు చాల ఇష్టం..సాయంత్రం పూట మా శివ పరివారం సభ్యులు ఇళ్లల్లో జ్యోతిర్లింగార్చన , ఒకపక్క, చండీ పారాయణ కొంతమంది , పురుషులు స్వామి వారికీ అబీషకేకం చేసుకుని ఆ రాత్రి వారి ఇంట్లో అన్నప్రసాదం తీసుకుంటాము..

ఒక్క కార్తీక పౌర్ణమి మాత్రం మా కామాక్షి శంకరులు స్వగ్రహం లో జరుగుతుంది.. ఉదయం అంతటా నత్తాలు తో ఉంది రాత్రి పూట జ్యోతిర్లింగార్చన అనంతరం అన్నప్రసాదం తీసుకుంటాము..ఈ కార్యక్రం కోసము మా పరివారం లో సభ్యులు ఒక 10 రోజులు ముందుగానే వారు గురువు గారు దగ్గరకి వచ్చి విన్నవించుకుంటారు.. మా ఇంట్లో స్వామి వారి అభిషేకం , జ్యోతిలింగార్చిన చేయాలనీ..

ఒకసారి మా గురువు గారు చేయించే జ్యోతిలింగార్చిన ని చుస్తే మన మనసుకు అనిపిస్తుంది..సాక్షాత్తూ కైలాసం లో ఉన్న నివాసము పరమేశ్వరుడు ఆ జోతిర్లింగార్చన లో కనబడతారు.. అది కూడా మంత్రం యుగ్మగా , అనుష్టాన దేవతలును ఆహ్వానించి , వారిని ఆసన చేసి అప్పుడు మహాలింగం కు ఆవాహన చేస్తారు.. 

మేము ఏది చేసిన శృంగేరి లో ఎలా చేస్తారో అలాగే చేస్తాము..శాస్త్రం ఏది చెప్పినాడో అదే ప్రామాణికం..

కార్తీకమాసం లోనే జ్యోతిర్లింగార్చన ఎందుకు చేస్తారు అనేది మన సనాతన ధర్మము లో ఎంత బాగా వివరించారో.. మన పూర్వికులు ఏది చేసిన అది శాస్త్రీయత ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు.. 

మాకు ఇలా అభిషేకములు , జ్యోతిలింగార్చన సమయం లో మా గురువు గారు మంచి మంచి విషయాలు , ఆధ్యాత్మిక , సనాతన ధర్మాలు వాటి విలువలు ని మా అందరికీ తెలియాపరుస్తారు.ముచ్చటగా మనుసులో మాటలు పంచుకోవడానికి...

కష్ట సుఖాలు తెలుపుకోవడానికి  మంచి చెడులు తెలిపే ఓ నేస్తం లా, గురువు లా , ఒక తండ్రి లా , ఒక ఆత్మీయులుగా  పలకరిస్తారు , మేము ఆలా కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకునేందుకు మాకెప్పుడు కావాలి మీ చల్లని స్నేహ హస్తం తో మా గురువు గారు మాకు ఉంటున్నారు 

ఊపిరి పీలుచుకునే క్షణం లేని జీవిత ప్రవాహంలో మనం అందరం ఉండగా  , మకకి కావలసింది , తెలుసుకోవలసినది చాల ఉంది అని మాకు తెలియయచేసి  

...మేము  తడబడినప్పుడు వెన్ను తడుతూ ,మా ఆలోచనల ఉహల తోడుగా

నిలుస్తూ , మాకు సరి అయినా సమయం లో మంచి విషయాలు తెలిసిచ్చేస్తారు 

నిరాశ ,నిస్ప్ర హ ,నిర్లక్ష్యం లను మా గురువు గారు వారి  దరిచేరకుండా నిరంతరం నిశ్చలమైన నిర్మలమైన ఆలోచనలతో , నిశ్శబ్దా భావాల్ని సవరిస్తూ ,మా శిష్య  సంబంధాలను పరిరక్షించుకుంటూ మాతో పంచుకుంటూ , కాలం అనే కల్పవృక్షము ను మా  సంకల్పాలను తీర్చుకునేందుకు కాలంతో కలసి పయనించి మా  జీవిత గమ్యాన్ని నిర్దేశించిన మా గరువులుగారు కి పాదాభివందనములు 

ఇక అసలు విషయానికి వద్దాము 

మన అందరికీ తెలుసు గత సం నుంచి మనకి కరోనా వలన ఇబ్బందులు పడుతున్నము 

మేము కరోనా లొక్డౌన్ మొదలు అయినప్పటినుంచి మేము శ్రీమద ఆంధ్ర మహా భాగవతం ను ప్రవచనం గా గురువు గారు చెప్పడం జరిగింది..

షోడశ మాస్ శ్రీ మాడ ఆంధ్ర మహా భాగవతం 

ఈ ప్రవచనం లో పద్యం, వచనం, తాత్పర్యం మరియు సన్నివేశాన్ని బట్టి గురువు గారు మాకు వివిధ పురాణాలూ లో ఉండే విషయాలు కూడా తెలియచేసారు..

ఆ అమృత భాండాగారాన్ని మా అందరికీ అందించే ప్రయత్నం చేసారు..

ప్రవచనం అనంతరం , దూప దీప నైవేద్య తో పాటు మృత సంజీవిని పారాయణ చేసే వారు.. అలాగే గురువు గారు చేసే పారాయణ లో కొంత భాగాన్ని భారత దేశం కోసం ఇవ్వడం , అలాగే మా చే కూడా ఆ సంకల్పం చెప్పిచడం కరోనా నివారణార్ధం కొత్త భాగాన్ని సమర్పించడం మా శివ పరివారం కు మా గురువు గారు నేర్పిచారు..

అందరు బాగుంది.. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా..లోక సమస్త సుఖినోభవంతు అన్న నానుడి తో..

మేము ఈ గురు పౌర్ణమి ని కొంచం అంగ రంగ వైభవం గా చేద్దామని సంకల్పం.    షోడశ మాస శ్రీ మద ఆంధ్ర మహా భాగవతం ను మా పూజ్య గురువు గారు మాకు పద్యం శ్రవణం వచనం తాత్పర్యం రూపం లో  మాకు అర్ధమయ్యే రీతి లో చెప్పారు. అటువంటి మహానుభావులు గురువు గారుని మేము సత్కరించుకోవలని ఈశ్వర సంకల్పం తో 

మా గురువు గారుకు చిరు సత్కారం చేస్తున్నాము.

అయితే మా గురువు గారు మమ్మలిని గురు దక్షిణ అడిగారు. అది ఏమిటంటే ఎవరు ఎవరు శ్రీ మద్ భాగవతం లో ఎన్ని పద్యాలు చెప్తారో వారికి ప్రైజ్ డిస్ట్రుబ్యూషన్  మరియు  బహుమతి కూడా  పద్యం ను చూడకుండా చెప్పాలి 15 నుంచి 30 నిమిషాలు.

(ఆన్లైన్ లొనే లేక ముఖతః )..అందులో నారాయణ కవచం కానీ నృసింహ ఆవిర్భావం కానీ  చెబితే 3500 కాష్ అవార్డ్..

ఇట్లు 

శివ పరివారం 




శివ పరివారం పరిచయం 

గురువు అంటే సరైన నిర్వచనం 

ప్రతినెలా మొదటి ఆదివారం పాశుపత రుద్రాభిషేకం , ఆ ఆ రోజులు ను అట్టి ఆ మహాదేవుడుకి పుష్పాభిషేకము , అన్నాభిషేకం పంచ అమృతాభిషేకం 

శతచండి హోమములు ఇప్పటి అరకు 2 సార్లు చేసుకున్నాము (2014 మరియు 2018)

గురువుగారు తో కాశీ యాత్ర - దసరా నవరాత్రులు కాశీ గడిపిన మధుర క్షణాలు 

గురువు ఆరు తో తీర్ధ యాత్ర - నైమిశారణ్యం 

దశమహావిద్యలు - అమ్మవారి హోమాలు (తార , బగళాముఖీ చిన్నమస్తా )

పూర్ణ దీక్షత్వం శిషులుకు ఇవ్వడం 

గురువు గారు శిష్యులకు చండీ సప్తశతి భోదన 

నిత్యం గంగా ప్రవాహం లా జరిగిగే షోడశ మాస శ్రీ మద ఆంధ్ర మహా భాగవతం ప్రవచనం 

షోడశ మాస ఉపవాస దీక్ష మరియు ఉద్యాపన (256 సోమవారం వ్రతం)

శిష్యులకు ఆధ్యాత్మిక బోధనా , సమయాచారం సదాచారం ను తెలుపుట 

మహా శివరాత్రి , మాస శివరాత్రి నిర్వహించుట 

పౌర్ణమి , శ్రీ చక్రార్చన నావార్చన 

కార్తీక మాస జ్యోతిర్లించనలు 

గణపతి తర్పణాలు 








Thursday, June 3, 2021

హనుమత్ జయంతి


  వైశాఖమాసం బహుళ దశమి     పూర్వాభాద్రనక్షత్రము
*వైశాఖ మాసే కృష్ణాయాం! దశమ్యాం మందవాసరే!! - పూర్వాభాద్రా నక్షత్రయ ప్రభూతాయా! శ్రీ ఆంజనేయాయ మంగళం*!!
     *హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు , ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది*.
*జననం*
*పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను.  అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్ని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది*. 
         *హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం ధరించి , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన తను చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. ఆ ముని శాంతించి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో వారినే వివాహం చేసుకొని  శివుని అవతారమైన శిశువుకు  జన్మ ఇచ్చినప్పుడు ఆమెకు శాప విమోచనం అవుతుందని వరమిచ్చాడు*. 

     *అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది. ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన     మరుక్షణం  ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం 'కేసరి' అని , వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది*. 

*అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు*.

       *ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది*

           *భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది*. 

      *హనుమ , ఏడుగురు చిరంజీవు లలో ఒకడు. శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది*.

   *జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు*.    
                                     *ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది:*

*హనుమంతుడు కూడా దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది*.

*1. ప్రసన్నాంజనేయస్వామి*.
*2. వీరాంజనేయస్వామి*.
*3. వింశతిభుజాంజనేయ స్వామి*.
*4. పంచముఖాంజనేయ స్వామి*.
*5. అష్టాదశ భుజాంజనేయస్వామి*.
*6. సువర్చలాంజనేయ స్వామి*.
*7. చతుర్భుజాంజనేయ స్వామి*.
*8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి*.
*9. వానరాకార ఆంజనేయస్వామి*

    *దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి*.

*ఆయన అష్టసిద్ధులు*

*1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి*.

*2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి*.

*3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి*.

*4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.*

*5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి*.

*6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి*.

*7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి*.

*8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి*.


*శ్రీ హనుమంతునికి ప్రదక్షిణాలు ఎలా చేయాలి ?*

*హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణ నమస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టసిద్దికి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.*

*'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'*

 *హరిమర్కటమర్కటాయనమః*

*శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం*
*తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం*

*శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన*
*శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||*

    *అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి*

*''యాకృత్తె రేభి: ప్రదక్షిణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసన్నో వరదో భూత్వా మమ అభిష్ట సిద్దం దదాతు''*

      *అని జలాన్ని అక్షతలతో వదలి పెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిరస్సు మీదనుండి స్నానము , నేలమీద పడక ,          సాత్వికాహారం వంటి నియమాలు పాటించాలి*.

         *ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ ప్రదక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి*.

                  *అభిషేకం*

     *పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు , కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం , నిత్యమూ చేయగలగటం మరీ మంచిది*.

*ఆచరణ : మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి
 
                        *మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం మంచిది. శరీరమంతా సింధూరం కుదరనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం , అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది*.

              *శనివార సేవ*

              *హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన , సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు , వడ మాల వంటివి ప్రోత్సహించి చేయించి స్వామికి సంతృప్తి కలిగించాలి*.

             *పంచ సంఖ్య*

        *హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చేసే ప్రదక్షిణాలు , నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటివి ఏవయినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం*.

          *హనుమ జన్మ తిథి*

   *హనుమ వైశాఖ మాసంలో , కృష్ణ పక్షంలో , దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం , శనివారం , కర్కాటక లగ్నంలో , వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ , కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమ జన్మతిథి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా వైశాఖ బహుళ దశమినాడు తప్పక జన్మ తిథి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు


             

Saturday, May 22, 2021

ఆయుర్వేదం లో వేదం కలిసి ఉంటుంది..ఈశ్వరుడు ని నమ్మాలి, వేదాన్ని నమ్మాలి

 ఆయుర్వేదం లో వేదం కలిసి ఉంటుంది..ఈశ్వరుడు ని నమ్మాలి, వేదాన్ని నమ్మాలి 

ఆయుర్వేదం (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేద వైద్య నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు. ఇది అధర్వణ వేదానికి ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు.

వేదముల వలెనే ఇది మొదట బ్రహ్మచే స్వయంగా తెలుసుకొనబడినదని అంటారు. తర్వాత బ్రహ్మ నుండి దక్షప్రజాపతి, అతని నుండి అశ్వినీ దేవతలు, వారి నుండి ఇంద్రుడు ఆయుర్వేదమును నేర్చుకున్నారన్నది పురాణ వాక్యం. ధర్మార్థ కామ మోక్షములకు అడ్డంకిగా ఉన్న అనేక వ్యాధులను నయం చేయాలన్న సదుద్దేశంతో భరద్వాజ, ఆత్రేయ, కశ్యప, కాశ్యప, నిమి మొదలగు ఋషులు జనుల యందు దయ కలవారై, త్రిలోకాధిపతియైన ఇంద్రుని వేడిరి. అప్పుడు కాయ, బాల, గ్రహ, ఊర్థ్వాంగ (శాలక్య), శల్య, దంష్ట్ర, జరా, వృష అను 8 విభాగాలతో కూడిన ఆయుర్వేదమును ఆ ఋషులకు ఇంద్రుడు ఉపదేశించెను. ఆ ఋషులు పరమానందముతో భూలోకమునకు వచ్చి శిష్యులకు ఉపదేశించిరి. ఆ శిష్యులలో ఉత్తముడైన అగ్నివేశుడు మొదటిగా అగ్నివేశ తంత్రము అనే గ్రంథమును రచించి విశ్వవ్యాప్తినొందించెను. ఈ విధంగా ఆయుర్వేద అవతరణ జరిగింది. నేటికిని ఈ ఆయుర్వేదము చక్కగ అభ్యసింపబడి ఆచరణలో ఉంది.

ఇతర వైద్య విధానాలతో పోల్చి చూస్తే, ఆయుర్వేదం చాలా ప్రాచీన మైనది. దానికి తోడుగ అనేక వైద్య అంశాలు విశదీకరించ బడ్డాయి. విశేషంగా శస్త్రవిద్యావిషయాలు, రక్తము (blood) దాని ప్రాధాన్యతపై అవగాహన పెంచారు

ఆ గ్రంథమును చరకుడు తిరిగి వ్రాసి దానికి చరక సంహిత అని నామకణం చేశాడు. మరియొక సాంప్రదాయం ప్రకారం శ్రీ మహా విష్ణువు యొక్క అవతారమైన కాశీ రాజైన దివోదాస ధన్వంతరి సుశ్రుతాది శిష్యులచేత ప్రార్థించబడినవాడై వారికి ఆయుర్వేదమును బోధించెను. ఆ శిష్యులందరు వారి వారి పేర తంత్రములను రచించిరి. వాటిలో సుశ్రుత సంహిత అనునది యెంతో ప్రాచుర్యమును పొందెను

ఆయుర్వేదంలో జీవం అనేది మానవ శరీరం, ఇంద్రియాలు, మెదడు మరియు ఆత్మల సమ్మేళనంగా భావించ బడుతోంది. జీవించి ఉండే మనిషి మూడు దోషాలు (వాత, పిత్త మరియు ఖఫములు), ఏడు ప్రాథమిక ధాతు కణజాలాలు (రస, రక్త, మాంస, మేధ, అస్ధి, మజ్జ మరియు శుక్రాలు) అలాగే శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు (మలం, మూత్రం మరియు చెమట) లతో కలిసి ఉన్న ఒక సమ్మేళనం వంటిది. ఆ విధంగా మొత్తం శరీర నిర్మాణం శరీరంలో ఉండే ఈ దోషాలతోనూ, ధాతువులు, కణజాలంతోనూ మరియు వ్యర్ధ పదార్ధాల ఉత్పత్తులతోనూ కలిసి వుంటుంది. రసాలుగాను, ధాతువులుగానూ మరియు వ్యర్ధ పదార్ధంగానూ జీర్ణ ప్రక్రియ ద్వారా మారే మనం తీసుకునే ఆహారం చుట్టూ శరీరాకృతి మరియు అవయవ సంబంధిత పెరుగుదల మరియు క్షీణత అనేవి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆహారాన్ని మింగడం, అది జీర్ణమవడం, శరీరం దానిని గ్రహించడం, జీర్ణమయింది వంటబట్టడం అనేవి మానసిక వ్యవస్థపైన, అలాగే జీవాగ్ని (బయో ఫైర్) పైన, ప్రభావితం చేస్తూ, చెప్పుకోతగ్గ ప్రభావాన్ని చూపే మన ఆరోగ్యంతోనూ, వ్యాధులతోనూ ఒకదానితో మరొకటి అంతర చర్యలను కలిగి ఉంటాయి.

ఈరోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్లడం కంటే... ఆ తర్వాత వ్యాధి నిర్ధారణ కోసం వారు సూచించే పరీక్షలే రోగిని ఎక్కువగా భయపెడుతుంటాయి.

ఇలాంటి రక్తపరీక్షలూ, మూత్రపరీక్షలూ, ఈసీజీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలను చేయించరు. కేవలం నాడిని చూడటం ద్వారానే వ్యాధినిర్ధారణ చేస్తారు. తద్వారా రోగుల ఖర్చులు ఆదా అవుతాయి. ఇక ఆయన ఎన్నెన్నో దేశాల్లో  ఆయుర్వేదం గొప్పదనాన్ని తెలుసుకుని ,ఇంగ్లీష్ వైద్యం   విధానంలో నయంకాని (క్యూర్ లేదనే) వ్యాధులకు ఆయుర్వేద విధానంలో నయం చేసే విధానాలను భారతదేశానికి వచ్చి తెలుసుకుంటారు . 

ఇది వరకు పూర్వం రోజుల్లో ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని మెడికల్ షాప్స్ ఏమి లేవు.. 

ఆక్సిజెన్ అనే పదం వినబడేది కాదు..ఎక్కడో హాస్పిటల్ లో ICU రూమ్ లో ఎప్పుడో కానీ డాక్టర్స్ వాడే వారు .

మా చిన్నప్ప్పుడు నాన్నగారు ఉండే రోజుల్లో మా ఇంట్లో ఎప్పుడు ఆయుర్వేదం మందులే.. ఎదో పెద్ద జబ్బు చేస్తేనే తప్పదు అనుకుంటేనే డాక్టర్ గారు రెఫెర్ చేస్తేనే వారు హాస్పిటల్ కి వెళ్లే వారు.. అది కూడా ఇంటి డాక్టర్ ఎలా చేరారో అలాగే.

ఇప్పుడు హాస్పిటల్ COMMERICIAL , చెప్పడానికే సిగ్గు గా ఉంది.

ఇది వరకు ప్రతి ఒక్కరి ఇళ్లలో చావనప్రస్, అగ్నితున్ది, యోగరాజ్ గుగ్గిళ్ళు ,కాయం , ఆలా కొన్ని మందులు ఉండేవి . మాకు వెంకటేశ్వర ఆయుర్వేదం చింతలూరు వాళ్ళది నెలకి ఒకసారి వెళ్లి నాన్నగారు కొన్ని జనరల్ మందులు పట్టుకుని వచ్చే వారు..

మా నాన్నగారు అన్నగారు ఆయుర్వేద వైద్య నిపుణులు.. అయన పేరు డాక్టర్ రాణీ శ్రీనివాస శాస్త్రి గారు.. విజయవాడ సత్యనారాయణ పురం లో ఉఁడేవారు..భారతీయ రసాయన శాల అని పేరు ఉంటుంది.. ఆయన ఆయూర్వేదమే కాదు మంచి జ్యోతిష్య శాస్త్రవేత్త , మేము డిగ్రీ చదివే రోజుల్లో 

వారనికి ఒకసారి అయినా వెళ్లే వాళ్ళము..

మా ఇంట్లో చాల మందికి మా మావయ్యలు చిన్నతనం లో ఎన్నో పెద్ద పెద్ద రోగాలలను నయం చేసారు..

ఇది వరకు రోజులల్లో ఇంటి కి ఒక వైద్యులు ఉండేవారు..

ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రికే ఏమి తెలియడం లేదు.. కనీసం ఆ మంత్రి పదవి నిర్వహిస్తున్న వారికైనా డాక్టర్ డిగ్రీ ఉండాలి..ఇక ప్రభుత్వ ఆరోగ్య కార్యాలయం లు అలాగే ఉన్నాయ్ ఆస్పత్రులు అలాగే ఉన్నాయి.

నా అభిప్రాయం 

నా అభిప్రాయం లో ప్రభుత్వం మూడింటికే  ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. ఒకటి వైద్యం , రెండు విద్య..మూడవది వ్యవసాయం  వాటికే ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి..

మిగతా ఫథకాలు, చెత్త చెదారాలు పక్కన పెట్టాలి..

ఇక ప్రభుత్వ హాస్పిటల్ ని కార్పొరేట్ కన్నా నీట్ గా ఉంచాలి.. మీరు చుడండి ప్రైవేట్ కి ప్రభుత్వ హాస్పిటల్ కి తేడా..అక్కడ ఇక్కడ నర్సు లు పంచి చేస్తారు.. స్టాఫ్ పని చేస్తారు, ఇంకా చెప్పాలి అంటే ప్రభుత్వ డాక్టర్స్ కి మంచి అనుభవమ్ ఉంటుంది.. కానీ తేడా ఎక్కడ శుభ్రత పరిశుభ్రత 

ప్రభుత్వ హాస్పిటల్స్ చాల బాగుంటాయి.. విశాలమైన ప్రదేశం  మొక్కలు చెట్లు, ఉంటాయి కానీ మీరు చుడండి అక్కడ పడిపోయిన జీప్స్ ,కార్లు , పనికి రాణి వస్తువులు ఉంటాయి.

కొన్ని సంవస్త్రాలు నుంచి..అదే ప్రైవైట్ హాస్పిటల్ లో చిన్న కాయితం డస్ట్ బిన్ లో వేయకపోయినా హౌసెకీపింగ్ వాళ్ళకి క్లాస్ పీకుతారు అడ్మిన్ డిపార్ట్మెంట్..

ఇక అస్సలు విషయానికి వస్తే ప్రభుత్వ హాస్పిటల్ ని ఒక కార్పొరేట్ కన్నా నీట్ గా ఉంచండి 

పడిపోయిన డ్రైనేజీ గొట్టాలు , మొదలైనవి ఎప్పటికప్పుడు నీట్ గా రిపేర్ చేయించండి.

నోటీసు బోర్డు పెట్టండి..డస్ట్ బిన్స్ ఏర్పాటు చెయ్యండి..చాల పరిశుభ్రత గా ఉంచండి..

వచ్చిన రోగులని మనసారా పలకరించండి.. దూరం నుంచి వచ్చిన వారికీ వేరేగా వసతి ఏర్పాటు చెయ్యండి..కాంటీన్ లో ఖరీదు కాకుండా మంచి భోజనం టిఫిన్ ఏర్పరతు చెయ్యండి..

డాక్టర్స్ , నర్స్ లు కాంపౌండ్ మొ..సిబ్బంది పలకరించి తక్షణం వారి కి కావలసిన ఏర్పాటు చెయ్యండి. ఓటు వేసిన ప్రజలు అందరు ప్రభుత్వ హాస్పిటల్ లోనే చూపించుకోండి.. జిల్లా వారీగా ఉన్నాయి కదా..ధనవంతుడు ,పేదవాడు అని చూడకుండా వారి ప్రాణాన్ని కాపాడండి..

మంత్రులు , అధికారులు ఆకస్మిక తనికీలు నిర్వహించండి..

నామమాత్రపు వసూళ్లు చెయ్యండి.. అందరికీ అదే రేటు.. మీ హాస్పిటల్ అభివృద్ధి కి ఒక డొనేషన్ ప్రొగ్రమ్మె పెట్టుకోండి.. అక్కడ ధర్మ హుండీ పెట్టుకోండి.. పెద్ద పెద్ద వాళ్ళదగ్గర అభివృద్ధి కి కేటాయించుకోండి..

మిమ్మలిని నమ్మి కదా జనాలు ఓట్లు వేసి గలిపిస్తున్నారు. వాళ్ళ నమ్మకానికి వొమ్ము కాకుండా చూసుకోండి..ఆపదలో ఆదుకోండి..ఒక్కసారి ఇలా చేసి చుడండి 

ప్రభుత్వ అధికారులు , మంత్రులు కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించుకుంటారు.. సామాన్య ప్రజలు మాత్రం అగచాట్లు పడి ప్రభుత్వ హాస్పిటల్ లో చూపించుకుంటారు..

ఈ ప్రభుత్వ డాక్టర్స్ మాత్రం సాయంత్రం టైం కి వచ్చి ఇంటి దగ్గర మంచి ట్రీట్ మెంట్ ఇస్తారు.. 

ఒక్క డాక్టర్ కి మాత్రమే ఈశ్వరుడు రోగం నయం చేసే అధికారం ఇస్తాడు..

ఇలాంటివి అన్ని మా మనసులో భాధలు , ఊహాగానాలు మాత్రమే

.. ఇలాంటి రోజులు ఈ జన్మకి చూస్తానో లేదో..

ప్రభుత్వానికి ఒక రోగి మరణం ఒక లెక్క మాత్రమే..కానీ అది ఒక కుటుంబ వ్యస్వస్త చిన్నాభిన్నం చేస్తది

ఈ మధ్య ఎంతో మాది మేధావులు, చిన్న పిల్లలు, మంచి ఉద్యోగస్తులు , భాద్యత గల కుటుంబ యజమానులు , మధ్య తరగతి వాళ్ళు అందరు వెళ్లిపోతున్నారు..

ప్రాణం ఎవరిదైనా ఒకటే అనే భావన లో ఉండాలి..

ఇంతకంటే ఎక్కువ గా చెప్పలేను 

Saturday, April 24, 2021

ముచికుందుడు

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

ఈ రోజు మనకి శ్రీ మద్ భాగవతం లో గురువు గారు ముచుకుందుడు  గురించి చెప్పారు 

మా చిన్నతం లో మేము పడుకునే తప్పుడు మా నాన్నగారు మాకు రెండు శ్లోకాలు చెప్పేవారు అవి ఏమిటంటే  మొదటిది 

రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !

శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!

రెండవ శ్లోకం 

అగస్త్యో మాధవశ్చైవ ముచుకుందో మహాబలః / కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖశాయినః

ముచికుందుడు గురించి తెలుసుకుందాం 

ముచికుందుడు లేదా ముచుకుందుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. మాంధాత కుమారుడు. అంబరీషుడు ఇతనికి సోదరుడు అవుతాడు. ఇక్ష్వాకు వంశాన్నే సూర్యవంశం అని కూడా అంటారు. హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘు చక్రవర్తి, శ్రీరాముడు కూడా సూర్యవంశానికి చెందిన రాజులు. కాలయవనుడు కృష్ణుడికి వ్యతిరేకంగా మూడు మిలియన్ల యవనాల సైన్యంతో మధురపై దాడి చేసిన రాజు.

కాలయవనుడుముచుకుందుడు కృష్ణుడికి వ్యతిరేకంగా మూడుకోట్ల మంది మ్లేచ్ఛసైన్యంతో మధురపై దాడి చేసిన రాజు. పెద్ద జడతో నల్లగా ఉండే కాలయవుడికి యాదవులు ఎవరూ కూడా తనని చంపలేని ఒక వరం ఉంది.నారద మహర్షి మాట విని శ్రీకృష్ణుని మధుర పైకి యుద్ధానికి వస్తున్నాడు అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు జరాసంధుని తో యుద్ధం ముగించుకుని అంతలోనే కాలమును యుద్ధం ప్రజలకు నష్టం కలిగిస్తుందని విశ్వకర్మ ను పిలిపించి సముద్రగర్భంలో పన్నెండు ఆమడల వెడల్పు తో ద్వారకా నగరాన్ని నిర్మాణం చేయిస్తాడు ద్వారకకు కాపలాగా బలరాముడిని ఉంచి తను మధుర నగరానికి చేరుకుంటాడు అంతలోనే కాలయవనుడు నిరాయుధుడైన శ్రీకృష్ణపరమాత్ముని చూసి వీడేనా యాదవ రాజు అని వెంట పడడంతో శ్రీకృష్ణుడు పరుగులు తీస్తాడు పరుగుతీసి ఒక గుహ లోకి వెళతాడు గుహలో గాఢ నిద్ర లో ఉన్నటువంటి ముచికుందుని చూసి యాదవుడు అని అనుమానంతో కాలిపై తంతాడు ముచుకుందుడు నిద్రనుండి లేచి కళ్ళు తెరవగా ఆ కళ్ళ నుండి అగ్ని దారులు బయటికొచ్చి కాలయవనుడు కాలి బూడిదై పోతాడుఅయిపోతాడు ముచుకుందుడు మాంధాత కుమారుడు సూర్య వంశానికి చెందిన వాడు అయితే దేవతలకు యుద్ధంలో సహాయం చేసి అలసిపోతాడు దేవతలు ముచుకుందా నీవు మాకు బాగా సహాయం చేశావు ఏమైనా వరం కోరుకో అని అంటారు ముచికుందుడు నేను బాగా అలసిపోయాను నాకు నిద్ర పోవడానికి మంచి చోటు కావాలి అని కొడతాడు దానికి ఇంద్రుడు నీకు బాగా నిద్ర వస్తుంది నిన్ను ఎవడైతే నిద్రలో నుండి లేపుతాడో వాడు నీ కళ్ళలో నుండి వచ్చే మంటలో దగ్దమై పోతాడు అని వరము ఇస్తాడు

అందుకే మన పూర్వికులు ఆచారం లో కూడా ఎవరైనా ఇంటికి వేళ్ళ వలసి వస్తే సమయ సమాచారం చూసుకునే వెళ్లారు వారు ..ఎప్పుడు పడితే వెళ్లేవారు కాదు.. ఒక నిర్దిష్ట సమయం లో వెళ్లే వారు.. అలాగే మంచి నిద్ర లో ఉండే వాళ్ళను ఒక్కసారి గా లేపకూడదు .

ఇది వరకు పెద్దలు మనకి సమయాచారం సదాచారం గురించి తెలియచేసేవారు . (అంటే ఈ సమయం లో ఏమి పనులు చెయ్యాలి / చెయ్యకూడదు అనే విషయాలు ). మనకి గురువు గారు చాల సార్లు సమయాచారం , సదాచారం గురించి తెలియయచేసారు 

ఇట్లు

శివ పరివారం 

Thursday, April 22, 2021

నవ నిధులు - అష్టసిద్ధి నవవిధికే దాతా’

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

మనకి నిత్యం జరిగే భాగవతం లో మనకి తెలియని ఎన్నో విశేషాలు మన పూజ్య గురువు గారు ద్వారా తెలుసుకుంటున్నాము . ఇలాంటి మంచి విషయాలు మన పూజ్య గురువు గారు తెలియచేసినందు వారికీ పాదాభివందనం 

ఈ రోజు భాగవతం లో దశమ స్కంధం లో చివరిలో గురువు గారు నవ నిధులు గురించి తెలియచేసారు . మన శివ పరివారం కు అవి ఏమిటో అందచేసే ప్రయతనం చేస్తాను 

అష్టసిద్ధులు అనగా ఎనిమిది రకాల సిధ్దులు. భారతీయ తత్వ శాస్త్రంలో "సిద్ధి" అన్నమాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం. 

మనకి సిద్దించే శక్తులు లో ఒకటి  శ్రీమద్ భాగవతం ఒకటి .

 "మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకరకచ్ఛపౌ, ముకుందకుందనీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ"

(అ.) విధము     (ఆ.) విధము

1. మహాపద్మము,

2. పద్మము

3. శంఖము

4. మకరము

5. కచ్ఛపము

6. ముకుందము

7. కుందము

8. నీలము

9. ఖర్వము 

1. కాళము

2. మహాకాళము

3. పాండుకము

4. మాణవకము

5. నైసర్పము

6. సర్వరత్నము

7. శంఖము

8. పద్మము

9. పింగళము.

నవ-నిధులు : ఇవి కుబేరుని నవనిధులు

మనకి మణిద్వీప వర్ణనలో అమ్మవారి దగ్గర ఒక శ్లోకం లో చెప్పుకుంటాము అవి అష్టసిద్ధులు నవ 

నవ నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు  సృష్టి కర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు

భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం

అలాగే అమ్మవారి ఖడ్గమాలా లో కూడా ఒక వర్ణన చేస్తారు 

అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,

ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట సిద్ధయః

మార్కండేయ పురాణములో అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశీత్వం అని సిద్ధులు అష్టవిధములుగా పేర్కొనబడినవి. బ్రహ్మ వైవర్త పురాణమున శ్రీకృష్ణ జన్మ ఖండమునందు సిద్ధులు గురించి మరింత వివరం తెలుపబడినది .

చివరిగా హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు, వినాయకుడు లకు అష్టసిద్ధులుండేవి. వీరిరువురికీ అష్టసిద్ధుల మీద పూర్తి సాధికారత ఉందనీ, వీరిన పూజించిన భక్తులకు ఆయా సిద్ధులను అతి సులభంగా అనుగ్రహించగలరనీ ఓ నమ్మకం. అందుకనే హనుమంతుని ‘అష్టసిద్ధి నవవిధికే దాతా’ అంటాడు తులసీదాసు తన హనుమాన్‌ చాలీసాలో. ఇక వినాయకుని భార్య సిద్ధి అన్నది కేవలం ఒక పేరు మాత్రమే కాదు. ఆమె అష్టసిద్ధులకు ప్రతిరూపం 

ఇట్లు 

శివ పరివారం 

Tuesday, April 20, 2021

కృష్ణుడు -జరాసంధుడు భీముడు

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

మనకి నిత్యం జరిగే శ్రీ మద్ భాగవతం లో ఇప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు జరాసంధుడు కధ లోకి వచ్చాము , అయితే శివ పరివారం లో ఒకరు చివరిలో సందేహాలు లో ఒక ప్రశ్న వేశారు 

17 సార్లు దాడులు జరిగే వరకూ జరసంధాను శ్రీకృష్ణుడు ఎందుకు చంపలేదు?

ఒకనాడు కృష్ణ పరమాత్మ నిండు పేరోలగంలో సభ తీర్చి ఉన్నాడు. అపుడు ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. ‘అయ్యా, జరాసంధుడు అనే రాజు అనేకమంది రాజులను ఓడించి కారాగారంలో బంధించాడు. వారందరూ కూడా అనేకమయిన హింసలు పొందుతున్నారు. కాబట్టి మీరు త్వరలో విచ్చేసి జరాసంధుడిని వధించి ఆ రాజులందరికీ స్వేచ్ఛ కలిగేటట్లుగా అనుగ్రహించ వలసినది’ అని కోరాడు. ఆమాటలు విన్న కృష్ణ పరమాత్మ సంతోషించి ‘తప్పకుండా మేము తొందరలో వచ్చి జరాసంధుడిని వధిస్తాము’ అని మాట యిచ్చి, ఈ సందర్భంలో ఎం చేస్తే బాగుంటుందో ఆలోచనను చెప్పమని ఉద్ధవుడిని అడిగారు. పరమాత్మ అన్నీ తెలిసు ఉన్న వాడయి ఉంది ఉద్ధవుడిని అడగడం ఎందుకు? కానీ ఈశ్వరుడికి సహకరించిన పుణ్యమును పదిమందికి కట్టబెడతారు. అపుడు ఉద్ధవుడు అన్నారు “ఇటువంటి కార్యం చేసేముందు ఒకపని చేస్తే బాగుంటుంది. ధర్మరాజు గారి చేత రాజసూయయాగం చేయించి ఆ యాగం చేసేటప్పుడు నాలుగు దిక్కులా ఉండే రాజుల పీచమణచదానికి నలుగురిని పంపవలెను కనుక ఆ సందర్భంలో జరాసంధుడిని కూడా వధించి రాజసూయ యాగం చేస్తే బాగుంటుంది మీరు అలా ఆలోచించండి’ అన్నాడు. ‘చాలామంచి ఆలోచన చెప్పావు’ అని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు.

ధర్మరాజు కృష్ణ పరమాత్మకు ఎదురువచ్చి స్వాగతం పలికాడు. రాజసూయ యాగం చేయడానికి సంకల్పం జరిగింది. వెంటనే ధర్మరాజు గారు తన సోదరులను పిలిచి నలుగురినీ నాలుగు దిక్కులకు పంపారు. నాలుగు దిక్కులకు వెళ్ళిన వారు అన్ని దిక్కుల వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారి పేరు చెప్పగానే ఎవరూ వ్యతిరేకించిన వారు లేరు ఒక్క జరాసంధుడు తప్ప. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ ‘ధర్మజా, నీవు బెంగ పెట్టుకోవద్దు. జరాసంధుడిని వధించడం కోసమని నేను అర్జునుడు భీమును బ్రాహ్మణ రూపంలో వెళతాము. జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. వాడు బ్రాహ్మణులు ఏదయినా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తాడు. కాబట్టి బ్రాహ్మణరూపంలో వెళ్లి యుద్ధ భిక్షను అడుగుతాము. ఇస్తాను అనిన తరువాత వాడు తప్పుకోవడానికి వీలులేదు. వాడు యుద్ధం చేస్తాడు. యుద్ధంలో జరాసంధుడు మరణిస్తాడు. తరువాత రాజసూయ యాగం చేద్దాము’ అని ముగ్గురూ బ్రాహ్మణ రూపములు ధరించి మగధ దేశమునకు వెళ్ళారు. జరాసంధుడు బయటకు వచ్చి మీకేమి కావాలి?” అని అడిగాడు. వాళ్ళు మాకు యుద్ధభిక్ష కావాలి అన్నారు. బ్రాహ్మణులయిన వారు యుద్ధ భిక్ష కోరడం ఏమిటి అని జరాసంధుడు వారి ముగ్గురిని తేరిపార చూశాడు. వాడేమీ తెలివి తక్కువ వాడు కాదు. వచ్చినవాళ్ళు కృష్ణ భీమార్జునులని గుర్తించాడు. కృష్ణుడిని చూసి ఒక మాట అన్నాడు. జరాసంధుడు కృష్ణుని చేతిలో 17సార్లు ఓడిపోయాడు. కానీ 18 వ సారి జరాసంధుడిని తప్పించుకుని ద్వారకకు పారిపోయి అక్కడ ఉన్నాడు. 18 వ సారి కృష్ణుడు ఓడిపోయినట్లు నటించాడు. అపుడు ఆయన అలా ఓడిపోయినట్లు నటించడానికి కారణమే ఇప్పుడు జరాసంధుడు చచ్చిపోవడానికి కారణం అవుతుంది. 17 సార్లు తానూ ఓడిపోయానన్నది జరాసంధుడు మరచిపోయాడు. 18 వ సారి కృష్ణుడు పారిపోయాడు అన్నది గుర్తు ఉంది. జరాసంధుడు కృష్ణుడిని ఎంత మాట అన్నాడో చూడండి!

“ఏమి వింతయ్యా! నేను యుద్ధమునకు వస్తే పారిపోయిన వాడివి ఇవాళ వచ్చి యుద్ధ భిక్ష అడుగుతున్నావు. అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు. కానీ నీతో యుద్ధం చేయడానికి నేను సిగ్గుపడుతున్నాను. పారిపోయిన వాడితో నాకు యుద్ధం ఏమిటి? నేను నీతో యుద్ధం చేయను” అన్నాడు. ఈశ్వరుని అధిక్షేపించడంలోనే వాని మరణం వచ్చింది.

‘కృష్ణా నాతొ యుద్ధ భూమిలో నిలబడడం అంటే అంత తేలికయిన విషయం కాదు. ముందు నువ్వు పక్కకి వెళ్ళు. అర్జునుడు మంచి బలపరాక్రమములు ఉన్నవాడు. గాండీవం పట్టుకుంటే శత్రువులను దునుమాడుతాడు. కానీ అతడు నాకంటే చిన్నవాడు. వీనికన్న పెద్దవాడు భీముడు ఉన్నాడు కదా. అతడు మహా బలవంతుడు. పైగా వాయుపుత్రుడు. నాతో బలమునకు సరిపోతాడు’ అని మిక్కిలి కోపంతో చెయ్యి విసిరి యుద్ధమునకు రమ్మనమని అవతల వాళ్ళని లాగడం మొదలు పెట్టాడు. భీమసేనుడు జరాసందునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు.

వెంటనే మల్లయుద్ధం చేయడానికి వీలుగా ఒకచోట భూమిని సమతలంగా తయారుచేశారు. జరాసంధుడు భీమసేనుడు యిద్దరూ మల్లయుద్ధం మొదలుపెట్టారు. భయంకరమయిన యుద్ధం సాగుతోంది. ఇద్దరూ కూడా ఒకరికొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు. ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి నెత్తురోడి పోయి యిద్దరూ కూడా ఎర్రటి రంగులోకి మారిపోయారు. అలా కొట్టుకుంటున్నారు. బీమునిలో ఉండే తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సును భీమసేనుడియందు ప్రవేశపెట్టారు. కృష్ణుడు తేజస్సు కలియడం వలన భీమసేనుడి తేజస్సు క్షీణించలేదు. జరాసంధుడిది పదివేల ఏనుగుల బలం. యుద్ధంలో వాడేమీ సామాన్యుడు కాదు. యుద్ధం జరగగా జరగగా జరాసంధుడి శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. ఎడతెరపి లేని యుద్ధం చేస్తున్న భీమసేనుడి వంక చూసి కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆయన దృష్టిని ఆకర్షించేటట్లుగా పిలిచి చెట్టుకొమ్మ తీసి దానిని రెండుగా చీల్చి చూపించారు. ఆ సంజ్ఞను భీముడు అర్థం చేసుకుని జరాసంధుని ఒకకాలును తన రెండు కాళ్ళతో తొక్కిపట్టి రెండవ కాలును పట్టుకుని ఉత్తరించేస్తే, శరీరంలో సగభాగం తలవరకూ జరాసంధుడి శరీరం రెండు ఖండములుగా విడిపోయింది. ఆ రెండిటిని భీముడు అటూ యిటూ విసిరేశాడు. ఆ రోజున జరాసంధుడు మరణించాడు. అతని మరణానంతరం కృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించాడు. ‘ధర్మ బద్ధమయిన పాలన చేసే వాడు ఎవడు ఉంటాడో, వానియందు నేను సర్వకాలముల యందు ప్రీతిని కలిగి ఉంటాను. అందుకని మీరు ధర్మ బద్ధంగా పరిపాలించండి’ అని చెప్పి ఆ రాజులకు హితోపదేశం చేసి విడిచి పెట్టేశారు. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. జరాసంధుని వద్ద ఉన్న ధనకనకవస్తు వాహనములను పట్టుకుని కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు. అప్పుడు రాజసూయ యాగము చేయడానికి ధర్మరాజు సంకల్పం చేశారు.


మరొక కథనం కూడా ఉంది. మరియు ముఖ్యమైనది. భీముడు, బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, ఈ 5 మంది ఒకే నక్షత్రంలో జన్మించారు. వీరి వీరి జాతకాల ప్రకారం, వీరిలో ఎవరు ముందుగా మరొకరి చేతిలో హతమవుతారో మిగిలిన ముగ్గురు కూడా వారి చేతిలోనే మరణిస్తారు. క్రమంగా ఏకచక్రపురంలో పాండవులు నివసిస్తున్న సమయంలో, అంతగా తెలివిలేని బకాసురుడు ముందుగా భీముని చేతిలో సంహరించబడేలా శ్రీకృష్ణుడు ప్రణాళిక రచించాడు. క్రమంగా మిగిలిన ముగ్గురు కూడా భీముని చేతిలోనే మరణించవలసి ఉన్నది. అందుచేత ఆ అవకాశాన్ని భీమునికి ఇవ్వాలన్న కారణంగా కూడా జరాసంధుని సంహరించకుండా ఎదురుచూడవలసి వచ్చింది. సమయం వచ్చేలోపు, సమయాన్ని వృధా చేయకుండా మిగిలిన దుష్టులను మట్టికరిపించాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు.


విష్ణు భగవానుడు భూమిపై అవతారం దాల్చిన ప్రతిసారీ, ఆ అవతారం ధర్మ సంస్థాపనకు కారణమయిందని మనందరికీ తెలుసు. క్రమంగా శ్రీ కృష్ణుని అవతారం దాల్చినప్పుడు, కౌరవులందరికి గుణపాఠం బోధించడం, తన మేనమామ కంసుని సంహరించడం అతని ముందున్న ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. దాన్ని సాధి౦చుకొడానికి ఆయన తనకు గల ముఖ్యమైన స౦బ౦ధాలను ఆధారితంగా చేసుకున్నాడు. క్రమంగా పాండవులను తన పంచన చేర్చుకున్నాడు. తన భావోద్వేగాలను పక్కకు పెట్టి, తెలివిగా ఆడటం అంత తేలికైన విషయం కాదు. బహుశా ఈ కథ ద్వారా అటువంటి పాఠాన్నే తెలియజేసాడేమో మనందరికీ. కానీ, శ్రీ కృష్ణుని ప్రతి అడుగులోనూ యుక్తి దాగి ఉంటుందని గమనించాలి.


జరాసంధుని ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి .. 

శ్రీకృష్ణుడు నివసించే ద్వారక మీదకు దండెత్తడానికి వెళ్ళిన ప్రతిసారీ శ్రీ కృష్ణుడు పెళ్లి కొడుకు రూపంలో అయినా ఉండేవాడు, లేదా సైన్యాన్నంతా ఓడించి తననొక్కటే విడిచిపెట్టేవాడు. పురాణాల ప్రకారం జరాసంధుడు వివాహం చేసుకుంటున్న వారిని ఏమీ చేయడు. క్రమంగా నిరాశతో వెనుదిరగవలసి వచ్చేది. ఎన్నిమార్లు ప్రయత్నించినా, ఎంత శక్తిమంతమైన రాజ్యాలలోని రాజులను శ్రీ కృష్ణుని మీదకు ఉసిగొల్పినా ఓటమే చివరికి వరించేది. క్రమంగా జరాసంధుని ప్రయత్నాలన్నీ వ్యర్థమే అయ్యాయి. అయితే, అతని వైఫల్యం అతని నమ్మకాన్ని ఎన్నడూ బలహీనపర్చలేదు మరియు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. ఆ విధంగా శ్రీ కృష్ణుని సంహరించడానికి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదిహేడు సార్లు ప్రయత్నించాడు జరాసంధుడు. వచ్చిన ప్రతిసారీ కృష్ణుని చేతిలో ఓడిపోయి సైన్యాన్ని కోల్పోయి, వెనుతిరిగేవాడు. ఇక్కడ శ్రీ కృష్ణుని యుక్తి బాగా తెలుస్తుంది. యుద్ధం చేయడం అంటే శత్రువుని ఓడించడం కానీ, సంహరించడం కాదు అని. క్రమంగా యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం చేశాడు, అవసరం లేదనుకున్న సమయంలో యుక్తిని ప్రదర్శించాడు.

అలా అయితే 17 వ దాడి తర్వాత శ్రీకృష్ణుడు ఎందుకని జరాసంధుని సంహరించవలసి వచ్చింది ?. పదిహేడు మార్లు జరాసంధుని ఏమీ చేయని శ్రీకృష్ణుడు, పద్దెనిమిదవసారి మాత్రం విడిచిపెట్టలేదు. నిజానికి జరాసంధుని పుట్టుక వెనుక ఒక కథ ఉంది., జరాసంధుడు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడే రెండు భాగాలుగా జన్మించాడు. జరా అనే పేరుగల ఒక రాక్షస మహిళ, ఈ రెండు భాగాలను ఒకటిగా చేసింది. అందుచేత అతనికి జరాసంధుడు అని పేరు పెట్టడం జరిగింది. అతనికి మరో వరాన్ని కూడా ఆమె ప్రసాదించింది. జరాసంధుని ఎవరూ సంహరించలేరు, కేవలం అతని శరీరాన్ని విభజించి వ్యతిరేక దిశలో విసిరివేస్తే తప్ప. కావున దీనికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అవసరం అవుతుంది. మరెలా సంహరించాడు ? ఇప్పుడు తెలుసుకుందాం.

జరాసంధుని మరణానికి కృష్ణుని ప్రణాళిక : 

యుధిష్ఠిరుడు (ధర్మరాజు) రాజసూయ యాగము చేయాలని నిశ్చయించుకున్న సమయం వచ్చింది. అయితే, రాజసూయ యాగాన్ని నిర్వర్తించడం కోసం, ఒక రాజును చక్రవర్తిగా ప్రకటించి, ఇతర రాజులందరూ ఆతనిని తమ చక్రవర్తిగా అంగీకరించడం తప్పనిసరి చేశారు. కానీ జరాసంధుడు శ్రీకృష్ణుని చక్రవర్తిగా అంగీకరించడని తెలుసుకున్న యుధిష్టిరుడు కృష్ణుని సహాయం కోరుకున్నాడు. భీమార్జునులు బ్రాహ్మణులుగా మారువేషం వేసి, జరాసంధుని కడకు వెళ్లి కుస్తీ సవాలు చేయమని కృష్ణుడు సూచించాడు. క్రమంగా ' భీముని' తో కుస్తీకి జరాసంధుడు అంగీకరించాడు. ఈ కుస్తీ పోటీ నాలుగు రోజుల పాటు కొనసాగగా, భీముడు జరాసంధుని సంహరించలేకపోయాడు. క్రమంగా కృష్ణుడు పూనుకోక తప్పలేదు. దూరం నుండి పోటీని పర్యవేక్షిస్తున్న శ్రీ కృష్ణుడు, జరాసంధుని సంహరించడానికి సూచనగా, భీమునికి కనపడేలా ఒక ఆకును ఉపయోగించి, రెండు ముక్కలుగా చేసి వివిధ దిశలలో విసిరేశాడు. మార్గదర్శకంగా, భీముడు జరాసంధుని సంహరించడంలో సఫలీకృతం అయ్యాడు. క్రమంగా జరాసంధుని శరీరాన్ని రెండు సగాలుగా చీల్చి, రెండు భాగాలను వేర్వేరు దిశల్లో విసిరి, వాటిని తిరిగి కలుసుకోనివ్వకుండా చేసి జరాసంధుని సంహరించాడు.

బలరాముని ప్రశ్నకు శ్రీకృష్ణుని సమాధానం : 

కంసుని మద్దతుదారుడైన జరాసంధుని మరణం జరిగిన చాలాకాలం తర్వాత, బలరాముడు, కృష్ణుడు ఒక చర్చకు పూనుకున్నారు. బలరాముడు శ్రీ కృష్ణుని అన్న. చర్చ సందర్భంగా, అతన్ని సంహరించగలిగిన నువ్వు ఇంత కాలం ఎందుకు వేచి ఉన్నావు అని అడిగాడు బలరాముడు. క్రమంగా, శ్రీ కృష్ణుడు బలరామునికి ఇలా చెప్పాడు, ప్రతిసారి జరాసంధుడు దాడి చేసే నిమిత్తం కొత్త సైన్యంతో వచ్చేవాడు. ఈ సైన్య౦లో అత్యంత శక్తిమ౦తులైన రాజులతో సహా భూమ్మీద ఉండే అనేకమంది దుష్ట ప్రజలు కూడా ఉన్నారు. క్రమంగా వారందరినీ ఒకే చోట మట్టుబెట్టే అవకాశం వచ్చింది. అలా దుష్టులను జరాసంధుడు తీసుకుని వచ్చేవాడు, నేను వారిని సంహరించేవాడిని. అని బదులిచ్చాడు. ఈ సమాధానం కారణంగా, శ్రీ కృష్ణుని మేధస్సును, ప్రజ్ఞాపాఠవాలను, యుక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు బలరాముడు.

ఇట్లు 

శివ పరివారం