ఈ నెల 24 వ తారీఖున గురు పౌర్ణమి అయ్యింది.. ఆ తర్వాత రోజున ఆదివారం నాడు మా పూజ్య గురువు గారు అయినా శ్రీ రాళ్లబండి రామ కృష్ణ శర్మ గారు కి మేము చిరు సత్కారం చేసుకోవాలని పరమేశ్వర సంకల్పం
ముందుగా మా గురువు గారు గురించి ఓ నాలుగు మాటలు , మా గురువు గారు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు (ప్రైవేట్ పాఠశాలా లో ) గా పనిచేసారు . కొన్ని కారణాలు వలన ఉపాధ్యా య వృత్తి కి స్వస్తి చెప్పి , తానూ నమ్ముకున్న ఆధ్యాత్మిక మార్గం లో మా గురువు గారు నిత్యా కర్మానుష్ఠానం చేసుకుంటూ ఆధ్యాత్మికం గా మా శిష్యులు అందరికీ దగ్గరయ్యారు.. మా అందరికీ ఆధ్యాత్మిక గ్యాన బోధ , సమయాచారం సదాచారం అన్ని వివరిస్తూ , మాకు తెలియని ఎన్నో విశేషాలు మాకు తెలియపరిచారు..
మా గురువు గారు పుట్టిన ప్రదేశం గుడివాడ , కృష్ణ జిల్లా , తల్లి తండ్రులు సుబ్రహ్మణ్య దీక్షితులు , అన్నపూర్ణమ్మగారు 4 వ సంతానం
మా గురువు గారు ఆంధ్ర యూనివర్సిటీ లో MA ఎకనామిక్స్ మరియు MA ఇంగ్లీష్ కూడా చేసారు.. మా గురువు గారు అనర్గళంగా ఇంగ్లిష్ లో మాట్లాడగలుగుతారు , పని చేసిన స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం , తండ్రి గారు ద్వారా సంస్కృతం మరియు భారతము భాగవతం విశేషాలు కూడా చిన్నతనం నుంచి నేర్చుకున్నారు.ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు
మేము మా గురువు గారు తో పెట్టుకున్న సత్సంఘం పేరు శివ పరివారం
మేము ఏ కార్యక్రం చేసిన సర్వం శ్రీ శివ పరివారం అని చేస్తాము..
మా శివ పరివారం విశేషం ఏమిటంటే ప్రతి నెల మొదటి ఆదివారం నాడు తప్పనిసరిగా స్వామి వారికీ పాశుపత రుద్రాభిషేకం , లేదా ఆ రోజు విశిస్థను బట్టి అన్నాభిషేకం , పుష్పాభిషేకం ,లేక పంచ అమృతం తో స్వామి వారికీ పాశుపతం చేసుకుంటాము
ఇలా 2005 నుంచి ఇప్పటివరకు ఎక్కడ బ్రేక్ లేకుండా చేసాము అది కూడా ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి. వెళ్లి ఆ మహాదేవుడికి అభిషేకం చేసి వస్తాము . మాకు కావలసింది భక్తి శ్రద్ద..ఏనాడూ మేము ఎవరి దగ్గర దక్షణా ఆశించలేదు..తిరిగి మేమె దేవాలయం లో అభిషేకం చేసి దేవాలయ పునరుద్దరణకు కొంత ఇచ్చేవాళ్ళం. దక్షినాపేక్ష లేకుండా ఉండడమే ఆ గురువు యోక్క్క విశిష్టత..
శాస్త్రం లో ఒక మాట ఉంది , ఏ ఇంట్లో అయితే ధూప దీప నైవేద్యాలు తో ఇల్లు ఉంటుందో., ఏ ఇంట్లో అయితే శివ అభిషేకం లేదా ఈశ్వరాభిషేకం జరుగుతుందో ఆ ఇల్లు ని గృహముగా పరిగణిస్తారు అని మా గురువు గారు మాకు తరచూ చెబుతూ ఉంటారు..
అసలు ఆధ్యాత్మిక గురువు కి నిర్వచనం ను ఒక్క మాటలో చెప్పాలంటే మా పూజ్య గురువు గారు ..వారి సతీమణి గారు . వారి ఇల్లు నిత్యం గంగ ప్రవాహం లా ఉంటుంది..
మా అందరి ద్రుష్టి లో అది వారి గృహం కాదు . మా అందరికీ అమ్మవారు ఉండే దేవాలయం.
నిత్యం చండీ పారాయణ, అభిషేకాలు , వ్రతాలూ, సుందరకాండ పారాయణాలు , మా శిష్య బృందం లో ఎవరు ఏమి శుభకార్యం చెయ్యాలన్న గురువు గారు ఇంటికి వచేస్తాము ఆ స్వామి వారికీ అభిషేకం గురువు గారు దగ్గర చేసుకుంటాము..
ప్రతి పౌర్ణమికి , మరియు మాస శివరాత్రి మా గురువు గారు ఇల్లు దేవాలయ మంటపం లా ఉంటుంది.. అది చాల విశిష్టమైనది గా ఆ రోజుని చేసుకుంటాము..
అలాగే శని త్రయోదశి రోజున స్వామి వారికీ తైలాభిషేకం చేసుకుంటాము..
మనకి ఏది కావాలన్నా ఒకటే మార్గం ఆ స్వామి వారికీ అభిషేకం చేసుకోవడం.. అంటే..
ఈశ్వరుడికి తెలియనిది ఏముంటుంది..అంటారు గురువు గారు ..
ఆలా స్వామి వారికీ అభిషేకం మరోపక్క చండీ పారాయణాలు జరుగుతూ ఉంటాయి..
మా గురువు గారు చండీ ఉపాసకులు , దశ మహావిద్యలు ఉపాసన మంత్రం తో చేసుకుతూ ఉంటారు....
ఇప్పటికే అమ్మవారి దశ మహా విద్యలు లో 6 వరకు హోమాలు చేసారు
అలాగే అమ్మవారి శతచండీ మహా యాగం కూడా చేసారు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు తో నిర్వహించారు.. శతచండీ యాగం అత్యంత అత్బుటం గా జరిగింది అనడానికి నిదర్శనం మా అందరికీ హోమగుండం లోంచి అమ్మవారు కనబడినది.
అలాగే గురువు తో తీర్ధయాత్ర అంటారు..మేము మా గురువు గారు తో కాశీ మరియు నైమిశారణ్యం ను చూడగలిగాము.. అక్కడ విశిష్టత ను మాకు తెలియచేసారు.. అలాగే పుణ్యకేత్రాలు ,ఉజ్జయిని మొ.. ప్రదేశాలు కూడా చూసాము
కాశీ లో దేవి నవరాత్రులు , చివరిగా చండీ హోమం చేసుకున్నాము . సాక్షాతూ ఆ కాశీ విశ్వేశ్వరుడే మాకు ఆ హోమం చేయించారా అన్నట్టు గా జరిగింది.. ఎందుకంటే దసరా రోజున , కాశీ మహా పట్టణం లో బాషా కానీ ప్రదేశం లో మేము చండి హోమం ఎలా నిర్వహించాలి అని ఆలోచించుకున్నాము.. మేము పరివారం తో మొదటి సారి, అమ్మవారు ని ప్రార్ధిచగా కాశీ దేవాలయ పండితుడు ఒకరు పంపారు అని అయన పేరు శ్యామ్ గారు ఒక్క నలుగురు వేదం పండితులు తో వచ్చి వారే స్వయం గా చేసారు.. మేము దక్షిణ ఇస్తుంటే , కాశీ వచ్చి మీరు నాకు దక్షిణ ఇస్తారా అని ఒక చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు..ఇప్పటికీ ఆ సన్నివేశం మా అందరి కళ్ళల్లోనూ మెదులుతోంది..
ఇలాగే నైమిశారణ్యం లో కూడా అంటే మా టీచర్ గారు ఇక నడవలేను అని కూర్చుంటే , హనుమంతుడి ఒక బ్రాహ్మణుడు వేషం లో వచ్చి మా టీచర్ గరుని మాటల్లో పెట్టాలి నైమిశారణ్యము మొత్తం నడిపించి చూపించారు..అంతా ఈశ్వరుడు మాకు ఇచ్చిన గురువు గారు ఆశీస్సులు
మా గురువు గారు పూర్ణ దీక్షపరులు , శిష్యులకి కూడా కొంత మందికి పూర్ణ దీక్షత్వం ఇచ్చారు..
ఒక గురువు వారి శిష్యులు కి పూర్ణ దీక్షత్వం ను ఎలా ఇవ్వాలో , శాస్త్రం లో ఎలా ఇస్తారో అలాగే ఇచ్చారు.. ఒక గురువు శిష్యుడికి అడిగిన వెంటనే ఎప్పుడు మాత్రం లాంటివి ఇవ్వరు. ఆ గురువు శిష్యుడిని గమనిస్తూ , అతనికి మంత్రం మీద ఉన్న ఆసక్తిని గురు శుశ్రూషని బట్టి గురువు ఆ శిష్యుడికి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో అప్పుడే మంత్రం లాంటిది ఇస్తారు..ఒక గురువు శిష్యుడికి మంత్రం ఇచ్చారు అంటే గురువు తన ఊపిరిని కొంత ఇస్తున్నట్లు గా మా గురువు గారు భావిస్తారు..
అలాగే మా గురువు గారు శిష్యులు లో ఎవరికీ కష్టం వచ్చినా తనకి వచ్చినట్టే బాధపడతారు. వారికోసం అమ్మవారు ని ప్రాధేయపడతారు
అలాగే మాస శివరాత్రి , మహా శివరాత్రి ని అత్యంత వైభవం గా జరుపుకుంటాం మా శివ పరివారం.
మా శివ పరివారం కు మహా శివ రాత్రి వచ్చిందంటే చాలు అది ఒక పెద్ద పండగా చేసుకుంటము..ఏకాదశ రుద్రం , అఖండ రుద్రాభిషేకం , ఏకవారం, ఆలా అన్ని రకాలు గా జరుగుతాయి.. కావలసిన పదార్ధములు పరివారం లో సభ్యులు ముందుగా నిర్ణయిచుకుని ఏర్పుటు చేస్తారు. అలాగే ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి కూడా అంటే ప్రదోష వేళా సమయం కు కచ్చితం గా ఆ స్వామి వారికీ అభిషేకం చెయ్యాలి అని సంకల్పం..
శాస్త్రం లో మనకి నవరాత్రలు నాలుగు వస్తాయి ,నవరాత్రులూ అనగానే మనకి ముందుగా ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు తలంపుకు వస్తాయి!
అలాగే చైత్ర మాసం లో వచ్చే వసంత నవరాత్రులు కూడ మనకి పరిచయమే!
ఈ రెండూ కాక మరో రెండు నవరాత్రులు వున్నాయి.వాటి గురించి చిన్న వివరణ.
1 చైత్రమాసమున వసంత నవరాత్రములు
2 ఆషాఢమున వారాహీ నవరాత్రులు
3 ఆశ్వీజమున శరన్నవరాత్రులు దుర్గాదేవి
4.మాఘమాసమున శ్యామలదేవి నవరాత్రులు.
ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు.ఆషాఢ శధ్ధ పాడ్యమి నుండీ వారాహీ నవరాత్రలు ప్రారంభం! అవి గుప్తం గా చేసుకుంటారు
ఆశ్వీజమున జరిగే శరన్నవరాత్రులు మా గురువు గారు ఇంట్లో అంగ రంగ వైభవం గా జరుగుతాయి..నిత్యం అమ్మవారి అలంకరణ, పూజ, పరివారం లో సభ్యులు, పగలు ఉపవాసం ,రాత్రి భోజనాలు , సాయంత్రం అమ్మవారి కుంకుమ పూజ, సువాసిని పూజ,
ఒక్కసారి గా చుస్తే శృంగేరి లో అమ్మవారి దేవి నవరాత్రులు ఎలా నిర్వహిస్తారో అలాగే మా గురువు గారు ఇంట్లో జరుగుతాయి..శ్రీ చక్రార్చన , నవవార్చన మొ అన్ని సాంప్రదాయ పద్దతిగా , శాస్త్రీయం గా సనాతనంగా కనబడతాయి..కంకణ ధార చేసుకున్నవారు గురువు గారు ఇంట్లోనే ఉంటారు..
సాధారణం గా మా గురువు గారు దేవి నవరాత్రులు ని వారి స్వగృహం లోనే నిర్వహిస్తారు.. ఒక్కసారి మాత్రం కాశీ లోను , ఇంకోసారి సరూర్ నగర్ లో ఉన్న ఈశ్వరాలయం లో నిర్వహిచారు.. నిత్యం రుద్ర హోమం, ఆఖరి రోజున చండీ హోమం తప్పనిసరిగా చేస్తారు.. ఈ మధ్య జరిగిన దసరా నవరాత్రులు లో ఈశ్వరుడు కి రోజుకో ఒక పాశుపతం చేసుకున్నాము .
ఒక్క మాటలో చెప్పాలంటే శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము బోధించబడినది. అర్జునుడు దీని ద్వారా శతృంజయమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు.
రుద్రము నందలి 169 మంత్రములతో మనకు కావలసిన మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యాన్ని, ఆయుర్వృద్ధిని ఇచ్చే అమృత పాశుపతమును చేస్తున్నప్పుడు ముందుగా పాశుపత మంత్రమును చెప్పాలి.
ఇలా 169 రుద్ర మంత్రములను సంపుటీకరిస్తే అది ఒక పాశుపతం అవుతుంది. ఇది గురుముఖతః నేర్చుకొని, ఉన్నవాళ్లు మాత్రమే చేస్తేనే మంచి ఫలితములను ఇస్తుంది.
మా గురువు గారు అబ్బాయి శ్రీ శశికాంత శర్మ కూడా వేదం చదువుకుని మా గురువు గారు చేసే కార్యక్రం లో సహకరిస్తారు..
మహా పాశుపతము ,త్రిశూల పాశుపతము ,ఆఘోర పాశుపతము , నవగ్రహ పాశుపతము
కౌబేర పాశుపతము ,మన్యు పాశుపతము, కన్యా పాశుపతము , బుణ విమోచన పాశుపతము ,సంతాన పాశుపతము , ఇంద్రాక్షీ పాశుపతము చేసుకున్నాము
చివరిగా మా శివ పరివారం ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసే సమయం కార్తీకం .. కార్తీక మాసం అంటే మా శివ పరివారం కు చాల ఇష్టం..సాయంత్రం పూట మా శివ పరివారం సభ్యులు ఇళ్లల్లో జ్యోతిర్లింగార్చన , ఒకపక్క, చండీ పారాయణ కొంతమంది , పురుషులు స్వామి వారికీ అబీషకేకం చేసుకుని ఆ రాత్రి వారి ఇంట్లో అన్నప్రసాదం తీసుకుంటాము..
ఒక్క కార్తీక పౌర్ణమి మాత్రం మా కామాక్షి శంకరులు స్వగ్రహం లో జరుగుతుంది.. ఉదయం అంతటా నత్తాలు తో ఉంది రాత్రి పూట జ్యోతిర్లింగార్చన అనంతరం అన్నప్రసాదం తీసుకుంటాము..ఈ కార్యక్రం కోసము మా పరివారం లో సభ్యులు ఒక 10 రోజులు ముందుగానే వారు గురువు గారు దగ్గరకి వచ్చి విన్నవించుకుంటారు.. మా ఇంట్లో స్వామి వారి అభిషేకం , జ్యోతిలింగార్చిన చేయాలనీ..
ఒకసారి మా గురువు గారు చేయించే జ్యోతిలింగార్చిన ని చుస్తే మన మనసుకు అనిపిస్తుంది..సాక్షాత్తూ కైలాసం లో ఉన్న నివాసము పరమేశ్వరుడు ఆ జోతిర్లింగార్చన లో కనబడతారు.. అది కూడా మంత్రం యుగ్మగా , అనుష్టాన దేవతలును ఆహ్వానించి , వారిని ఆసన చేసి అప్పుడు మహాలింగం కు ఆవాహన చేస్తారు..
మేము ఏది చేసిన శృంగేరి లో ఎలా చేస్తారో అలాగే చేస్తాము..శాస్త్రం ఏది చెప్పినాడో అదే ప్రామాణికం..
కార్తీకమాసం లోనే జ్యోతిర్లింగార్చన ఎందుకు చేస్తారు అనేది మన సనాతన ధర్మము లో ఎంత బాగా వివరించారో.. మన పూర్వికులు ఏది చేసిన అది శాస్త్రీయత ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు..
మాకు ఇలా అభిషేకములు , జ్యోతిలింగార్చన సమయం లో మా గురువు గారు మంచి మంచి విషయాలు , ఆధ్యాత్మిక , సనాతన ధర్మాలు వాటి విలువలు ని మా అందరికీ తెలియాపరుస్తారు.ముచ్చటగా మనుసులో మాటలు పంచుకోవడానికి...
కష్ట సుఖాలు తెలుపుకోవడానికి మంచి చెడులు తెలిపే ఓ నేస్తం లా, గురువు లా , ఒక తండ్రి లా , ఒక ఆత్మీయులుగా పలకరిస్తారు , మేము ఆలా కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకునేందుకు మాకెప్పుడు కావాలి మీ చల్లని స్నేహ హస్తం తో మా గురువు గారు మాకు ఉంటున్నారు
ఊపిరి పీలుచుకునే క్షణం లేని జీవిత ప్రవాహంలో మనం అందరం ఉండగా , మకకి కావలసింది , తెలుసుకోవలసినది చాల ఉంది అని మాకు తెలియయచేసి
...మేము తడబడినప్పుడు వెన్ను తడుతూ ,మా ఆలోచనల ఉహల తోడుగా
నిలుస్తూ , మాకు సరి అయినా సమయం లో మంచి విషయాలు తెలిసిచ్చేస్తారు
నిరాశ ,నిస్ప్ర హ ,నిర్లక్ష్యం లను మా గురువు గారు వారి దరిచేరకుండా నిరంతరం నిశ్చలమైన నిర్మలమైన ఆలోచనలతో , నిశ్శబ్దా భావాల్ని సవరిస్తూ ,మా శిష్య సంబంధాలను పరిరక్షించుకుంటూ మాతో పంచుకుంటూ , కాలం అనే కల్పవృక్షము ను మా సంకల్పాలను తీర్చుకునేందుకు కాలంతో కలసి పయనించి మా జీవిత గమ్యాన్ని నిర్దేశించిన మా గరువులుగారు కి పాదాభివందనములు
ఇక అసలు విషయానికి వద్దాము
మన అందరికీ తెలుసు గత సం నుంచి మనకి కరోనా వలన ఇబ్బందులు పడుతున్నము
మేము కరోనా లొక్డౌన్ మొదలు అయినప్పటినుంచి మేము శ్రీమద ఆంధ్ర మహా భాగవతం ను ప్రవచనం గా గురువు గారు చెప్పడం జరిగింది..
షోడశ మాస్ శ్రీ మాడ ఆంధ్ర మహా భాగవతం
ఈ ప్రవచనం లో పద్యం, వచనం, తాత్పర్యం మరియు సన్నివేశాన్ని బట్టి గురువు గారు మాకు వివిధ పురాణాలూ లో ఉండే విషయాలు కూడా తెలియచేసారు..
ఆ అమృత భాండాగారాన్ని మా అందరికీ అందించే ప్రయత్నం చేసారు..
ప్రవచనం అనంతరం , దూప దీప నైవేద్య తో పాటు మృత సంజీవిని పారాయణ చేసే వారు.. అలాగే గురువు గారు చేసే పారాయణ లో కొంత భాగాన్ని భారత దేశం కోసం ఇవ్వడం , అలాగే మా చే కూడా ఆ సంకల్పం చెప్పిచడం కరోనా నివారణార్ధం కొత్త భాగాన్ని సమర్పించడం మా శివ పరివారం కు మా గురువు గారు నేర్పిచారు..
అందరు బాగుంది.. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా..లోక సమస్త సుఖినోభవంతు అన్న నానుడి తో..
మేము ఈ గురు పౌర్ణమి ని కొంచం అంగ రంగ వైభవం గా చేద్దామని సంకల్పం. షోడశ మాస శ్రీ మద ఆంధ్ర మహా భాగవతం ను మా పూజ్య గురువు గారు మాకు పద్యం శ్రవణం వచనం తాత్పర్యం రూపం లో మాకు అర్ధమయ్యే రీతి లో చెప్పారు. అటువంటి మహానుభావులు గురువు గారుని మేము సత్కరించుకోవలని ఈశ్వర సంకల్పం తో
మా గురువు గారుకు చిరు సత్కారం చేస్తున్నాము.
అయితే మా గురువు గారు మమ్మలిని గురు దక్షిణ అడిగారు. అది ఏమిటంటే ఎవరు ఎవరు శ్రీ మద్ భాగవతం లో ఎన్ని పద్యాలు చెప్తారో వారికి ప్రైజ్ డిస్ట్రుబ్యూషన్ మరియు బహుమతి కూడా పద్యం ను చూడకుండా చెప్పాలి 15 నుంచి 30 నిమిషాలు.
(ఆన్లైన్ లొనే లేక ముఖతః )..అందులో నారాయణ కవచం కానీ నృసింహ ఆవిర్భావం కానీ చెబితే 3500 కాష్ అవార్డ్..
ఇట్లు
శివ పరివారం
శివ పరివారం పరిచయం
గురువు అంటే సరైన నిర్వచనం
ప్రతినెలా మొదటి ఆదివారం పాశుపత రుద్రాభిషేకం , ఆ ఆ రోజులు ను అట్టి ఆ మహాదేవుడుకి పుష్పాభిషేకము , అన్నాభిషేకం పంచ అమృతాభిషేకం
శతచండి హోమములు ఇప్పటి అరకు 2 సార్లు చేసుకున్నాము (2014 మరియు 2018)
గురువుగారు తో కాశీ యాత్ర - దసరా నవరాత్రులు కాశీ గడిపిన మధుర క్షణాలు
గురువు ఆరు తో తీర్ధ యాత్ర - నైమిశారణ్యం
దశమహావిద్యలు - అమ్మవారి హోమాలు (తార , బగళాముఖీ చిన్నమస్తా )
పూర్ణ దీక్షత్వం శిషులుకు ఇవ్వడం
గురువు గారు శిష్యులకు చండీ సప్తశతి భోదన
నిత్యం గంగా ప్రవాహం లా జరిగిగే షోడశ మాస శ్రీ మద ఆంధ్ర మహా భాగవతం ప్రవచనం
షోడశ మాస ఉపవాస దీక్ష మరియు ఉద్యాపన (256 సోమవారం వ్రతం)
శిష్యులకు ఆధ్యాత్మిక బోధనా , సమయాచారం సదాచారం ను తెలుపుట
మహా శివరాత్రి , మాస శివరాత్రి నిర్వహించుట
పౌర్ణమి , శ్రీ చక్రార్చన నావార్చన
కార్తీక మాస జ్యోతిర్లించనలు
గణపతి తర్పణాలు