అందరు జనవరి 1 వద్దు ఉగాది ముద్దు.. ఎందుకు ?
Tuesday, December 31, 2024
జనవరి 1 అది వేడుక..ఉగాది మన పండగ..
Friday, August 23, 2024
శివ ధ్యాన శ్లోకాలు
శివ ధ్యాన శ్లోకాలు
శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణ
శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక – ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు.
ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, పారాయణకీ, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. స్వరం రానివారు, నియమపాలన కుదరని వారు తదితరులు దీనిని పారాయణ చేయడం కూడదని శాస్త్రనియమం.
కానీ ఈ రుద్రమంత్రాల వల్ల లభించే సిద్ధి, కైవల్యం వంటి అద్భుత ఫలాలను అందరికీ అందజేయాలని సంకల్పించుకున్న ఋషులు ఆ రుద్రనమకాన్ని శ్లోక రూపంగా మలచి పురాేతిహాసాల ద్వారా, తంత్రశాస్త్ర గ్రంథాలద్వారా అందజేశారు.
మంత్రాలను శ్లోకంగా మలచాలంటే ఋష్యత్వం కలిగిన వారికే సాధ్యం. అందుకే వేదాలను వ్యాసం చేసి ప్రసాదించిన భగవాన్ వేదవ్యాసులవారు మహాభారతం, సూతసంహిత, శివరహస్యం – వంటి గ్రంథాలద్వారా వివిధ వివిధాలుగా ’శతరుద్రీయ’ శ్లోకాలను అందజేశారు.
విష్ణుసహస్ర, శివసహస్ర, లలితా సహస్ర నామ స్తోత్రాలవలె ఈ నమక స్తోత్రాన్ని – స్నానాది శుచి నియమాలు పాటిస్తూ పారాయణ చేస్తే చాలు పరిపూర్ణ ఫలం లభిస్తుమ్ది. అందులో సందేహం లేదు. దీనిని పారాయణ స్తోత్రంగా పఠించవచ్చు. అభిషేకానికి వినియోగించుకోవచ్చు, స్వరనియమం లేదు. ఉచ్ఛారణలో జాగ్రత్త వహించాలి. శ్రద్ధావిశ్వాసాలున్న ఆస్తికులందూ దీని పఠనానికి అర్హులే.
పైగా – ఇది సాక్షాత్తు డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది.
ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని సర్వజన సౌలభ్యంకోసం ప్రచురిస్తున్నాం.
ధ్యానమ్:
ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర
జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః!
అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్!!
బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజన్గైః
కంఠే కాలాః కపర్దా కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తి భేదా
రుద్రాశ్శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!
ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే
ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్!
తతః ప్రణమ్య బహుధా కృతాంజలి పుటః ప్రభుః
శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్!!
గణేశ ఉవాచ:
నమస్తే దేవ దేవాయ నమస్తే రుద్ర మన్యవే!
నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః!!1!!
నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే!
నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః!!2!!
ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్!
శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా!!3!!
శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో!
యా తే రుద్రశివా నిత్యం సర్వంగలసాధనమ్!!4!!
తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాపతే!
ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ!!5!!
యా తయా మృడయ స్వామిన్ సదా శంతమయా ప్రభో!
గిరిశంత మహారుద్ర హస్తే యా మిషు మస్తవే!!6!!
బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే!
శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామసి!!7!!
త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్!
యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్!!8!!
యథాతథావమాం రుద్ర తదన్యధాపి మే ప్రభో!
రుద్ర త్వమ్ ప్రథమో దైవ్యో భిషక్ పాపవినాశకః!!9!!
అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా!
అహీన్ సర్వాన్ యాతు ధాన్యః సర్వా అప్యద్య జంభయన్!!10!!
అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః!
విలోహితో స్త్వయం శంభో త్వదధిష్ఠాన ఏవహి!!11!!
నమో నమస్తే భగవన్ నీలగ్రీవ మీఢుషే!
సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానంద మూర్తయే!!12!!
ఉభయోగార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్!
సంప్రాప్య ధనురన్యేషాం భయాయ ప్రభవిష్యతి!!13!!
అస్మద్భయ వినాశార్థ మధునాభయద ప్రభో!
యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వాప!!14!!
అవతత్య ధనుశ్చత్వం సహస్రాక్ష శతేషుధే!
ముఖానిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ!!15!!
విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి!
అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః!!16!!
కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః!
ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యాతు భయం భవేత్!!17!!
యాతే హేతిర్ధనుర్హస్తే మీఢుష్టమ బభూవ యా!
తయాస్మాన్ విశ్వతస్తేన పాలయ త్వ మయక్ష్మయా!!18!!
అనాతతాయాయుధాయనమస్తే ధృష్ణవే నమః!
బాహుభ్యాం ధన్వనే శంభో నమో భూయో నమో నమః!!19!!
పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః!
ఇషుధిస్తవ యా తావదస్మదారే నిధేహి తమ్!!20!!
హిరణ్య బాహవే తుభ్యం సేనాన్యే తే నమోనమః!
దిశాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమః!!21!!
త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే!
నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః!!22!!
నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః!
నమస్తే హరికేశాయ రుద్రాయ స్తూపవీతినే!!23!!
పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః!
సంసార హేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే!!24!!
క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే!
అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః!!25!!
రోహితాయ స్థపతయే మంత్రిణే వానిజాయచ!
కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువంతయే!!26!!
తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః!
ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే!!27!!
ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రందయతే నమః!28!!
పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః!
ధావతే ధవలాయాపి సత్త్వనాం పతయే నమః!!29!!
అవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే!
స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషు ధిమతే నమః!!30!!
తస్కరాణాం చ పతయే వంచతే పరివంచతే!
స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే!!31!!
నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః!
అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః!!32!!
ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరిచరాయతే!
కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ!!33!!
నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతయే నమః!
నమ ఉగ్రాయ భీమాయ నమశ్చాగ్రేవధాయచ!!34!!
నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః!
హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః!!35!!
నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే!
నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే!!36!!
గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః!
నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే!!37!!
మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః!
నమశ్శివాయ శర్వాయ నమశ్శివతరాయ చ!!38!!
నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయతే నమః!
ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ!!39!!
నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః!
ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ!!40!
నమశ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః!
ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః!!41!!
వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః!
వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః!!42!!
సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః!
ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ!!43!!
శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః!
నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయతే నమః!!44!!
స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః!
జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః!!45!!
పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ!
మధ్యమాయ నమస్తుభ్యమపగల్భాయ తే నమః!!46!!
జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః!
సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయచ నమోనమః!!47!!
క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః!
ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయ చ నమోనమః!!48!!
శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః!
నమో వన్యాయ కక్ష్యాయ మౌన్జ్యాయ చ నమోనమః!!49!!
శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః!
ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ!!50!!
వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః!
శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః!!51!!
దుందుభ్యాయ నమస్తుభ్య మాహనన్యాయతే నమః!
ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయ చ!!52!!
పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః!
సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః!!53!!
నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః!
నమో నీప్యాయ సోద్యాయ సరస్యాయ చ తే నమః!!54!
నమో నాద్యాయ భవ్యాయ వైశంతాయ నమోనమః!
అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః!!55!!
అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః!
విద్యుత్యాయ నమస్తుభ్యమీథ్రియాయ నమోనమః!!56!!
ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః!
రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః!!57!!
వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః!
నమో రుద్రాయ తామ్రాయాప్యరుణాయ చ తే నమః!!58!!
నమ ఉగ్రాయ భీమాయ నమశ్శంగాయ తే నమః!
నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః!!59!!
ప్రవాహ్యాయ నమస్తుభ్యమిరిణ్యాయ నమోనమః!
నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః!!6౦!!
కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః!
కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే!!61!!
నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః!
సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః!!62!!
కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః!
నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్oసవ్యాయ తే నమః!!63!!
రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ!
నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః!!64!!
హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః!
నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః!!65!!
నమోపగుర మాణాయ పర్ణశద్యాయ తే నమః!
అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః!!66!!
విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః!
త్ర్యంబకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః!!67!!
మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః!
వేదవేదాంత వేద్యాయ వృషారూఢాయ తే నమః!!68!!
అవిజ్ఞేయ స్వరూపాయ సుందరాయ నమోనమః!
ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే!!69!!
హిరణ్య బాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ!
నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః!!70!!
హిరణ్యపతయే తుభ్యమంబికాపతయే నమః!
ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక!!71!!
మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే!
తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణ రూపిణే!!72!!
అపార కళ్యాణ గుణార్ణవాయ
శ్రీ నీలకంఠాయ నిరంజనాయ!
కాలంతకాయాపి నమో నమస్తే
దిక్కాల రూపాయ నమో నమస్తే!!!73!!
వేదాంత బృంద స్తుత సద్గుణాయ
గుణ ప్రవీణాయ గుణాశ్రయాయ!
శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే
కాశీ నివాసాయ నమో నమస్తే!!74!!
అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధి రూపాయ నమోనమస్తే!
ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమో నమస్తే!!75!!
నీహార శైలాత్మజ హృద్విహార ప్రకాశ హార ప్రవిభాసి వీర!
వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే!!76!!
వ్యాస ఉవాచ:
ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః!
కృతాంజలి పుటస్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః!!
త మాలోక్య సుతం ప్రాప్తం వేదం వేదాంగపారగం!
స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః!!
ఇతి శ్రీ శివ రహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్ధే
గణేశ కృత రుద్రాధ్యాయ స్తుతిః నామ దశమోధ్యాయః
అనేనా శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన
శ్రీ విశ్వేశ్వర స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు!!
రుద్రకవచమ్ ( స్కందపురాణ )
రుద్రకవచమ్ ( స్కందపురాణ )
||
అథ శ్రీ రుద్రకవచమ్ ||
ఓం అస్య శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహా మంత్రస్య,
దూర్వాసఋషిః అనుష్ఠుప్ ఛందః త్ర్యంబక రుద్రో దేవతా
హ్రామ్ బీజమ్ శ్రీమ్ శక్తిః హ్రీమ్ కీలకమ్;
మమ మనసోభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః ||
హ్రామిత్యాదిషడ్బీజైః షడంగన్యాసః ||
||
ధ్యానమ్ ||
శాంతమ్ పద్మాసనస్థమ్ శశిధరమకుటమ్ పంచవక్త్రమ్ త్రినేత్రమ్
శూలమ్ వజ్రంచ ఖడ్గమ్ పరశుమభయదమ్ దక్షభాగే మహన్తమ్ |
నాగమ్ పాశమ్ చ ఘంటామ్ ప్రళయ హుతవహమ్ సాంకుశమ్ వామభాగే
నానాలంకారయుక్తమ్ స్ఫటికమణినిభమ్
పార్వతీశమ్ నమామి ||
||
దూర్వాస ఉవాచ ||
ప్రణమ్య శిరసా దేవమ్ స్వయంభు పరమేశ్వరమ్ |
ఏకమ్ సర్వగతమ్ దేవమ్ సర్వదేవమయమ్ విభుమ్ |
రుద్ర వర్మ ప్రవక్ష్యామి అంగ ప్రాణస్య రక్షయే |
అహోరాత్రమయమ్ దేవమ్ రక్షార్థమ్ నిర్మితమ్ పురా ||
అథ రుద్ర కవచమ్
రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌహరస్తథా |
శిరోమే ఈశ్వరః పాతు లలాటమ్ నీలలోహితః ||
నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖమ్ పాతు మహేశ్వరః |
కర్ణయోః పాతు మే శంభుః నాసికాయామ్ సదాశివః ||
వాగీశః పాతు మే జిహ్వామ్ ఓష్ఠౌ పాత్వంబికాపతిః |
శ్రీకణ్ఠః పాతు మే గ్రీవామ్ బాహో చైవ పినాకధృత్ ||
హృదయమ్ మే మహాదేవః ఈశ్వరోవ్యాత్ స్సనాన్తరమ్ |
నాభిమ్ కటిమ్ చ వక్షశ్చ పాతు సర్వమ్ ఉమాపతిః ||
బాహుమధ్యాన్తరమ్ చైవ సూక్ష్మ రూపస్సదాశివః |
స్వరంరక్షతు మేశ్వరో గాత్రాణి చ యథా క్రమమ్ ||
వజ్రమ్ చ శక్తిదమ్ చైవ పాశాంకుశధరమ్ తథా |
గణ్డశూలధరాన్నిత్యమ్ రక్షతు త్రిదశేశ్వరః ||
ప్రస్తానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే |
సంధ్యాయామ్ రాజభవనే విరూపాక్షస్తు పాతు మామ్ ||
శీతోష్ణా దథకాలేషు తుహినద్రుమకంటకే |
నిర్మనుష్యే సమే మార్గే పాహి మామ్ వృషభధ్వజ ||
ఫలశృతి
ఇత్యేతద్ద్రుద్రకవచమ్ పవిత్రమ్ పాపనాశనమ్ |
మహాదేవ ప్రసాదేన దూర్వాస మునికల్పితమ్ |
మమాఖ్యాతమ్ సమాసేన నభయమ్ తేనవిద్యతే |
ప్రాప్నోతి పరమ ఆరోగ్యమ్ పుణ్యమాయుష్యవర్ధనమ్
విద్యార్థీ లభతే విద్యామ్ ధనార్థీ లభతే ధనమ్ |
కన్యార్థీ లభతే కన్యామ్ నభయ విన్దతే క్వచిత్ |
అపుత్రో లభతే పుత్రమ్ మోక్షార్థీ మోక్ష మాప్నుయాత్ |
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ |
త్రాహిమామ్ పార్వతీనాథ త్రాహిమామ్ త్రిపురంతక
పాశమ్ ఖట్వాంగ దివ్యాస్త్రమ్ త్రిశూలమ్ రుద్రమేవచ |
నమస్కరోమి దేవేశ త్రాహిమామ్ జగదీశ్వర |
శత్రు మధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాన్తరే |
గమనేగమనే చైవ త్రాహిమామ్ భక్తవత్సల |
త్వమ్ చిత్వమాదితశ్చైవ త్వమ్ బుద్ధిస్త్వమ్ పరాయణమ్ |
కర్మణామనసా చైవ త్వంబుద్ధిశ్చ యథా సదా |
సర్వ జ్వర భయమ్ ఛిన్ది సర్వ శత్రూన్నివక్త్యాయ |
సర్వ వ్యాధినివారణమ్ రుద్రలోకమ్ సగచ్ఛతి
రుద్రలోకమ్ సగచ్ఛత్యోన్నమః ||
|| ఇతి స్కందపురాణే దూర్వాస ప్రోక్తమ్ రుద్రకవచమ్ సంపూర్ణమ్ ||