అందరు జనవరి 1 వద్దు ఉగాది ముద్దు.. ఎందుకు ?
జనవరి 1 అది వేడుక..ఉగాది మన పండగ..
కంపెనీ సెలవలు కి టూర్ తిరగడానికి మన బంధువులు ఇండియా రావడానికి జనవరి 1 చాల ముఖ్యమైనడి గ చెప్పవచ్చు.
ఇది క్యాలెండరు లో మార్పు అని కొందరు , ఈ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని కొందరు ఎదురు చూస్తారు.
ఇప్పుడిప్పుడు కొత్త నినాదం ప్రచారంలోకి వస్తోంది..మొహమాటం లేకుండా చెప్పాలంటే తెస్తున్నారు..
కొత్త సంవత్సరం అంటే ఉగాది కాని జనవరి 1 కాదని..!
ఎదో హ్యాపీ న్యూయిర్ లో హ్యాపీ లేదు అని కొందరు తాగుబోతు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు..
శుభాకాంక్షలు తెలుపుకోవడం లో తప్పేమి లేదుకదా.. హ్యాపీ గా నే చెబుతున్నారు కదా ..
నిజమే అనుకుందాం..
వాస్తవానికి ఉగాదిని మనం పండగగా జరుపుకుంటాం..
జనవరి 1 ని వేడుకగా పరిగణిస్తాం..
ఉగాదిని మన దేశంలో మాత్రమే జరుపుకుంటాం.
అది కూడా భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు ఒక్కో ప్రాంతం వారు
ఒక్కో రోజున.. ఒక్కో రీతిలో... భిన్నో రుచిః అన్నట్టు..
జనవరి 1..
ఇంచుమించు ప్రపంచ వేడుక.. సమయాలు..తేదీలు..
సంవత్సరాలు అనేవి ప్రపంచం మొత్తం మీద( ఏవో ఒకటి రెండు ప్రాంతాలు..దేశాలు మినహాయించి)ఒకేలా ఉండడం వల్లనే..మనం కూడా వాటిని పాటిస్తున్నందువల్లనే
మొదటి నుంచి మనం మిగిలిన ప్రపంచంతో సమానంగా పరిగెత్తగలుగుతున్నాం.అందునా ఈ గ్లోబలైజేషన్ రోజుల్లో అలా పరిగెత్తడం
మరీ కష్టం.. అయినా అవసరం..!
ఒకప్పుడు న్యూ ఇయర్ అంటే చాల కాలం వేచి చూచేలా ఉండేది.. కానీ ఇప్పుడు మొన్ననే కదా 2024 వచ్చింది.. అప్పుడే 2025 అని అంటున్నాము..
మన దేశంలో.. ప్రస్తుత సమాజంలో.. మనకు మనమే సిగ్గు పడుతున్న ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి.
స్త్రీల పట్ల గౌరవ లోపం.. వేధింపులు..మానభంగాలు.. ఆడదాన్ని అంగడి బొమ్మగా పరిగణిస్తున్న వైనాలు..
సినిమాల్లో అశ్లీలత.. చట్ట సభల్లో సైతం మహిళలకు అవమానాలు..
పెరిగిపోతున్న మద్యం వినియోగం.. యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిపోతున్న ఉదంతాలు..
మద్యాన్ని ప్రభుత్వమే విక్రయిస్తున్న దిక్కుమాలిన వ్యవస్థ..ఇంచుమించు వ్యభిచారాన్ని కూడా లీగల్
చేస్తున్న దుస్థితి.. కులమత విద్వేషాలు..పెరిగిపోతున్న అంతఃకలహాలు..
కులం పేరిట..మతం పేరిట మనుషులు విడిపోతున్స ప్రమాదకర పరిస్థితి..!
ఇలా చుట్టూ ఎన్నో సమస్యలు ఉండగా ఆంగ్ల సంవత్సరం
గురించి ఇప్పటి పరిస్థితుల్లో అయితే అంత యాగి అవసరమా..ముందే చెప్పుకున్నట్టు
కొత్త సంవత్సరం అనేది ఒక వేడుక..ఎప్పటినుంచో వస్తున్న ఒక వాడుక..
మనకైతే ఉగాది పండగ ఇంటిల్లపాది జరుపుకునే ఒక పండుగ..దైవ కార్యక్రమం..
అది మనం ఎటూ సంప్రదాయబద్దంగానే జరుపుకుంటున్నాం.కేవలం ఆంగ్ల సంవత్సరాది మాత్రమే జరుపుకొని ఉగాదిని విస్మరించడం లేదు.
అప్పుడు ఇంత హడావిడి దేనికి..!?
మనదేశంలో ఎప్పటినుంచో.. ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా అన్ని మతాల పండగలను అందరం సంబరంగా జరుపుకోవడం
ఒక ఆనవాయితీగా... సంప్రదాయంగా ఉంది. ఇప్పుడేదో ఈ దేశం మతం పరంగా విడిపోయినట్టుగా..
ప్రపంచం నుంచి మనం వేరుపడిపోయినట్టుగా
కొన్ని మొదలయ్యాయి.
ఇవి ఎక్కడికి దారి తీయబోతున్నాయో మరి.
మన సంప్రదాయాల పట్ల మనం ఎంత గౌరవంగా ఉంటామో..అలాగే ప్రపంచంలోని ఇతర
దేశాల..ఇతర మతాల సంప్రదాయాల పట్ల కూడా అంతే గౌరవంగా వ్యవహరించడం ఎప్పుడూ వాంఛనీయమే..!
అప్పుడే కదా
వసుధైక కుటుంబం సాధ్యపడుతుంది. ఆ అద్భుతమైన..
మహోన్నతమైన భావనకు ఊపిరిపోసిన మనమే
దానికి తూట్లు పెడుతున్న దయనీయ పరిస్థితి..
ఇంకెక్కడి
లోక సమస్త సుఖినోభవంతు.. విశ్వ మానవ సమాజం..
భిన్నత్వంలో ఏకత్వం..!
Regards
Rani Sarma