Thursday, August 15, 2024

స్వాతంత్ర్య సమర యోధులు

మనము ప్రతి సం ఆగష్టు 15 కి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము.. ఇప్పటికి మనకి సుమారు 78 వ సం లో భారత దేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జర్పుకుంటుంన్నాము.. 
ఒకనాడు ఆగష్టు 15 వచ్చింది అంటే మన పెద్దలు , స్వతంత్ర పోరాట సమరయోధులు , ఆనాటి యుద్ధం లో పాలొన్న వ్యక్తులు , పోరాటం ను కళ్లారా చుసిన వాళ్ళు ఉండేవారు.. ఇంట్లో పిల్లలకి , మనవలు కి వాటి విశేషాలు ను తెలియపరచే వారు.. పెద్ద పెద్ద కార్యాలయాలు లో వారిని సాదరంగా ఆహ్వానించే వారు.. వారిని గౌరవించే వారు , చిరు సత్కారం చేసే వారు.. ఇప్పుడు వారు కనబడడం లేదు.. ఆ తరం కూడా కనబడడం లేదు.. ఒక్కో సంవస్త్రానికి ఒక్కో తరం వెళ్లిపోతోంది.. చెప్పాలంటే కనుమరుగౌతున్నాది 
తరం వెళ్ళి పోతున్నది....!  ఆ ప్రేమ... కనుమరుగైపోతున్నది....!!
తరం వెళ్ళిపోతుంది. ప్రేమగల పెద్దరికం కనుమరుగైపోతుంది
బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది
జ్ఞాపకాల మూట వదిలి బాటపట్టి అల్లంత దూరాన వెళ్లిపోతుంది.
ఒకనాడు మన పాత తరం వాళ్ళు ఎలా ఉండే వారో కూడా ఇప్పటి వారికి తెలియడం లేదు.. వారు 
తెల్లని వస్త్రధారణతో...స్వచ్ఛమైన మనసుతో...
మధురమైన ప్రేమతో... అందరి పట్ల అనురాగంతో
విలువలతో కూడిన బ్రతుకును సాగించిన ....
అందరి మనసులోనూ , ఒక ఊరు ని నమ్ముకుని అక్కడే ఉండేవారు.. 
ఇప్పుడు ఆలోచిస్తుంటే  
మన ముందు తరం మెల్లగా చేజారిపోతున్నది అని చెప్పచు. 
వయోభారంతో కొందరైతే , అనారోగ్యం తో కొందరు.. ఎలాగైతేనేం  మనల్ని వదిలివెళ్లిపోతున్నారు 
అప్పట్లో వారు ఎల్ ఉండేవారు అంటే 
హుందాతనపు మీసకట్టు...
రాజహాసపు పంచ కట్టు....
మార్చని మాట కట్టు...
మా మాటే శాసనం అన్నట్టు 
శ్రమనే నమ్ముకుని  బ్రతుకు మెట్టు....
తల తెగిన తప్పని నీతి ఒట్టు కట్టు ....
అలాగే ఇబ్బందులు ఎన్ని ఎదురైనా విప్పని గుట్టు....
ఇలా నిజాయితీకి మారుపేరుగా నిలిచిన....మన పాత తరం 
ఎవరి నోట విన్న వందే మా తరం 
ఒక్కోసారి ఒక నాటి మన పెద్దతరం క్రమంగా కనుమరుగవుతుంటే.....
హృదయం బరువెక్కుతుంది .మనసు మూగబోతుంది.
కంటనీరు కారిపోతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు,
ఉన్నా.... కష్టాలు ఎన్ని చుట్టుముట్టినా.....
సమస్యలు ఎన్నో ఎదురైనా..... అందరూ సామరస్యంగా..
కలిసిమెలిసి ...., ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునేవారు.
ఒకరికొకరు సహకరించుకునేవారు. ఇంటి సమస్య ఊరు 
సమస్యలను సమూహంగా జయించేవారు.

ఇలాగే మీ ఇంట్లో కూడా ఒక తాతయ్య ఉండేవారు అమ్మని , నాన్నని వారి గురించి ప్రయత్న పూర్వకం గా అడిగి తెలుసుకోండి.. 
వారు గురించి నాలుగు మంచి వాక్యాలు వ్రాయండి.. మీ ముందు తరానికి , మీ తర్వాత తరానికి వారధి నాన్న లాంటి వారు ఉంటారు.. 
వారిని అడిగితె మీకు గంగా ప్రవాహమే వస్తుంది..

No comments:

Post a Comment