Saturday, September 19, 2020

శ్రీమన్నారాయణ కవచము

వర నారాయణ కవచము

నరిభీకర వజ్రకవచ మాశ్రిత సంప

త్పరిణామ కర్మసువచము

పురుహూతున కెట్లు మౌని బోధించె? దగన్.


అనినం బరీక్షిజ్జనపాలునకు మునినాథుం డిట్లనియె.

"వినవయ్య! నరనాథ! మునినాథుఁ డింద్రున-

  కనువొంద నారాయణాఖ్య మైన

కవచంబు విజయ సంకల్పంబు నప్రమే-

  యస్వరూపంబు మహాఫలంబు

మంత్రగోప్యము హరిమాయావిశేషంబు-

  సాంగంబుగాఁగ నెఱుంగఁ జేసె;

దాని నే వినిపింతుఁ బూని తదేకాగ్ర-

  చిత్తంబుతోడుతఁ జిత్తగింపు;

మొనర ధౌతాంఘ్రిపాణి యై యుత్తరంబు

ముఖముగా నుత్తమాసనమున వసించి

కృత నిజాంగ కరన్యాస మతిశయిల్ల

మహిత నారాయణాఖ్య వర్మము నొనర్చె.


ఇట్లు నారాయణకవచంబు ఘటియించి, పాదంబులను, జానువులను, నూరువులను, నుదరంబునను, హృదయంబునను, నురంబునను, ముఖంబునను, శిరంబునను నట్లష్టాంగంబులం బ్రణవపూర్వకంబైన యష్టాక్షరీ మంత్రరాజంబు విన్యాసంబుచేసి ద్వాదశాక్షర విద్యచేతం గరన్యాసంబు చేసి, మంత్రమూఁర్తియై భగవచ్ఛబ్ద వాచ్యం బైన ప్రణవాది యకారాంత మహామంత్రంబు చేత నంగుళ్యంగుష్ఠ పర్వసంధులయం దుపన్యసించి, మఱియు హృదయంబున నోంకారంబు, వికారంబు మూర్ధంబున, షకారంబు భ్రూమధ్యంబు నందు, ణకారంబు శిఖ యందు, వేకారంబు నేత్రంబులయందు, నకారంబు సర్వ సంధులయందు మఱియు నస్త్రము నుద్దేశించి మకారంబు నుపన్యసించె నేని మంత్రమూర్తి యగు; మఱియును "అస్త్రాయఫట్" అను మంత్రంబున దిగ్భంధనంబుచేసి, పరమేశ్వరునిం దన భావంబున నిల్పి విద్యామూర్తియుఁ, దపోమూర్తియు నగు షట్చక్తి సంయుతం బైన నారాయణ కవచాఖ్య మైన మంత్రరాజంబు నిట్లని పఠియించె.

గరుడుని మూఁపుపై బదయుగంబు ఘటిల్లఁగ శంఖచక్ర చ

ర్మ రుచిర శార్ఙ్గ ఖడ్గ శర రాజితపాశ గదాది సాధనో

త్కర నికరంబు లాత్మకరకంజములన్ ధరియించి భూతి సం

భరిత మహాష్టబాహుఁడు కృపామతితో ననుఁ గాచుఁ గావుతన్.


ప్రకట మకర వరుణ పాశంబు లందును

జలములందు నెందుఁ బొలియ కుండఁ

గాచుఁగాక నన్ను ఘనుఁడొక్కఁ డై నట్టి

మత్స్యమూర్తి విద్యమానకీర్తి.


వటుఁడు సమాశ్రిత మాయా

నటుఁడు బలిప్రబల శోభనప్రతిఘటనో

ద్భటుడు త్రివిక్రమదేవుఁడు

చటులస్థలమందు నన్ను సంరక్షించున్.

అడవుల సంకటస్థలుల నాజిముఖంబుల నగ్ని కీలలం

దెడరుల నెల్ల నాకు నుతి కెక్కఁగ దిక్కగుఁగాక శ్రీనృసిం

హుఁడు సురశత్రుయూధప వధోగ్రుడు విస్ఫురి తాట్టహాస వ

క్త్రుఁడు ఘన దంష్ట్ర పావక విధూత దిగంతరుఁ డప్రమేయుఁడై.

అరయఁగ నెల్ల లోకములు నంకిలి నొంద మహార్ణవంబులో

నొరిగి నిమగ్న మైన ధర నుద్ధతిఁ గొమ్మున నెత్తినట్టి యా

కిరిపతి యగ్ని కల్పుఁ డురుఖేలుఁడు నూర్జిత మేదినీ మనో

హరుఁడు గృపావిధేయుఁడు సదాధ్వములన్ననుఁ గాచుఁగావుతన్.

రాముఁడు రాజకులైక వి

రాముఁడు భృగు సత్కులాభిరాముఁడు సుగుణ

స్తోముఁడు నను రక్షించును

శ్రీమహితోన్నతుఁడు నద్రి శిఖరములందున్.

తాటక మర్దించి తపసి జన్నముఁ గాచి-

  హరువిల్లు విఱిచి ధైర్యమున మెఱసి

ప్రబలు లైనట్టి విరాధ కబంధోగ్ర-

  ఖరదూషణాది రాక్షసులఁ దునిమి

వానరవిభు నేలి వాలిఁ గూలఁగ నేసి-

  జలరాశి గర్వంబుఁ జక్కజేసి

సేతువు బంధించి చేరి రావణ కుంభ-

  కర్ణాది వీరులఁ గడిమిఁ ద్రుంచి

యల విభీషణు లంకకు నధిపుఁ జేసి

భూమిసుతఁ గూడి సాకేత పురము నందు

రాజ్యసుఖములు గైకొన్న రామవిభుఁడు

వరుస ననుఁ బ్రోచుచుండుఁ బ్రవాసగతుల.

మఱియు; నఖిల ప్రమాదంబు లైన యభిచార కర్మంబుల వలన నారాయణుండును, గర్వంబు వలన నరుండును, యోగభ్రంశంబువలన యోగనాథుఁ డయిన దత్తాత్రేయుండును, గర్మబంధంబులవలన గణేశుం డైన కపిలుండును, గామదేవునివలన సనత్కుమారుండును, మార్గంబుల దేవహేళనంబు చేయుటవలన శ్రీహయగ్రీవమూర్తి యును, దేవతానమస్కార తిరస్కార దేవపూజా చ్ఛిద్రంబులవలన నారదుండును, నశేష నిరయంబులవలనఁ గూర్మంబును, నపథ్యంబు వలన భగవంతుం డైన ధన్వంతరియును, ద్వంద్వంబువలన నిర్జితాత్ముం డయిన ఋషభుండును, జనాపవాదంబువలన నగ్నిదేవుండును, జనన మరణాదులం గలుగఁ జేయు కర్మంబులవలన బలభద్రుండును, గాలంబువలన యముండును, సర్పగణంబులవలన శేషుండును, నప్రబోధంబువలన ద్వైపాయనుండును, బాషాండ సమూహంబువలన బుద్ధదేవుండును, శనైశ్చరునివలనఁ గల్కియునై, ధర్మరక్షణపరుం డయిన మహావతారుండు నన్ను రక్షించుంగాత; ప్రాత స్సంగమ ప్రాహ్ణ మధ్యాహ్నాపరాహ్ణ సాయంకాలంబులను ప్రదోషార్ధరాత్రాపరాత్ర ప్రత్యూషానుసంధ్యలను గదాద్యాయుధంబుల ధరియించి, కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసంహార, త్రివిక్రమ, వామన, హృషికేశ, పద్మనాభ, శ్రీవత్సధామ, సర్వేశ్వరేశ, జనార్దన, విశ్వేశ్వర, కాలమూర్తు లను నామ రూపంబులు గల దేవుండు నన్ను రక్షించుంగాక; ప్రళయకాలాన లాతితీక్ష్ణ సంభ్రమ భ్రమణ నిర్వక్రవిక్రమ వక్రీకృత దనుజచక్రం బైన సుదర్శన నామ చక్రంబ! మహావాయు ప్రేరితుండై హుతాశనుండు నీరస తృణాటవుల భస్మీభూతంబు చేయు భంగి, భగవత్ప్రయుక్తంబవై మద్వైరి సైన్యంబుల దగ్ధంబు గావింపుము; జగత్సంహారకాల పటు ఘటిత చటుల మహోత్పాత గర్జారవ తర్జన దశదిశాభి వర్జిత ఘనఘనాంతర నిష్ఠ్యూత నిష్ఠురకోటి శతకోటిసం స్పర్శ స్ఫుర ద్విస్ఫులింగ నిర్గమనానర్గళ భుగ భుగాయమాన మూర్తి విస్ఫూర్తి! నారాయణకరకమలవర్తి! గదాయుధోత్తమ! మదీయవైరి దండోపదండంబుల భండనంబునం జండ గతిం బిండిపిండిగాఁ గూశ్మాండ వైనాయక రక్షో భూత గ్రహంబులు చూర్ణంబులుగాఁ గొండొక వినోదంబు సలుపుము; ధరేంద్రంబ వైన పాంచజన్యంబ! సర్వలోక జిష్ణుండైన శ్రీకృష్ణునిఁ నిఖిల పుణ్యైక సదన వదన నిష్ఠ్యూత నిశ్శ్వాసాధర వేణు పూరితంబవై యున్మత్త భూత, ప్రేత, పిశాచ, విప్ర గ్రహాది క్రూర దుర్గ్రహంబులు విద్రావణంబులుగా, నస్మ త్పరవీరమండ లంబుల గుండియలతోఁ దదీయమానినీ దుర్భర గర్భంబులు గర్భస్థార్భక వివర్జితంబులుగా నవియ, బ్రహ్మాండభాండ భీకరంబయిన భూరి నాదంబున మోదింపు; మతి తీవ్రధారా దళిత నిశాతకోటి కఠోర కంఠ కరాళ రక్తధారా ధౌత మలీమస విసరంబవయిన నందక మహాసి శేఖరంబ! జగదీశ ప్రేరితంబవై మద్విద్వేషి విషమ వ్యూహంబుల మెండు ఖండములుగ ఖడించి చెండాడుము; నిష్కళంక నిరాంతక సాంద్ర చంద్రమండల పరిమండిత సర్వాంగ లక్షణ విచక్షణ ధర్మనిరతం బవయిన చర్మంబ! దుర్మద మద్వైరిలోకంబులకు భీకరాలోకంబులను సమాకుల నిబిడ నిరీంద్ర నిష్ఠుర తమః పటల పటు ఘటనంబులం గుటిల పఱుపుము; నిఖిల పాపగ్రహంబుల వలనను సకల నర మృగ సర్ప క్రోడ భూతాదులవలనను నగు భయంబులు పొందకుండ భగవన్నామ రూప యాన దివ్యాస్త్రంబుల రక్షించుం గాక; బృహద్రథంతరాది సామంబులచేత స్తోత్రంబు చేయం బడుచున్న ఖగేంద్రుండు రక్షణ దక్షుండై నన్ను రక్షించుఁగాక; శ్రీహరి నామ రూప వాహన దివ్యాయుధ పారిషదోత్తమ ప్రముఖంబు లస్మదీయ బుద్ధీంద్రియ మనఃప్రాణంబుల సంరక్షించు; భగవంతుండయిన శేషుండు సర్వోపద్రవంబుల నాశంబు చేయు; జగ దైక్యభావంబయిన ధ్యానంబు గలవానికి వికల్పరహితుండై, భూషణాయుధ లింగాఖ్యలగు శక్తులం దన మాయ చేత ధరియించి తేజరిల్లు చుండు లక్ష్మీకాంతుండు వికల్ప విగ్రహంబులవలన నన్ను రక్షించుఁగాక; లోకభయంకరాట్టహాస భాసుర వదనగహ్వరుం డగుచు, సమస్త తేజోహరణ ధురీణ తేజః పుంజ సంజాత దివ్య నృసింహావతారుం డగు నప్పరమేశ్వరుండు సర్వ దిగ్భాగంబు వలన, సమస్త బహిరంతరంబుల వలన నన్ను రక్షించుచుండుఁ గాత" మని నారాయణాత్మక కవచ ప్రభావం బితిహాస రూపంబున నింద్రుండు దెలిసికొని, ధ్యానంబు చేసి, తద్విద్యాధారణ మహిమవలన నరాతుల నిర్జించెం; గావున నెవ్వరేని నిర్మలాత్ము లగు వార లే తద్విద్యా ధారణులై యనుదినంబును బఠియించిన; నతి ఘోర రణంబుల నత్యుత్కట సంకటంబులను, సర్వ గ్రహ నిగ్రహ కర్మ మారణకర్మాది దుష్కర్మ జన్య క్లేశంబులను వదలి, యవ్యాకుల మనస్కులై, విజయంబు నొందుదురు; మఱియును, సర్వ రోగంబులకు నగమ్యశరీరులై సుఖంబు నొందుదు; రదియునుం గాక.

అతిభక్తిఁ గౌశికుం డను బ్రాహ్మణుఁడు దొల్లి-

  యీ విద్య ధరియించి యెలమి మించి

మరుభూమియందు నిర్మలచిత్తుఁడై యోగ-

  ధారణంబున బిట్టు తనువు విడిచె

దానిపై నొకఁడు గంధర్వవరేణ్యుండు-

  చిత్రరథాఖ్యుఁ డజేయుఁ డొంటి

చదలఁ జనంగఁ దచ్ఛాయ తదస్థిపైఁ-

  గదసిన నాతఁడు గళవళించి

యువిద పిండుతోడ నవ విమానముతోడఁ

దనదు విద్యతోడ ధరణిఁ ద్రెళ్ళి

తిరిగి లేవలేక తికమక గుడువంగ

వాలఖిల్యమౌని వానిఁ జూచి.

"నారాయణ కవచ సమా

ధారణ పుణ్యాస్థి దీని దగ్గఱ నీకుం

గూరెడినె? విష్ణుభక్తుల

వారక చేరంగ నెట్టివారికిఁ దరమే?

సంధించి నీ యంగక సంధులెల్లన్

బంధించి తన్మంత్రబలంబు పేర్మి

న్నందంబు మాన్పింపఁ దదన్యమేదీ?

సింధుప్రవాహోన్నతిచేతఁ దీరున్.

కావున నీ పుణ్యశల్యంబులు భక్తియుక్తుండ వై కొనిపోయి ప్రాఙ్ముఖంబునఁ బ్రవహించెడు సరస్వతీ జలంబుల నిక్షేపణంబు జేసి కృతస్నానుండవై యాచమనంబు చేసిన, నీ సర్వాంగబంధనంబు లుడుగు" ననిన నతం డట్ల చేసి, తన విమానం బెక్కి నిజస్థానంబున కరిగెఁ; గావున.

అనుదినము దీని నెవ్వరు

వినిరేనిఁ బఠించిరేని విస్మయ మొదవన్

ఘన భూతజాల మెల్లను

మునుకొని వారలను గాంచి మ్రొక్కుచు నుండున్.

విశ్వరూపువలన నైశ్వర్యకరమైన

యిట్టి విద్యఁ దాల్చి యింద్రుఁ డపుడు

మూఁడులోకములకు ముఖ్యమైనట్టి శ్రీ

ననుభవించి మించె నధికమహిమ.


Wednesday, September 16, 2020

పితృదేవతల ఆరాధనం- మహాలయపక్షము

నం చేసే పని మీద నమ్మకం, భక్తి శ్రద్ధలు ఉండాలి. మనల్ని కనిపెంచిన, పెద్ద చేసిన పితరుల పట్ల గౌరవం, పూజ్య భావం ఉండాలి. ఇది మన కనీస బాధ్యత. మనల్ని చూసి మన సంతానం నేర్చుకోవలసి సంప్రదాయం ఇది. మనకు ఋషులు కల్పించిన మహదవకాశం ‘మహాలయం’.
 
పితృ ఋణాన్ని తీర్చే పర్వం పితృపక్షం. అదే ‘మహాలయం’గా ప్రసిద్ధి చెందింది. .మహం ఆలం యాత్‌ ఇతి మహాలయం’ అని వ్యుత్పత్తి. చాలినంత తృప్తిని పితరులు ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన తర్పణాదుల ద్వారా పొందుతారు కనుక దీన్ని ‘మహాలయ పక్షం’ అని చెబుతారు.
 
‘‘అమావస్యే దినే ప్రాప్తే గృహద్వారాయే సమాశ్రితః
వాయుభూతాః ప్రవాంఛతి శ్రాద్ధాం పితృగణానృణామ్‌- అని గరుడ పురాణం పేర్కొంటోంది. అమావాస్య దినం రాగానే పితృ దేవతలు వాయు రూపంలో తమ వారి ఇళ్ళకు వచ్చి, సూర్యాస్తమయం వరకూ ఉండి, తమ వారు శ్రాద్ధ కర్మలు నిర్వహించి, అన్నదానాలు చేస్తే సంతృప్తి పొంది, ఆశీర్వదించి వెళ్తారట! లేకుంటే అసంతృప్తి చెంది, శాపనార్ధాలతో నిందించి, తిరుగుముఖం పడతారని గరుడ పురాణ వచనం.
 
నిజమే మరి! బిడ్డకు జన్మనిచ్చిన తల్లితండ్రులు... కోటి ఆశలతో పెంచి, పెద్ద చేసి, విద్యా బుద్ధుల ద్వారా ఒక స్థాయికి తెచ్చిన వారు... తమ చరమ దశలో ఆదుకుంటాడని ఆశించడం అసహజం కాదు. అలాకాక, మరోలా ప్రవర్తిస్తే ఏమనాలి? ఊపిరి ఆగిన తరువాత తమకు జన్మనిచ్చిన వారి అంత్యేష్ఠిని భక్త శ్రద్ధలతో నిర్వహించి, కర్మకాండ జరిపించడం పితృఋణం తీర్చినట్టు కాదు.
 
మూడు ఋణాలు
ప్రతి మానవుడు మూడు విధాలైన ఋణాలతో పుడతాడు. అవి దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ధర్మబద్ధమైన నిత్య నైమిత్తిక కార్యాచరణలతో ఈ మూడు ఋణాల నుంచి విముక్తుడవుతాడు. ‘యజ్ఞేవ దేవేభ్యః’ అని శాస్త్ర వచనం. క్రతువులు చేయడం, చేయించడం ద్వారా దేవగణాలు సంతృప్తి చెందుతాయి. అలా దైవఋణం తీరుతుంది. ‘బ్రహ్మచర్యేణ ఋషిభ్యః’- అంటే బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి.
ఇక మూడవది పితృ ఋణం. ‘ప్రజయా పితృభ్యః’ అని శాస్త్రవచనం. సంతానంతో పితృ ఋణం తీరుతుంది. ఇది పరంపరానుగతమైనది. దీనికి విఘాతం కలిగించకూడదు. తగిన వయసులో వివాహం చేసుకొని, సంతానాన్ని పొందాలి. తద్వారా పితృ దేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాదులు నిర్వహించాలి. మనం ఎలాంటి పితృకార్యం నిర్వహిస్తున్నా ఐదుగురు పితృ దేవతలు మన వాకిటి ముందు వాయురూపంలో నిరీక్షిస్తారు. వారు- తండ్రి, తాత, ముత్తాత, తల్లి తండ్రి, తల్లి తాత. వీరికి తర్పణాదులు, పిండ ప్రదానాలు తప్పక చేయాలనీ, అప్పుడే పితృ ఋణం తీరుతుందనీ పెద్దలు చెబుతారు. గరుడ పురాణం కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది.
 
పితృ యజ్ఞం
మహాభారతంలో, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు పితృ యజ్ఞాన్ని గురించి ధర్మరాజు కోరిక మేరకు వివరంగా చెప్పాడు. ‘‘దైవ పూజ కన్నా పితృ పూజే గొప్పది. పితృ దేవతలతో పాటు దేవగణాలూ సంతృప్తి చెందుతాయి. పితృ సమారాధనం సర్వ శుభసాధనం. ప్రతి అమావాస్య నాడు భక్తితో పితృ యజ్ఞం నిర్వహించాలి. అలా చేస్తే సంవత్సరమంతా పితృయజ్ఞం నిర్వహించిన ఫలం ప్రాప్తిస్తుంది’’ అని తెలిపాడు. సాధారణంగా ప్రతి అమావాస్య నాడు లేదా పితరులు మరణించిన రోజున శ్రాద్ధ కర్మలను మన పితృ దేవతలకు మాత్రమే పరిమితం చేస్తాం. కానీ, పితృ పక్షాలలోనూ, మహాలయ అమావాస్య నాడు సామూహిక శ్రాద్ధాలు... అంటే మన వంశంలోని పితృ దేవతలకూ, చనిపోయిన బంధు మిత్రులకూ, ఎంతమందికి వీలయితే అంతమందికి పిండ తర్పణాది కార్యక్రమం నిర్వహించవచ్చు. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృ పక్షం. ఆ అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అని పేర్కొంటారు. ఈ పేరు వెనుక ఒక కథ మహా భారతంలో ఉంది.
 
కర్ణుడి నుంచి మొదలు!
కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన కర్ణుని జీవాత్మ స్వర్గ మార్గంలో ప్రయాణం సాగించింది. కర్ణుడు బ్రతికున్న కాలంలో అర్థించిన వారందరికీ లేదనకుండా దానం చేసి, దానకర్ణుడుగా కీర్తి గడించాడు. అలాంటి కర్ణుడికి మార్గమధ్యలో ఆకలిదప్పులు కలిగాయి. చెట్టుకు పండిన పండును కోసుకు తిందామంటే, అది బంగారంగా మారింది! జలం తాగి ఆకలి తీర్చుకుందామంటే దోసిలిలో నీరు బంగారమయింది! కర్ణుడికి ఏమీ అర్థం కాలేదు. తండ్రి అయిన సూర్యుణ్ణి ప్రార్థించాడు. ప్రత్యక్షమైన సూర్యుడికి తన గోడు చెప్పుకొని, పరిష్కారం అడిగాడు.
 
అప్పుడు సూర్యుడు ‘‘నాయనా! నువ్వు దానకర్ణుడివే! అనుమానం లేదు. నీ సంపదనంతా దానం చేశావు. ఇంద్రుడు కోరితే సహజ కవచ కుండలాలనే దానం చేశావు. కానీ, ఒక్క రోజైనా, ఒక్కరికైనా అన్నదానం చేయలేదు. దాని ప్రభావమే ఇది!’’ అని చెప్పాడు. పరమాత్మ అనుమతితో కర్ణుడిని సశరీరంగా భూలోకానికి పంపిస్తూ, అన్నదానం చేయాల్సిందిగా సూచించాడు. కర్ణుడు సశరీరునిగా భూలోకానికి వచ్చిన రోజు భాద్రపద కృష్ణ పాడ్యమి. నాటి నుంచి పదిహేను (పక్షం) రోజులపాటు ఆకలి గొన్నవారికి అన్నదానాలు జరిపాడు. బంధు మిత్రులకు శాద్ధ కర్మలూ, తర్పణాదులూ నిర్వహించి, తిరిగి స్వర్గానికి పయనమయ్యాడు.
 
నాటి నుంచి భాద్రపద మాస శుక్ల పక్షం దైవ కార్యాలకూ, కృష్ణ పక్షం పితృ యజ్ఞాలకూ పరిమితం అయ్యాయి. కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షంగా వ్యవహరిస్తారు. ఈ పక్షం రోజులూ పితృ యజ్ఞం నిర్వహించాలనీ, వీలుకాని పక్షంలో అమావాస్య నాడు నిర్వహించాలనీ స్కాంద పురాణం చెబుతోంది. మన తాత ముత్తాతలు తృప్తి చెందితే... వారి అనుగ్రహం వల్ల మన తరువాతి తరాలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రబలమైన ధార్మిక విశ్వాసం. ఆ కారణంగానే పితృ కార్యాలకు మన శాస్త్రాలు అత్యంత ప్రాధాన్యం కల్పించాయి. శుభకార్యాలైన ఉపనయ, వివాహ సందర్భాల్లో కూడా పితరుల పట్ల శ్రద్ధా భక్తులు ప్రకటించే ఘట్టాలు చేటు చేసుకుంటాయని గమనించాలి.
 
భాద్రపదమాస కృష్ణ పక్షం మహాలయ పక్షం. ఈ రోజుల్లో శాస్త్ర విధిని అనుసరించి పితృ దేవతలను తృప్తి పరచాలి. పితరుల తృప్తి కోసం ఈ పుణ్య క్రతువును యాచన చేసి అయినా నిర్వర్తించాలనీ, అది ధర్మ సమ్మతమేననీ శాస్త్రం చెబుతోంది. ‘‘ప్రతిఫలం ఆశించకుండా ఇలాంటి శ్రాద్ధ కర్మలు విధిగా ఆచరించాలి. వంద యజ్ఞాలు చేసిన ఫలం కన్నా పితృ దేవతలకు తర్పణాలు విడవడం వల్ల లభించే ఫలం ఎంతో ఎక్కువ’’ అని ఏనాడో మన మహర్షులు చెప్పారు.

 మానవ జన్మ పొందిన ప్రతి జీవికి ఋణత్రయ బంధం ముడిపడి వుంటుంది. భగవంతుడు మనకు ప్రసాదించిన బుద్ధి జ్ఞానాల ద్వారా మనం ఋణ త్రయ విముక్తి పొందటానికి చేయవలసిన కర్మను పూర్వులు నిర్దేశించారు. ఋణ త్రయాలు -1.ఋషి ఋణము, 2. దేవ ఋణము, 3. పితృ ఋణము.

1 ఋషి ఋణము: ఋషుల వల్ల లభించిన జ్ఞానం బ్రహ్మ చర్య పాలన ద్వారా వేదాధ్యయనం, సంధ్యావందనం కర్మలను నిష్ణగా ఆచరించడం ద్వారా మానవులు ఋషి ఋణాన్ని తీర్చుకోగలుగుతారు.
2. దేవ ఋణము: దేవతలకు ఆహారాన్ని అందించడం ద్వారా ఇది తీరుతుంది. యజ్ఞ యాగాది కర్మల నాచరిస్తూ అందు సమర్పించే హవిస్సుల ద్వారా దేవతలకు ఆహారం అందుతుంది. దేవ ఋణ విముక్తికి తోడ్పడుతుంది.
3. పితృ ఋణం: మన శరీరాల జన్మ కారణమైన పితృ దేవతల అనుగ్రహాన్ని కూడా మానవులు పొందాలి. సత్సంతాన రూపంలో కొన్ని దేహాలు సృష్టించబడి సృష్టి కార్యవృద్ధి పొంది పిండోదక దానాలు జరిగితే పితృ దేవతలు తృప్తిపొంది వారు సంతానాన్ని ఆశీర్వదిస్తారు. అప్పుడు పితృ ఋణ విముక్తి కలుగుతుంది.
పితరులు గతించిన అనంతరం వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు. కాబట్టి ఆయా రూపాలలో వున్న పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, దర్శశ్రాద్ధ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారివారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతాయి. కావున ప్రతి ఒక్కరు పితృ ఋణ విముక్తుల ఎలా కావాలో చెపుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి. ప్రతి నెలా చేయాల్సిన తిల తర్పణం (దర్శ శ్రాద్ధం) సంవత్సర శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు.
ప్రతిసంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరు భూలోకంలోని తమ తమ సంతతివారు మహాలయ శ్రాద్ధము లేదా తిల తర్పణం చేయుదురని ఆయన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని, భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్ల పక్షం వరకు ఇక్కడ వసిస్తారు.
ఇంతమంది మహానుభావులైన పితృ దేవతలందు భాద్రపద కృష్ణపక్షం ఆరంభంనుంచి ఆమావాస్య వరకు ఆతర్వత ఆశ్వీజ, కార్తీక కృష్ణ పక్షాలలోను ఈ భూలోకంలో వసించుట చేత ఈ భూలోకమే మహానుభావులైన పితృదేవతలకు ఆలయమై భాసించును. ‘యత్కాలానచ్ఛేదేన భూలోకస్య మహాలయత్వమ్ తదచ్ఛేదక కాలస్యాపి మ హాలయత్వం బోద్ధ్వమ్’ అని వాక్యం. మహతామ్+ ఆలయం=మహదాలయః. పితృదేవతలందరు భూలోకంలో వుండుటవలన ఈ భూలోకమే మహాల(ళ)య మగును. దీనివల్ల ఈ కాలానికి మహాల(ళ)య పక్షము అని పేరు. పక్షమనగా పదిహేను రోజులని అర్ధం. ఆ విధంగా ప్రధానంగా భాద్రపద కృష్ణ పాడ్యమి మొదలు అమావాస్య వరకుండే పదిహేను రోజుల కాలమే మహాలయపక్షము. ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు.
ఈ మహాలయ పక్షాలకు పితృ పక్షమని, పెద్దల దినాలు అనే మాట కూడా వాడుకలో వుంది. ఈ పక్షం రోజుల్లో ప్రత్యేకించి ఓకరోజు సద్భ్రాహ్మణులు చెప్పిన రోజున సకుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలనారాధించి వారిపేర బ్రాహ్మణులకు బియ్యం, తాంబూల దక్షిణలు సమర్పించి వారి ద్వారా పితృ దేవతల ఆశీస్సులు పొందడమనే సదాచారం నేటికీ అమల్లో వుంది. ఈ విధంగా మహాలయ పక్షంలో ఈ బియ్యమిచ్చే కార్యక్రమం ద్వారా పితృ ఋణాన్ని తీర్చుకునే సదవకాశం మనకు కలిసి వస్తున్నది. బియ్యమివ్వడమంటే అపక్వ (ఆమ) పదర్ధాలను బియ్యము, పెసరపప్పు, నిర్దేశించిన కూరగాయలు, తాంబూల దక్షిణ యుక్తంగా పెద్దల పేర భక్తితో బ్రాహ్మణులకు దానం చేయబడే ప్రక్రియ. దీనినిఆమ శ్రాద్ధమని అంటారు.
భాద్రపద కృష్ణ పక్షంలో పితరులనుద్దేశించి శ్రాద్ధ తర్పణాలు చెయ్యబడనిచో ఆశ్వీజ కృష్ణపక్షంలోనైనా చేస్తారేమో అని ఎదురు చూస్తూ చివరకు కార్తీక మాస కృష్ణ పక్షం వరకు నిరీక్షిస్తూ రెండు నెలలు భూలోకంలోనే వుండి పోతారు. అప్పటికి కూడా భూలోకంలోని తమ సంతతి తమకు శ్రాద్ధ, తర్పణాలు చెయ్యకపోతే నిరాశ చెందిన పితృదేవతలందరు తిరిగి పితృ లోకాలకు వెళ్లిపోతారు. వారు నిరాశ చెందితే మనకు వారి ఆశీస్సులెలా అందుతాయి?
కావున మహాలయ పక్షాలలో మన వంశంలో గతించిన పితరులను అందరినీ సామూహికంకగా ‘కారుణ్యపితరులు’గా భావించి ఈ సందర్భంగా స్మరించి ఆరాధించుకోవడం జరుగుతుంది. కావున పితరులను నిరాశపరచకుండా కార్తీకం వరకు సమయముంది కదా అని తాత్సారం చేయకుండా భాద్రపద మాసంలోనే మహాలయపక్షంలోనే మహాలయ శ్రాద్ధ తర్పణాలు అవశ్యం చేసి తీరాలనే పెద్దల ఆదేశాన్ని పాటించడం మన విధి.
1 తర్పణాలు ఎప్పుడాచరించాలి?: దర్శ శ్రాద్ధమనబడే తిల తర్పణాలను ప్రతి నెలా అమావాస్య, సూర్య సంక్రమణము ఆరంభం నాడు, సూర్య చంద్ర గ్రహణ పుణ్య కాలమునందును, మహాలయ పక్షంలోను, ప్రత్యాబ్ధికములు (శ్రాద్ధములు) చేసిన మరుసటి దినము (పరేహణి) తర్పణం చేయుట ధర్మమని పెద్దలు ఆదేశించి వున్నారు.
2. ఎవరు తర్పణం చేయాలి?: 1.తండ్రి గతించిన వారందరు తర్పణం చేయాలి. 2. తండ్రి జీవించివున్నవారు తర్పణములు చేయకూడదు. 3. తల్లి జీవించి తండ్రి గతించినవారు ఆపై మూడు తరముల పితరులను స్మరిస్తః తర్పణం చేయాలి.
3. తర్పణం ఎవరెవరికి చేయాలి?: 1. ఒక్క పరేహణి తర్పణం తప్ప మిగతా అన్ని కాలాలలోని తర్పణాలు పితృ మాతృవర్గ ద్వయ పితరులకు (వారి నాహ్వానించి) తర్పణం చేయాలి. 2. మాతృ/పితృ ప్రత్యాబ్దిక శ్రాద్ధము చేసిన మరుదినము ఉదయమే పితృ వర్గము వారిని మాత్రమే ఆహ్వానించి తర్పణము చేయవలయునని నిర్దేశించబడింది. 3. మాతా మహులు (తల్లియొక్క తండ్రి) జీవించి వున్నచో మాతృవర్గము వారికి తర్పణము చేయవలసిన అవసరం లేదు.
వర్గద్వయమనగా పితృవర్గము (తండ్రి వైపు) వారు. మరియు మాతృవర్గము (తల్లియొక్క తండ్రివైపు) వారు
పితృవర్గంలో (పురుషులు) పితృ(తండ్రి), పితామహ (తాత), ప్రపితామహ (ముత్తాత) తాతకు తండి ఇలా మూడు తరముల వారు. ఈ ముగ్గురిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా దర్భలపై ఆహ్వానించి తర్పణం చేయాలి.
పితృవర్గంలో (స్ర్తిలు): మాతృ (తల్లి), పితామహి (నానమ్మ), ప్రపితామహి (తండ్రికి నానమ్మ) ఇలా మూడు తరాల వారు పై వరుసలో జీవించి వున్న వారిని వదిలి ఆపై తరము వారిని ఆహ్వానించాలి.
మాతృవర్గంలో (పురుషులు): 1. మాతామహ (తల్లికి తండ్రి), 2. మాతుః పితామహ (తల్లి తండ్రికి తండ్రి), 3. మాతృ ప్రపితామహ (తల్లి తాతకు తండ్రి)-3 తరాలు. మూడు తరాల వారిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా ఆహ్వానించి తర్పణం చేయాలి.
మాతృవర్గంలోని స్ర్తిలు: 1. మాతా మహి (తల్లియొక్క తల్లి), 2.మాతుఃపితామహి (తల్లికి అవ్వ), 3. మాతుఃప్రపితామహి (తల్లి అవ్వకు తల్లి) 3 తరాలు.
మానవుడు నేడు ప్రతీ పనికీ ద్రవ్య రూపంలో లాభానే్న వెతుకుతున్నాడు. అలా ద్రవ్య-వస్తు రూపంలో పొందలేని అనేకం భక్తి శ్రద్ధలతో ఈ కర్మ చేయడంవలన మనం పొందవచ్చును.
ప్రతి శ్రాద్ధ కర్మ, తర్పణంరోజున, గతించిన పితరులు, వసు రుద్ర ఆదిత్య స్వరూపులై ప్రకృతిలో అంతర్లీనమైన వున్న పితృదేవులను ఆహ్వానించి, అర్చించి తిల తర్పణలర్పించి అనంతరం వారిని యధా స్థానానికి సాగనంపడం సదాచారం.
భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన ఉత్కృష్టమైన ఈ కర్మకాండ ఎంతో అమూల్యమైనది. ఈ విధంగానైనా మనం మన పిల్లలు-తండ్రి, తాత, ముత్తాత ఆపై తరంవారు వారి భార్యల (సపత్నీకానాం) పేర్లు తెలుసుకుని గుర్తుంచుకునే అవకాశం కలుగుతుంది.
అట్లే తల్లివైపు మూడు తరాల స్ర్తి పురుషుల పేర్లు గోత్రం కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగానైనా మన పూర్వులను స్మరించుకునే అవకాశం కలుగుతుంది. మనంవారికేం చేయగలుగుతాం? మననుండి వారాశించేదేమిటి? కేవలం భక్తితో వారిని స్మరిస్తూ ఆహ్వానించి తిల తర్పణం (నువ్వుల నీళ్లు దర్భలపై వదలడమే కదా! మనకీ జన్మకారుకులైన పితృదేవలతలకు కృతజ్ఞతలర్పించుకోవడం ( ఈ తర్పణాల ద్వారా) మన విద్యుక్త ధర్మం కదా! దీనిద్వారా మన కుటుంబంలో తండ్రి, తల్లివైపు మూడు తరాల వారిని తెలుసుకునే సదవకాశం కలుగుతుంది. ఇది ధర్మంలుప్తం కానంత కాలం నిరంతరం సాగే ప్రక్రియ.
తర్పణం చేయకుంటే ఏమవుతుంది?: తర్పణం అనేది పితృదేవతలకు మన కృతజ్ఞతలు తెలుపుకునే మానసిక యజ్ఞంలాంటిది. లౌకికంగా ఆలోచిస్తే మనకు క్షణ కాలం బస్సులో సీటుఇచ్చిన వాడికి చిన్న సహాయంచేసిన వాడికి ధాంక్సు అంటూ కరిగిపోతూ చెబుతామే! మరి మన శరీర సృష్టికే కారణమైన, మనకు జీవితాన్ని ప్రసాదించిన పితృదేవతలకు కృతజ్ఞతలు తెలుపకపోవడంలో ఎంత స్వార్ధం! ఎంత మూర్ఖం! కాబట్టి ప్రతి ఒక్కరు మన పూర్వులకై ఇలాంటి సత్కర్మలనాచరించి వారిని తృప్తిపరుస్తూ వారి ఋణాన్ని తీర్చుకుని వారి ఆశీస్సులు పొందడం సదా వాంఛనీయం, సర్వ శ్రేయస్కరం!
అన్ని అమావాస్య-సంక్రమణ తర్పణాలు తప్పక చేయాలా?: వీలైనంతవరకు అన్ని అమావాస్యలు (సంవత్సరంలో 12సార్లు) సౌరమానం ప్రకారం సంక్రమణ ఆరంభ దినాలు (సంవత్సరంలో 12 సంక్రమణాలు) మరియు గ్రహణాల, మహాలయ పక్షాల వంటి సందర్భాల్లో తర్పణాలు చేయాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. అలా వీలుకానిపక్షంలో అమావాస్య తర్పణలు తప్పక చేయాలి.సౌరమానులకు సంక్రమణాలు ప్రధానం. ఆమావాస్య తర్పణాలతో బాటు (ఉత్తరాయణ పుణ్యకాలం మకరం) సంవత్సరంలో మేషం, కర్కాటకం (దక్షిణాయన ఆరంభం కర్కాటకం) తుల, మకర సంక్రమణాలు ఈ నాలుగు నెలల్లోనైనా తప్పక తర్పణం చేయాలి. మహాలయ పక్షాలలో విధిగా తర్పణం చేసి తీరాల్సిందే. ఇదంతా ఎంతో కష్టమనుకుని బాధపడుతు చేయడం సరికాదు. మనసారా శ్రద్ధ, భక్తితో మన పితృదేవులకు కృతజ్ఞతలు తెలుపుకునే ఉత్తమ యజ్ఞంలా భావించి చేయాల్సిందే కానీ ఎదో వంతుకు, నలుగురేమైనా అనుకుంటారేమో అని చేయాల్సింది కాదు. అందుకే ‘శ్రద్ధ యా దీయతే ఇతి శ్రాద్ధం’ అన్నారు పెద్దలు.
కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయనవసరం లేదా?: ‘దేవ పితృ కార్యాభ్యాం నప్మ మది తవ్యం’ అంటుంది శాస్త్రం. అంటే ఆయా సందర్భాల్లో ఆచరించాల్సిన దేవ, పితృ కార్యాలను తప్పనిసరిగా విధిగా ఆచరించాలని దీని అర్ధం. అంతేకానీ కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయాల్సిన అవసరం లేదనేది ఎక్కడా చెప్పబడలేదు. ఈ వాదన సరైంది కాదు. ప్రతి అమావాస్య, సంక్రమణం ఇతర విశేష దినాలలో పితృదేవతలు మననుండి ఆశించేది కృతజ్ఞతలే కదా!ఈ శ్రాద్ధ తర్పణాల ద్వారా పితృదేవులకు కృతజ్ఞతలందచేసుకోవడంలో బద్ధకించడం ఘోరమైన అపచారమే కదా! ఈ సదాచారాన్ని మనంపాటించకపోతే మన పితృదేవతలను మనం మరిచిపోవడమే కదా! మనమే మన పూర్వులను మరిచిపోతే మన పిల్లలు, తర్వాతి వారు మన వంశం గురించి ఎలా తెలుసుకోగలుగుతారు? కాబట్టి తీర్ధ విధులు (తీర్థ క్షేత్రాలలో) కావించే శ్రాద్ద తర్పణాలు) వేరు, నిత్యాబ్ధీకాలు, తర్పణాలు వేరు. కావున ఈ కర్మలు ఆచరించడం భారమనుకోవడం భక్తి శ్రద్ధలు లేక విసుగుతో చేయడం క్షమించరాని అపచారమే తప్ప మానవ ధర్మమనిపించుకోదు.
తర్పణము చేయుటకు అశక్తులు-అనర్హులకు ఏమిటి పరిష్కారం?: ఒక వీధిలో ఒక చోట మంటపెట్టి అందులో గుప్పెడు మిరపకాయలు గనక వేస్తే దాని ఘాటు ఆ వీధిలోని వారందరికీ ఎలా చేరుతుందో అదే విధంగా ఆ వీధిలో ఏ కొందరో ధర్మకార్యాలు చేస్తుంటే దాని ప్రభావం-ఏమీ చెయ్యని వారికి కూడ అందుతుందనే వాస్తవం పై ఉదాహరణ వివరిస్తుంది. పూర్వం రాజుల కాలంలో ఋషులు యజ్ఞ యాగాదులు, జప తపాలు చేస్తూ వుంటే (వారిని రాజులు ప్రోత్సహించి, పోషించేవారు) ఆ రాజ్యంలో సుఖ శాంతులు విలసిల్లేవనేది ప్రత్యక్ష సత్యం.


Thursday, September 3, 2020

నరకలోకములు అనేవి ఉన్నాయా?

 DATE :-0/09/2020

ప్రియమైన శివ పరివారం కు శుభాకాంక్షలు 

మనకి ప్రతి రోజు మన పూజ్య గురువు గారు శ్రీమద్ భాగవతం లో చాల చాల మంచి విశేషాలు మనం తెలుసుకోవలసిన విశేషాలు చెబుతున్నారు.. 

ఈ రోజు చెప్పిన ప్రవచనం కొంత ఆసక్తికరం గా ఉంది.. 

శుకదేవుడు చెప్పినవన్నీ విన్న మహారాజు పరీక్షిత్తు "మునీన్ద్రా!  లోకులు ఉచ్చనీచగతులు పొందుతారు అన్నావు.  ఈ వైచిత్ర్యమెందుకు కలుగుతుంది?  అసలు ఇన్ని రకముల పరిణామాలు ఎందుకు ఉన్నాయి.  నరకములనీ, స్వర్గములనీ వేరుగా ఎందుకు ఉన్నాయి?  భగవంతుడు అందరినీ ఒకే తీరుగా ఎందుకు సృష్టించలేదు?" అని అడిగాడు.

ఈ విషయం గురించే మనకి గురువు గారు చాలా సవివరం గా చెప్పారు..

"సాత్వికులు, రాజసులు, తామసులు అని కర్మచేసేవాళ్ళు మూడు విధములుగా ఉంటారు.  వాళ్ళ శ్రద్ధ కూడా మూడు విధాలుగా ఉంటుంది.  సాత్విక శ్రద్ధతో కర్మ చేస్తే సుఖ ఫలం లభిస్తుంది.  రాజస శ్రద్ధతో చేస్తే దానిఫలం దుఃఖమయంగా ఉంటుంది.  పైగా అన్నీ సమయాల్లోనూ శ్రద్ధ ఒకే విధంగా ఉండదు.  శ్రద్ధల తారతమ్యం బట్టే కర్తల గతిలో తారతమ్యం వస్తుంది.  నిషిద్ధ కర్మ వల్ల అధర్మం కలుగుతుంది.  ఈ అధర్మ కర్మలు కూడా శ్రద్ధా భేదం వలన తారతమ్యం ఏర్పడి, దుఃఖ రూపమైన కర్మ ఫలంలో కూడా తారతమ్యము వస్తుంది.  ఆవిద్య వలన కోరికలతో చెడ్డ పనులు చేస్తారు మనుషులు.  అందుచేత వెయ్యివిధాల నరకాలు అనుభవిస్తారు.  అవన్నీ వివరంగా చెబుతాను, శ్రద్ధగా విను."  అని తెలియచేస్తారు.  


అప్పుడు మళ్ళీ మహారాజు "భగవంతుడా!  నరకలోకములు అనేవి ఉన్నాయా?  ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి?  అవి ఈ త్రిలోకములలో అంతర్భూతములా, లేక వాటి బయట ఉన్నాయా?  కొంచెం వివరించి చెప్పండి" అని అడిగాడు. 


ఆయన ప్రశ్నకు సమాధానంగా ఋషి చెప్తున్నాడు "అవును, ఈ మూడులోకములలోనే ఉంది ఆ నరకం అని పిలువబడే లోకం.  దక్షిణ దిక్కులో భూమికి కిందగా ఉంది నరకం. (అండ జలాశయం మీద ఉంది).  

నీటికన్నా పైన భూమీ కన్నా కింద.  పాతాళ లోకం.. 

మనకి తరచుగా గురువు గారు మహా సంకల్పం చెప్తారు. అందులో వస్తుంది.. పాతాళ లోకం 

పూర్వం మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు  మూడు వందల అడుగులు దాటి భూమిని త్రవ్వద్దు అంటారు.  లేకపోతే అంతకన్నా లోతు ఉన్న నీరు త్రాగితే ఆ ప్రవృత్తే వస్తుంది.  దక్షిణం వైపే అగ్నిష్వాత్తు మొదలైన పితృగణాల వారు తమ తమ గోత్రాల వారి మేలుకోరుతూ ఉంటారు.  (మరీచి పుత్రులు అగ్నిష్వాత్తు మొదలైన వారూ, విరాట్పుత్రులు సోమదత్తుడు మొదలైన వారూ, అత్రి పుత్రులు బహిర్షాదులు, తదితరులు పితృ గణాలు.  క్రమంగా వీరు దేవతలకూ, సాధ్వులకూ, దానవాదులకూ పితృగణాలు చెప్పబడతారు.)

సూర్యదేవుని పుత్రుడు యముడు పితృ రాజు.  ఆయన తన పరివారంతో నరక లోకంలో ఉంటాడు.  మరణించి తన లోకానికి వచ్చినవారు, వారి వారి శరీరములో ఉండగా వారి కర్మానుసారముగా చేసిన పాపాన్ని తన వారితో శిక్షిస్తూ ఉంటాడు.  పరమాత్మ ఆజ్ఞ మేరకూ తన గణముతో శిక్షిస్తూ ఉంటాడు. 

కొందరు ఈ నరకాలు ఇరవై ఒకటనీ, మరికొందరు అరవై ఒకటనీ అంటారు.  పేర్లూ, ఆకారములూ, లక్షణములను ఇప్పుడు వివరిస్తాను.  


"తామిస్రోऽన్ధతామిస్రో రౌరవో మహారౌరవః కుమ్భీపాకః కాలసూత్రమసిపత్రవనం సూకరముఖమన్ధకూపః కృమిభోజనః సన్దంశస్తప్తసూర్మిర్వజ్రకణ్టకశాల్మలీ వైతరణీ పూయోదః ప్రాణరోధో విశసనం లాలాభక్షః సారమేయాదనమవీచిరయఃపానం." అని 21 నరకాలు.


అంటే తామస్రం, అంధతామస్రం, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, సూకరముఖము, అంధకూపము, క్రిమిభోజనము, సందసం, తప్తసూర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరిణి, పూయోదం, ప్రాణ రోధం, విశసనం, లాలాభక్షం, సారమేయోదనం, అవీచి, అయఃపానము - అనేవి 21 నరకాలు. 


ఇవి కాక ఇంకో ఏడు ఉన్నాయి. అవి "క్షారకర్దమో రక్షోగణ భోజనః శూలప్రోతో దన్దశూకోऽవటనిరోధనః పర్యావర్తనః సూచీముఖం" - అంటే క్షారకర్థమం, రక్షాగణ భోజనం, శూలప్రోపం, దండశూకం, అవఠనిదోధనం, పర్యావర్తనం, సూచీముఖం.  ఇవి యాతనా భూములు.  ఇవి 7. 


మొత్తం ఇరవై ఎనిమిది (28) అవుతాయి.  ఇవన్నీ పాపులు రకరకాల యాతనలు అనుభవించే ప్రదేశాలు.


ఇట్లు 

శివ పరివారం 


రౌరవే అపుణ్యనిలయే పద్మార్బుదనివాసినామ్, అర్థినాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్థతు అని ఒక శ్లోకం చెప్పారు.. మన భోజనానంతరం కొంత ఆహారం ను కొన్ని మెతుకునులు వదిలి వేసి ఇలా పద్యం చెప్పి కొంత ఉదకం ను ఒదిలివేయవలను.. కంచం లో ఉన్నది శాంతము నాకేయకుడదు.. ఆ ఉడక నీరే మన పితృదేవతలకు దాహం తీరుస్తుంది అని తెలియచేసారు..

Wednesday, August 26, 2020

రాధాష్టమి


 భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. ఈ దినానికి 'రాధాష్టమి'అని పేరు

 *రాధామాధవం ఎంత రమణీయం ! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం , స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం. తనను తాను ప్రేమించుకుందుటకు , తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి , రాధాసుందరి

                                  మరి మాధవుడు  కోటి మన్మధ లావణ్య కోమలాంగుడు. త్రిజగన్మోహన నీలవర్ణ శోభితుడు. సకల సద్గుణ భూషితుడు. నిర్మల హృదయుడు. నిర్గుణుడు. అది బృందావనం. 
 రాధాయ నమః అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ రూపంలో పరిగ్రహించాడని , అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.
 *రాధాకృష్ణులు - ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది. అప్రాకృతమైన జగత్తులో - ముక్త ధామం , వైకుంఠం , గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.
       *గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం , శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం , సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు.
               *శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది*.

  *శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని , రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు*.

       *రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని , కృష్ణుణ్ని భర్తగా పొందాలని*
*కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం' గా మారుతుందని వరమిచ్చాడని ఆ గాథ సారాంశం*.

                 *వృషభానుడు , కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం , దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు. శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు* - *భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి'* *గా వ్యవహరిస్తారు*.

  ఇట్లు
శివపరివారం

Monday, July 27, 2020

భాగవతం లో నదులు చెట్లు పర్వతాలు మో.

ప్రియమైన శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

మనకి  మన పూజ్య  గురువు గారు శ్రీమధ్భగవతం లో  పర్వతాలు , నదులు , చెట్లు, వనాలు , సముద్రాలూ మొ. వాటి గురించి తెలియచేసారు , కొంత సమాచారం ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

మనకి అనేక పర్వతాలు ఉంటాయి అందులో ముఖ్యం గా  వృతానికి ఉత్తర భాగములో మూడు పర్వతాలుంటాయి -  నీలః శ్వేతః శృఙ్గవ.  ఒక్కో పర్వతం ఒక్కో వర్షానికీ (రమ్యకహిరణ్మయకురూణాం) సరిహద్దు.  ఇవి తూర్పు దిక్కు వైశాల్యం ఉండి విస్తరించాయి.  ఉప్పు సముద్రానికి ఆ పక్కా ఈపక్కా వ్యాపించాయి.  ఒక్కో పర్వతం తన పూర్వ పర్వతం కంటే పది రెట్లు ఎక్కువ విస్తీర్ణం.

పొడుగులోనే ఎక్కువ తక్కువలు, వైశాల్యములో కావు.  దక్షిణ ఇలా వృతములో మూడు పర్వతాలు ఉన్నాయి.  నిషధో హేమకూటో హిమాలయ.  ఇవన్నీ పదివేల యోజనాల ఎత్తులో ఉన్నాయి.  హరి వర్షం కింపురుషం భారత వర్షం.  భారతదేశ సరిహద్దు పర్వతం హిమాలయం.  ఇలావృత వర్షానికి పూర్వభాగములో, ఇంకో మూడు పర్వతాలు ఉన్నాయి.  మాల్యవత్ గంధమాధనం అవానలం అనే పర్వతాలు పేరు పొందాయి.  ఇవి కేతుమాల భద్రాశ్వ వర్షానికి హద్దులు.  మరియొక నాలుగు పర్వతాలు పదివేల యోజనాల ఎత్తూ వెడల్పు ఉన్నవై మేరు పర్వతానికి ఉన్నాయి.  మన్దరో మేరుమన్దరః సుపార్శ్వః కుముద.  మేరు పర్వతానికి పోదగినవారికే ఈ పర్వతాలు దారి ఇస్తాయి.  మేరుపర్వతానికి ఇవి రక్షకమైనవి.

ఈ నాలుగు పర్వతములలో ఒక్కో పర్వతానికి గుర్తుగా ఒక్కో మహా వృక్షములు ఉన్నాయి.  మామిడీ జంబూ కదంబం న్యగ్రోధ (మఱ్ఱి).  ఈ నాలుగు మహావృక్షాలూ పర్వతానికి జండాలులా ఉన్నాయి.

పదకొండు వేల యోజనాల ఎత్తుతో, ఒక్కో కొమ్మ వైశాల్యం వంద యోజనాలు.  అలాగే ఈ పర్వతానికి నాలుగు చెట్లున్నాయి.  నాలుగు సముద్రాలే వీటికి నీరుపోస్తాయి.  పాలూ తేనే చెరుకు రసం నీరు.  ఈ నాలుగు జనములతో నాలుగు హ్రదములున్నాయి.

ఈ జలములో గొప్పదనం, ఒక్క సారి ఈ జలాన్ని ఆచమనం చేస్తే దేవతల సమముతో బలం వచ్చి యోగముతో నిష్ణాతులవుతారు.  ఉపదేవతల ఐశ్వర్యం సహజముగా వస్తాయి.

నాలుగు పర్వతాలూ నాలుగు చెట్లూ నాలుగు నదులతో బాటు నాలుగు ఉద్యాన వనాలున్నాయి.  అవి నందనం చైత్రరథం వైభ్రాజకం సర్వతోభద్రం.  ఈ ఉద్యానవనములలో దేవతలతో చుట్టబడి దేవతా స్త్రీలూ, వారి భర్తలూ వినోదములతో కాలం గడుపుతారు

మందర పర్వతం మీద ఉన్న చెట్టు పేరు మామిడి.  పదకొండు వందల యోజనాల ఎత్తులో ఉంటుంది.  అంత ఎత్తుకు తగ్గట్టుగా ఒక్కో పండూ ఒక్కో పర్వత శిఖరములా ఉంటుంది.  అవి ఎంతో తీయగా ఉంటాయి.
ఆ మామిడి పళ్ళ రసం పర్వత ప్రాంతములో ప్రవహించింది.  అలా ప్రవహించి ఎరుపు రంగు నీరులా మారి అరుణొద అనే పేరు వచ్చింది.  మందర గిరి శిఖరం నుంచి ఈ నది పడి తూర్పు దిక్కుగా ప్రవహించి ఇలావృతాన్ని తడిపేస్తుంది.  ఈ అరుణొదా నది జలమును సేవించిన పార్వతీ దేవి సేవకులైన యక్షులు మొదలైనవారిని స్పృశిస్తే చాలు, మన శరీర సుగంధం పదియోజనాలు వ్యాపిస్తుంది.

జంబూ (అల్ల నేరేడు) పళ్ళు కింద పడగా ఒక్కో పండు ఏనుగు శరీరమంత ఉండగా ఆ జంబూ ఫలము యొక్క రసము పారిన నది జంబూ నది.  ఈ ప్రవాహమూ జలమూ నదీ పరివాహక ప్రాంతములో ఉన్న మట్టితో కలిసి బంగారమయ్యింది.  జంబూ నదీ తీరములో పుట్టినది జాంబూనదం.  దానితో దేవతలు ఆభరణాలు చేసుకుంటారు.   మేరు మందర శిఖరాల నుండీ పదివేల యోజనాల నుండీ కిందపడుతూ దక్షిణ భాగములో పడి ఇలా వృత వర్షాన్ని తడిపేస్తుంది.  అక్కడ ఉండే మట్టి, జంబూ రసముతో తడపబడి, వాయువు సూర్య కిరణాలు సోకడం వలన దేవతలకు ఆభరణముగా జాంబూనదముగా పేరు గాంచింది.
ఇక మూడవ వృక్షం కడిమ చెట్టు.  ఇది సుపార్శ్వములో ఉంది.  ఈ వృక్షం యొక్క తొఱ్ఱలో వెళ్ళినటువంటి ఐదు మధు ధారలు ప్రవహిస్తూ పర్వత శిఖరము నుంచీ ప్రవహిస్తూ ఇలా వృతానికి పశ్చిమ భాగములో వస్తాయి.  ఈ రసాన్ని తాగిన వారి నిట్టూర్పు నుంచి వచ్చిన వాయువు కొన్ని  యోజనాలు వ్యాపిస్తుంది.
ఇక నాలగవది అయిన న్యగ్రోధము (మఱ్ఱి).  ఇక్కడ నాలుగు నదములు ఉన్నాయి.  (తూర్పు నుంచి పశ్చిమానికి పారితే నదము).
అన్ని కోరికలూ తీర్చే నదులు ఇవి.  ఈ నదులనుండి మనకు కావలసినవి అన్నీ లభిస్తాయి.  పర్వతం నుంచి పడుతూ ఉత్తరం వైపునుంచి ఇలావృతానికి వ్యాపించి ఉంటుంది.  ఈ నీరు తాగినందు వలనే వారిని దేవతలన్నారు.  శరీరం మడత పడటం, శరీరం దుర్గంధం రావడం మొదలైనవి ఉండవు.  చలి వేడి రంగు మారడం లాంటివి ఈ నదీ జలం తాగే వారికి ఏర్పడవు.  బ్రతికున్నంతవరకు మాత్రం ఇవన్నీ అనుభవిస్తారు.
"కురఙ్గకురరకుసుమ్భవైకఙ్కత్రికూటశిశిరపతఙ్గరుచకనిషధశినీవాసకపిలశఙ్ఖ
వైదూర్యజారుధిహంసఋషభనాగకాలఞ్జరనారదాదయో వింశతిగిరయో మేరోః కర్ణికాయా ఇవ కేసరభూతా
మూలదేశే పరిత ఉపక్లృప్తాః"

(కురంగం, కురరమ్, కుసుంభమ్, వైకంఠం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, నిషధం, శినీవాసం, కపిలమ్, శంఖం, వైదూర్యం, జారుది, హంసమ్, ఋషభమ్, నాగం, కాలంజరం, నారదం మొదలైన ఇరవై పర్వతాలున్నాయి.)  ఇవి మేరు పర్వతానికి పూవు మధ్య చుట్టు ఉన్న పద్మ కర్ణికలాగ ఉన్నాయి. మేరు పర్వతం మధ్యభాగమైతే ఈ ఇరవై పర్వతాలూ చుట్టూ వ్యాపించి ఉంటాయి.

జఠరదేవ మేరు యొక్క పూర్వభాగములో ఉండి దశయోజన విస్తీర్ణముతో వ్యాపించి ఉంటాయి.  ఇలా చుట్టూ ఉన్న పర్వతాలతో మేరుపర్వతం అగ్ని జ్వాలలతో ఆవరించి ఉన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటుంది.

మేరు యొక్క మూర్ధ్న భాగములో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నగరముంటుంది. పదివేల యోజనాలతో సమ చతురస్రముగా ఉంటుంది. అది శాతకుంభీ నగరం.

ఇలాంటి బ్రహ్మ పురిని చుట్టుకొని అష్టదిగ్పాలకుల నగరాలుంటాయి.  ఏ దిక్కుకు ఏ పాలకులో ఆ దిక్కులో ఆ నగరాలుంటాయి.  ఒక్కో దానికీ రెండవది నాలగవ వంతు.  

బ్రహ్మదేవుని పట్టణము పేరు మనోవతి.  దీని చుట్టూ ఉన్న పట్టణాలను వివరిస్తాను చదవండి.  దేవేంద్రుని పట్టణము అమరావతి.  ఇది తూర్పు దిక్కున ఉంది.  అగ్నిదేవుడి పట్టణం తేజోవతి.  ఇది ఆగ్నేయదిక్కున ఉంది.  యముని పట్టణం సంయమని.  ఇది దక్షిణం వైపు ఉంది.  నిరుతి పట్టణం కృష్ణాంగన.  ఇది నైరుతి దిక్కున ఉంది.  వరుణుడి పట్టణం శ్రద్ధావతి.  ఇది పడమటి దిక్కున ఉంది.  వాయుదేవుని పట్టణం గంధవతి.  ఇది వాయువ్య దిక్కున ఉంది.  కుబేరుని పట్టణం మహోదయ.  ఇది ఉత్తర దిక్కున ఉంది.  ఈశానుడి పట్టణం యశోవతి.  ఇది ఈశాన్య దిక్కున ఉంది.
ఇలా మనకి శ్రీమద్ భాగవతం లో అన్ని నదులు, వనాలు చెట్లు, సముద్రాలూ మొ.. ఉన్నాయి..
మరల ఒక్కో చెట్టు ఒక్కో విశిష్టని సంతరించుకుని ఉంటాయి.. చెట్లను సేవించడం వల్ల కలిగే ప్రయోజనాలు -శాస్త్రం వివరించింది.
ఈ లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు..
https://ranisarma.blogspot.com/2020/07/blog-post_13.html?m=1
ఇటు
కృష్ణం వందే జగద్గురుం
శివ పరివారం 

Wednesday, July 22, 2020

ధ్రువుడు అనంతరం జరిగిన కథ

ప్రియమైన భాగవత శివ పరివారం కు శ్రీ కృష్ణ శరణం మమ

మనకి   నిన్నటి  రోజున ధ్రువోపాఖ్యానమ్ ను  మన గురువు గారు తెలియచేసారు.. ధ్రువుడు అనంతరం జరిగిన కథ మనం తెలుసుకుందాం ,మనకి శ్రీమద్ భాగవతం లో ఎందరో మహానుభావులు పేర్లు వస్తాయి. కనీసం వాళ్ళ పేర్లు తలుచుకున్న .. మనం ధన్యులు అని గురువు గారు మనకి చాల సార్లు చెప్పారు..


ఈ రోజు గురువు గారు చెప్పిన ప్రవచనం లో వచ్చిన వాళ్ళ పేర్లు

స్వయంభువ మనువుకు 'శతరూప'అనే భార్యవలన 'ప్రియవ్రతుడు' 'ఉత్తానపాదుడు' అనే కుమారులుజన్మించారు.వీరిలో ఉత్తాన పాదునికి 'సునీతి' 'సురుచి' అనే వారు భార్యలు.సురుచితో ఉత్తానపాదుడు అమిత ప్రేమగా ఉండేవాడు.సురుచికి 'ఉత్తముడు' సునీతీకి 'ధృవుడు' జన్మించారు.ఓకరోజు ఉత్తాన పాదుడు ఉత్తముని ఓడిలో కూర్చొపెట్టుకుని ఉండగా,అదేసమయంలో ధృవుడుకూడా తన తండ్రి ఓడిలో కూర్చోవాలని వెళ్ళాడు.అదిచూసిన సురుచి 'నీకు ఆ అధృష్టంలేదు వెళ్ళు' అని అన్నది.పినతల్లి మాటలకు మనసు గాయపడిన ధృవుడు తల్లి సునీతి అనుమతితో తపస్సుకు బయలుదేరగా నారదముని ఇచ్చిన సలహాతో యమునానది తీరాన ఉన్న 'మధువనం'చేరి నారదుడు ఉపదేశించిన నారాయణ మంత్రం జపిస్తూ,తపస్సు ప్రారంభించి తొలి మాసం ఆహారంగా వెలగ,రేగిపండ్లు స్వీకరిస్తు,రెండవ మాసం ఆరుదినాలకు ఒకసారి 'జీర్ణతృణపర్ణాలను'తింటూ తొమ్మిది దినాలకు ఒక సారి నీరు స్వీకరిస్తూ, మూడుమాసాలు గడిపాడు.నాల్గవమాసంలో పన్నెండు దినాలకు ఒకసారి శ్వాసిస్తూ,ఓంటి కాలిపై శ్రీమహవిష్ణువుని ధ్యానిస్తూ అయిదు మాసాలు తపసు చేసాడు.ధృవుని కి శ్రీమహావిష్ణువు దర్శనం ఇచ్చి'చిరంజీవి నీతపస్సు ఫలించింది.'జ్యోతిశ్చక్రము' నక్షత్రస్వరూపాలైన వసిష్ట,అత్రి,గౌతమ,కశ్యప,భరద్వాజ,జమదగ్ని,విశ్వామిత్రులు అయిన సప్తమహర్షులు తారకలతో కలసి దేనికి ప్రదక్షణం చేస్తుంటారో అటువంటి 'ధృవ' నక్షత్రంగా వెలుగొందుతావు.వృధ్ధుడైన నీతండ్రి రాజ్యాభారాన్ని నీవు స్వీకరించు.నీతమ్ముడు ఉత్తముడు అడవిలో వేటకు వెళ్ళి మరణిస్తాడు. అతని తల్లి అడవిలో అగ్నిజ్వాలలకు బలి అవుతుంది'అని అదృశ్యమైయాడు. రాజ్యభారం స్వీకరించిన ధృవుడు శింశుమార ప్రజాపతి కుమార్తె 'భ్రమిరి'నివివాహంచేసుకున్నాడు.ఈమెకు 'కల్పుండు' 'వత్సరుడు'జన్మించారు.వాయుదేవుని పుత్రిక 'ఇల'ను చేపట్టగా ఆమెకు'ఉత్కలుడు'జన్మించాడు.'ధన్య'అనే భార్యకు'శిష్టుడు'జన్మించాడు. 'శంభువు'అనే భార్యకు 'భవ్యుడు' 'శ్లిష్టి'అనేవారు జన్మించారు.వీరుకాక 'గర్కుడు' 'వృషభుడు' 'వృకుడు' 'వృకలుడు' 'ధ్రతిమంతుడు'అనే కుమారులు ఉన్నారు. సుధీర్ఘ రాజ్యపాలన చేసిన అనంతరం తన సంతతికి రాజ్యాన్ని అప్పగించి ధృవతారగా అంబరాన నిలిచాడు ధృవుడు.ధృవుని పెద్దకుమారుడు ఉత్కలుడు రాజ్యాన్ని తిరస్కరించి తపోవనాలకు వెళ్ళడంతో,రెండోకుమారుడు వత్సరునికి పట్టాభిషేకంజరిగింది. వత్సరుడు 'సర్వార్ధి'ని వివాహంచేసుకున్నాడు.వీరికి 'పుష్పార్ణుడు' 'చంద్రకేతుడు' 'ఇష్టుడు' 'ఊర్జుడు' 'వసువు' 'జయుడు'అనేవారు జన్మించారు. వీరిలో పుష్పార్జునునకు 'ప్రభ' 'దోష' అనే ఇద్దరు భార్యలు.వీరిలో ప్రభకు 'ప్రాతర్శ' 'థంధని' 'సాయిలు'జన్మించగా,దోషకు'ప్రదోషుడు' 'నిశీధుడు' 'వ్యుష్టుడు'అనేవారు జన్మించారు.వీరిలో వ్యూష్టుని భార్య 'పుష్కరిణి'వీరికి 'సర్వతేజుడు'జన్మించాడు.అతనికి 'ఆకూతి'భార్య వీరికి'చక్షుస్సు'అనే మనువు జన్మించాడు.చక్షుస్సు భార్య 'నడ్వల' వీరికి'పురువు' 'కుత్సుడు' 'త్రితుడు' 'ద్యుమ్నుడు' 'సత్యవంతుడు' 'బుతుడు' 'త్రతుడు' అగ్నిప్టోముడు' 'అతిరాత్రుడు' 'సద్యుముడు' 'శిబి' 'ఊల్మకుడు'అనే వారు జన్మించారు.వీరిలో ఊల్మకుడికి 'అంగుడు' 'సుమనుడు' 'ఖ్యాతి' 'కత్రువు' 'అంగీరసుడు' 'గయుడు' జన్మించారు.అంగుడు 'సునీథ'దంపతులకు 'వేనుడు'జన్మించాడు.అతని ప్రవర్తన నచ్చక అంగుడు అడవులకువెళ్ళి తపస్సు చేసుకొసాగాడు.ఈవిషయం తెలుసుకున్న మునులు వేనుని శపించగా అతను మరణించాడు.మునులు అతని శరీరంనుండి నారాయణాంశంతో ఓబాలుని సృష్టించారు.అతని మొదటి చక్రవర్తి అయిన'పృథుడు'ఇతనిభార్య 'అర్చి' వీరు హరి నామ స్మరణతో పలు అశ్వమేథ యాగాలు చేసారు. పృథువుకు 'కుబేరుడు' బంగారు సింహాసనం.'వరుణుడు' చంద్రకాంతులు వెదజల్లే గొడుగు. 'వాయుదేవుడు' వింజామరం.'ధర్మదేవత' యశోరూపమైన పూమాల, 'ఇంద్రుడు'కిరీటం , 'యముడు'రాజదండం, 'బ్రహ్మదేవుడు'వేదకవచాలు, 'సరస్వతిదేవి'మేలిముత్యాలదండ,' విష్ణువు' సుదర్శన చక్రాన్ని, 'లక్ష్మిదేవి'తరగని సంపదను,'శివుడు' ఖడ్గాన్ని, 'పార్వతిదేవి'శతచంద్రం అనే డాలును,'చంద్రుడు'తెల్లని గుర్రాలను వెండి రధాన్ని,'సూర్యుడు' అస్త్రాలను,'అగ్ని' అజగవం అనేధనస్సును,'భూదేవి'యోగమాయ అయిన పాదుకలు బహుకరించారు.' ఈదంపతులకు'విజాతాశ్వుడు' 'థూమ్రాశ్వుడు' 'హర్యాశ్వుడు' 'ద్రవిణుడు' 'అంతర్ధానుడు' 'హవిర్భానుడు' 'వృకుడు' జన్మించారు.

ఇట్లు
శివ పరివారం 

Tuesday, July 14, 2020

శతగాయత్రి-మంత్రావళి

శతగాయత్రి-మంత్రావళి
-: బ్రహ్మ గాయత్రి :-
1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //
-: విష్ణు గాయత్రి :-
4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
-: శివ గాయత్రి :-
7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//
9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//
10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //
11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
-: వృషభ గాయత్రి :-
13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
-: చండీశ్వర గాయత్రి :-
15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
-: భృంగేశ్వర గాయత్రి :-
17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//
-: వీరభద్ర గాయత్రి :-
18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
-: శిఖరగాయత్రి :-
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//
-: ధ్వజగాయత్రి :-
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//
-: దత్త గాయత్రి :-
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//
-: శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//
-: సుదర్శన గాయత్రి :-
25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
-: మత్స్య గాయత్రి :-
27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//
-: కూర్మ గాయత్రి :-
28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//
-: వాస్తుపురుష గాయత్రి :-
29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.//
-: శ్రీ గణపతి గాయత్రి :-
30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
-: శ్రీ కృష్ణ గాయత్రి :-
32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
-: శ్రీ రామ గాయత్రి :-
35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
-: శ్రీ ఆంజనేయ గాయత్రి :-
37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
-: శ్రీ హయగ్రీవ గాయత్రి :-
39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//
-: శ్రీ స్కంద గాయత్రి :-
40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
-: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-
43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
-: శ్రీ గరుడ గాయత్రి :-
45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//
-: శ్రీ అనంత గాయత్రి :-
46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//
-: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-
47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//
48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//
49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//
50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.//
51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//
52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//
53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//
54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//
-: శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-
55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.//
56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//
57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//
58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//
59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.//
60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//
61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//
62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//
63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//
-: శ్రీ సాయినాథ గాయత్రి :-
64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//
-: శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-
65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//
-: శ్రీ నృసింహ గాయత్రి :-
66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//
-: శ్రీ లక్ష్మణ గాయత్రి :-
67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//
-: శ్రీ క్షేత్రపాల గాయత్రి :-
68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//
-: యంత్ర గాయత్రి :-
69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//
-: మంత్ర గాయత్రి :-
70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//
-: శ్రీ సరస్వతీ గాయత్రి :-
71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//
-: శ్రీ లక్ష్మీ గాయత్రి :-
72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
-: శ్రీ గౌరి గాయత్రి :-
74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
-: శ్యామలా గాయత్రి :-
76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.//
77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//
-: భైరవ గాయత్రి :-
78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//
-: శక్తి గాయత్రి :-
79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//
-: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-
80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
-: శ్రీ బాలా గాయత్రి :-
82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//
-: శ్రీ సీతా గాయత్రి :-
83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//
-: శ్రీ దుర్గా గాయత్రి :-
84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//
-: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-
85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.//
-: శ్రీ ధరా గాయత్రి :-
86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//
-: శ్రీ హంస గాయత్రి :-
87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.//
-: శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-
88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//
-: శ్రీ గంగా దేవీ గాయత్రి :-
89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
90. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
-: శ్రీ యమునా గాయత్రి :-
91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.//
-: శ్రీ వారాహీ గాయత్రి :-
92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత శ్రీ చాముండా గాయత్రి :-
93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.//
శ్రీ వైష్ణవీ గాయత్రి :-
94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//
శ్రీ నారసింహ గాయత్రి :-
95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.//
శ్రీ బగాళా గాయత్రి :-
96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//
-: శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-
97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.//
శ్రీ సంతోషీ గాయత్రి :-
98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.//
శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-
99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

ఆది మంత్రం "గాయత్రి".

త్రికాలజ్ఞులై నిష్కాములైన భౌతికసుఖములనుకోరని ఋషీశ్వరులు యోగదృష్టితో లోకకళ్యాణమునకు ఉత్కృష్టమైన మంత్రములు ప్రసాదించిరి. 
మకారం మననం ప్రాహు స్తకారస్త్రాణ ఉచ్యతే/మనన త్రాణసంయుక్తో మంత్ర ఇత్యభి ధీయతే // 
'మ' మననం చేయువానికి 'త్ర' రక్షించును. అనగా మననం చేయువానిని రక్షించునది మంత్రమనబడును.
మంత్రములలో శైవ మంత్రములు ఒక కోటి, సౌరములు రెండు కోట్లు, గణేశ మంత్రములు ఏబది లక్షలు, వైష్ణములు ఏబది లక్షలు, శక్తి మంత్రములు మూడు కోట్లు గలవు. ఈ సప్తకోటి మహామంత్రములలో ఆది మంత్రం "గాయత్రి".
యోగులకంటే మంత్రజపం చేయువారు మిగుల ఉత్తములని భారతమున చెప్పబడెను. యజ్ఞములన్నింటిలో జపయజ్నం శ్రేష్టమైనది. యజ్ఞానం జపయజ్ఞోస్మి (భగవద్గీత) . 'సర్వమంత్రేషు గాయత్రీ వరిష్టా ప్రోచ్యతే బుధై:' సర్వమంత్రములలో గాయత్రిమంత్రం మిక్కిలి శ్రేష్టమైనది.
 'గయాన్  త్రాయతేసా గాయత్రీ 'అనగా ఏది గయ - ప్రాణమును రక్షిస్తుందో - అది గాయత్రి (ఐతరేయ బ్రాహ్మణం). ప్రాణములను ఉద్ధరించే  సామర్ద్యము కారణముగా ఆదిశక్తి గాయత్రి అనుబడినది. 'గాయత్రీ వేద మాతా చ' గాయత్రి వేదములయొక్క తల్లి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తియు గాయత్రీ శక్తిజనితములు. శంకరాచార్య భాష్యములో గాయత్రీశక్తిని స్పష్టం చేస్తూ ఇలా చెప్పబడినది - 'గీయతే తత్వమనాయ గాయత్రీతి ' అనగా ఏ వివేకబుద్ధి ఋతంభరా ప్రజ్ఞ ద్వారా వాస్తవికత యొక్కజ్ఞానము లభింపజేస్తుందో అది గాయత్రి. 
గాయత్రీ తు స్వయం పూర్ణో యోగ ఇత్యుచ్చతే బుధై: / కించిత్తత్వం హి యోగస్య బహిరస్మాన్న విద్యతే //
భావం : గాయత్రి స్వయముగా పూర్ణయోగం అని పండితులు తెలియజేశారు. యోగం యొక్క ఏ తత్వాలు దీనికి బాహ్యముగా లేవు. యోగమనగా కలయిక. ఆత్మను పరమాత్మలో కలిపేదే యోగం. ఐతే యోగసాధన మార్గాలు అనేకం. ఒకొకరి సాధన ఓకోలా వుంటుంది. సాధకుని స్థితిబట్టి, అవగాహనబట్టి, అనుకూలతబట్టి, శక్తిబట్టి, యోగ్యతబట్టి తమకు నచ్చిన సాధనమార్గాన్ని అనుసరిస్తారు. ఏ సాధనైన దాని పరమార్ధం పరమాత్మలో సంలీనమే. ఈ సాధనామార్గాలలో గాయత్రీ సాధన ఒకమార్గం.
గాయత్రీమాతకు ఐదు ముఖములుండును. అందు మొదటిది ముత్యపురంగు, రెండవది పగడపురంగు, మూడవది బంగారపు వన్నెయు, నాల్గవది ఇంద్రనీలపువర్ణమును, ఐదవది వజ్రపువర్ణమును కలిగియుండును. ఈమె త్రినేత్రదారిణి. నవరత్నకిరీటమును ధరించి ప్రకాశమానమై యుండును. దశబాహువులు కలిగి అందు వరదాభయముద్రలను, అంకుశం, కొరడా, కపాలం, శంఖ చక్ర గదా పద్మద్వయమును ధరించి ఎల్లప్పుడూ భక్తులను రక్షించుచుండును. 
                      * ఆదిశక్తి - వేదమాత - దేవమాత - విశ్వమాత *
గాయత్రి పరమాత్మ యొక్క ఇచ్చ్చాశక్తి. దాని కారణముగా సృష్టి మొత్తం నడుచుచున్నది. చిన్న పరమాణువు మొదలుకొని పూర్తి విశ్వబ్రహ్మాండం వరకు ఆమె యొక్క శక్తిప్రభావం వలననే చరిస్తున్నాయి. పరమాత్మ స్వయముగా మౌలికరూపంలో నిరాకారుడు, అన్నిటినీ తటస్థ భావముతో చూస్తూ శాంతియుత అవస్థలో ఉంటారు.సృష్టి ప్రారంభంలో ఆయనకు ఒకటి నుండి అనేకము అయే కోరిక కలిగినప్పుడు, ఆయన ఈకోరిక శక్తిగా తయారైనది.ఈ శక్తి సహాయంతోనే మొత్తం సృష్టి తయారై నిలబడినది. సృష్టిని తయారుచేసే ప్రారంభికశక్తి అయిన కారణముగా గాయత్రీనీ "ఆదిశక్తి " అనిఅన్నారు. బ్రహ్మకు సృష్టినిర్మాణ, విస్తరణల కొరకు అవసరమైన జ్ఞానము, క్రియాకౌశలము ఆదిశక్తి గాయత్రి యొక్క తపోసాధన ద్వారానే లభించినది. ఇదే జ్ఞాన -విజ్ఞానము, వేదము అనబడినది. ఈ రూపంలో ఆదిశక్తి పేరు "వేదమాత" అయినది. వేదముల సారము గాయత్రీ మంత్రములో బీజ రూపంలో నిండి ఉన్నది. సృష్టి యొక్క వ్యవస్థను రక్షించే, నడిపించే విభిన్న దైవశక్తులు ఆదిశక్తి యొక్క ధారలే. ఆదిశక్తి నిర్మాణం, పర్యవేక్షణ, పరివర్తనము మొదలైన క్రియలకు అనుగుణముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వంటి దైవశక్తులరూపంలో విడివిడిగా ప్రకటితమౌతుంది. ఇదేవిధముగా ఇతర దైవశక్తులు దీనియొక్క వివిధ ధారలు ఈశక్తి నుంచే పోషణ పొందుతాయి . ఈ రూపములో శక్తిని  " దేవమాత " అనే పేరుతో పిలుస్తారు. విశ్వఉత్పతి మొత్తం ఆదిశక్తి గర్బములో జరిగినది . కనుక "విశ్వమాత" అనే పేరుతో కూడా పిలుస్తారు. 
                                      గాయత్రీ పరాశక్తి. మహాకాశ, చిత్తాకాశ, చిదాకాశ స్వరూపమే గాయత్రీస్వరూపం. గాయత్రిమంత్రం సర్వతత్త్వసంపూర్ణం. పరబ్రహ్మ మౌలికం. గాయత్రీ పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరత్వమే భగత్వం. భగం కలిగినవాడే భగవంతుడు. భగమనగా బలం, తేజం, శక్తి, ఆరోగ్యం, ఐశ్వర్యములని అర్ధం. ఈ దైవీశక్తులే గాయత్రీశక్తులు. శక్తిమంతుడే పరమేశ్వరుడు, శక్తి ఉత్పాదనమే గాయత్రీయోగం.
                                     గాయత్రి మూడు గుణములతో కూడిన శక్తి . హ్రీం - సద్బుద్ధి, శ్రీం - సమృద్ధి, క్లీం - శక్తి ప్రధానములు. దీనికి మూడు విశేష ధారలు కలవు. వీటిని గంగ, యమునా, సరస్వతిల త్రివేణీ సంగమం అని కుడా అనవచ్చును. దైవశక్తులతో జోడించినపుడు వీటిని సరస్వతి ,లక్ష్మి ,కాళి మరియు బ్రహ్మ ,విష్ణు, మహేశ్వర రూపంలో తెలుసుకొనగలము. గాయత్రి సాధనతో సాధకుని మనస్సు, బుద్ధి మరియు భావనలు ఈ త్రివేణిలో స్నానం చేసే అవకాశం లభించినపుడు, స్థితి కాయకల్పం వలె తయారవుతుంది. సద్గుణములు వృద్ధి, అంతర్గత శాంతి , సంతోషంతో పాటు సార్వజనిక సమృద్ధి సఫలతలను ఇచ్చేది గాయత్రి. 
                                     ప్రాపంచిక కష్టాల నదిని దాటుటకు ధైర్యము, సాహసము, ప్రతిభ, ప్రయత్నం అనే నాలుగు కోణములుగల నావ అవసరము. గాయత్రీ సాధన ఈ నాలుగు ప్రత్యేకతలను మనిషిలో బాగా పెంపొందిస్తుంది.
                                     జీవాత్మ ,పరమాత్మ మధ్య సూక్ష్మ ప్రకృతి యొక్క మాయా పరద ఉన్నది . ఈ పరదాను దాటుటకు ప్రకృతిసాదనములతోనే ప్రయత్నించాలి. చింతన - మననం, ధ్యానం - ప్రార్ధన, వ్రతము - అనుష్టానము, సాధన వంటి అన్ని ఆద్యాత్మిక ఉపచారములు ఇందు నిమితమై ఉన్నాయి. వీటన్నిటిని వదిలి పరమాత్మను పొందుట ఏ విధముగాను వీలుకాదు. సత్యగుణం, చిత్ శక్తి ద్వారా మాత్రమే జీవాత్మ ,పరమాత్మల యొక్క కలయిక జరుగగలుగుతుంది. ఈ ఆత్మ పరమాత్మల కలయికను జరుపగలిగే శక్తియే గాయత్రి.
                                    గాయత్రి బ్రహ్మప్రతిపాదకమగు మంత్రము. కుండలినీ శక్తి 24 తత్వంలతో జగత్తును సృజించును కావున గాయత్రి  24 అక్షరములు కలిగి యున్నదని శంకరులు ప్రపంచసారమున వ్రాసిరి. 
ఈ శరీరం పంచభూతాత్మకం. ఇందలి జీవాత్మ చిదానందస్వరూపముగా పంచప్రాణస్వరూపముగా విహరించుచున్నది. తన్మాత్ర స్వభావంవలన ప్రలోభితమైన గుణసంపత్తును దైవీసంపత్తుగా మలచుకొని ఆధ్యాత్మికధారణ చేయవలెను. యోగసిద్ధివలన ఇది సాధ్యం. యోగసిద్ధి మంత్రసిద్ధివలన వచ్చును. 
                                * గాయత్రీ మంత్రం *
గాయత్రీమంత్రములో తొమ్మిది నామములు కలవు. ౧. ఓం ౨. భూ ౩. భువః ౪.సువః ౫.తత్ ౬. సవితు: ౭. వరేణ్యం ౮. భర్గః ౯.దేవస్య ఈ తొమ్మిదినామములద్వార భగవంతుడు కీర్తింపబడుతున్నాడు. ధీమహీ అంటే ఉపాసన అని అర్ధం. ధియోయోనః ప్రచోదయాత్ అంటే భగవంతున్ని ప్రార్ధించుట.
ఈ మంత్రమును ఐదుచోట్ల ఆపి జపించవలెను. ౧. ఓం ౨. భూర్భువ స్సువః ౩. తత్స వితుర్వరేణ్యం ౪. భర్గోదేవస్య ధీమహీ ౫. ధియోయోనః ప్రచోదయాత్.
"ఓం భూర్భువ స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
అర్ధం : 'ఓం' కారంను ప్రణవమని అందురు. ప్రణవమునుండియే సమస్త శబ్దములు, మంత్రములు ఏర్పడుటచేత ఓంకారం సర్వమంత్రములకు హేతువు. ఓంకారముచే వ్యాహృతులు, వ్యాహృతులచే వేదములు ఆవిర్భవించినవి. (ఓంకారం వివరణ ఈ బ్లాగ్ మొదటి పోస్ట్ యందు కలదు)   ఓం = ప్రణవాత్మకమైన పరమాత్మ(పరమేశ్వరుడు), భూ = ప్రాణము నకు ప్రాణము(సత్ స్వరూపుడు), భువః = సర్వదుఃఖములను పోగొట్టి(చిత్ స్వరూపుడు), సువః = సమస్తసుఖములను యిచ్చునట్టి(ఆనందస్వరూపుడు)పరమాత్మ, నః = మా యొక్క, ధియ = బుద్ధులను, ప్రచోదయాత్ = ప్రేరణ చేయునో,  తత్ = ఆ, సవితు: = సర్వజగత్తులను సృష్టిచేయు, దేవస్య = దివ్యమహిమగల ఆ పరమాత్మయొక్క, వరేణ్యం =మిక్కిలి శ్రేష్టమై కోరదగిన, భర్గః = సర్వదుఃఖనాశకరమగు శుద్ధస్వరూపమును, ధీమహి = ధారణచేయుదునుగాక.                               
                              * గాయత్రీ గుణముల విశిష్టత *
ఈ మంత్రము యొక్క ఇరువదినాలుగు అక్షరములు ఇరువదినాలుగు గుణములను కలిగియున్నది.
'త' - అజ్ఞానాంధకారమును పోగొట్టును, 'త్స' - ఉపపాతకములను పోగొట్టును, 'వి' - మహాపాతకములను, 'తు' - దుష్టగ్రహ దోషములను,   'ర్వ' - భ్రూణహత్యాదోషములను, 'రే' - అగమ్యాగమనదోషములను, 'ణి' - అభక్ష్యాభక్షణ దోషములను, 
'యం' - బ్రహ్మహత్యాపాతకములను, 'భ' పురుషహత్యాపాతకములను, 'ర్గో' గోహత్యదోషములను, 'దే' స్త్రీహత్యాదోషములను, 
'వ' - గురుహత్యాదోషములను, 'స్య' - మానసికపాపములను, 'ధీ' - పితృ మాతృవధ పాపములను, 'మ' - పూర్వజన్మార్జిత పాపములను, 'హి' - అశేష పాపసమూహములను, 'ధీ' - ప్రాణివధపాపములను, 'యో' - ప్రతిగ్రహపాపములను, 'యో' - సర్వపాపములను పోగొట్టగా,
'నః' - ఈశ్వరప్రాప్తియు, 'ప్ర' - విష్ణులోకప్రాప్తియు, 'చో' - రుద్రపదప్రాప్తియు, 'ద' - బ్రహ్మపదప్రాప్తియు, 'యాత్' - త్రిమూర్తుల ప్రసాదసిద్ధిని కలగజేయును.
భూ:, భువః, సువః, అనే మూడు వ్యాహృతులు బ్రహ్మతత్వ స్వరూపలక్షణమైన సత్, చిత్, ఆనందాలు. భూ: అంటే సత్తు, భువః అంటే చిత్తు, సువః అంటే ఆనందము. ఈ మూడు కలిసిందే ఓం. ఇదే పరబ్రహ్మ. తత్ సవితు: అదే సవిత. సూయతే అనే నేతిసవితా - ఈ జగత్తు సృష్టి స్థితి లయలకు కారణమైంది సవిత (గాయత్రి). 
                     * గాయత్రీ మంత్రోచ్చారణ ప్రభావం * 
ఈ మంత్రోచ్చారణ సమయమందు శరీరములోని సర్వ నాడీస్థానములలో స్పందనాశక్తి చేకూరును. షట్ చక్రములలో స్పందన ఏర్పడి తద్వారా చక్రములు జాగృతమౌను. ఈ బీజాక్షర స్పందనాశక్తివలన శరీరావయములలో ఉన్న గ్రంధులలో శక్తులను మేల్కొలిపి మహత్వపూర్ణమగు సఫలతను, సంపన్నతను, సిద్ధులను చేకూర్చును. గాయత్రి మంత్రంలోని బీజాక్షరములు శరీరములోని ఈ దిగువ వివరించినస్థానములయందు స్పందనను చేకూర్చి పూర్ణయోగత్వమును సిద్ధింపజేస్తుంది.
సూర్యున్ని ఆరాధించిన ఆరోగ్యం, కుశలం, పుత్రులు పుణ్యం; మహాదేవున్ని ఆరాధించుట వలన యోగం, జ్ఞానం, కీర్తి; విష్ణువును ఆరాధించిన ధర్మార్ధ కామమోక్షములు; దుర్గోపాసనచే సర్వ మోక్షాది సకలకోరికలు; గణేశున్ని ఉపాసించిన కర్మసిద్ధి, విఘ్ననివారణ ప్రాప్తించును. అయితే గాయత్రీ మంత్రానుష్టానమువలన పంచాయతన దేవతలు చేకూర్చు సర్వఫలములు సమిష్టిగా చేకూరును. ఈ మంత్రం పఠనం చేయువారికి చతుర్విధపురుషార్ధములు, ధర్మార్ధకామమోక్షములను ప్రాప్తించును. సమస్తకోరికలను తీర్చు కామ్యఫలప్రదాత్రి 'గాయత్రీ'. గాయత్రి కామధేనువు. ఆత్మశక్తిని, మానసికశక్తిని, సంసారికశక్తిని లభింపజేయును. ప్రణవం (ఓం), భూ:, భువః, సువః, గాయత్రిమంత్రం అనునవి పంచమహాయజ్ఞములు (దేవయజ్ఞం, ఋషియజ్ఞం లేక బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞములు). ప్రణవ వ్యాహృతిత్రయ గాయత్రీమంత్రమును నిత్యమును జపించినయెడల పంచపాపములనుండి పావనమై పంచయజ్ఞముల ఫలితంను పొందుదురు

గాయత్రి అంటే…
ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రీ తత్త్వాన్ని తెలుపని వేడుకోగా, ‘నా, స్ఫురణ మాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నా నుండి అగ్ని. అగ్ని నుం…డి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హ్రుతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలలో సమస్త క్రియలు ప్రవర్తిమవుతుదిన్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.
గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న 24 దేవతా శక్తులు.
గాయత్రీ మంత్రంలోని 24 దేవతలు, వారి చైతన్య శక్తులు:
01. వినాయకుడు: సఫలత్వ శక్తికి అధిపతి.విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
02. నృసింహ స్వామి: పరాక్రమ శక్తికి అధిపతి, పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
03. విష్ణుమూర్తి: పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు.
04. ఈశ్వరుడు: సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
05. శ్రీకృష్ణుడు: యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులును ప్రసాదిస్తాడు.
06. రాధాదేవి: ఈమె ప్రేమ శక్తికి అధిష్ఠాత్రి, భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయద్వేష భావాలకు దూరం చేస్తుంది.
07. లక్ష్మీదేవి: ధన వైభవ శక్తులకు అధినేత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.
08. అగ్నిదేవుడు: తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామార్ధ్యాలను ప్రాసాదిస్తాడు.
09. మహేంద్రుడు: రక్షాశక్తికి అధిష్ఠాత, అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదులు నుండి రక్షిస్తాడు.
10. సరస్వతి: విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి: దమన శక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.
12. ఆంజనేయుడు: నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణ తత్వం, బ్రహ్మచర్య పాల నాశక్తి ప్రసాదిస్తాడు.
13. భూదేవి: ధారణాశక్తికి అధినేత్రి. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది.
14. సూర్య భగవానుడు: ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్ని,సుదీర్ఘ జీవనాన్ని, ప్రాణశక్తికి, వికాసాన్ని, తేజస్సును ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు: ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.
16. సీతాదేవి: తపశ్శక్తి అధిష్ఠాత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారుచేసి, అధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేదీమె.
17. చంద్రుడు: శాంతి శక్తికి అధిష్ఠాత. చింత శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు.
18. యముడు: కాలశక్త్యాదిస్థాత. మృత్యువునకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసేవాడు.
19. బ్రహ్మ: సకల సృష్టికి అధిష్ఠాత.
20. వరుణుడు: భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు: ఆదర్శ శక్తికి అధిష్ఠాత. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు: సాహన శక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస: వివేక శక్తికి అధిష్ఠాత్రి. హంస క్షీరనీరవివేక జగత్ ప్రసిద్ధమైంది.
24. తులసీ మాత: సేవాశక్తికి అధిష్ఠాత్రి. ఆత్మశాంతి, దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది.
శ్రీ గాయత్రీ మాత మహాత్యం
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఓమ్ భూర్భువ స్వః ఓమ్తత త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఇదే గాయత్రీ మూల మంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దైవం లేదు.
త్రికాలలలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీదేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం. హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాలలో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతి నిత్యం నియమ నిష్ఠలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాల మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయువచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీ గాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిలో చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తుముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రర్పరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించిన అద్భుత చంధో తరంగం గాయత్రీ మంత్రం. ఆ రుషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహారుషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రమే ఇది.
* గాయత్రి మంత్రాక్షరాలు
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళవరాం
సహస్ర నేత్రాల గాయత్రీం శరణ మహం ప్రపద్యే
‘న గాయత్ర్యా నరం మంత్రం న మాతుః పర దైవతమ్’
గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ.’ శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది. పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేసిన 24 ధ్వనులే శ్రీ గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలే 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉంటే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించేవారిని ఆ 24 శక్తులు సర్వవేళలా కాపాడుతాయి.
*************************************************************************************************************
గాయత్రి జపము వలన కలుగు ప్రయోజనాలు
గాయత్రీ మంత్రం చాలా గొప్పది. దాని ప్రభావం అనంతం. పూర్వం ఆ మంత్రాన్ని జపిస్తూ కొన్ని హోమాలు చేసి రోగాల్ని పోగొట్టుకున్నారని దేవీ భాగవతం వివరిస్తోంది. ఈ మంత్ర, జప, హోమ విధానాల్ని బాగా తెలుసుకొని చేయాల్సి ఉంటుంది. మంత్రం ఇంత శక్తిమంతమైనది కనుకనే ఈనాటికీ చాలా చోట్ల దీని మహత్వం ప్రచారంలో వినిపిస్తోంది. విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రం వల్ల చేకూరే ప్రయోజనాల్ని దేవీ భాగవతం పదకొండో స్కంధంలో వివరించి చెప్పాడు.
రావిచెట్టు కింద శనివారం కూర్చొని నూరుసార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే భూత రోగ అభిచారాల నుంచి విముక్తి లభిస్తుంది. తిప్పతీగ ముక్కలు పాలలో నానపెట్టి గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇస్తే అది మృత్యుంజయహోమం అవుతుంది. ఇలా చేయటం వల్ల సర్వరోగ నివారణ కలుగుతుంది. జ్వరం శాంతించటం కోసం గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ మామిడాకులు, పాలను కలిపి ఆహుతి ఇవ్వాలి. పాలలో వసను నానపెట్టి అగ్నిలో వ్రేల్చితే (హోమం చేస్తే) క్షయరోగం తగ్గుతుంది.
పాలు, పెరుగు, నెయ్యి ఈ మూడింటినీ కలిపి గాయత్రీ మంత్రంతో హోమం చేస్తే రాజయక్ష్మ రోగం శాంతిస్తుంది. క్షీరాన్నాన్ని గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇచ్చి, సూర్యుడికి నివేదించి దాన్ని రాజయక్ష్మ రోగికి తినిపిస్తే బాధ తగ్గుతుంది. సోమలతను కణుపుల వరకూ తుంచి ఆ ముక్కలను అమావాస్య నాడు పాలతో కలిపి ఆహుతి ఇస్తే క్షయవ్యాధి నివారణ అవుతుంది. శంఖవృక్షపు పూలను గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ వ్రేల్చితే కుష్టురోగం తొలగుతుంది. పాలచెట్టు సమిధలతో హోమం చేస్తే ఉన్మాదం తగ్గుతుంది. మేడిచెట్టు సమిధలను గాయత్రీ మంత్రం జపిస్తూ హోమం చేస్తే మేహ రోగాలు నశిస్తాయి. చెరకురసం, తేనె కలిపి హోమం చేసినా మేహ సంబంధ రోగాలు శాంతిస్తాయి. పాలు, పెరుగు, నెయ్యి కలిపి ఆహుతి ఇస్తే మసూచి రోగం మటుమాయమవుతుంది.
కపిలగోవు నెయ్యిని వ్రేల్చినా మసూచి తొలగిపోతుంది. మేడి, మర్రి, రావి సమిధలను వ్రేల్చితే ఆవులు, గుర్రాలు, ఏనుగులకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. జమ్మి సమిధలను పాలు, నెయ్యితో కలిపి రెండేసి వందల సార్లు గాయత్రీ మంత్రంతో హవనం చేస్తే చీమలు తదితరాల వల్ల కలిగే కష్టనష్టాలు తొలగిపోతాయి. దీనివల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఈ హోమం తర్వాత అన్నాన్ని బలిగా వేయాలి. మట్టిపెడ్డను నూరుసార్లు గాయత్రితో అభిమంత్రించి ఏ దిశకు విసిరితే ఆ దిశ నుంచి కలిగే అగ్నిభయం, గాలిభయం, దొంగలభయం నశిస్తాయి. దర్భను తాకి గాయత్రిని జపిస్తే భూతరోగాల నుంచి విముక్తి లభిస్తుంది. గాయత్రీ మంత్ర జలాన్ని తాగినా ఇదే ఫలితం కలుగుతుంది. భూత శాంతికి నూరుసార్లు గాయత్రీ మంత్రంతో భస్మాన్ని అభిమంత్రించి ఆ తర్వాత దాన్ని నొసటన ధరించాలి. అలాంటి వారికి భూతశాంతితో పాటు వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది.
గాయత్రీ మంత్రంతో చక్కగా విచ్చిన పూలను తెచ్చి అగ్నిలో హోమం చేస్తే పుష్టి, కలివి కలుగుతాయి. ఎర్ర కమలాలను గాయత్రీ మంత్రంతో వ్రేల్చితే ధనప్రాప్తి కలుగుతుంది. అన్నాన్ని హోమం చేసినా సంపదలు కలుగుతాయి. మారేడు సమిధలను కానీ, ఫలపుష్పాలను కానీ, మారేడు వేళ్లను కానీ హోమం చేసిన వారింట సిరి సంపదలు తులతూగుతుంటాయి. మారేడు సమిధలు పాలలో, నేతిలో తడిపి రోజుకు రెండు వందల సార్లు చొప్పున వారం రోజుల పాటు హోమం చేస్తే తరగని సిరిసంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, పేలాలు కలిపి గాయత్రీ మంత్ర హోమం చేసిన వరుడికి మంచి వధువు లభిస్తుందని దేవీ భాగవతంలో గాయత్రీ మంత్ర జప హోమాల విశేషాల వివరణ కనిపిస్తుంది. ఈ జపం ఎలా ఎన్నిసార్లు ఏయే నియమ నిష్టలతో చేయాలనే విషయాన్ని పండితుల నుంచి తెలుసుకొని అలా చేయటం ఉత్తమం.