Wednesday, November 15, 2023

భగినీ హస్త భోజనం ... సోదరి ఇంట భోజనం

భగినీ హస్త భోజనం ... సోదరి ఇంట భోజనం 

ఐదు రోజుల పండుగ దీపావళి పండుగలో ఆసక్తికరమైన పండుగ ‘భగినీ హస్త భోజనం‘. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల పండుగ అంటే గుర్తుకొచ్చేది రక్షా బంధన్ పండుగ. అంతటి ప్రాముఖ్యత కలిగినది కార్తీకమాసంలో వచ్చే దీపావళి పండుగలో భాగమైన భగినీ హస్త భోజనం పండుగ.కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ.  దీనికి పండుగ అని ఎందుకు అంటామంటే..అన్న చెల్లెలి ఇంటికి వచ్చిన అనుబంధాలకు ప్రతీక కాబట్టి. సోదరీ సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగల్లో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది. ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష (రాఖీ) కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని, రక్షిస్తామని చెపుతారు. రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది. "భయ్యా ధూజీ'' అనే పేరుతొ ఉత్తరదేశంలో బాగా ప్రాచూర్యం పొందిన భగినీ హస్తభోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది. అమ్మ చేతి ముద్ద  మళ్లీ తినే భాగ్యం.. మనకి దక్కింది అంటే ఆ  అమ్మ ప్రతిరూపంగా  ఉన్న సోదరి కే మాత్రమే ఉంటుంది 
మనం బాగుండాలి అనుకునే  వారిలో అమ్మ తర్వాత సోదరి మాత్రమే.. మా అన్నదమ్ములు బాగుండాలి అని కోరుకునేది ఎంత మంది ఉన్నా ఆ ప్రేమ చెప్పలేదని ఒక్క సోదరి కి మాత్రమే ఉంది 
ఈ సంప్రదాయం ఇప్పడి డి కాదు మన పురాణం మనకి ఇచ్చిన బహుమానం.. ఈ భగినీ హస్త భోజనమే మనకి ఆదర్శం 
ఇక మనం విషయం లో కి వస్తే యమధర్మరాజు.. గురించి అందరికీ తెలుసు కదా  యమలోకపు చక్రవర్తి.. పాపపుణ్యాల లెక్క తేల్చే సమవర్తి.. యముడు యమున ఇద్దరు సూర్యుని సంతానం అన్నకు భోజనం పెట్టాలన్న ఎప్పటినుంచో ఆశ.. ఎన్ని సార్లు కబురు పంపినా తీరికే లేని ధర్మరాజు.. వృత్తి ధర్మం లో ఉండేవారు 
ఆ విషయం తెలిసి చెల్లెమ్మకు ఎన్నో సార్లు అంతులేని నిరాశ..ఎదురైంది . ప్రాణప్రదంగా ప్రేమించిన అన్నకేమో ప్రాణాలు హరియించే విధి.. సోదరికేమో  ఎదురుచూపుల నిశీధి..! ఏమి చేస్తాము 
ఇక సోదరి పిలుపు ఆ రోజు రానే వచ్చింది.. దీపావళి వెళ్ళింది.. ఎప్పటిలా చెల్లి నుంచి  యమునికి పిలుపు.. అన్నా అన్నానికి రా..అని.. ఈసారి యమధర్మ రాజు రాలేనని చెప్పలేదు 
వస్తానని చెప్పాడు  మరుసటి రోజు.. ఇంకేమి చెల్లికి పండగే.. అన్నకు నచ్చిన  పిండివంటలు , పాయసం మొ.. అన్ని మనసారా  ఏర్పాటు చేసింది , తానే స్వయం గా వడ్డించి తినిపించింది. యమధర్మరాజు  కడుపారా.. తిని చెల్లి తో చిన్ననాటి ముచ్చట్ల  మాట్లాడుకున్నారు . సోదరునికి ప్రేమను పంచి.. ఆ  అన్నాచెల్లెళ్ల పూర్వ అనుబంధం  ఇంకాస్త చిగురించి..! 
ఇక చెల్లెలకి  ఏం కావాలో కోరుకొమ్మని అడిగిన యమ ధర్మ రాజు  .. 
ఆమె సిరులడగలేదు.. సంపదలు కోరలేదు.. వరాలు  ఏమి కోరలేదు  . తన గర్భంలో  నిండు నీరిమ్మని వినుతించలేదు..మరి ఏం కోరిందో..??తెలుసుకుందామా 

అన్నా.. ఇదే కార్తీక శుద్ధవిదియ నాడు సోదరి ఇంట తిన్న అన్నకు అపమృత్యువు వద్దేవద్దు.. నరకవాసం అసలే వద్దని.. ఇదే నీ చెల్లికి  నువ్వు చెల్లించే ముద్దు..  ఇక నాకేమి కోరికే కద్దు.. అని అడిగింది. . తథాస్తు అన్న ధర్మరాజు.. యముని ఆనందానికి లేనే లేదు హద్దు.  అన్నలకు అపమృత్యునాస్తి.. చెల్లెళ్ళకు శాశ్వత పుస్తి.. యముని వరం.. యమికి సంబరం..! ఇదే కదా మన సంస్కారం . 
ఇక ఇది .పురాణమే అనుకో.. సంప్రదాయమే కానీ..  సోదరీ సోదరుల బంధానికి శాశ్వతత్వమే  ఈ భోజన తత్వం.. సోదరి సోదరుల  సంబంధాలు.. 
శాస్త్రం లో ఇంకో మాట కూడా ఉంది. ఎవరైనా  అన్న చెల్లలు లేదు అక్కా తమ్ముడు ఆనందం గా ఉంటారో అక్కడకి వాళ్ళ దగ్గరకి శని ప్రవేశించడు అని మన పెద్దలు చెప్తారు 
ఆప్తుల నడుమ , ఆస్తుల కోసం వివాదాలు.. అలకలు..దూరాలు.. నిందలు..ఆరోపణలు.. ఇవన్నీ సమసి.. రక్తబంధం విలువ తెలిసిన చోట  సాక్షాతూ యమధర్మ రాజు రావడానికి కొంచం ఆలోచిస్తారు .. అది వీడని బంథమని.. తెగని రుణానుబంధమని ఒక్కసారి పాశం వేసే ముందు ఆలోచిస్తారు అని చెబుతారు. అంత విలువైనది ఈ  భగినీ హస్త భోజనం 

ఈ పండుగను పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, 'యమవిదియ',  అని కూడా అంటారు . భయ్యా ధూజీ అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం కలిగింది 

ఇట్లు 
రాణీ సుబ్రహ్మణ్య శర్మ