Sunday, October 30, 2022

నేడు అంతర్జాతీయ పొదుపు దినోత్సవం

నేడు అంతర్జాతీయ పొదుపు దినోత్సవం 

దీన్ని 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ సేవింగ్స్'గా ప్రపంచ దేశాలు గుర్తించాయి. పొదుపు అవసరాన్ని చాటి చెప్పేందుకు, సేవింగ్స్‌ను ప్రోత్సహించడానికి ఈ రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సాధారణ వాడుకలో పొదుపు అంటే తమ ఆదాయంలో డబ్బును ఖర్చు పెట్టకుండా అట్టేపెట్టుకోవడం. 

ఆర్ధిక శాస్త్రం పరిభాషలో ఆదాయంలో వినియోగం చేయగా మిగిలిందే పొదుపు. మరింత విస్తృతమైన అర్ధంలో "పొదుపు" అంటే ఖర్చును తగ్గించుకోవడం.

భవిష్యత్తు అవసరాలు, వ్యయాల కోసం పక్కన పెట్టే మొత్తమే పొదుపు. ఇది సాధారణంగా అత్యవసరాలు, ఆపదల కాలంలో చేతికందుతుంది. మరో మాటలో చెప్పాలంటే అవసరమైనప్పుడు అతిత్వరగా చేతికందే మొత్తాలే పొదుపు. డిపాజిట్లు, నగదు, నగదు సమానమైన సాధనాలు ఈ కోవలోకి వస్తాయి.

మదుపు

వివిధ ఆర్థిక సాధనాలు, అసెట్లలో దీర్ఘకాలంలో సంపదను సృష్టించడానికి చేసేదే మదుపు. ఇవి సంపదను సృష్టించడంతోపాటు ఆదాయాలను కూడా ఇస్తాయి. ఈ కోవలోకి షేర్లు, రియల్‌ ఎస్టేట్‌, బంగారం, మ్యూచువల్‌ ఫండ్లు, బాండ్లు, ఇతర సాధనాలు వస్తాయి. వీటిలో రిస్క్‌ ఎక్కువ. అలాగే రాబడీ అధికమే. స్వల్ప, మధ్య, దీర్ఘకాలాలకు అనుగుణంగా మదుపు చేయవచ్చు.

నేటి పొదుపు.. రేపటి మదుపు..

ఆ తరంలో..ఈ తరంలో..

నీకైనా..నాకైనా..ఎవరికైనా

ఇదే ఓ వేదమంత్రం. మనకి  బ్రతికే సూత్రం..!


పొదుపంటే సొమ్ము మాత్రమే కాదు..

వనరులు.. మొక్కలు అడవులు మొ. 

నేటి మొక్క.. మరునాటికి చెట్టు..

మరో నాటికి మహావృక్షం!


మనకి పెద్దలు తరచు చెబుతూ ఉంటారు  

మన చిన్నతనం లో లక్ష్మీ నివాసం సినిమాలో ఒక పాట ఉండేది అది ఇప్పటికీ నాకు గుర్తు 

ధనమేరా అన్నిటికీ మూలం

ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం

కొండలైన కరగిపోవు కూర్చుని తింటే..

కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే..  అంటాడు ఆరుద్ర. 

ఈ మాటలు  బాగుంటాయి వింటే..

ఆచరణే కష్టం.. 

కానీ క్రమశిక్షణ గా కలిగి మెలిగితే నే జీవనం .

ఆపై నీ ఇష్టం!


ఆకలి కడుపు, ఖాళీ జేబు, విరిగిన మనసు నేర్పినన్ని పాఠాలు ఎవరూ నేర్పలేరు' అంటారు. ఆకలి కడుపు జీవితంలో ఆహారం విలువను తెలియజేస్తే... ఖాళీ జేబు చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో పొదుపు చేయలేకపోయామే అన్న వేదనను మిగుల్చుతుంది. 'బూంద్‌ బూంద్‌ బనేగా సముందర్‌, పైసా పైసా జమాతో రుపయా హోయేగా' అనేది హిందీలో ఒక సామెత. ఒక్కొక్క బిందువు కలిస్తేనే మహాసముద్రం... పైసా పైసా కలిస్తేనే రూపాయి అవుతుందని దాని అర్థం. జీవితమనే బండిని సాఫీగా నడిపేందుకు అవసరమైన ఇంధనమే 'ధనం'. ఆదాయానికి మించి ఖర్చు చేయకుండా, రేపటి ఆనందమయ జీవితం కోసం...భవిష్యత్తు అవసరాల కోసం పక్కన పెట్టే చిన్నచిన్న మొత్తాలే పొదుపు. ఇవన్నీ జీవితంలో పొదుపు ఎంత ముఖ్యమో...తెలియజెప్పే సూత్రాలు. రూపాయి అంటుందిట- 'నన్ను వంద వరకూ పెంచు' తర్వాత నిన్ను నేను పెంచుతా' అని. అదే రూపాయిని చిల్లరగా మార్చితే చెల్లాచెదురవుతాయి. అదే చిల్లరను ఒక దగ్గర జమ చేస్తూపోతే ధన సమూహంగా మారుతుంది. అందుకే పొదుపు...భవిష్యత్తు నిర్మాణానికి తొలిమెట్టు.


'చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి/ బంధువవుతానని అంది మనీ మనీ/ అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు/ ఐనా అన్ని అంది మనీ మనీ/ పచ్చనోటుతో లైఫ్‌ లక్ష లింకులు పెట్టుకుందని/ అంది మనీ మనీ'   . 

'పొదుపు తెలిసిన గృహిణి కాపురం పచ్చని సంసారమే' అంటారు పెద్దలు. ఇంటి అవసరాల కోసం వచ్చే ఆదాయాన్ని బట్టి బడ్జెట్‌ తయారుచేసుకోవాలి. పొదుపు కోసం కొంత మిగుల్చుకోవాలి. ఈ అలవాటు ప్రారంభంలో కొంత కష్టమనిపించినా...తినగ తినగ వేము తీయనుండు అన్నట్టుగా తర్వాత్తర్వాత సులభమవుతుంది. 'ఇదమే వహి పాండిత్యం, ఇదమే వహి శూరత, ఇదమే వహి వైదగ్థ్యం, అదాదల్ప తరోవ్యయః’ అన్నారు మన పెద్దలు. . ఆదాయం కన్నా చాలా తక్కువ ఖర్చుపెట్టడమే..కానీ అది ఈ రోజుల్లో అయ్యే పని కాదని అందరికీ తెలుసు . 


కుటుంబాలకే కాదు...ఇది పాలకులు, ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది. ప్రజల సొమ్మును, ప్రకతి వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతూ...లక్షల కోట్ల అప్పులతో ప్రభుత్వాలను నడుపుతున్నారు. సంస్కరణల పేరుతో ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తూ...కార్పొరేట్లకు మాత్రం కోట్లాది రూపాయల రాయితీలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో...అరకొర ఆదాయాలతో బతకడానికే ఆపసోపాలు పడుతుంటే...పొదుపు ఎలా చేయాలి? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. నయా ఉదారవాద ఆర్థిక విధానాల పుణ్యమాని... ప్రపంచంలో వినిమయదారీ సంస్కతి విపరీతంగా పెరిగింది. చేతిలో పైసా లేకపోయినా, మధ్యతరగతి జీవితాలను ఆశల పల్లకిలో విహరింపజేస్తూ...క్రెడిట్‌ కార్డులు, ఇఎంఐ ల రూపంలో వున్నదంతా ఊడ్చేస్తున్నారు.  పొదుపు అలవాటుని ప్రజల్లో అవగాహనా పెంచాలి. 


కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి  ఎలా ఉందంటే 

మనం చేస్తే పొదుపు అది ఇంటికి మేలు..

కాని..అదుపు లేని.. పొదుపు ఎరుగని సర్కార్ల దుబారా.. 

ఈ పంపిణీల హంగామా.. అప్పుల పాలు..అదెంత భారం ఈ దుబారా..

అందుకోడానికి ఎందుకంత గాభరా..?

ఈ స్కీములు.. పెద్ద స్కాములు..

సంక్షేమం కాదది..సంక్షామం!


అన్నట్టు..అతి పొదుపు.. అదీ మరీ ముప్పే..

నువ్వు తినడం మాని.. తగిన బట్ట కట్టక..

జీవితాన్ని అనుభవించక.. బ్రతికే బ్రతుకు ఎడారి..

అప్పుడు నీ పేరు పిసినారి..!  అవసరాన్ని 

మించిన పొదుపు.. దెబ్బతినే గరిమనాభి...

నీ మరోపేరు లోభి..!  ఇతరుల పొట్ట కొట్టి..

నీ పొట్ట కట్టి కూడబెడితే ఆస్తి..

సమాజానికి నీ వల్ల ప్రయోజనం నాస్తి..

చెప్పేయి ఆ పద్ధతికి స్వస్తి..

సంపాదించు..ఆస్వాదించు..ఆస్తి పెంచు..

అవసరానికి మించి ఉంటే కాస్త పంచు..! 


చివరిగా  పొదుపు ప్రాముఖ్యతను ప్రభత్వం అందరిలోనూ అవగాహనా పెంచాలి .

మారుతున్న పరిస్థితులు, విజృంభిస్తోన్న మహమ్మారి నేపథ్యంలో ఈ రోజు వెనుక ఉన్న ఆలోచన, ఉద్దేశాలను ప్రజలు గుర్తించాలి.   ఆర్థిక వనరులు (ఫైనాన్షియల్ రిసోర్సెస్) ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంచాలి . దీన్ని దృష్టిలో పెట్టుకొని డబ్బు ఆదా చేయడంతో పాటు పొదుపుపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు పొదుపు విలువ చాటి చెప్పాలి. డబ్బు ఆదా చేయడం ప్రాముఖ్యత గురించి పాఠశాలల్లో ప్రచారం చేయాలి. చిన్న వయస్సులోనే పిల్లలకు డబ్బు దాచడం గురించి నేర్పితే, ఆ అలవాటు పెద్దయ్యాక వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని మా అభిప్రాయం అనవసరమైన ఖర్చును తగ్గించుకొని, రేపటికోసం కొంత దాచాలన్నది పెద్దలు చెప్పే ఆర్థిక సూత్రం. ఈ సూత్రంపైనే కుటుంబ భవిష్యత్తయినా, దేశ భవిష్యత్తయినా ఆధారపడి వుంటుంది.

Friday, October 28, 2022

MOBILE మొ - బైల్

 మొబైలాయనమహా..

సమయం వృధాయై నమః 

పనులు పెండింగేయి నమః 

సవ్య సాచి  వాయ నమః 


ఒకప్పుడు  అనగా మన తరం లోనే   ఏ ఫోను లేనప్పుడు

ఎంత హాయి.. ఈ మొబైలొచ్చాక సొమ్ములు సమయం రెండు పోయిపోయి..!

 

ఒకనాడు బేసిక్ అంటూ పలకరించింది. మొబైల్ 

ఫోన్చే చేసేమా..ఎత్తేమా.. గ్రీనా..రెడ్డా.. 

అందులో ఎసెమ్మెస్.. షార్ట్ మెసేజ్ సర్వీస్..

దాంట్లో ఓ మెమరీ కార్డు.. అందులోనే పాటల రికార్డు..

అక్కడితో సరి.. ఓ చిన్న రీఛార్జి తప్పని సరి!

ఇక మనం అంతటి ఆగలేదు కదా  


పోను..పోను ఈ ఫోనులో బుల్లి కెమెరా...

ఏదో మెగా పిక్సల్.. అదో  లెవెలు..

సరిగ్గా కనబడని వీడియో.. వెనక్కి తిప్పి 

తీసుకుంటేనే సెల్ఫీ... అప్పటికదే గొప్ప..

ఆ బుల్లి ఫోనే ఒప్పులకుప్ప..! వయ్యారి భామ 


ఒకనాడు ఇంటిల్లిపాదికీ ఒకటే ఫోను..

అదే ఉమ్మడికుటుంబం.. సంబరాల కదంబం..!


మొదట్లో ఫోనొత్తినా... ఎత్తినా చార్జి.. 

ఊరు మారితే రోమింగు.. అప్పుడు మరీ భారంగా ఇన్కమింగు..

ఇది పెద్దోడి వ్యవహారమేరా అని నిట్టూర్పు..

మనకి మనమే ఓదార్పు..!  

ఫోన్ ఎత్తాల వద్దా.. పోనిలే ఎక్కడ ఉన్నామో తెలుస్తుందిలే ... 


సరే..రాను రాను  వినియోగదారుల  వినియోగం..

చేతిలో ఫోనుంటే  అదో రాజయోగం..

పది పెట్టి కార్డు కొని గీకితే ఏడున్నర. ఛార్జి 

ఇన్కమింగు లైఫ్ టైము.. డబ్బులైపోతే మళ్లీ గీకుడు..!


ఈలోగా సుడిగాలి లా వచ్చింది  లిమిటెడ్ వాలిడిటీ చార్జింగు

జేబుకు చిరుగు.. సొమ్ములైపోయాక 

ఔట్ గోయింగుకి  లేకపోయినా రామీ.. ఇన్కమింగు హామీ..!


ఇక్కడి వరకు అంతా ఒక యుగం మొదలైంది ఆండ్రాయిడ్ యుగం..

స్మార్ట్ ఫోను జగం.. వచ్చింది వాట్సాప్ యోగం 

మొహం తెలియనోన్ని దగ్గర చేసే ఫేస్బుక్కు..

మూగనోము వదిలిస్తూ  ఇన్ స్టాగ్రాము..

వీటన్నిటికీ స్వెట్టర్లా ట్విట్టర్..ఫోనులోనే సినిమాలు..

టివి చానళ్లు..గూగులు..వంటిపై లేకుండా

నూలు పోగులు.. వీటన్నిటికీ నెట్టు.. అదే నీ పని పట్టు..

అదిగో..అక్కడితో నీ పని మాడిపోయిన పెసరట్టు..

ఆ మత్తు నుంచి మనం బయటపడితే 

మొబైల్ ఫోను మీదొట్టు..! ఇదో గమ్మత్తు 


ఇప్పుడు కార్డు గీకుడు.. బుల్లి రీచార్జీలు గోవిందా..

బాదుడే బాదుడు.. అది కూడా 28 రోజులే .

ముప్పై రోజులైతే  ఏడాదికి పన్నెండే..

అదే ఇరవై ఎనిమిదైతే  సాల్ కి తేరా..

తెలివంటే అదేరా..! కార్పొరేట్ల గిమ్మిక్కు..

సర్కారు లాజిక్కు.. ఇక నీకెవరు దిక్కు!


మొత్తంగా లైఫ్ టైమనిఆఫర్స్ బోణీ..బాణీ..

హోల్ మొత్తం అంబానీ..  

ట్రాయ్ నిన్ను చేసింది టాయ్

నిన్ను ఫోనుకి బానిసను చేసి 

అయ్యో అనుకునేలోగానే జియో మింగేసింది..

ఎయిర్ టెల్ మోగించింది డేంజర్ బెల్..

ఒక ఐడియా నీ జీవితాన్నే మార్చేసింది..

ఇప్పుడు ఇంటి బడ్జెట్లో సింహభాగం 

మొబైల్ రాగం.. రీఛార్జి రోగం..!

అన్నం లేకపోయినా పర్లేదు

ఫోను రీఛార్జి మస్టు.. అదే చీజ్ బడీ మస్తు మస్తు!!


ఫోను మనలని ముంచేసే వ్యసనమే..

అది లేకపోతే  బతుకు శీర్షాసనమే..

మనిషికో మొబైల్. అవకాశం ఉంటే మరొకటి . 

త్రీజి..ఫోర్ జీ..ఫైవ్ జీ.. వల్లే మన  గురూజీ లు 

ఇలా ఎక్కడికి పోతున్నావు  సర్ జీ...!


కరోనా కష్టకాలం లో మనకి దొరికింది ఒక ఆయుధం అదే మొబైల్ ఆయుధం..

సవ్యసాచి కూడా అవాక్కయ్యే లా ఉపయోగించాము 


ఇప్పుడు పిల్లల చేతిలో ఫోన్ 

ఆ అమ్మా.. వస్తున్నా..ఆ నాన్న ... 

ఉఆ..ఇవే సమాధానాలు 

తల్లి తండ్రులు ఎక్కడ చూస్తారో అని మొబైల్లాక్. 

ఆకలేస్తే ఫోన్, ఆకలిని చంపేసేది ఫోన్.  


ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా ఫోన్ ఇచ్చి అన్నం పెట్టేస్తున్నారు.

నిజం గా  ఆరు బయట చందమామ చూడడం లేదు. నెట్టింట్లో నెట్ లో చూపిస్తున్నారు. 


ఇంకా ఉంది 

ఇక మన తర్వాతి ఎపిసోడ్  రీలు తిప్పడాలు.. 


Sunday, October 23, 2022

ధన్వంతరి

 ధన్వంతరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి (Etymology) చెప్పబడింది. 


మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చు.

శ్రీ ధన్వంతరి స్తోత్రం..

శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం చారుదోర్భిశ్చతుర్భిః ౹

సూక్ష్మస్వచ్ఛాతిహృద్యాంశుక పరివిలసన్మౌళిమంభోజనేత్రమ్ ౹

కాలాంభోదోజ్జ్వలాంగం కటితటవిలసచ్చారుపీతాంబరాఢ్యమ్ ౹

వందే ధన్వంతరిం తం నిఖిలగదవనప్రౌఢదావాగ్నిలీలమ్ ౹౹

ఒక శంఖం, ఒక చక్రం లేదా శక్తి (చక్ర) పళ్లెంలో ఒక జలగ మరియు అమృతాన్ని (ఖగోళ అమృతం) ఒక కుండ: హిమ్, తన నాలుగు చేతులు పట్టుకుని ఎవరు ధన్వంతరి, నమస్కారాలు. దీని గుండె కాంతి చాలా సూక్ష్మ స్పష్టమైన, సున్నితమైన మరియు ఆనందము మెరుపు ప్రకాశిస్తాడు. ఈ కాంతి కూడా అతని తల మరియు తామర కళ్ళు చుట్టూ మెరిసిపోయాడు. ఎవరు తన మేరే నాటకం ద్వారా ఒక శక్తివంతమైన దావాగ్ని వంటి అన్ని వ్యాధులు నాశనం చేస్తాడు.


ఇప్పటిదా..అప్పటిదా.. అని కాకుండా 

నీ కోసం నా కోసం ముందే ఆలోచించి

యుగాలకు మునుపే ఉద్భవించిన ధన్వంతరి.. మహా మంత్రం 

అలా దశావతారాలకు మునుపే తొలి అవతారమెత్తిన శ్రీ హరి!


ఆరోగ్యమే మహాభాగ్యం.. ఈ సూత్రానికి జీవం పోస్తూ

సృష్టిలో ఆది వైద్యుడిగా రూపు దాల్చిన ధన్వంతరి..

అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ రోగాలకు వైరి...!

శ్రీ హరి రక్ష మనకి 


వైద్యో నారాయణో హరి.. ధన్వంతరి పేరు చెబితేనే

వ్యాధులు హరీ.. అలా వరమిచ్చెను మురారి..

సర్వరోగాలను హరియించే  భాస్కరుని శిష్యుడై..

బ్రహ్మాదులే ధన్వంతరి అని నామకరణం చేయగా

ఇలను చేరిన  మొదటి వైద్యుడు.. శస్త్రచికిత్సలకూ ఆద్యుడు!


మన మనసుకు..శరీరానికి బాధ కలిగించే శల్యాలను..

వికృతులు..అఘాతాలను నివారించే శక్తిసంపన్నుడు

ఈ ధన్వంతరుడు..! ఇది వ్యుత్పత్తి..లోకోక్తి..

అనేక సందేహాలకు నివృత్తి..!!


క్షీరసాగర మథనం జరుగుతున్న శుభవేళ..

కామధేనువు..ఉచ్చశ్రైవం. ఐరావతం..పారిజాతం..

ఇన్ని అద్భుతాలు.. అనంతరం ముకుందప్రియ..

మహాద్భుత ఉద్భవం తదుపరి.. అసురులు అక్షింతలు చేసుకుని వీక్షిస్తుండగా..

అసలే మూతపడని రెప్పలను మరింతగా తెరచి చూస్తుండగా..

పీనాయుత బాహుదండ యుగళుడై..

కంబుకంటుడై.. పద్మారుణ లోచనుడై..

విశాల వక్షస్థలుడై.. సుస్నిగ్ధ కేశజాలంతో..

నీలగాత్ర తేజుడై.. పీతాంబరం..మణికుండల

సమాభాసితుడై.. అమృతకలశంతో అరుదెంచినాడు ధన్వంతరి..

లోకకళ్యాణం కోరి..! 


ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది.[1]


భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.

బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం భాస్కరుని (సూర్యభగవానుని) వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.

కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") - ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.

విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం.

ఇంతే కాకుండా పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. 


పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉంది.




భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. తరువాత రమాదేవి అవతరించి విష్ణువు వక్షోభాగాన్ని అలంకరించింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.


"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడు  అతడే  "ధన్వంతరి"  గా ఉద్భవించాడు 




ధన్వంతరి మంత్రం

ఓం నమో భగవతే  మహా సుదర్శన  వాసుదేవాయ ధన్వంతరయే

అమృత కలశ హస్తాయ  సర్వ భయ వినాశాయ  సర్వ రోగ నివారణాయ

త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్ర్తే  శ్రీ మహా విష్ణు స్వరూప శ్రీ ధన్వంత్రి స్వరూప

శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా 

గాయత్రీ : 


ఓం తత్ పురుషాయ విద్మహే అమృత కలశ హస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్!


ఓం ఆదివైధ్యాయ విద్మహే ఆరోగ్య అనుగ్రహాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్!



క్షీర సాగరమును చేరి సురాసురు

,,,,లమృతమ్ము నొందగ యత్నమూని

మంథర శైలమున్ మంచి కవ్వము చేసి

....వాసుకిన్ ద్రాడుగ బట్టుకొనుచు

ద్రిప్పుచు నుండగా దీక్షతో నా గిరి

....క్రుంగుచుండుట జూచి కూర్మమగుచు

వీపుపై మోసెను విష్ణువా యద్రిని

....సాధన మారీతి జరుగు చుండ

నహిపతికి బాధ హెచ్చయి హాలహలము

గ్రక్కె గ్రక్కున నతి భయంకరముగ నది

సకల ప్రాణాంతకంబయి జగములెల్ల

వ్యాప్తి చెందుచు నుండగా భయమునొంది


దేవతలు రాక్షసులు నంత దేవదేవు

డైన శంకరు బ్రార్థింప నా కృపాబ్ధి

యభయమిడి స్వాగతించి యా హాలహలము

నంతయును దన కంఠంబునందు నిలిపె


ఆ మహా గరళమ్ము నంతయు మ్రింగెనా

....కడుపులో నున్న లోకమ్ము లెల్ల

నాశనమగునంచు నీశుడా తరుణాన

....నుమియుచో వెలుపల నుండునట్టి

భువనమ్ము లెల్లను పూర్తిగా నాశిల్లు

....ననుచు దలంచి నిల్పెను స్థిరముగ

తన కంఠమందు తద్దయు హాలహలమునే

....యెంత బాధయును భరించుచుండి

యటుల ముల్లోకములకు మహావిపత్తు

తొలగజేసి భద్రమ్ములు కలుగజేసె

నాదిదేవుడు నతుల దయామయుండు

శంకరుండు సదా లోకశంకరుండు


జయ మహాదేవ! శంకరా! జయము జయము

జయ జగత్త్రయ రక్షకా! జయము జయము

జయ మనుచు దేవ దానవ చయములెల్ల

సంస్తుతు లొనర్చి రావేళ సన్నయమున


మరల క్షీరాంబుధి మథనమ్ము సాగించు

....చుండగా నద్దాని నుండి వేగ

వెల్వడె సురభియు, విధుడు,నైరావత

....మును కల్పభూజమ్ము, పుష్కరాక్షి

యగు మహాలక్ష్మియు, నశ్వరాజంబగు

....నుచ్చైశ్రవమ్మును నొప్పు మీర

అమృత కలశమ్ముతో నంత ధన్వంతరి

....ప్రత్యక్షమయ్యె నా పర్వమందు

హరి జగన్మోహినీ రూప మపుడు దాల్చి

యమృతకలశమ్ము చేబూని యసురతతుల

నకట మోహింపజేయుచు, నమర బృంద

ములకు నమృతమ్ము బంచె నద్భుతము గాగ


హరి లీలలు హరు లీలలు

కరము శుభంకరములగు జగమ్ములకెల్లన్

హరిహరుల నాత్మ దలచుచు

పరమాదరమలర గూర్తు వందన శతముల్

Friday, October 14, 2022

మానవ సంబంధాలు. Human Relations

మనిషి ఎల్లప్పుడూ ఒంటరిగా కాకుండా ఒక సొంత కుటుంబాన్ని ఏర్పరచుకొని జీవనం సాగిస్తాడు. తన కుటుంబంతో జీవనం సాగించడానికి ఒక ఇంటిని కట్టి దానినే దేవాలయంగా భావిస్తారు.

" ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం మా ఇల్లే బృందావనం "

అంటూ ప్రతీ వారి లాగానే మనం కూడా మా ఇల్లు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని అనుకుంటాం.

కానీ నేడు అది పెరిగిన కొద్దీ మన బృందావనం బీటలు వాలి చివరికి మమకారం తగ్గి అహంకారంతో రగిలి అతలాకుతలం అయ్యింది.

ఆలోచిస్తే ఒకే ఇంట్లో పెరిగినవాళ్ళం, ఒకే బడిలో చదివినవాళ్ళం, ఒకే ఊళ్ళో తిరిగినవాళ్ళం .... కానీ మా వయస్సు పెరుగుతున్న కొద్దీ పెద్దల ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి.

దీనికి కారణం మారుతున్న కాలంతో పాటు, రోజురోజుకి మనిషిలో పెరుగుతున్న స్వార్ధం ఎందుకంటే మన చిన్నతనంలో

"కలసి ఉంటే కలదు సుఖం" అని చెప్పేవారు,

కానీ నేడు " కలసి కలహించుకోవడం కన్నా

విడిపోయి సంతోషంగా

ఉండటం మేలు".

అంటున్నారు.

ఇది భౌతిక , కుటుంబ ఎడబాటైనట్లైతే అంత ఇబ్బందేమీలేదు. కాని

చిన్నతనంలో ఉన్న కుటుంబాలని నేటి కుటుంబాలతో పోల్చి చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.

"వెన్నలాంటి రాత్రులలో చందమామ మిస్ అవ్వలేదు కానీ చందమామ కధలు చెప్పేవారు మిస్ అయ్యారు.

ఎండా కాలంలో వేసవి సెలవులు మిస్ అవ్వలేదు కానీ ఆ వేసవి సెలవుల్లో ఇంటిల్లిపాదినీ ఒక దగ్గర చేర్చే పెద్ద దిక్కు మిస్ అయ్యింది.

ప్రతి సంవత్సరం వచ్ఛే పండగలు మిస్ అవ్వలేదు కానీ ఏ పండగ నాడు

ఏ తీపి వంటకం వండాలో చెప్పే మనిషి మాత్రం మిస్ అయ్యారు".

దీనికి కారణం నేటి తరానికి కధలు చెప్పడానికి ట్యాబ్లు, యూ ట్యూబ్ ఉన్నాయి. అదే వేసవి సెలవులు వస్తే సమ్మర్ కోర్సులు, క్రాష్ కోర్సులు ఉన్నాయి. అలాగే పండగలు వస్తే తినడానికి రెస్టారెంట్స్, తిరగడానికి షాపింగ్ మాల్స్ ఉన్నాయి.

అందుకే నేటి తరానికి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు అవసరం లేదు. అందుకే మన భారత దేశంలో కూడా ఉమ్మడి కుటుంబాలు శాతం తగ్గుముఖంగ ఉండగా చిన్న కుటుంబాలు శాతం పెరుగుతూ ఉంది.

నేటి తరానికి ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళని ఒక క్రాష్ కోర్సులో జాయిన్ చేస్తారు, ఇలా చివరికి వ్యక్తిత్వ వికాసం కూడా కోర్సుల్లో జాయిన్ అయి నేర్చుకుందుకు ప్రయత్నిస్తారు..

వాళ్ళు వృత్తిలో రాణించడానికి పాఠాలు చెప్పగలరేమో గాని జీవితానికి కావాల్సిన నైతిక విలువలు, సాంప్రదాయాలు, ప్రేమాభిమానాలు మాత్రం నేర్పించలేరని తెలియడం లేదు.

ఒక అర్ధ శాస్త్రవేత్త చెప్పిన

మాటను గుర్తుచేస్తాను

" All human relations are commercial relations"

అంటే

" మానవుని యొక్క అన్ని బంధాలు వ్యాపార బంధాలే".

ఏమో కొన్ని సార్లు ఈ మాట నిజమనిపిస్తుంది. నేటి సమాజంలో మనిషి బంధాలను ప్రేమతో కాక డబ్బుతో ముడి వేస్తున్నారు. ఎక్కడ ఇచ్చిపుచ్కునే ధోరణి ఉందో ఆ బంధాలు దృఢంగా ఉంటాయి.

ప్రేమ, అభిమానాలు వ్యక్త పరచడానికి ఇచ్చిపుచ్కోవడమనేది ఒక పద్ధతి అంతే కానీ పుచ్కునే ధోరణితో బంధాలు ఏర్పడితే అవి ఎక్కువ కాలం నిలబడవు.

ప్రేమకు ప్రాధాన్యత ఉన్నచోట డబ్బు ఉంటుంది కానీ డబ్బుకి ప్రాధాన్యత ఉన్నచోట మాత్రం ప్రేమ నిలబడదు.

కానీ ఒక్క మాట మాత్రం వాస్తవం

" ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం కానీ మన కోసం కన్నీళ్లు కార్చే మనిషిని మాత్రం కొనలేం "

ఈ మాటలు నిజం .

నేను చెప్పడం కాదు

యాపిల్ కంపినీ సృష్టి కర్త,

తన ఆఖరి రోజులలో డైరీలో రాసుకున్న మాటలివి.

"Relationships never dies with natural death, but these relationships are always murdered with EGO, IGNORANCE and SELFISHNESS".

అందుకే మన జీవితంలో

ఉన్న ప్రతీ బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే "

When you say sorry to someone, It means that you are not wrong and other one is right. But it means that you have given importance to relationship more than 'EGO'

Let's have a smooth relationships

Thanks and Regards
SARMA RANI
709 542 542 7 (Home)
86 888 38311 
Mail : sarmarani@gmail.com